ఈ భాగంలో అనుభవం:
- బాబా లీలలు ఎవరికీ అర్థం కావు - ఆయన ఎవరిని, ఎప్పుడు, ఎలా ఆశీర్వదిస్తారో తెలియదు
నేను ఒక సాయి భక్తురాలిని. నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. అప్పటినుండి నేను బాబాని తండ్రి అని పిలుస్తాను. నాకు పెళ్లైన కొత్తలో 2022, జూలై 5న నేను, మావారు శిరిడీ వెళ్ళాము. నేను అదే మొదటిసారి శిరిడీ వెళ్లడం. తర్వాత బాబా అనుగ్రహంతో గురువారంనాడు నాకు ఒక పాప పట్టింది. తనకి సాయిధన్విక అని పేరు పెట్టుకున్నాము. నేను నా ఖాళీ సమయాల్లో సాయి సచ్చరిత్ర చదవడం, హారతి పాటలు పాడుకోవడం, శిరిడీ ప్రత్యక్ష ప్రసారం చూడటం, గుడికి వెళ్లడం చేస్తుంటాను. నా చిన్ననాటి నుండి ప్రభుత్వోద్యోగం చేయాలని నాకొక కల. అందుకోసం 4 సంవత్సరాలు బ్యాంకు పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాను. ఒకరోజు రాత్రి 10 గంటలకి శిరిడీ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న నా మనసుకి 'నేను ఎప్పుడు శిరిడీ వచ్చి మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తాను, హారతి పాడుతాను' అని అనిపించింది. అప్పుడు నేను, "నాకు ప్రభుత్వోద్యోగం వస్తుందంటే మీ దర్శనాన్ని అనుగ్రహించు తండ్రీ" అని అనుకున్నాను. ఇక బాబా నన్ను శిరిడీకి ఎలా రప్పించుకున్నారో చూడండి.
బాబా దయవలన మా అన్నయ్య పెళ్లి 2024, డిసెంబర్ 6న జరపడానికి నిశ్చయమైంది. కువైట్లో ఉండే మావారు అన్నయ్య పెళ్లికోసం వారం రోజులు ముందు వచ్చారు. నేను మావారిని శిరిడీ వెళదామని అడిగాను. అందుకాయన, "పెళ్లి హడావుడిలో ఇప్పుడు వెళితే బాగోదు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం" అని అన్నారు. అయితే బాబా చేసిన అద్భుత లీల చూడండి. డిసెంబర్ 6 రాత్రి అనగా డిసెంబర్ 7, తెల్లవారుజామున గం.4:46ని.లకి అన్నవరంలో అన్నయ్య పెళ్లి జరిగింది. తర్వాత మా అన్నయ్యవాళ్ళు ఒక కారులో, నేను, మావారు, మరో 6 మంది వేరే కారులో బయలుదేరాము. మావారే కారు నడిపారు. దారిలో ఏం జరిగిందో తెలీదుగాని మా కారు వెళ్లి ఒక పెద్ద రాయిని ఢీకొట్టింది. మన తండ్రి బాబా దయవల్ల ఎవరికీ ఏమీ కాలేదు, చిన్న దెబ్బ కూడా తగలలేదు. కారుకి చూడటానికి ఏమీ కానట్లు ఉన్నా చిన్నచిన్న డామేజ్లు అయ్యాయి. ఆ కారు వేరే వాళ్లది అయినందున వాళ్ళు ఏమంటారో అని అనుకున్నాము. అంతలో కారు స్టార్ట్ అవ్వలేదు, ఏసీ కూడా పని చేయలేదు. అప్పుడు మావారు, "కారు ఇంజన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే శిరిడీ వస్తామ"ని అనుకున్నారు. బాబా దయవల్ల ఇంజన్ బాగానే ఉంది. మేము 20,000 ఖర్చు పెట్టి కారుకి ఏసీ, ఇంకా కొన్ని వేయించాము. అంత ఖర్చు పెట్టాక కూడా కారు ఓనరు మరో పది వేల రూపాయలు అడిగితే ఇచ్చాము. ఒకవేళ ఇంజిన్ పాడై ఉంటే లక్ష రూపాయలు ఖర్చు అయుండేది. అలాంటిది కేవలం 30,000 రూపాయలే అయింది. బాబానే పెద్ద మొత్తం అవ్వకుండా కాపాడారు. "శతకోటి వందనాలు బాబా. ఎవరికీ ఏమీ కాకుండా కాపాడారు తండ్రీ".
ఇకపోతే, పెళ్లి తర్వాత నా బంగారం బీరువాలో పెట్టిన గుర్తు కానీ, ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు 'శ్రీసాయి సూక్ష్మయ నమః' అని జపిస్తూ వెతికితే వెంటనే దొరికాయి. అంతా బాబా దయ.
శిరిడీ వెళదామంటే, ఇప్పుడొద్దన్న మావారు జరిగిన కారు యాక్సిడెంట్ కారణంగా శిరిడీ వస్తానని మొక్కుకున్నారని చెప్పాను కదా! అందుకని మేము డిసెంబర్ 22న శిరిడీ చేరుకున్నాము. నాకు హారతి చూడాలని కోరిక. కానీ మా దగ్గర హారతి టిక్కెట్లు లేవు. వాటిని నెల ముందు ఓపెన్ అయినప్పుడు బుక్ చేసుకోవాలి. కానీ మేము హఠాత్తుగా శిరిడీ వెళ్లాలనుకున్నందువల్ల మాకు టిక్కెట్లు దొరకలేదు. అయితే బాబా ఏం చేసారో చూడండి. మేము 22వ తేదీ రాత్రి 8:30కి మామూలుగా బాబా దర్శనం చేసుకొని వద్దామని ఫ్రీ లైన్లో వెళ్ళాము. అప్పుడు రద్దీ ఎక్కువగా లేదు, కాస్త ఖాళీగానే ఉంది. కానీ ఓ చోట నా ముందున్న వాళ్ళని దర్శనానికి పంపించి, మమ్మల్ని పంపకుండా గేటు వేసేసారు. అక్కడున్న సెక్యూరిటీ అతన్ని రిక్వెస్ట్ చేసినా పంపలేదు, "టీవీలో చూడండి" అని అన్నాడు. అప్పుడు నా కళ్ళ నిండా నీరు, మనసు నిండా బాధతో, "బాబాకి నేను అంటే ఇష్టం ఉండను" అని చాలా ఏడ్చాను. బాబాని దగ్గరనుండి చూసే అదృష్టం నాకు లేదని అనుకున్నాను. కొంతసేపటికి వేరే సెక్యూరిటీ అతను వస్తే, మా ఆయన మమ్మల్ని లోపలికి పంపించండి అని అడిగారు. అతను దగ్గరుండి మా ఇద్దరిని తీసుకొని వెళ్లి సమాధి మందిరంలో సమాధికి దగ్గరగా నిల్చోబెట్టారు. నా కళ్ళనిండా నీళ్లు నిండిపోయాయి. బాబాకు నా మీద ఎంత ప్రేమ?, నా కోరిక తీర్చారు అనుకున్నాను. ఇంకా నాకు తెలిసేదేమిటంటే, మా ముందు పంపబడ్డ వాళ్లందరినీ బాబాని దర్శించాక బయటకు పంపించారని, వాళ్ళని హారతికి ఉంచలేదని. ఒకవేళ ఆ సెక్యూరిటీ మమ్మల్ని ఆపకుండా పంపి ఉంటే, నేను బాబాను అంత దగ్గరగా చూడలేకపోయేదాన్ని. బాబా లీలలు ఎవరికీ అర్థం కావు. ఆయన ఎవరిని, ఎప్పుడు, ఎలా ఆశీర్వదిస్తారో మనకి తెలియదు. ఆ సమయంలో బాబా నాకు ఇష్టమైన పసుపు రంగు వస్త్రాలలో ఉన్నారు. నేను ఆయనకి దగ్గరగా, ఎదురుగా ఉండి హారతి పాడుతూ ఆయన్ని చూస్తూ ఉండిపోయాను. నేను నాకు ప్రభుత్వోద్యోగం వస్తుందంటే మీ దర్శనం కావాలని అనుకున్నాను. బాబా ఈ విధంగా 'నేనున్నాన'ని చెప్పారు. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? నేను బాబా నాకు ఖచ్చితంగా ఉద్యోగమిస్తారని నమ్ముతున్నాను. బాబా నన్ను శిరిడీకి రప్పించడానికి చేసిన ఈ లీల నా జీవితంలో మరిచిపోలేనిది. బాబాకి నా శతకోటి వందనాలు. అందరూ బాగుండాలి,, అందులో మనం ఉండాలి.
Om sai ram, 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba sorry baba .. sorry sorry sorry 😞🙏
ReplyDeleteSARVAM SREE SHIRIDI SAINAADHUNI ANUGRAHAME KADAA..
ReplyDeleteWE CAN'T IMAGINE THE MIRACLES OF OUR LORD SAIMAHARAAJ..
SAI SARANAM.
BAABAA SARANAM.
SAIBAABAA SARANAM.
DWARAKAMAAYEE SARANAM.
SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM SAIRAM
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sai Ram. Baba arogyam vishayam Lo help cheyandi. Elanti ibandi kalgakunda chuskondi pls. Sarvejanoh Sukhinobhavanthu
ReplyDeleteOm Sai Ram
ReplyDelete