ఈ భాగంలో అనుభవాలు:
1. ఊదీ మహత్యం
2. సమస్య లేకుండా చూసిన బాబా
ఊదీ మహత్యం
సాయిబాబా భక్తులకు నమస్కారాలు. నా పేరు రేవతి. మేము గుంటూరులో ఉంటాము. మేము 2025, సంక్రాంతికి మా అత్తమామల వూరు వెళ్ళాం. అక్కడ ఒకరోజు బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుంటే చీకట్లో మా పాప ఏదో చూసి భయపడి వణుకుతూ ఏమీ చెప్పలేక సతమతమైపోయింది. మావారు ఏదీ సరిగా తెలుసుకోకుండా పాపను కొట్టారు. నేను మా పాప బాధను, అలాగే ఆయన కోపాన్ని తట్టుకోలేకపోయాను. ఊరిలో మా మామగారు బాబాను నమ్మనందువల్ల అక్కడ బాబా ఊదీ అందుబాటులో లేక నాకు ఏం చేయడానికి తోచలేదు. ఆ సమయంలో సచ్చరిత్ర చదివే అలవాటున్న నాకు అందులో బాబాను తలుచుకొని మట్టిని ఊదీగా పెట్టిన సందర్భం గుర్తుకు వచ్చింది. వెంటనే రెండు అగరుబత్తీలు వెలిగించి, అవి కాలంగా రాలిని బూడిదను ఊదీగా భావించి భావించి బాబాను తలుచుకుంటూ మా పాప నుదిటి మీద పెట్టి, కొంత నోట్లో వేసి, మరికొంత తన వీపుకు రాశాను. కాసేపటికి మా పాప పడుకొని లేచి చక్కగా అన్నం తిని, భయపడకుండా మళ్ళీ పడుకుంది. అంతా బాబా దయ.
మేము ఊరు నుండి గుంటూరుకి తిరిగి వచ్చాక మా బాబుకి బాగా అనారోగ్యం చేసింది. వేడి చేసి గొంతులో అంతా ఎర్రగా పుండు అయినట్లు అయింది. దానివలన బాబు ఏమీ తినలేకపోయాడు, నీరు కూడా త్రాగలేకపోయాడు. తెలిసినవాళ్ళు ఏదో చిట్కా వైద్యం చేస్తారంటే వెళ్లాను కానీ, వాళ్ళు అక్కడ లేరు. నాకు ఏమీ దిక్కు తోచలేదు. సాయంత్రానికి నొప్పి ఎక్కువై బాబు బాగా ఏడవడం మొదలుపెట్టాడు. నేను వాడి బాధను చూసి తట్టుకోలేకపోయాను. కనీసం కొంచెంసేపు పడుకోబెడదామని ప్రయత్నం చేసినా వాడు నిద్రపోలేదు. ఇంకా నేను బాబాను తలుచుకొని, "బాబా! నా బాబుకి నొప్పి తగ్గి చక్కగా కొంచెంసేపు నిద్రపోవాలి" అని వేడుకొని ఊదీ బాబు నుదుటన పెట్టి, కొంత నోట్లో వేసాను. కొంతసేపటికి వాడు ఎలా నిద్రపోయాడో నాకు తెలియదుగాని ప్రశాంతంగా పడుకున్నాడు. మేము ఆనందంగా బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాము. తర్వాత బాబు ఏరోజూ నొప్పి అని ఏడవలేదు. హాయిగా పడుకునేవాడు. తర్వాత మూడు రోజులకు వాడికి పూర్తిగా నయమైంది. "మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే తండ్రి సాయినాథా. నా ప్రతి విషయంలో వెంటుండి నడిపే మీరు నా సొంతకాల మీద నేను నిలబడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రీ".
సమస్య లేకుండా చూసిన బాబా
బాబా చరణములకు ప్రణామం. నా పేరు జగదీశ్వర్. 2025, జనవరి 25న మా అబ్బాయి కరీంనగర్ రావడానికి యుఎస్ఏ నుండి బయలుదేరాడు. తను అక్కడ రెండు బ్యాగులు చెక్ ఇన్ చేసాడు. కానీ ఢిల్లీకి చేరుకున్నాక చూస్తే ఒక బ్యాగు మాత్రమే వచ్చింది, ఇంకో బ్యాగు రాలేదు. ఓ వైపు హైదరాబాద్ వెళ్లే లింక్ ఫ్లైట్‌కి సమయమవుతుంది. ఆలస్యమైతే ఆ ఫ్లైట్ తప్పిపోవచ్చు. అదే జరిగితే, హైదరాబాద్‌కి నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడుంటే అప్పుడు బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అదే విషయం మా అబ్బాయి తనని పికప్ చేసుకోవడానికి కరీంనగర్ నుండి హైదరాబాద్‌కి బయలుదేరుతున్న నాకు మెసేజ్ పెట్టాడు. నేను ఇంకా టెన్షన్ పడిపోయి బాబాకి దణ్ణం పెట్టుకొని, "తను రావడానికి సమస్య లేకుండా చూడండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల ఎయిర్ పోర్ట్ సిబ్బంది, "మీ బ్యాగు వెతికి మీ అడ్రస్‌కి పంపుతాము" అని చెప్పడంతో మా అబ్బాయి బయలుదేరాడు. నేను తనని హైదరాబాద్‌లో పికప్ చేసుకుని కరీంనగర్లో మా ఇంటికి తీసుకొచ్చాను. రెండు రోజుల తర్వాత ఎయిర్ పోర్ట్ సిబ్బంది, "మీ బ్యాగులో యుఎస్ఏ ఎయిర్ పోర్ట్‌లోనే ఉంది. బై మిస్టేక్ ఫ్లైట్‌లో లోడ్ కాలేదు" అని సమాచారం ఇచ్చారు. బాబా దయవల్ల బ్యాగు సురక్షితంగా ఉంది. మా అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరాడు. "ధన్యవాదాలు బాబా".
సర్వం సాయిమయం.
Om sai ram, 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram, 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteSai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai💐🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram bless us baba 🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏