ఈ భాగంలో అనుభవాలు:
1. తరుగులేని బాబా అనంత కరుణ
2. శ్రీసాయి కృప
3. నమ్మినవారి వెన్నంటే నిలిచి సదా కాపాడే సాయినాథుడు
తరుగులేని బాబా అనంత కరుణ
ఓం శ్రీసాయినాథాయ నమః. శ్రీసాయిబాబా అనంతకోటి భక్తులకు నమస్కారం. నేను గత 20 సంవత్సరాలుగా బాబా పాదాలను ఆశ్రయించిన పాదరేణువును. నా పేరు ఆంజనేయులు. శ్రీసాయిబాబా నన్ను, నా కుటుంబాన్ని ఎన్నో బాధలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించారు. వారి కరుణతో మా అబ్బాయి సాయి చరణ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. 2024, మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఒకనాటి అర్ధరాత్రి నా ఎడమ కాలు నడుము నుండి అరికాలు వరకు భరించలేనంత నొప్పి పెట్టింది. నా అవస్థను చూడలేక మా ఇంట్లోవాళ్ళు చాలా బాధపడ్డారు. అర్ధరాత్రి కావడం వలన ఏ డాక్టరూ అందుబాటులో ఉండని పరిస్థితి. అటువంటి సమయంలో మనందరి డాక్టరైన శ్రీసాయిబాబా, వారి ఊదీ నాకు గుర్తుకు వచ్చాయి. వెంటనే బాబాని శరణువేడి ఊదీ నా కాళ్ళంతా పూసుకున్నాను. ఇంకా బాబా నామస్మరణ చేశాను. అరగంట తర్వాత నెమ్మదిగా ఉపశమనం కలిగి ఉదయానికి 90% తగ్గింది. అయినా డాక్టర్ దగ్గరకి వెళ్తే, 'ఏ సమస్యా కనిపించడం లేద'ని చెప్పి మూమూలుగా ఏదో టాబ్లెట్ వ్రాశారు. ఎంత వ్రాసిన బాబా అనంత కరుణ తరగనిది. ఆ సాయిబాబా వారి కరుణ అందరి మీద ఉండాలని ఆశిస్తున్నాను
శ్రీసాయి కృప
ముందుగా సాయి భగవానుని పాదపద్మములకు ప్రణామాలు. నా పేరు గోపాలకృష్ణ. నేను నిత్యం బాబా సంరక్షణలో ఉన్నాను. ఆయన నన్ను, నా కుటుంబాన్ని విధాలా కాపాడుతూ వస్తున్నారు. 2024, సెప్టెంబర్ నెలలో ఒకరోజు నా భార్యకి, మా పాపకి జ్వరం వచ్చింది. మందులు వాడుతూ రెండురోజులు చూసినప్పటికీ ఇద్దరికీ తగ్గలేదు. అప్పుడు నాకు బాబా గుర్తొచ్చి ఆయనతో చెప్పుకొని కొద్దిగా ఊదీ తీసుకొని నీళ్లలో కలిపి పాపకి పట్టించాను. కొద్దిగా జ్వరం తగ్గనారభించింది. తర్వాత నేను మాకు దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి, "పాపకి, నా భార్యకు జ్వరం తగ్గాల"ని బాబాను ప్రార్థించాను. కానీ నాకు కొంచెం భయమేసి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకి వెళ్తే, పాపకి బ్లడ్ టెస్ట్ చేసి, టెస్ట్ రిజల్ట్ కోసం 3 గంటల తర్వాత రమ్మన్నారు. సరేనని మేము మా ఇంటికి వచ్చాము. నేను మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటివేమైనా వస్తాయేమోననుకున్నా ను. 3 గంటల తర్వాత హాస్పిటల్‌వాళ్ళు ఫోన్ చేసి, "మీ పాప బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. వాట్సాప్ చేశాము చూడండి" అని అన్నారు. అద్భుతం! టెస్ట్ రిజల్ట్‌లో అంతా నార్మల్‌గానే ఉంది. నేను భయపడినట్లు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటివేమీ లేవు. కొద్ది రోజుల్లో ఇద్దరికీ నయమైంది. "మీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు ధన్యవాదాలు బా బా. ఇలాగే ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి".
నమ్మినవారి వెన్నంటే నిలిచి సదా కాపాడే సాయినాథుడు
సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితంలో ఎన్నోసార్లు సాయినాథుడి లీలలు నాకు అనుభవం. ప్రతి విషయంలోనూ నా వెన్నంటుండి నడిపించే బాబాకి నేను ఎప్పటికీ ఋణగ్రస్థురాలినే. ఈమధ్య ఒకసారి మా రెండు సంవత్సరాల పాపకి ఆరోగ్య సమస్య వచ్చి, ఎన్ని మందులు వాడినా నయం అవలేదు. నాకు, మావారికి పాపకి తగ్గిపోతే బాగుండు అన్న ఆలోచనే. కానీ నాకు పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్లడం ఇష్టం లేదు. నాకు తెలిసిందల్లా బాబాకి చెప్పుకోవడం, ఆయన్ని వేడుకోవటం మాత్రమే. కాబట్టి ఆయన్నే ప్రార్థించి, "పాపకి తగ్గాలి. సచ్చరిత్ర ఒక వారం పారాయణ చేస్తాను బాబా" అని అనుకున్నాను. అన్నట్టుగానే వారంలో పారాయణ పూర్తి చేసాను. ఆ వారం రోజుల్లో ఎప్పుడు బాబాని అడిగినా 'వారం రోజుల్లో బాగవుతుంది' అని సమాధానం వచ్చేది. కానీ వారమైన పాపకి తగ్గలేదు. ఇక అప్పుడు పాపని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని అనుకున్నాము. కానీ బాబా ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నారని బాధపడ్డాను. మరుసటిరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే హాస్పిటల్ ఎదురుగా ఉన్న గోడ మీద బాబా కనపడ్డారు. ఆయన్ని చూడగానే నాకు చాలా ధైర్యంగా అనిపించింది. డాక్టర్ చూసి "పాపకి పర్లేదు. సమస్యేమీ లేదు" అని మందులు ఇచ్చారు. అవి వేస్తే, అదే రోజు నుండి పాపకి తగ్గడం మొదలైంది. నేను చాలా సంతోషపడి బాబాకి పరిపరివిధాల కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నమ్మినవారి వెన్నంటే నిలిచి సదా కాపాడే సాయినాథుని చరణాలకు సాష్టాంగ ప్రణామములు.
Om Sai Ram please 🙏🙏 cure my eye winking.Problem is very bad.i am lady of 70years.While speaking my eye winking i feel awkward.i trust you as my mother and father
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am experiencing your omnipresence. I am totally surrendering myself at your lotus feet. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
baba naa kali noppi taggelaga chudu baba. sai madava bharam antha meede baba.
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteSri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha