సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1922వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాను పూర్తి విశ్వాసంతో శరణువేడితే తప్పకుండా సమస్యలు తీరుతాయి అనేందుకు నిదర్శనాలు

2. బాబా దయతో చేకూరిన ఆరోగ్యం 

బాబాను పూర్తి విశ్వాసంతో శరణువేడితే తప్పకుండా సమస్యలు తీరుతాయి అనేందుకు నిదర్శనాలు

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుడిని. నేను నా కుటుంబంతో ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నాను. మా పిల్లలు ఇక్కడ స్కూల్లో చదువుతున్నారు. మా పెద్దబాబు నాల్గవ తరగతి చదువుతున్నాడు. తనకి కొంతమంది లోకల్(ఆస్ట్రేలియన్) స్నేహితులు ఉన్నారు. వాళ్లలో ఒక బాబు గత కొన్ని వారాలుగా మా అబ్బాయిని బాగా ఏడిపిస్తుండేవాడు. ఎంతలా అంటే మా అబ్బాయి ఇంటికి వచ్చిన తరువాత తరుచు తనలో తాను ఏడవడం, మూడిగా కూర్చుని బాధపడటం చేస్తుండేవాడు. నేను అది గమనించి ఏమయిందని అడిగితే, ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టి చాలాసేపటి తరువాత విషయం అంతా చెప్పాడు. అప్పుడు ఇంకా విషయం వాళ్ల టీచర్‌కి చెప్పి, ఆ అబ్బాయికి దూరంగా ఉండమని చెప్పాము. కాని తరువాత కూడా ఆ అబ్బాయి అదే పనిగా ఆడుకునే సమయంలో ఏడిపిస్తున్నాడని మా బాబు చెప్పాడు. అప్పుడు ఏమి చేయాలని ఆలోచిస్తూంటే, నాకు బాబా గుర్తుకు వచ్చి, 'ఈ సమస్యను బాబా మాత్రమే పరిష్కరించగలర'ని నమ్మి "ఆ అబ్బాయి మళ్లీ మా బాబుతో మునుపటిలా స్నేహంగా ఉంటే మీ అనుగ్రహాన్ని సాయి బంధువులతో పంచుకుంటాన"ని ఆయన మీద భారమేసాను. తర్వాత బాబా చల్లని చూపుతో ఆ అబ్బాయిలో మార్పు రావడం గురించి మా బాబు చెప్తుంటే మేము సంతోషించి మనసులోనే బాబాకు మా  హృదయపూర్వక  ధన్యవాదాలు తెలుపుకొని ఎల్లవేళలా ఇలాగే అందరి మీద మీ దయ చూపమని వేడుకున్నాము.

గత కొన్ని సంవత్సరాలుగా నా మోకాళ్ళ కింద భాగంలో మూడు, నాలుగు చోట్ల గుల్లలు వచ్చి విపరీతమైన దురదలు పెడుతుండేవి. ఎంతలా అంటే ఒక్కోసారి గోకడం వలన రక్తం కూడా వచ్చేది. చాలామంది వైద్యులను సంప్రదించి చాలా రకాల మందులు వాడినా ఏమాత్రం తగ్గలేదు. కానీ ఈ విషయంగా నేను ఇప్పటివరకు ఏ రోజూ కూడా బాబాను సహాయం కోరింది లేదు. ఈమధ్య ఒకరోజు మా ఇద్దరు అబ్బాయిలకు కూడా అదేవిధంగా కాళ్ళ మీద చిన్నగా దురదలు మొదలవడం గమనించి వెంటనే ముగ్గురం కాళ్ల మీద బాబా ఊదీ రాసుకొని, మరికొంత ఊదీ నోట్లో వేసుకొని, "మా అందరికీ పూర్తిగా తగ్గితే నా అనుభవాన్ని తోటి సాయి బంధువులతో  పంచుకుంటాన"ని బాబాను శరణువేడాను. వరుసగా మూడురోజులు ఊదీ రాసాక మా పిల్లలకి పూర్తిగా తగ్గిపోయింది. నాకు మాత్రం చాలా కొద్దిగా ఉంది. బాబా దయతో త్వరలో పూర్తిగా తగ్గిపోతుందని నా నమ్మకం.

కొన్నిరోజుల క్రితం ఒక సోమవారం సాయంత్రం నా స్నేహితుడు నాకు ఫోన్ చేసి, "నా కారు అందుబాటులో లేదు. నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. నీ కారు కావాల"ని అడిగాడు. నేను సరేనని వెంటనే వెళ్ళి నా కారు అతనికిస్తే తను బయటికి వెళ్లాడు. కొన్ని గంటల తరువాత తను కంగారుపడుతూ నాకు ఫోన్ చేసి, "నేను ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాను. నీ కారు ఇక్కడ సురక్షితమైన ప్రదేశంలో పార్క్ చేసి రెండు, మూడు చోట్లకు వెళ్లాను. చూస్తే, కారు తాళాలు ఎక్కడో మిస్ అయ్యాయి. అన్ని చోట్ల వెతికాను కానీ, ఎక్కడా దొరకలేదు" అన్నాడు. ఆ మాట వినగానే నేను బాబాను మనసులో తలచుకుని, ఆయన మీద ఉన్న నమ్మకంతో, "ఏమీ కాదు. కంగారు పడొద్దు. ఇప్పుడు రాత్రి అయింది కదా! మీరు వచ్చేయండి. రేపు వెళ్లి స్పేర్ 'కీ'తో కారు తెచ్చుకుందాం" అని అన్నాను. మరుసటిరోజు పొద్దున నా స్నేహితుని ఫ్రెండ్స్ తనకి కాల్ చేసి, '"ఎక్కడా కీ దొరకలేదు" అని అన్నారు. అదే విషయం తను నాతో చెప్పాడు. ఆ మాటతో నేను కూడా కాస్త కంగారుపడ్డాను. ఎందుకంటే, ఆ కారు కీ తోపాటు మా ఇంటి మెయిన్ డోర్ మాస్టర్ కీ కూడా దానికి జత చేసుంది. కానీ ఏదో మూల కీ ఖచ్చితంగా దొరుకుతుందని బాబా మీద నమ్మకం ఉండింది. అదేరోజు సాయంత్రం స్పేర్ 'కీ'తో కారు తెచ్చుకోవడానికి వెళ్ళాము. అప్పుడు కూడా నా స్నేహితుని ఫ్రెండ్స్, " 'కీ' కోసం చాలా వెతికాము కానీ, ఎక్కడా కనపడలేదు" అన్నారు. నేను ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు బాబాతో "గురువారం సాయంత్రం లోపు 'కీ' దొరికితే మీ అనుగ్రహం తోటి సాయి బంధువులతో పంచుకుంటాన"ని చెప్పుకొని ఆయనకి శరణువేడాను. అంతే, బుధవారం ఉదయం ఎనిమిది గంటలకల్లా 'కీ' దొరికిందని నాకు మెసేజ్ వచ్చింది. బాబాను పూర్తి విశ్వాసంతో శరణువేడితే మన సమస్యలు తొలగిపోతాయని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

బాబా దయతో చేకూరిన ఆరోగ్యం

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయి భక్తులకు నా వందనాలు. నా పేరు వైఎస్ బి రెడ్డి. నేను 35 సంవత్సరాల నుంచి బాబా భక్తుడ్ని. నా జీవితంలో బాబా లీలలు అనేకం. ఈమధ్యకాలంలో నేను షుగర్, కాళ్ళ పిక్కల నొప్పులతో సుమారు ఎనిమిది నెలలు చాలా ఇబ్బందిపడ్డాను. అనేక హాస్పిటళ్ళకి తిరిగినా నయం కాలేదు. కొన్నిరోజులకి నేను బాబాను, "షుగర్, కాళ్ళనొప్పులు తగ్గాల"ని వేడుకొని ఊదీ నీళ్లు తాగడం మొదలుపెట్టాను. కొన్ని రోజులకు షుగరు, కాళ్ళనొప్పులు తగ్గిపోయాయి. బాబా చల్లని చూపు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా, మీ దయతో అంతా చక్కబడింది".

సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.

6 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi manchivarini rent ki pampandi

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. ఓం సాయిరాం 🙏🌹🌹

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  6. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo