సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1951వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మేలు జరిగేలా సహాయం చేసిన బాబా
2. ప్రతి విషయం బాగా చూసుకున్న బాబా 



సాయిభక్తుల అనుభవమాలిక 1950వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన బాబా
2. బాబా ఊదీ నిజంగా దివ్య ఔషధం
3. పిలిచినంతనే కష్టం తీర్చే బాబా




సాయిభక్తుల అనుభవమాలిక 1949వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • తలుచుకున్న ప్రతిసారీ తామున్నామని వెంటనే సహాయం అందించే బాబా 


సాయిభక్తుల అనుభవమాలిక 1948వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాని నమ్ముకుంటే చాలు, జీవితంలో అన్నీ శుభాలే!
2. సూపర్ మార్కెట్ దగ్గర బ్యాగులో ఉండాల్సిన పర్సు ఇంటిలో ఎలా ఉందో! - బాబాకే ఎఱుక  
3. ఎటువంటి సమస్య ఎదురైనా బాబా దయతో బాగైపోతుంది

బాబాని నమ్ముకుంటే చాలు, జీవితంలో అన్నీ శుభాలే!

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ. సాయిబాబా నాకు చేసిన మేలు నేను ఎన్నటికీ మరువలేనిది. ఆయన నన్ను అనుక్షణం ఆదుకుంటూ నడిపిస్తూ ఉద్ధరిస్తున్నారు. ఆయన్ని నమ్ముకుంటే చాలు, ఇక జీవితంలో అన్నీ శుభాలే!!! నేను ప్రమోషన్ కోసం ఒక పరీక్ష వ్రాయవలసి ఉండగా దానికి మూడు అవకాశాలే ఇస్తారు. నేను, "మొదటి ప్రయత్నంలోనే పాసవ్వాలి బాబా" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల మొదటి ప్రయత్నంలోనే పాసయ్యాను. నేను బాబాని, "వైజాగ్ లో నాకు ఒక ఇల్లు ఇప్పించమ"ని ప్రార్థిస్తే, మంచి ఇల్లు ఇప్పించారు. 2024, సెప్టెంబర్ 22న మా పాప రజస్వల వేడుక చేసాము. నాకు బంధువులతో విరోధం ఎక్కువ. అందువల్ల వాళ్ళందరూ వీడు ఈ ఫంక్షన్ ఎలా చేస్తాడో, వీలైతే నష్టం చేద్దామని అనుకున్నారు. నేను, "బాబా! ఈ ఫంక్షన్ మీది. నన్ను నిమిత్తమాత్రునిగా చేసి మీ మనవరాలి వేడుక మీరే జరిపించాలి" అని మొదటి శుభలేఖ మీద వ్రాసి సాయిబాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల ఆ రోజు ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో చెప్పడానికి నా నోటి వెంట మాటలు రావడం లేదు. వర్షం అస్సలు పడలేదు, 350 మందికి భోజనం క్యాటరింగ్ ఇస్తే, 500 కంటే ఎక్కువ మంది వచ్చినప్పటికీ అందరికీ సరిపోగా ఇంకా మిగిలిపోయింది. ఇది బాబా చేసిన లీల. "ధన్యవాదాలు సాయినాథా! నేను ఎప్పుడైనా మీపై అపనమ్మకంతో ఉన్నా నన్ను క్షమించి ఒక తండ్రిలా నన్ను దగ్గరకు చేర్చుకోండి. ఎన్ని జన్మలైనా నాకు మీపై అచంచలమైన విశ్వాసం ఉండాలని, మీరు తప్ప ఇంకేదీ నాకవసరం ఉండకుండేలా దీవించండి".


ఎటువంటి సమస్య ఎదురైనా బాబా దయతో బాగైపోతుంది
 
సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. ఒకసారి మా బాబుకి విపరీతమైన జ్వరం వచ్చింది. 3-4 రోజులు మందులు వాడినా జ్వరం తగ్గలేదు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. మరుసటిరోజు నుంచి జ్వరం తగ్గుముఖం పట్టి ఒక్క రోజులో పూర్తిగా మాయమైపోయింది. ఇలా నాకు ఎటువంటి సమస్య ఎదురైనా బాబా దయతో అంతా బాగైపోతుంది. "ధన్యవాదాలు బాబా. ఎప్పటికీ మీ దయ మాపై ఇలాగే ఉండి మేము ఆరోగ్యంగా ఉండాలి బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1947వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సాయి కరుణ

నేను ఒక సాయి భక్తుడిని. నేను రైల్వేలో ఎమర్జెన్సీ సెక్షన్‌లో పని చేస్తున్నాను. నేను చాలా పనులమీద 2024, నవంబర్ 23 రాత్రి రైలెక్కి 24వ తేదికి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉండగా అదేరోజు ఉదయం 8:45కి మా రైల్వేస్టేషన్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రాంతానికి డ్యూటీ మీద ఎమర్జెన్సీ ట్రైన్ తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళేటపుడు బాగానే వెళ్ళాము కానీ, తిరిగి వచ్చేటప్పుడు మా రైల్వేస్టేషన్‌కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్టేషన్‌లో మా ట్రైన్ ఆపేశారు. అప్పుడు ఒక సింగిల్ లోకో అదే మార్గంలో వెళ్తుంది. మా ట్రైన్, ఆ సింగిల్ లోకో వేర్వేరుగా ఎందుకు వెళ్ళడం, మా ట్రైన్‌ని, ఆ లోకోని కలిపి కప్లింగ్ చేసి పంపితే లోకోపైలట్ ఒకరే సరిపోతారు, డీజిల్ కూడా అదా అవుతుందని పై నుండి ఆదేశాలు వచ్చాయి. అయితే అసలు చిక్కు ఏంటంటే, లోకో కప్లింగ్ అన్నది చాలా సంవత్సరాల తరువాత చేయడం, పైగా మా ట్రైన్ బ్రేక్ పైప్స్ చాలా పాతవి, చాలారోజుల నుండి వాడకపోవడం వల్ల పైప్ మీద పగుళ్లు కూడా వచ్చి ఉన్నాయి. కాబట్టి కప్లింగ్ ప్రక్రియలో ఏదన్నా సమస్య రావచ్చు. ఒకవేళ అదే జరిగితే మా ట్రైన్ సమయానికి మా రైల్వేస్టేషన్‌కి చేరుకోదు. ఆలా అయితే నేను హైదరాబాద్ వెళ్లాల్సిన ట్రైన్ అందుకోలేను. అందువల్ల నాకు భయమేసి, "బాబా! ఎటువంటి సమస్య రాకుండా చూసి, సమయానికి నేను మా ఇంటికి వెళ్లి, ఆపై హైదరాబాద్ వెళ్లి అన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకునేలా కరుణించండి. ఒక పేదవానికి అన్నదానం(ఫుల్ మీల్స్) చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయ చూపారు. కప్లింగ్ అయ్యాక 100 కిలోమీటర్ల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా చేశారు. దాంతో నేను రాత్రి 7:30కి ఇంటికి చేరుకొని, 10 గంటలకి ట్రైన్ హైదరాబాద్ ఎక్కి వెళ్ళాను. అక్కడ నా పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంకా చాలా రోజుల తర్వాత మా బంధువులందరినీ కలిసాను. కొంతమంది బంధువులు ఇంటికి చాలా సంవత్సరాల తరువాత వెళ్లి కలవగలిగాను. ఇదంతా బాబా దయవల్లే జరిగింది.

రైల్వే జీఎం మా ఆఫీసులో వార్షిక ఇన్స్పెక్షన్ డిసెంబర్ 13న చేయడానికి నిశ్చయించారు. కిందటి సంవత్సరం ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఇన్స్పెక్షన్‌లో భాగంగా ఒక ఇంచార్జికి అతని తప్పు అంతలా లేకపోయినప్పటికీ చార్జిషీట్ ఇచ్చి, పెద్ద పనిష్మెంట్ కూడా ఇచ్చారు. ఈసారి నేను ఇంచార్జిగా ఉన్న సెక్షన్‌లో ఇన్స్పెక్షన్ జరగనుండటం వల్ల నేను బాబాని, "ఈ ఇన్స్పెక్షన్ బాగా అయితేనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా భార్య కాన్పు సమయానికి నాకు సెలవులు దొరుకుతాయి. కాబట్టి అలా అయ్యేటట్లు అనుగ్రహించినట్లైతే నేను మీ మందిరంలో పాలకోవా సమర్పించి, అందరికీ ఆ ప్రసాదం పంచుతాను" అని ప్రార్థించాను. బాబా దయవల్ల ఇన్స్పెక్షన్ చాలా బాగా జరిగి GM సార్ మా సెక్షన్‌కి స్పాట్ క్యాష్ అవార్డు ప్రకటించారు. అది కూడా నా చేతులకు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం బాబా మందిరంలో పాలకోవా సమర్పించి అందరికీ పంచాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలానే మీ కరుణ మీ భక్తులపై చూపండి".

నా భార్య 8 నెలల గర్భవతి ఉండగా రెండు నెలల నుంచి తనకి కడుపులో మరియు వెన్నులో కాస్త నొప్పి వస్తూ ఉండేది. డాక్టరుకి చూపిస్తే, "కడుపు కిందకు జారింది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలానే ఎందుకైనా మంచిది ఫెటల్ ఎకో స్కాన్ చేయండి" అని సలహా ఇచ్చారు. స్కాన్ చేయించడానికి అపాయింట్మెంట్ కోసం చూస్తే వారం తరువాత దొరికింది. బాబా దయవల్ల ఆరోజు నాకు ఎటువంటి ఎమర్జెన్సీ డ్యూటీ పడలేదు, స్కాన్ కూడా బాగా జరిగింది. కానీ రిపోర్టులో ఏమొస్తుందోనని కాస్త టెన్షన్ పడ్డాను. వెంటనే బాబాని తలుచుకొని, "బాబా! స్కాన్‌ రిపోర్టులో అంతా బాగుండేలా చేయండి. ఎటువంటి సమస్య లేకుండా ఉండేలా చూడండి. ఒకరికి అన్నదానం చేస్తాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల స్కాన్ రిపోర్ట్ బాగా వచ్చింది. కానీ కాస్త నీరు ఎక్కువగా ఉంది, మరే సమస్య లేదని డాక్టర్ చెప్పారు. "ధన్యవాదాలు బాబా".

2024, నవంబర్ 28 నాటికి నా భార్యకి 8 నెలలు పూర్తై 9వ నెల వచ్చింది. దాంతో నేను తనని హైదరాబాదులో ఉన్న తన పెద్దక్క వాళ్ళింటికి పంపాలనుకున్నాను. కానీ 2 నెలల ముందు నుండి గైనకాలజిస్ట్, "గర్భం కిందకు జారడం, ఉమ్ము నీరు ఎక్కువగా ఉండడం వల్ల చివరి నిముషం వరకు ప్రయాణం చేయొచ్చా, లేదా అన్న దాని గురించి నేనేం చెప్పలేను. 8 నెలలు పూర్తయ్యాక ఒకసారి రండి. స్కాన్ చేసి రిపోర్టు చూసాక పుట్టింటికి వెళ్లాలా, వద్దా అన్నది చెప్తాను" అని అన్నారు. ఒకవేళ డాక్టర్ వద్దంటే, మహారాష్ట్రలోని సోలాపూర్ వరకు ఇంత దూరం వచ్చి చూసుకొనే వాళ్ళే లేరు. ఎందుకంటే, నా భార్య తల్లిదండ్రులు దూరంగా విజయనగరంలో ఉంటారు. పైగా నా భార్య తండ్రికి వారంలో రెండుసార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. పోనీ హైదరాబాద్‌లో ఉన్న తన అక్క రావాలంటే, వాళ్ళ బాబు స్కూలు పోతుంది. కాబట్టి తప్పనిసరిగా నేను నా భార్యని హైదరాబాద్ పంపించాల్సి ఉంది. అందువల్ల నేను బాబాని, "బాబా! స్కాన్‌లో అంతా బాగుండాలి. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే నేను నా భార్యని హైదరాబాద్ పంపగలను. అక్కడ తన ఇద్దరు అక్కల కుటుంబాలు, మా బంధువులు అందుబాటులో ఉంటారు గనక ఏదైనా సమస్య వస్తే వాళ్ళు చూసుకుంటారు. అందువల్ల అంతా బాగుండి హైదరాబాద్ వెళ్లడానికి డాక్టర్ అనుమతిస్తే, ముగ్గురు అభాగ్యులకు అన్నదానం చేస్తాను" అని ప్రార్థించాను. బాబా దయ చూపారు. రిపోర్ట్ నార్మల్‌గా వచ్చింది. డాక్టర్, "కాస్త ఉమ్మనీరు ఎక్కువగా ఉంది. జాగ్రత్త!" అని చెప్పి హైదరాబాద్ వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అయితే నేను రైల్వే ఎమర్జెన్సీ సెక్షన్‌లో పని చేస్తుండటం వల్ల నాకు ఎప్పుడు డ్యూటీ వేస్తారో తెలియని పరిస్థితి. కాబట్టి నేను బాబాని, "నా భార్యని హైదరాబాద్ తీసుకొని వెళ్లేరోజు ఎటువంటి ఎమర్జెన్సీ డ్యూటీ పడకుండా, అలాగే తనకి తోడుగా వెళ్లేందుకు నాకు సెలవు దొరికేలా అనుగ్రహించి మమ్మల్ని క్షేమంగా హైదరాబాద్ చేర్చండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా మా ట్రైన్లో హైదరాబాద్‌కి ప్రయాణం సాగింది. అంతేకాదు, మర్నాడు డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. డాక్టర్ చూసి నా గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉందని అన్నారు. బాబాకి ఇచ్చిన మాట ప్రకారం ముగ్గురికి అన్నదానం చేశాను. "ధన్యవాదాలు బాబా. ఇలానే మీ దయ మాపై కురిపిస్తూ నా భార్యకి కాన్పు సక్రమంగా అయి ఆరోగ్యవంతురాలైన చక్కటి ఆడబిడ్డని ప్రసాదించండి".

సాయిభక్తుల అనుభవమాలిక 1946వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ఆరోగ్యం
2. సాయినాథుని కృప


సాయినాథుని కృప

సాయినాథుని చరణాలకు పాదాభివందనం. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. నేను 2024, అక్టోబర్ నుండి రెండు నెలలపాటు జలుబు వల్ల గొంతులో సమస్యతో బాధపడ్డాను. హాస్పిటల్‌కి వెళదామంటే ఏదో ఒక ఆటంకమొచ్చి వెళ్లడం అయ్యేది కాదు. చివరికి నవంబర్ 14, గురువారం డాక్టర్ వద్దకు వెళితే, టెస్ట్ చేసి, "గొంతులో చిన్న పుండు అయి వాపు వచ్చింది" అని చెప్పి వారం రోజులకు మందులిచ్చి, "తగ్గకపోతే వేరే టెస్ట్ చేసి తదుపరి చికిత్స చేద్దామ"ని అన్నారు. అంటే పరోక్షంగా తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సి రావొచ్చన్నట్లు మాట్లాడారు. అదీకాక ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడకూడదన్నారు. కానీ, ఉపాధ్యాయురాలినైన నేను మాట్లాడకపోతే ఎలా? అసలు నాకు ఆపరేషన్ అంటేనే భయమేసింది. విషయం తెలిసి నాకంటే ఎక్కువగా నా కుటుంబసభ్యులు, నా స్నేహితురాలు బాబాని ఎక్కువగా ప్రార్థించారు. బాబా కూడా వాళ్ళకి తగ్గిపోతుందని సందేశాలిచ్చారు. అలాగే బాబా దయవల్ల మందులు వాడిన రెండోరోజు నుండే గొంతులో మెరుగుదల వచ్చి వారం రోజులకి పూర్తిగా తగ్గిపోయింది. నేను మళ్ళీ గురువారం(నవంబర్ 21) డాక్టర్ వద్దకు వెళితే, "పూర్తిగా తగ్గింది. మీరు ఇక చెకప్‌కి రావాల్సిన అవసరం లేదు" అన్నారు. నేను ఆ సమస్యతో బాధపడుతున్న సమయంలో మా పాప జలుబు, దగ్గుతో బాధపడింది. బాబాని ప్రార్ధిస్తే రెండు రోజుల్లో తగ్గిపోయింది. ఒకరోజు మా అత్తయ్యవాళ్ళు మా ఇంటికి వచ్చి చీకటి పడుతుండగా తిరిగి వెళ్లారు. మా అత్తయ్య పెద్దావిడ. చలి ఎక్కువగా ఉన్న కారణంగా నేను, "వాళ్ళంతా క్షేమంగా ఇంటికి చేరుకొని, మా అత్తయ్యకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాల"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు, మా అత్తయ్య కూడా బాగానే ఉన్నారు.

మా ఇల్లు కట్టి ఏడు సంవత్సరాలవుతుంది. అందుకని పండగ సెలవుల్లో పెయింటింగ్ వేయించాలని అనుకున్నాం. కానీ తర్వాత పండగ సెలవుల్లో అయితే మరీ పండగ దగ్గరకొచ్చేస్తుంది, పని పూర్తవ్వదని, పండగ సెలవులకు ముందు సెలవులు పెట్టాల్సి వస్తుందని క్రిస్మస్ సందర్భంగా వచ్చే రెండు రోజుల సెలవులతోపాటు మరో రెండు రోజులు సెలవు పెడితే సరిపోతుందనుకొని క్రిస్మస్ రోజు పెయింటింగ్ మొదలుపెట్టాం. అయితే ఆరోజు భోరున వర్షం పడింది. "ఏమి చేయాలి బాబా?" అని బాబాని తలుచుకొని ఆ రోజుకి ఇంటి లోపల పెయింటింగ్స్ వేయించాము. బాబా దయవల్ల మరుసటిరోజుకి వర్షం తగ్గడంతో బయట పెయింటింగ్ చేయించాము. పని చాలా బాగా జరిగింది. ఇలా బాబా నన్ను ఎన్నో విధాలుగా కాపాడుతున్నారు. "ధన్యవాదాలు తండ్రీ. నన్ను మీ కుటుంబంలో చేర్చుకొని నన్ను, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు సాయినాథా! మీ చల్లని దృష్టి నా మీద, నా కుటుంబం మీద, ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1945వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చాలా దయగలవారు - జాగ్రత్త వహిస్తారు
2. ఆటంకం లేకుండా శిరిడీకి రప్పించుకున్న బాబా



సాయిభక్తుల అనుభవమాలిక 1944వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఉనికికి, వారి సహాయానికి స్పష్టమైన సంకేతం
2. ఉద్యోగం ప్రసాదించిన బాబా


ఉద్యోగం ప్రసాదించిన బాబా

ఓం శ్రీ శిరిడీ సాయినాథా! సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు తిలోత్తమ. శ్రీ సాయినాథుని దివ్య పాదాలకు శిరస్సువంచి నమస్కరిస్తూ ఆయన మాపై చూపిన ప్రేమను పంచుకుంటున్నాను. కరోనా సమయంలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మా తమ్ముడిని ఉద్యోగం నుండి తొలగించారు. అప్పటినుంచి మా తమ్ముడు ఏవేవో కోర్సులు నేర్చుకొని వైజాగ్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేసాడు. కానీ తనకి ఏ ఉద్యోగ అవకాశము రాలేదు. రెండు రౌండ్లు పూర్తయ్యాక ఫోన్ చేస్తానని చెప్పేవాళ్ళు కానీ, ఏ ఫోనూ వచ్చేది కాదు. మా తమ్ముడు చాలా దుఃఖానికి గురైయ్యాడు. నేను బాబాని, "బాబా! మా తమ్ముడికి స్థిరమైన ఉద్యోగాన్ని ప్రసాదించండి" అని చెప్పుకున్నాను. కొన్నిరోజులకి హైదరాబాదులో ఉన్న మా పెద్దమ్మవాళ్ళ అల్లుడు ఒక జాబ్ ఇంటర్వ్యూకి తమ్ముడ్ని తీసుకెళ్లారు. తమ్ముడు రెండు రౌండ్లు విజయవంతంగా పూర్తిచేసాక వాళ్ళు, 'హెచ్ఆర్ ఫోన్ చేస్తార'ని చెప్పారు. కానీ వారం రోజులైనా ఫోన్ రాలేదు. దాంతో మా తమ్ముడు వాళ్ళు ఇంకా కాల్ చేయరని నిరాశ చెందాడు. నేను, "బాబా! దయతో తమ్ముడికి ఫోన్ వచ్చేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. తర్వాత ఒక ఆదివారం రాత్రి హెచ్ఆర్ ఫోన్ చేసి, "సోమవారం ఆఫీసుకు రమ్మ"ని చెప్పారు. అంతే, మా ఆనందానికి అవధుల్లేవు. బాబా దయతో మా తమ్ముడు ఆ ఉద్యోగంలో చేరి అక్కడ అంతా చాలా బాగుందని చెప్పాడు. ఇలా మంచి ఉద్యోగం కోసమే ఆలస్యమైందనుకున్నాము మేము. ఇప్పుడు మా తమ్ముడు చాలా సంతోషంగా ఉన్నాడు. "ధన్యవాదాలు బాబా".

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.

సాయిభక్తుల అనుభవమాలిక 1943వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నెలసరి ఆపి నోము చేసుకొనేలా అనుగ్రహించిన బాబా
2. బాబా అనుగ్రహం



సాయిభక్తుల అనుభవమాలిక 1942వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయినాథుని దయ
2. బాబాని శరణుజొచ్చినంతనే తీరిన ఆరోగ్య సమస్యలు 

శ్రీసాయినాథుని దయ

సాయి బంధువులకు నమస్కారం. నా పేరు ఛత్రపతి. ఒకసారి నా కడుపులో మంట మొదలై ఎంతకూ తగ్గలేదు, చాలా ఇబ్బందిపెట్టింది. బాబాను తలిస్తే సమస్య తీరిపోతుందని తెలిసినప్పటికీ ఆ సమయంలో నాకు ఆయన జ్ఞాపకం రాలేదు. అదే మాయ అంటే. అది మనల్ని ఆవహిస్తుంది. బాబాను మనకి దూరం చేస్తుంది, సమయం వృధా అయ్యేలా చేస్తుంది, మన బాధ తీరకుండా అడ్డు పడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, కొంతసేపటి తర్వాత బాబా ఊదీ నా దగ్గర ఉండటం జ్ఞాపకమొచ్చి, దాన్ని నీళ్ళలో కలుపుకొని త్రాగి బాబా నామస్మరణ చేసుకుంటూ నిద్రపోయాను. బాబా దయవల్ల హాయిగా నిద్రపట్టి, పొదున్నకి కడుపులో మంట పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".

నేను ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం అవుతుండగా జీతం పెంపు విషయంగా చర్చించే రోజు వచ్చింది. 'బాబా ఉన్నారు, ఆయన నాకు మంచి జరిగేలా చూసుకుంటార'ని నాకు తెలుసు. అయినా ఎటువంటి ఆశ పెట్టుకోకుండా మా మేనేజర్ గదికి వెళ్ళాను. నేను అయితే మా మేనేజర్ నా జీతం అస్సలు పెంచరనుకున్నాను. కానీ 5% పెంచారు. అది తక్కువా, ఎక్కువా అన్నది నాకు తెలియదుగానీ, ఎటువంటి ఆశ లేని నాకు ఎంతో కొంత పెరగటం అనేది ఆనందాన్నిచ్చింది. ఈసారి బాబా ఇంకా బాగా అనుగ్రహిస్తారని, అంటే నాకు అర్హత ఉన్నంత అని నేను నమ్ముతున్నాను. "ధన్యవాదాలు బాబా".

2024, అక్టోబర్ నెలలో పెద్ద తుఫాను అని, చెన్నైలో భారీ వర్షాలని టీవీలో వార్తలు వస్తున్న రోజుల్లో మా అమ్మానాన్న మునపటి సంవత్సరంలా నాకు ఏమవుతుందోనని చాలా భయపడ్డారు. నేను మాత్రం బాబా మీద భారమేసి ధైర్యంగానే ఉంటూ బాబాను, "ఇంటికి వెళ్ళటానికి అనుమతిచ్చేలా చూడమ"ని ప్రార్థిస్తూ ఉండగా అనుకోకుండా బాబా కరుణించారు. మా మేనేజర్ ఇంటికి వెళ్ళమని చెప్పారు. దాంతో నేను హఠాత్తుగా ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. నిజానికి నాకప్పుడు ఏదైనా ట్రైన్ అందుబాటులో ఉందా, లేదా అన్నది తెలియదు. మరుసటిరోజు ఉదయం త్వరగా తయారై రిజర్వేషన్ యాప్ చూస్తే, అద్భుతం! బాబా దయవల్ల ఒక ట్రైన్‌కి టికెట్ ఉండటంతో దాన్ని బుక్ చేసుకున్నాను. ఇక అప్పుడు సమస్య ఏంటంటే, ఆ ట్రైన్ అందుకోవాలంటే నేను గంట లోపల స్టేషన్‌కి చేరుకోవాలి. కానీ నేను ఉన్న చోటు నుండి రైల్వేస్టేషన్‌కి అంత తొందరగా వెళ్ళటం కుదిరే పని కాదు. అయినా బాబాని ప్రార్థిస్తూ రాపిడో యాప్‌లో వాహనం బుక్ చేసుకొని బయలుదేరాను. ఏదో అద్భుతం జరిగినట్లు నేను రెండు నిమిషాలు తేడాలో ట్రైన్ అందుకొని సురక్షితంగా మా ఇంటికి చేరుకున్నాను. ఆపై తూఫాన్ చెన్నైలో పెద్దగా ప్రభావం చూపలేదని తెలుసుకొని చాలా ఆనందపడ్డాను. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo