ఈ భాగంలో అనుభవాలు:
1. భక్తిని గెలిపించిన బాబా
2. బాబాని తలచిన వెంటనే కనపడిన చెక్ బుక్
భక్తిని గెలిపించిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన సాయినాథునికి నా నమస్కారములు. నా పేరు శ్వేత. నాకు సంవత్సరంన్నర వయసున్న పాప ఉంది. తనకి 2024 సంవత్సరాంతంలో ఎర్రగా దద్దుర్లు వచ్చాయి. నేను వాటికి డైపర్ రాషెస్ క్రీమ్ రాస్తే, ఎక్కడెక్కడ పూశానో ఆ చోట తగ్గాయి. కానీ కాలికి పట్టీలు వేసే చోట, డైపర్ వేసే చోట చాలా ఎక్కువగా దద్దుర్లు వచ్చాయి. ఎందుకలా వస్తున్నాయో అని నేను భయపడ్డాను. బాబాను తలుచుకొని పాపకు స్నానం చేసే నీటిలో, తను త్రాగే నీటిలో, అలాగే తనకు ఏమీ తినిపిస్తున్నా వాటన్నింటిలో బాబా అమృత సంజీవని ఊదీ ఇస్తుండేదాన్ని. బాబా దయవల్ల మూడు రోజుల్లో ఆ దద్దుర్లు అన్నీ ఎండిపోయాయి. మరే ఏ సమస్య రాలేదు. అయినా మా ఆయన పాపను ఒకసారి హాస్పిటల్లో చూపించమన్నారు. సరేనని హాస్పిటల్‌కి వెళ్తే, డాక్టర్ పాపను పరీక్షిస్తూ, "గుండె సవ్వడి ఒకరకంగా వినిపిస్తుంది. మీ పాపకు హార్ట్ ప్రాబ్లెమ్; హార్టులో హోల్ ఉంద"ని కార్డియాలజీ డిపార్ట్మెంట్కు పంపించారు. అక్కడ గుండె సంబంధిత డాక్టర్ పాపను చూసి, ముందు డాక్టర్ వ్రాసిచ్చిన చీటీలో ఏదో వ్రాసి, "ఇది మీ డాక్టర్‌కి చూపించండి" అని చెప్పారు. మేము దాన్ని ముందు చూసిన పిల్లల డాక్టర్‌కు చూపించాము. ఆ డాక్టర్, "ఐదు రోజుల ఆగి మళ్ళీ పాపను తీసుకొని రండి. వేరే చోటకు రిఫర్ చేస్తాము" అని చెప్పారు. అది విని నాకు ఒక్కసారిగా గుండె ఆగినట్లు అనిపించింది. అంత చిన్న పాపకి ఈ సమస్య ఏమిటి అని అనుకున్నాను. ఇంటికి వచ్చి బాబా ముందర ఒకటే ఏడ్చాను. తర్వాత బాబాకు నమస్కరించుకొని, "బాబా! మూడు రోజులు స్తవనమంజరి చదువుతాను. తొమ్మిది గురువారాల వ్రతం చేస్తాను. ఇంకా 108 ప్రదక్షిణలు చేస్తాన"ని చెప్పుకున్నాను. ఆ ఐదు రోజులు పాప గుండెకు, నుదుటలో ఊదీ పెడుతూ, తను తినే అన్నంలో, తాగే నీటిలో కలిపి ఇస్తూ ఎంత నరకయాతననుభవించానో ఆ బాబాకే తెలుసు. ఆయన ఫేస్బుక్ సందేశాల రూపంలో ఎంత అభయం ఇస్తున్న నా మనసు కుదుటపడలేదు. ఐదు రోజుల తర్వాత పాపని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లాను. అప్పుడు బాబాతో ఒక్కటే మాట చెప్పాను, "నా భక్తికి, నీ కరుణకు ఇది పరీక్ష బాబా. ఇందులో నన్ను గెలిపిస్తావో, నువ్వు గెలుస్తావో" అని. తర్వాత డాక్టర్ దగ్గరకి వెళ్లి, పాపను పరీక్ష చేయిస్తూ కూడా నా మనసులో, "బాబా! నన్ను ఈ పరీక్షలో గెలిపించండి" అని ఒకటే వేడుకున్నాను. ఆ దయామయుడైన సాయి గుండెకు నా మనోవేదన చేరింది. డాక్టర్ మొత్తం పరీక్షించాక, "పాపకు అస్సలు ఏ సమస్య లేదు" అని అన్నారు. నేను "మరోసారి బాగా పరీక్ష చేయండి" అని అన్నాను. ఆయన మళ్ళీ పరీక్షించి, "పాపకు అసలు అలాంటి సమస్య ఏది లేద"ని నిశ్చయంగా చెప్పేశారు. ఆ మాటలు విని నేను ఎంతగా ఆనందించానో, బాబాకు ఎంతగా కృతజ్ఞత చెప్పానో నేను మాటల్లో చెప్పలేను, మీరే ఊహించుకోండి. ఇంతటి సమస్య నుండి బయటపడేసిన బాబాకు ఎన్ని వేల కోట్లసార్లు కృతజ్ఞతలు తెలిపిన తక్కువే. "బాబా! అనుక్షణం మా అందరి వెంట ఉండి రక్షించండి. మీ దయలేని ఈ జగత్తులో మేము అస్సలు ఉండలేము, అసలు ఊహించుకోలేము. సదా మీ పాదాల చెంత ఉండే అదృష్టాన్ని మాకు కల్పించండి బాబా".
బాబాని తలచిన వెంటనే కనపడిన చెక్ బుక్
సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. ఇప్పుడు నేను పంచుకోబోయే అనుభవం చిన్నదే అయినా ఎందుకు పంచుకుంటున్నానంటే, సాయి ఉనికి అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలియాలని. మనమంతా సాయి భక్తులమే అయినా ఒక్కోసారి ఏవో వ్యవహారాల్లో పడి సాయికి కొంచెం దూరంగా ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది. అలాంటప్పుడు ఈ బ్లాగ్ చదువుతూ ఉండడం, అడపాదడపా మన అనుభవాలు పంచుకుంటూ ఉండడం వల్ల, సాయితో మనకు ఆ కనెక్టివిటీ ఉన్న ఫీలింగ్‌లో ఉండగలుగుతాము. ఇక విషయానికి వస్తే, మొన్నీమధ్య ఒకరోజు నేను పని మీద బ్యాంకుకి వెళ్ళాను. అది కో-ఆపరేటివ్ బ్యాంక్. ఎప్పుడైనా ఒకసారి ఎవరో ఒక కస్టమర్ వచ్చి వెళ్తుంటారు కాబట్టి చాలావరకు ఖాళీగా ఉంటుంది ఆ బ్యాంకు. నేను వెళ్లిన రోజు కూడా అలానే ఉంది. నేను నా సెల్ఫ్ చెక్ ఒకటి బ్యాంకులో ఇచ్చి, ఇంకా కొన్ని బ్యాంకు లావాదేవీలు కూడా పూర్తి చేసుకున్నాక అన్నీ సర్దుకుని వెళదామని, నేను తెచ్చుకున్న డాక్యుమెంట్లన్నీ బ్యాగులో పెట్టుకుంటుంటే నా చెక్ బుక్ కనపడలేదు. నేను అదివరకు ఎక్కడైతే చెక్ వ్రాసానో అక్కడ, ఇంకా మిగత అన్ని చోట్లా చూసినా కనపడలేదు. బ్యాంకు స్టాఫ్‌ని అడిగితే, వాళ్ళు కౌంటర్‌కి అవతలవైపు అంటే వాళ్ళ వైపు చూసి, "ఇక్కడెక్కడా లేదు మేడం" అన్నారు. అప్పుడు నేను మళ్ళీ క్యాష్ కౌంటర్ దగ్గరకి వెళ్లి అక్కడ అటు, ఇటు చూసి కౌంటర్లో ఆయన్ని కూడా అడిగాను. ఆయన, "ఇక్కడ లేదండి" అన్నారు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే, అప్పటివరకు బ్యాంకులో స్టాఫ్ కాకుండా, కస్టమర్ నేను ఒక్కదాన్నే ఉన్నాను. బ్యాంక్ అంతా ఖాళీగా ఉంది. కొద్దిసేపటి క్రితమే నేను ఆ చెక్ బుక్‌లోని ఒక చెక్ చింపి ఇచ్చాను. ఇంతలో ఎలా మాయమైపోయందని ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే నాకు భక్తులు తమ వస్తువులు కనపడనప్పుడు బాబాని ప్రార్థించి, 'ఓం శ్రీసాయి సూక్ష్మయ నమః' అని స్మరించడం గుర్తొచ్చి, నేను ఇంకా 'సాయి సూక్ష్మాయ నమః' అని కూడా అనుకోలేదు కేవలం 'బాబా' అనుకొని చూసేటప్పటి క్యాష్ కౌంటర్ బయట కింద పడి ఉన్న నా చెక్ బుక్ కనిపించింది. అప్పటివరకూ అటూ ఇటూ పదిసార్లు చూసినా కనపడనిది బాబాని తలచిన వెంటనే కనపడింది. ఏమనాలి దీన్ని? బాబా, 'ఈమధ్య నీ వ్యవహారాల్లో పడి నన్ను తలుచుకోడం తగ్గించావు కాబట్టి నిన్ను నాతో కనెక్టివిటీలో ఉంచుకోవడానికే ఈ లీల' అని అంటున్నట్టు అనిపించింది నాకు. "ధన్యవాదాలు బాబా".
Om Sairam!! Sada me anugrahanni ma meeda ilage kuripinchandi thandri!! Nannu na kutumbanni meere kapadali baba!! Antha me daya!! Meeku sarvasya saranagathi ayyelaga deevinchandi !! Jai Sairam!!!
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm sai ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram, baba amma nannalani kshamam ga arogyam ga chusukondi, anni velala vaallaki thodu undandi, vaalla purti badyata meede tandri, shiva ni kuda anni vishayallo jagratta ga chusukondi, naaku manchi arogyanni prasadinchandi baba pls, ofce lo work pressure lekunda prashantam ga unde la chusukondi baba e roju anta bagunde la chusukondi baba pls. Ammamma tataya la problems konchem taggai daaniki chala thanks tandri adi me daye tandri.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi
ReplyDeleteOm Sri Sai Ram
ReplyDeleteOm Sai Ram. Sai thandri Tana job ki etuvanti ibandi kalagakunda chuskondi pls. Sarvejanoh Sukhinobhavanthu
ReplyDeleteSai ram kapadu.. problems anni clear ayyela chey tandri🥲🙏
ReplyDeleteSri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai,🙏🙏🙏🙏🙏
ReplyDelete