సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2032వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ లేకుంటే ఏమైపోతామో!
2. అర్ధరాత్రి బాబా అందించిన సాయం


అర్ధరాత్రి బాబా అందించిన సాయం

అందరికీ నమస్కారం. నా పేరు అలేఖ్య. మేము హైదరాబాద్‌లో ఉంటాము. ఒకరోజు మేము మా సొంతూరు వరంగల్‌ వెళ్ళడానికి కారులో ప్రయాణమయ్యాము. మధ్య దారిలో తినడానికని ఒక చోట ఆగి, తిన్న తర్వాత తిరిగి బయల్దేరుతుంటే కారు స్టార్ట్ అవ్వలేదు. అసలు సమస్యేమిటో తెలుసుకుందామంటే దగ్గర్లో మెకానిక్ షాపు లేదు. అక్కడ ఆ హోటల్ తప్ప చుట్టుపక్కల ఎక్కడా ఒక్క షాపు కూడా లేదు. మెల్లగా వర్షం కూడా మొదలయింది. గంటకు పైగానే వర్షంలో పిల్లలతో మేము ఇబ్బందిపడ్డాము. అక్కడ ఉన్నవాళ్లలో ఒక్కరు కూడా మాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మనసులో "బాబా! మీరే ఏదో ఒకటి చేయండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది(రాత్రి 11 గంటలు). ఏదో ఒక రూపంలో మాకు సాయమైన చేయండి. లేదా తొందరగా కారు స్టార్టు అయ్యేలా చూడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. చాలాసేపటికి ఒక ముస్లిం అతను తనంతట తానుగా వచ్చి నేను సహాయం చేస్తానని చెప్పి, ఇంకొకరిని కూడా తీసుకొచ్చి సహాయం చేసాడు. 2 నిమిషాల్లో కారు స్టార్ట్ అయ్యింది. కొంతదూరం వెళ్ళాక సాయిబాబానే  ఆ ముస్లిం అబ్బాయి రూపంలో వచ్చి మాకు సహాయం చేసారని నాకనిపించింది. ఎప్పటికీ మా వెంటే ఉండే తండ్రి మా సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.

9 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Omsairam. Omsairam🌹🙏🌹🙏🌹

    ReplyDelete
  3. Very nice Sai Leelas .Sai Baba helps whole heartly pray 🙏🙏 him.Om Sai Ram

    ReplyDelete
  4. Baba baba baba baba.. niku anni telusu kada .. nuvve kapadali.. vere dikku ledu.. saranu saranu 🙏

    ReplyDelete
  5. Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi

    ReplyDelete
  6. Om sri sairam🙏🙏

    ReplyDelete
  7. Om sri sairam🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo