ఈ భాగంలో అనుభవాలు:
1. మొదటి శిరిడీ దర్శనం
2. అంతా బాబా లీల
మొదటి శిరిడీ దర్శనం
నా పేరు రాజన్ బాబు. నేను అప్పుడప్పుడే బాబాని నమ్ముతున్న రోజుల్లో నా జీవితంలో ఏవో సమస్యల వల్ల ఇంట్లో మనశాంతి కరువైంది. ఏదేమైనా నా సమస్యలకు పరిష్కారం కావాలంటే బాబాని నమ్మడమే సరైన పని అని పూర్తిగా బాబాపై విశ్వాసముంచి ఆయన్ని వేడుకున్నాను. 2019, అక్టోబర్ 9, దసరాకి ముందు ఇంట్లో గొడవలతో ఇంట్లో ఎవరూ నాతో మాట్లాడడం లేదు. అందువల్ల ఈ దసరా సమయంలో ఇక్కడ ఉండొద్దని అనుకున్నాను. అంతలోపే శిరిడీ వెళ్దామని ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడే నా ఫోన్లో కాజీపేట నుండి శిరిడీకి ట్రైన్లు ఉన్నాయా అని చూస్తే దసరారోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ట్రైన్ ఉంది. వెంటనే స్లీపర్ టికెట్ బుక్ చేశాను. టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉన్నప్పటికీ సరిగా దసరా ముందురోజు కన్ఫర్మ్ అయింది. దాంతో నేను ప్రయాణానికి సిద్ధమయ్యాను. మరో అద్భుతం ఏమిటంటే, నా టికెట్ స్లీపర్ క్లాస్ నుండి సెకండ్ ఏసికి అప్గ్రేడ్ అయిందని నాకు మెసేజ్ వచ్చింది. నేను ఆనందంగా బాబాకు నమస్కరించుకొని ట్రైన్ ఎక్కాను. కానీ నేను మొదటిసారి శిరిడీ వెళ్తున్నాను. నాకు ఏమీ తెలియనందు వల్ల, "బాబా! నాకు ఏమీ తెలియదు. ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి తిరిగి వచ్చేదాకా నా వెంట ఉండి చూసుకోవాల"ని వేడుకొని నా సీట్లో కూర్చున్నాను. కాసేపటికి నా బెర్త్ పైకెక్కి పడుకొని ఆలోచిస్తూ, "నా ప్రయాణం ఎలా జరుగుతుంది బాబా? నీవే దిక్కు" అని పదేపదే బాబాను తలుచుకుంటున్నాను. కొంతసేపటికి ట్రైన్ హైదరాబాదులో ఆగింది. కిందకి దిగి తినడానికి కొన్ని కొనుక్కొని మళ్ళీ ట్రైన్ ఎక్కాను. ట్రైన్ బయలుదేరింది. నా ఎదురు బెర్త్లో పడుకొని ఉన్న విజయవాడకి చెందిన ఒక అబ్బాయి హఠాత్తుగా లేచి, "హైదరాబాద్ వచ్చిందా?" అని అడిగాడు. నేను, "ఆ.. ఇప్పుడే వెళ్లిపోయింది" అన్నాను. అతను, "అయ్యో..! ఓకే" అన్నాడు. అతని దగ్గర తినడానికి రేగిపళ్ళు తప్ప ఏవీ లేవు. వాటిని తింటుంటే నాకు బాధేసి నా దగ్గరున్న అరటిపళ్ళు అతనికి ఇచ్చాను. ఒకరినొకరం పరిచయం చేసుకున్నాము. అతను తరచూ శిరిడీ వెళ్లి, వస్తుంటానని చెప్పాడు. నేను ఆనందంగా శిరిడీ తెలిసిన వ్యక్తిని పరిచయం చేసారని బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇద్దరం కలిసి శిరిడీ చేరుకొని ముందుగా ధూళి దర్శనం చేసుకున్నాం. అతను, "నేను రేపు తిరిగి వెళ్తాను" అని అన్నాను. నేను మూడు రోజులుంటాను అని అన్నాను. రూములు చూసి ఒక రూమ్ తీసుకున్నాము. అప్పటివరకు నాతో ఉన్న అతను, "నేను ఎక్కడైనా పడుకుంటాను" అన్నాడు. నేను, "వద్దు. నువ్వు నాతోనే ఉండు" అన్నాను. అతను సరేనని స్నానం చేసాక నన్ను మళ్లీ బాబా దర్శనానికి తీసుకొని వెళ్ళాడు. ప్రసాదాలయం, ఇంకా అన్నీ చూపించి మర్నాడు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. నేను అతనితో వెళ్లి, అతన్ని ట్రైన్ ఎక్కించి వచ్చాను. నేను అక్కడున్న మూడు రోజులు కనీసం రోజుకు మూడుసార్లు చొప్పున
వీలైనన్నీ సార్లు దర్శనం చేసుకున్నాను. త్రయంబకేశ్వరం కూడా వెళ్ళొచ్చాను. ప్రతి విషయంలో బాబా దగ్గరుండి నన్ను తిరిగి ఇంటికి చేర్చారు. "ధన్యవాదాలు బాబా".
అంతా బాబా లీల
'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు పాఠకులకు నమస్కారాలు. నా పేరు వెంకటేష్. 2024, ఫిబ్రవరి 22న నేను నా కుటుంబంతో మా కజిన్ సిస్టర్ పెళ్లికి వెళ్లాను. అక్కడ ఫంక్షన్ హాల్లో మా కుటుంబానికి కేటాయించిన గదిలో ఉన్నాం. పెళ్ళైపోయాక నేను మా బ్యాగులన్నీ సర్ది ఒకటికి రెండుసార్లు తనిఖీ చేశాను. తర్వాత బ్యాగులన్నీ నేను, నా భార్య బయటికి తీసుకొచ్చాము. నేను గదికి తాళం వేసే ముందు మరోసారి గదిలో అంతా చూసి, మా వస్తువులు ఏవీ లేవన్న నిర్ధారణకొచ్చిన తర్వాత తాళం చేసి, తాళాలు ఇచ్చేసాను. నాకు బాగా గుర్తుంది, నా బ్యాగును నేనే పెళ్లికూతురు గదిలో పెట్టాను. తర్వాత మేము బయలుదేరేముందు పనివాళ్ళు అన్నీ బ్యాగులు మా కారులో పెట్టారు. నేను అన్నీ వచ్చే ఉంటాయని చెక్ చేసుకోలేదు. తీరా ఇంటికి వచ్చాక చూసుకుంటే, ఒక బ్యాగు కనిపించలేదు. ఎవరిదా ఆ బ్యాగు అని చూసుకుంటే అది నాదే. ఆ బ్యాగులోని పెళ్లికోసం కొన్న కొత్త బట్టలు, బిజినెస్ కోసం ఉపయోగించే మొబైల్, లాకర్ తాళాలు ఉన్నందున చాలా టెన్షన్ పడ్డాను. ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తం అంతా వెతికినా కనిపించలేదు. అప్పుడు పెళ్ళికొడుకువాళ్లకి విషయం చెప్తే, ఫంక్షన్ హాల్ దగ్గర విచారించారు, సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసారు కానీ, ఆ బ్యాగు జాడ తెలియలేదు. నేను చాలా భయపడిపోయి మనసులో బాబాని తలుచుకున్నాను. వాళ్ళు మరుసటిరోజు మళ్లీ వెళ్లి పెళ్లికూతురు గది, మేము ఉన్న గది చెక్ చేశారు. అప్పుడు మేము ఉండిన గదిలోనే ఆ బ్యాగు ఉందట. ఆ విషయం వాళ్లు కాల్ చేసి చెప్తే, నేను అస్సలు నమ్మలేకపోయాను. ఎందుకంటే, నేను గదికి తాళం వేసే ముందు బాగా చెక్ చేశాను. ఇంకా అప్పుడు అంతా బాబా లీల అనుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా".
Om Sairam!!!
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeletePls baba na barthani nannu kalapandi sai
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi pl manchi match chusi. Marriage chaindi
ReplyDeleteSai om Sai om Sai om Sai om .., Sai please Sai kashtalanni chuttumuttayi. Kapadu tandri.. Meena ki Pelli kudurinchu… please please.. ammanannani , tammudini tana bharya biddalni, nannu ma ayanani na biddalani kapadutu undu.. na family andariki ayurarogyalu ivvu🙏
ReplyDeleteOm Sai Ram. Baba visa vishayam Lo antha manchiga jarigela chuskondi thandri. Ellapudu thodu ga undi kapadandi. Sarvejanoh Sukhinobhavanthu
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
om sai ram
ReplyDelete