సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1929వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మీద భారమేస్తే చాలు - అంతా సవ్యంగా ఉంటుంది
2. శ్రీసాయి అనుగ్రహం
3. ఊదీతో పని చేసిన టీవీ


శ్రీసాయి అనుగ్రహం

నేను ఒక సాయి భక్తురాలిని. 2022లో మేము శిరిడీ వెళ్ళాము. మేము అక్కడినుండి శనిసింగణాపూర్, ఇంకా పేరు గుర్తులేదుగానీ దగ్గర్లో ఉన్న ఒక శివుడి గుడికి కూడా వెళదామనుకున్నాము. కానీ వెళ్లలేకపోయాము. అందువల్ల నా మనసులో తీరని బాధగా వుండింది. అయితే శిరిడీలో ఒక అద్భుతం జరిగింది. శిరిడీలో ఎక్కడన్నది నాకు సరిగా తెలీదు కానీ, ఓ చోట హాల్‌లా ఉంది. అందులో వరుసగా చిన్నచిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి, శివలింగం కూడా ఉంది. ముందు మా అమ్మాయి, అల్లుడు వెళ్తుంటే వెనుక నేను, నా వేలు పట్టుకొని నా 3 సంవత్సరాల మనవరాలు నడుస్తున్నాము. ఒక పూజారి నీళ్లు దగ్గర పెట్టుకొని, చెంబుతో కొంతమందికి ఇస్తున్నారు. అతను నా ముందున్న మా అమ్మాయి, అల్లుడికి ఇవ్వకుండా నా ముఖం వైపు చూసి, చెంబుతో నీళ్లు ఇచ్చి, 'శివలింగంకి పోయమ్మా' అన్నారు. నేను అలాగే చేశాను. మా అల్లుడు ఆశ్చర్యంగా "ఆ పూజారి మీకు నీళ్ళు ఇచ్చారా? మేము మీ ముందేగా వచ్చాము. మాకు ఇవ్వలేదు, మీకు ఇచ్చారు. అద్భుతం!" అని అన్నారు. నాకు ఆరోజు అర్ధం కాలేదు కానీ, తర్వాత సాయితండ్రి నా చేత శివయ్యకు అభిషేకం చేయించారని అనుకున్నాను.

2024, అక్టోబర్ 24, గురువారం మధ్యాహ్నం నుండి నాకు వీపు, కుడిభుజం బాగా నొప్పిగా వుండింది. మర్నాడు కూడా అలానే ఉంది. టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. ఇక నొప్పి భరించలేక, "బాబా! నొప్పి తగ్గించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఒక గంటలో తగ్గింది. "ధన్యవాదాలు బాబా".

ఊదీతో పని చేసిన టీవీ

నా పేరు శాంతి. మాది విశాఖపట్నం. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు చాలా ఉన్నాయి. అందులో నుండి ఒక అనుభవాన్ని ఇప్పుడు సాయి బిడ్డలతో పంచుకుంటున్నాను. 2019లో మేము స్మార్ట్ టీవీ కొన్నాము. అది బాగానే పని చేసేది కానీ, 2024లో సరిగా పని చేయడం మానేసింది. ఎన్నిసార్లు మెకానిక్‌కి ఫోన్ చేసి వచ్చి చూడమని చెప్పినా కొన్నిరోజులు రాలేదు. చివరికి ఒకరోజు వచ్చి చూసి, "రిపేర్ చేయాలి. 1800 రూపాయలు అవుతుంది. తర్వాత కూడా పని చేయకపోతే 6,000 రూపాయలు అవుతాయ"ని చెప్పారు. "అయితే తర్వాత చేయిద్దాం. మెకానిక్‌ని పంపించేయండ"ని నేను మా ఆయనతో చెప్పి టీవీకి బాబా ఊదీ పెట్టాను. బాబా అద్భుతం చేశారు. హఠాత్తుగా టీవీ పని చేయడం మొదలుపెట్టింది. మా ఇంట్లో వాళ్ళందరూ "ఎలా పని చేస్తుంది?" అని అడిగారు. నేను గర్వంగా, "బాబా దయవల్ల ఇది సాధ్యపడింది" అని చెప్పుకున్నాను. "కష్టం అనగానే మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వేల వేల కృతజ్ఞతలు సాయిదేవా. ఏమిచ్చినా మీ ఋణం తీర్చుకోలేనిది తండ్రీ".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo