ఈ భాగంలో అనుభవాలు:
1. అడుగడుగునా తోడుండి ఎంతో సహాయం చేసిన బాబా
2. 'నేనుండగా భయమెందుక'ని అభయమిచ్చి అడిట్ విజయవంతం చేసిన సాయి
అడుగడుగునా తోడుండి ఎంతో సహాయం చేసిన బాబా
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు ఆశాదీప్తి. నేను ఈ బ్లాగు ద్వారా బాబా గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇంకా ఆయనకు ఎంతో దగ్గరయ్యాను. నేనిప్పుడు రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. మేము 2024, ఏప్రిల్ నెల చివరిలో మా బాబుకి వేసవికాలం సెలవులు ఇవ్వడంతో ఎక్కడికైనా పర్యటనకి వెళదామని బాగా ఆలోచించి తూర్పు భారతదేశంలోని సిక్కిం, డార్జిలింగ్ వెళ్ళడానికి నిశ్చయించాము. నేను ఆ పర్యటనకు బయలుదేరేముందు సాయిని "మా వెన్నంటే ఉండి ఆ ప్రదేశాలన్నీ చక్కగా చూపించి, క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చమ"ని కోరుకున్నాను. సాయి నా కోరిక ప్రకారం అడుగడుగునా మాకు తోడు ఉండి ఎంతో సహాయం చేశారు. మేము ఆ పర్యటనలో భాగంగా లాచుంగ్ అనే ఒక పల్లెటూరికి వెళ్ళాము. అది భారత భూభాగంలోని చిట్టచివరి ఊరు. ఆ ఊరు తర్వాత చైనా భూభాగం మొదలవుతుంది. మేము ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసి రాత్రికి ఆ ఊరు చేరుకున్నాక మేము ముందుగా బుక్ చేసుకున్న హోటల్‌వాళ్ళు రూమ్ బుక్ అవ్వలేదని చెప్పారు. మేము ఎంతో నిరాశ చెందాం. ఆ రాత్రివేళ పల్లెటూరులో ఏం చేయాలో అర్థం కాలేదు. సాయిని ప్రార్థిస్తే ఆయన దయవల్ల అదే హోటల్లో వేరే రూమ్ మాకు అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రదేశాలన్నీ చక్కగా చూసి తిరుగు ప్రయాణం అయ్యాము. అయితే అక్కడి స్థానిక రూల్స్ ప్రకారం ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండటం కోసం ఆ దారిలో తిరుగు ప్రయాణమయ్యేవాళ్ళని ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు అవుతారని మాకు కొంచెం ఆలస్యంగా తెలిసింది. మేము చెక్ పోస్ట్ వద్దకు చేరుకునేపాటికి 9 దాటింది. దాంతో మమ్మల్ని ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆపేసి ముందుకు పోనివ్వలేదు. అక్కడున్న పోలీసుల్ని ఎంత బతిమాలినా వదల్లేదు. అలా కాసేపు గడిచిన తర్వాత నేను సాయిని ప్రార్థించాను. సాయి దయవల్ల మధ్యాహ్నం వరకు వదలరనుకుంటే 45 నిముషాల్లోనే మమ్మల్ని వదిలేశారు. ఆ విధంగా సాయి మాకు ఎంతో సహాయం చేశారు. ఇకపోతే, ఆ ప్రాంతంలో ఎక్కడా సాయి ఫోటోలుగాని, ఆయన గుడులుగాని కనిపించలేదు. నా మనసుకి, 'కనీసం ఒక్కసారైనా సాయి దర్శనం ఇస్తే బాగుంటుంద'ని అనిపించింది. సరిగ్గా మధ్యాహ్న ఆరతి సమయానికి మేము మిలిటరీవాళ్ళు నడుపుతున్న ఒక గుడికి వెళ్ళాము. ఆ గుడిలో రాధాకృష్ణులతో పాటు సాయిబాబా కూడా ఉన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అలా నా కోరికను మన్నించి సాయి నాకు తమ దర్శనభాగ్యాన్ని ప్రసాదించారు. ఇలా అడుగడుగునా మాకు తోడుగా ఉంటూ క్షేమంగా మమ్మల్ని ఇంటికి చేర్చారు బాబా. "ధన్యవాదాలు సాయి".
2024, సెప్టెంబర్ నెలలో మా అమ్మకి, మావయ్యగారికి ఒకేసారి షోల్డర్ ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సమస్య రెండు వైపుల నుండి ఒకేసారి వచ్చేపాటికి మేము చాలా ఒత్తిడికి లోనయ్యాము. నేను సాయిని ప్రార్థించి, "ఇద్దరి సర్జరీలు మంచిగా అవ్వాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు చక్కగా కోలుకోవాలి. అంతా సజావుగా జరిగిపోవాల"ని అనుకున్నాను. సాయి దయవల్ల నాలుగు రోజులు తేడాలో ముందు అమ్మకి, తర్వాత మావయ్యగారికి సర్జరీలు చక్కగా జరిగి వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. తర్వాత కుట్లు కూడా ఇద్దరికీ తొలగించారు. అంత బాగా జరిగింది. కానీ అమ్మకి సర్జరీ అయినప్పటినుంచి రాత్రివేళ ఎందుకో నొప్పి బాగా ఉంటుంది, సరిగా నిద్రపోవట్లేదు. సాయి దయతో ఆ నొప్పిని కూడా త్వరలోనే తగ్గిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఈమధ్యకాలంలో ఎన్నో సమస్యలు మమ్మల్ని చుట్టుముడుతున్నాయి, సాయి దయతో అన్నిటిని ఒక్కొక్కటిగా తీర్చి మమ్మల్ని ఒడ్డుకి చేరుస్తారని ఆశిస్తున్నాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
'నేనుండగా భయమెందుక'ని అభయమిచ్చి అడిట్ విజయవంతం చేసిన సాయి
నా పేరు చంద్రశేఖర్. నేను ఒక ఆక్వా కంపెనీలో సూపర్వైజర్‌గా పని చేస్తున్నాను. 2024, ఏప్రిల్ 30న మా సెక్షన్‌లో ఇన్స్ఫెక్షన్ జరిగింది. అంతకుముందు మా సెక‌్షన్‌లో ఒక పెద్ద ఆడిట్ ఫెయిల్ అయినందున మా యజమాని ఇన్స్పెక్షన్‌కి ముందు ఇన్చార్జిలకు, సూపర్‌వైజర్‌లకు కలిపి మీటింగ్ పెట్టి వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఈ ఆడిట్ గాని ఫెయిల్ ఐతే ఎక్కడ మా యజమానితో తిట్లు తినాల్సి వస్తుందోనని మాకు భయమేసి ఇన్స్పెక్షన్‌కి వారం ముందు నుండి మా సెక్షన్‌లో గోడలకు, టేబుల్‌లకు రంగులు వేసి శుభ్రంగా ఉంచాం. అలాగే టేబుల్ మీద, రొయ్యలు మీద పుల్‌గా ఐస్ వేసి టెంపరేచర్ తక్కువ ఉండేలా చేసాము. కానీ క్రేట్స్(వెదురు బుట్టలు) కొద్దిగా ఫంగస్ పట్టి బాగాలేవు. అందువల్ల నేను, "సాయిబాబా! మా సెక‌్షన్‌లో ఇన్స్పెక్షన్ విజవంతమయ్యేలా చేయండి" అని సాయితో చెప్పుకున్నాను. తర్వాత టేబుల్ దగ్గర క్రేట్స్ సర్దుతుండగా ఒక క్రేట్ మీద 'SAI' అన్న పెద్ద అక్షరాలు కనిపించాయి. ఆవిధంగా 'నేను ఉండగా నీకు భయమెందుక'ని అభయమిచ్చారు సాయి. మా సెక‌్షన్‌లో చిన్న తప్పు జరిగినప్పటికీ బాబా దయవల్ల ఆడిట్ విజయవంతమైంది. ఇలా బాబా చాలా విషయాల్లో నాకు సహాయం చేస్తున్నారు. "ధన్యవాదాలు బాబా. నేను మిమ్మల్ని కొన్ని కోరికలు కోరాను. అవి కూడా నెరవేరేలా చేయండి తండ్రీ".
Sai vamsi nannu ardhamcheskovali om sairam
ReplyDeleteOm sai ram, nenu twaraga kolukuni na arogya Samasyalu anni theeri poye la chayandi tandri pls, ofce lo situations anni bagundi ma team ki oka manchi person ni allocate it ye la chayandi tandri pls, amma nannalani, ma family ni, shiva vaalla family ni kshanam ga chusukondi tandri pls.
ReplyDeleteOm sai ram, nenu twaraga kolukuni na arogya Samasyalu anni theeripoye la chayandi tandri pls, ofce lo situations anni bagundi ma team ki oka manchi person ni allocate iyye la chayandi tandri pls, amma nannalani, ma family ni, shiva vaalla family ni kshanam ga chusukondi tandri pls.
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sai Ram
ReplyDeletebaba , sai madava arogyam bagundali. fever lekunda chudu swamy. naaku kuda kaliki vachhina pundu taggali swamy.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi manchivarini rent ki pampandi
ReplyDeleteOm Sri Sai nathaya namaha
ReplyDeleteOm Sri Sai nathaya namaha
Om Sri Sai nathaya namaha
Om Sri Sai nathaya namaha
Om Sri Sai nathaya namaha
Sri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDelete