ఈ భాగంలో అనుభవం:
- ప్రార్థనలకు బాబా సమాధానం
నా పేరు మాధవి. నా ప్రార్థనలకు బాబా ఎలా సమాధానమిచ్చారో నేనిప్పుడు పంచుకుంటాను. మా అమ్మ, వదినలు మధ్య కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాళ్ళు సన్నిహితంగా మాట్లాడుకునేవారు. అలాంటిది ఒకరోజు మా అమ్మ, "కోడలు నాతో మాట్లాడటం లేద"ని చెప్పింది(కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఇక్కడ సమస్య గురించిన వివరాలు ప్రస్తావించలేను). అది విని నేను ఆందోళన చెంది, "బాబా! దయచేసి వదిన అమ్మతో మాట్లాడేలా చేయండి. ఆమె మొండిగా ఉంటుందని నాకు తెలుసు. అలాగని ఏ సంబంధాన్ని వదిలిపెట్టలేం" అని బాబాతో చెప్పుకొని బాధపడ్డాను. ఇక అద్భుతం చూడండి. నేను మళ్ళీ మా అమ్మకి ఫోన్ చేసినప్పుడు మామూలుగా "వదిన మాట్లాడుతుందా?" అని అడిగాను. అందుకు అమ్మ, "నిన్న ఫోన్ చేసింది. ఏమీ జరగనట్లు చక్కగా మాట్లాడింది" అని చెప్పింది. అది విని నేను సంతోషించి బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. "చాలా ధన్యవాదాలు బాబా. నేను నా తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉంటున్నానని మీకు తెలుసు. వాళ్లకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా ఇంకేమైనా సమస్యలు వచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంటే వాళ్లే(వదినవాళ్ళు) అండగా ఉండాలి. దయచేసి వారి బంధాన్ని ఆరోగ్యకరంగా ఉండేలా అనుగ్రహించండి".
2024లో మా అమ్మానాన్న కొత్త ఇంటికి మారి పాత ఇంటిని అద్దెకు ఇవ్వాలనుకున్నారు. అయితే 2 నెలలు చూసినా ఎవరూ అద్దెకు రాలేదు. ఎవరైనా వచ్చినా ఇల్లు చూసి వెళ్లిపోతుండేవారు. ఈ పరిస్థితి అమ్మవాళ్లకి బాధను కలిగించడంతోపాటు ఆర్థికంగా ఇబ్బందిపెట్టింది. నేను వాళ్ళని ఆ స్థితిలో చూడలేకపోయాను. ఒకరోజు నేను ఈ బ్లాగును చదువుతున్నప్పుడు, ఇదే సమస్యను ఎదుర్కొన్న ఒక భక్తుని అనుభవం చూసాను. అందులో వాళ్ళ ఇంటిని డిసెంబర్‌లో ఎవరో అద్దెకు తీసుకోవోడంతో సమస్య తీరినట్లు ఉంది. అది చదివాక ఖచ్చితంగా చెప్పలేనుగానీ, 'డిసెంబర్ నాటికి అమ్మావాళ్ళింట్లో ఎవరో అద్దెకు వస్తారని బాబా నాకు సూచన ఇచ్చారని' అనుకున్నాను. తరువాత సరిగ్గా అదే జరిగింది. ఎవరో వచ్చి విచారించి, డిసెంబరులో ఇంటిలో దిగుతామని చెప్పారు. అది తెలిసి నేను, 'బాబా మనల్ని ఎంతలా చూసుకుంటున్నారు?' అని ఆశ్చర్యపోయాను. బాబా తమ బిడ్డలు సంతోషంగా లేకుంటే చూడలేరు. ఆయన నా ప్రార్థనలకు వేరే భక్తుల అనుభవం ద్వారా నాకు సమాధానం ఇచ్చారు. "చాలా ధన్యవాదాలు బాబా".
ఒకరోజు అకస్మాత్తుగా నా మేనేజర్ నాకు ఫోన్ చేసి, 'నేను ఒక పనికోసం ఎక్కువ గంటలు నమోదు చేసానని, దాన్ని సర్దుబాటు చేయమని, అన్ని గంటలకి పేమెంట్ ఇవ్వలేమని' చెప్పారు. దాంతో నేను డబ్బు గురించి ఆలోచించలేదు కానీ, నమ్మకం దెబ్బతింటుందని కొంచెం ఆందోళన చెంది చాలా బాధపడ్డాను. అయితే ఆ సమయంలో గంటల సంఖ్యను వేరే పనికింద సర్దుబాటు చేయడానికి కూడా వేరే అవకాశం లేకపోయింది. ఎందుకంటే, అది డిసెంబర్ నెల అయినందున నాకు ఎక్కువ పనులు లేవు. ఏదేమైనా నేను సమస్యను బాబా పాదకమలాల వద్ద ఉంచాను. తర్వాత నేను ఫేస్‌బుక్ పేజీలో చూస్తుంటే సాయిబాబా ఫోటో క్రింద, "నువ్వు పెద్ద ప్రమాదం నుండి రక్షించబడ్డావు. ఇది నువ్వు అనుకున్నట్లు జరగలేదని చింతించకు. ఇది నీ మేలు కోసం నా ప్రణాళిక. అనుకున్నవి సమయానికి నెరవేరుతాయి" అని వ్రాసింది. అది చూసిన నేను, 'బాబాకు మనకు ఏది మంచిదో తెలుసు. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు' అని అనుకున్నాను. కానీ నా టీమ్ ఈ అంశాన్ని స్టాండ్-అప్ మీటింగ్ వరకు లాగకూడదని అనుకున్నాను. తర్వాత నేను మీటింగ్‌కి హాజరయ్యే ముందు బాబాని ప్రార్థించి, కేవలం ఆయన నుండి భరోసా కోసం, "బాబా! దయచేసి మీటింగ్‌లో ఆ అంశం రావడం లేదని నాకు ఏదైనా హామీ ఇవ్వండి" అని అడిగాను. సమావేశానికి కొన్ని నిమిషాల ముందు నేను ఫేస్‌బుక్‌లో, "నేను నీకోసం పోరాడతాను. ఆందోళనలన్నీ తీసేసి ప్రశాంతంగా కూర్చో. నువ్వు ఏమీ చేయనవసరం లేదు. నా మాటలు నమ్ము" అని బాబా సందేశం చూసాను. బాబా అలా చెప్పడం చూసి నాకు చాలా సంతోషంగా అనిపించి మీటింగ్‌కి హాజరయ్యాను. బాబా చెప్పినట్లు మీటింగ్‌లో ఆ అంశం రాలేదు. "చాలా ధన్యవాదాలు బాబా. నా జీవితానికి సృష్టికర్త మీరే. మీకు ఏది కావాలంటే అది చేయండి. అయితే ఎప్పుడూ మాతో ఉండండి. పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనా మీ ఉనికిని అనుభవిస్తుంటే నేను భయపడను దేవా.
దయచేసి నాకు నమ్మకం కలిగించండి".
Om Sairam!!!
ReplyDeleteOm Sai Ram. Visa vishayam Lo help cheyandi Baba. Anni vishayallo thodu ga undi dairyanni ivandi. Sarvejanoh Sukhinobhavanthu.
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm sai ram, tandri naaku ofce lo ye problem lekunda chusukondi nenu anukunnattu prashantam ga unde la chusukondi baba pls, amma nanna alage shiva ni yeppudu kshamam ga arogyam ga ashtaishwaryalatho chusukondi baba pls, naaku manchi arogyanni prasadinchandi baba e roju anta prashantam ga gadiche la chusukondi baba pls anta me daye tandri.
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi barya biddalu isyawaram aur aryoyalatho nuralu kshamam gavindalani Kalyan ni bless chaindi pl
ReplyDeleteThandri govt teacher job prasadinchu thandri nuv eppudu Naku thodu ga undu
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteSai Raksha Raksha Raksha🙏
ReplyDeleteSorry baba.. Nijamga sorry 😞 .. inkepudu ala cheyanu.. nee dari lo nadavadaniki maritha prayathnistanu.. naku shradha saburi ivvu🙏🙏 naku emotions control cheskone capacity nuvve ivvali .. asahayuraliki nuvve sahayam cheyi.. talli laga aduko.. 🙏
ReplyDeleteSri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏
ReplyDelete