ఈ భాగంలో అనుభవాలు:
1. ఫోన్ దొరికేలా దయ చూపిన బాబా
2. చెప్పినట్టుగానే ఉంగరం దొరికేలా అనుగ్రహించిన బాబా
ఫోన్ దొరికేలా దయ చూపిన బాబా
సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు జ్యోతిర్మయి. మాది నెల్లూరు. 2024, డిసెంబర్ 31 రాత్రి మావారు తన స్నేహితులతో కలిసి కేకు కట్ చేసి, షెటిల్ ఆడి బాగా ఎంజాయ్ చేసారు. మాకు షాపు ఉంది. ఆ రాత్రి కూల్ డ్రింక్స్ బాగా అమ్ముడుపోతాయని రాత్రి 2 గంటల వరకు ఉండి అప్పుడు షాపు మూసేసి 3 గంటలకి ఇంటికి వచ్చి పడుకున్నారు. మేము ఉదయం 9 గంటలకి బాబా గుడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నందువల్ల పిల్లల్ని రెడీ చేసి న్యూయిర్ కదా ఒక ఫోటో తీద్దామని మావారి ఫోన్‌కోసం చూస్తే, ఎక్కడా కనిపించలేదు. నా ఫోన్ నుంచి ఆయన ఫోన్‌కి కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ, ఫోన్ జాడ తెలియలేదు. చాలాసార్లు ప్రయత్నించాక ఇంకా ఇలా కాదని మావారిని నిద్రలేపి, "ఫోన్ ఎక్కడ పెట్టారండి, కనపడటం లేదు" అని అంటే, "ఉంది.. చూడు!" అని పడుకున్నారు. నేను, "లేదు అండి. కావాలంటే ఒకసారి ఫోన్ చేస్తాను, చూడండి" అన్నాను. మావారు, "షాపులో చూడు" అన్నారు. సరేనని చూస్తే, అక్కడ కూడా లేదు. ఇంకా నాకు ఫోన్ పోయిందని కోపం వస్తుంటే, మావారు ఏమో "ఎక్కడికీ పోదులే, ఉంటుంది" అని శాంతంగా ఉన్నారు. ఆయన గత న్యూఇయర్‌కి ఫోన్ పగలకొట్టుకొని వచ్చారు. అందుకని నాకు బాగా కోపమొచ్చి ఏదేదో అంటుంటే, "న్యూ ఇయర్ కదా! అబ్బా.. అరవకు. ఎక్కడో ఉంటుందిలే. ఎక్కడో పెట్టి మర్చిపోయాను, గుర్తు రావడం లేదు" అన్నారు. కానీ నేను ఊరుకోలేకపోయాను. కాసేపటికి నా టార్చర్ భరించలేక, "అబ్బా.. పోతే పోయిందిలే! వదిలేసి సంతోషంగా రెడీ అవ్వు. గుడికి వెళదాం" అన్నారు మావారు. నాకు మరింత కోపం వచ్చింది. ఆ ఫోన్లో మా పిల్లల ముఖ్యమైన ఫోటోలున్నాయి. అందువల్ల అరుస్తూనే పిల్లలకి టిఫిన్ పెట్టాను. తర్వాత పూజ చేస్తూ, "బాబా! నేను ఆనందంగా మీ దగ్గరకు రావాలి. ఇలా టెన్షన్‌తో, బాధతో రాలేను. మేము రెడీ అయి మీ దగ్గరకు వచ్చేలోపు ఎలాగైనా ఫోన్ దొరకాలి బాబా" అని అనుకుంటూ పూజ పూర్తి చేశాను. ఆలోపు మావారు తన స్నేహితులకి ఫోన్ చేసి, తన ఫోన్ గురించి అడిగితే, వాళ్ళు మాకు తెలియదన్నారు. దాంతో రాత్రి షటిల్ ఆడిన చోట పడిపోయి వుంటుందని అక్కడికి వెళ్లారు. కానీ అక్కడ కూడా ఫోన్ లేదు. ఆ విషయం నాతో చెప్తే, అరస్తానని మౌనంగా ఉండి "గుడికి వెళ్దాం. త్వరగా కానివ్వు" అన్నారు. నేను దోశలు వేస్తూ కూడా, "బాబా! ఫోన్ దొరకాలి. బాబా బాబా.." అని అనుకుంటూనే ఉన్నాను. మావారు, "రా వెళ్దాం" అంటే, "రాను" అని చెప్పాను. అందుకాయన, "ఏం?" అన్నారు. నేను, "నాకు ప్రశాంతత లేదు. నేను రాను పో" అన్నాను. నిజానికి 'ఎలాగైనా బాబా ఫోన్ దొరికేలా చేస్తారని' నమ్మకం ఉన్నప్పటికీ పైకి మాత్రం 'రాను' అని అంటున్నాను. ఇంతలో మావారు నా ఫోన్ నుంచి ఇంకో ఫ్రెండ్‌కి కాల్ చేసారు. ఆ ఫ్రెండ్ "ఒరేయ్! నీ ఫోన్ నా దగ్గరే ఉంద"ని అన్నాడు. అప్పుడు మావారు నాతో, "నా ఫ్రెండ్ దగ్గర నా ఫోన్ ఉందంట. ఎక్కడికీ పోదు అన్నాను కదా!" అని అన్నారు. అప్పుడు మనసులో బాబాకి దణ్ణం పెట్టుకొని, "థాంక్స్ బాబా" అని చెప్పుకొని మావారితో, "నా బాబానే నీకు ఫోన్ దొరికేలా చేసారు" అని చెప్పాను. బాబా తన బిడ్డలని బాధపెట్టారు. ఒకవేళ ఆలస్యం జరిగిన గానీ తప్పకుండ మనల్ని గమ్యం చేరుస్తారు.
చెప్పినట్టుగానే ఉంగరం దొరికేలా అనుగ్రహించిన బాబా
సాయి బంధువులందరికీ నమస్కారం. నేను బాబా భక్తురాలిని. 2024, సెప్టెంబర్‌లో మేము వేరే ఊరు నుంచి బదిలీ మీద హైదరాబాద్ వచ్చాము. ఆ సమయంలోనే మా అమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో మా అన్నయ్య కొడుకు పెళ్లి హడావిడిగా చేయవలసి వచ్చింది. ఆ పెళ్లి అప్పుడు నేను మా ఆయన ఉంగరం తీసి ఎక్కడో పెట్టాను. తరువాత బీరువా సర్దుతున్నప్పుడు ఆ ఉంగరం కోసం ఎంత వెతికినా కనిపించలేదు. ఇంకా నేను, "బాబా! మీరే ఉంగరం కనపడేలా చేయాలి" అని దణ్ణం పెట్టుకొని ఆయన మీద భారమేసాను. తరువాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, "రెండు రోజుల తర్వాత నీ వస్తువు దొరుకుతుంది" అని బాబా మెసేజ్ వచ్చింది. అలాగే బాబా చెప్పినట్టు ఉంగరం బీరువాలో దొరికింది. ఎన్నోసార్లు బాబా "నేను ఉండగా భయం ఎందుకు?" అని చెప్పినప్పటికీ ప్రతిసారీ భయమే. బాబా ఉండగా ఎందుకింత భయపడతామో అర్థం కాదు. "ధన్యవాదాలు బాబా. నా సమస్య ఏమిటో మీకు తెలుసు. అది చాలా భయంకరమైన సమస్య అని కూడా మీకు తెలుసు తండ్రీ. ఆ సమస్య తీర్చు తండ్రీ. జీవితంలో నేను మిమ్మల్ని అడిగేది అది ఒక్కటే.
అది మీరు మాత్రం తీర్చగలరు తండ్రీ".
Om Sai Ram. Visa vishayam Lo help cheyandi Baba. Health vishyam Lo thoduga undandi Sai thandri. Chala bayam ga untundi. Meere thoduga undi dairyanni ivandi. Sarvejanoh Sukhinobhavanthu.
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to our family members 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDelete