- పోస్ట్ క్రియేట్ చేసి మరీ ఉద్యోగం అనుగ్రహించిన బాబా
నా పేరు లక్ష్మి. మాది మండపేట. నేను సాయి భక్తురాలిని. నేను ఇసుకపల్లి బేబీగారి సాయి సత్సంగదామంలో పాల్గొంటూ ఉంటాను. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. హైదరాబాదులోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మా పెద్దబాబు కంపెనీలో తనకి సమస్యగా ఉందని, హఠాత్తుగా ఉద్యోగం మానేశాడు. మా కోడలు అమ్మవాళ్లు, "పిల్లలున్నారు, కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు" అని చాలా అన్నారు. నేను చాలా వేదన చెంది బాబాకి చెప్పుకుంటూ 'కుటుంబం ఉంది, ఇద్దరు పిల్లలున్నారు' అని చాలా ఆలోచిస్తుండేదాన్ని. బాబు ఉద్యోగం లేకుండా సంవత్సరం ఇంట్లోనే ఉన్నాడు. తను ఒకసారి మండపేట వచ్చినప్పుడు నేను తనని బేబీగారి ఇంటికి తీసుకెళ్లి, బాబాకి దణ్ణం పెట్టిందామని అనుకున్నాను. ముందుగా అబ్బాయిని తీసుకెళ్లకుండా నేను ఒక్కదాన్నే బేబీగారి ఇంటికెళ్లి, అమ్మ ఉంటే అబ్బాయికి ఫోన్ చేసి రమ్మందామనుకొని వెళ్లాను. అప్పుడు ఆమె ఇంట్లోనే ఉన్నారు. దాంతో మా అబ్బాయికి కాల్ చేసి సత్సంగానికి రమ్మని చెప్పాను. తర్వాత నేను వాడికి అడ్రస్ తెలీదు కదా అని, బయట నిల్చొని వాడికోసం వేచి ఉండగా తెల్లని మాసిన బట్టలు, చేతిలో సంచి ధరించిన ఒక పెద్దాయన కనిపించారు. ఆయన్ని, "ఎవరండీ మీరు? ఎవరు కావాలండి?" అని అడిగాను. ఆయన నా వంక చాలా దీక్షగా చూసిన మీదట, "బేబీగారు ఉన్నారా అండి?" అని అడిగారు. నేను, "ఆఁ.. ఉన్నారండి. పిలవమంటారా?" అని అడిగాను. ఆయన కాసేపు ఆగి, "వద్దులెండి. నేను మళ్ళీ వస్తాను" అని చెప్పి వెనుతిరిగి వెళ్ళిపోయారు. అంతలో బేబీగారు లోపల నుంచి వచ్చి, "లక్ష్మీగారూ! మీ అబ్బాయి వచ్చాడా అండి" అని అన్నారు. నేను, "లేదండి. వాడికోసమే చూస్తున్నానండి. అమ్మా! ఇప్పుడు ఒక పెద్దాయన వచ్చి, మీ గురించి అడిగితే, ఉన్నారండని చెప్పాను. పిలుస్తానంటే, వద్దండి. మళ్ళీ వస్తానండి అని చెప్పి వెళ్ళిపోతున్నారమ్మా. ఇప్పుడే వెళ్తున్నారు, పిలుస్తాను ఉండమ్మా" అని చెప్పి వెళ్తున్న ఆయన్ని "ఏవండీ! బేబీగారు వచ్చారు. రండి రండి" అని పిలిచాను. "ఎవరండీ" అంటూ బేబీగారు కింద మెట్ల వరకు వచ్చారు. అప్పటివరకు నాకు కనిపిస్తున్న ఆయన ఆమె వచ్చేసరికి మలుపు తిరిగిపోయారు. ఈలోగా మా అబ్బాయి వచ్చాడు. ఇంకా మేము ముగ్గురం ఇంటి లోపలికి వెళ్ళాము. బేబీగారు అబ్బాయికి బాబా దర్శనం చేయించి, బాబా ఫోటో, ఊదీ ఇచ్చి, "ఉద్యోగం వస్తుందమ్మా. మళ్లీ ప్రయత్నించమ్మా, మీ అమ్మ నీ గురించి చాలా వేదన చెందుతుంది. బాబాని తలుచుకో, నీకు అంతా మంచి జరుగుతుంది" అని దీవించారు. తర్వాత నేను, మా అబ్బాయి మా ఇంటికి వచ్చేసాము. భోజనాలు చేసి పడుకున్నాము. సరిగ్గా తెల్లవారుజామున 3 గంటలప్పుడు నాకు కలలో బేబీగారి ఇంటి దగ్గర కనిపించిన పెద్దాయన చిరునవ్వుతో నన్ను చూస్తూ కనిపించారు. సాక్షాత్తు బాబానే దర్శనమిచ్చి 'నేనున్నాను వేదన చెందకు' అని చెప్తున్నట్లనిపించి నాకు కన్నీళ్లు అస్సలు ఆగలేదు. 'ఎంత దయామయుడువయ్యా సాయినాథా! నా వేదన ఆలకించి నాకు అభయాన్నిచ్చావు. చాలా చాలా సంతోషమయ్యా. నా బిడ్డ భారం నీదే' అనుకుని బాబానే తలుచుకున్నాను తెల్లారేవరకు. ఉదయం బేబీగారికి ఫోన్ చేసి, "అమ్మా! నిన్న సాయంత్రం వచ్చిన ఆయన మళ్లీ వస్తానని చెప్పారు. వచ్చారా అమ్మా" అని అడిగితే, "లేదు లక్ష్మిగారు" అన్నారు ఆవిడ. అప్పుడు, "నాకు రాత్రి స్వప్నంలో ఆ పెద్దాయన కనిపించారమ్మా" అని చెప్పాను. ఆవిడ, "ఇంకేంటి లక్ష్మిగారు. బాబానే స్వయంగా బాబు బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఇంకా వేదన చెందకండి" అన్నారు. అప్పటినుంచి నేను చాలా సంతోషంగా ఉండసాగాను.
తర్వాత మా అబ్బాయి, నేను హైదరాబాద్ వెళ్లాము. హైదరాబాద్ వెళ్ళాక అబ్బాయి ప్రయత్నాలు చేసుకునేవాడు కానీ, ముందు కంపెనీలో చెప్పకుండా మానేసిన కారణంగా వాళ్లు ఎక్స్పీరియన్ లెటర్ ఇవ్వలేదు. అది చాలా సమస్య అయ్యింది. నేను బాబాను తలుచుకుంటూ నాకు తెలిసిన వాళ్ళని అడుగుతుండేదాన్ని. వాళ్లలో సుమన్ అనే ఆయన నేను అడిగే విధానాన్ని మనసులో పెట్టుకొని, "అమ్మా! నీ వేదన నాకు అర్థమవుతుంది. కానీ నేను చేసేది చిన్న కంపెనీలో. మీ వాడు పెద్ద కంపెనీలో చేశాడు కదమ్మా. కాబట్టి పెద్ద కంపెనీలలో ప్రయత్నిస్తాను. అక్కడ మీవాడికి ఉద్యోగం రాకపోతే నా కంపెనీలోనే ఉద్యోగం ఇప్పిస్తాను. బాధపడకు నేనున్నాను" అని అభయమిచ్చి చాలా ప్రయత్నించారు కానీ, ఫలితం రాలేదు. చివరికి ఆయన తన కంపెనీలో అడిగారు. ఆయన ఆ కంపెనీలో పెద్ద పోస్టులోనే ఉన్నారు. ఆయన ఆఫీసులో, "నేను చెప్పిన అబ్బాయికి మన ఆఫీసులో తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలి. ఇది నా రిక్వెస్ట్" అని అడిగారు. దానికి మేనేజ్మెంట్ వాళ్లు 'సుమన్ సార్ చెప్పార'ని ఆఫీసులో ఖాళీ పోస్టు లేకపోయినా పోస్ట్ క్రియేట్ చేసి మరీ మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వడానికి నిశ్చయించారు. అప్పుడు సుమన్ సార్ నాకు ఫోన్ చేసి, "అమ్మా! మీ అబ్బాయిని ఇంటర్వ్యూకోసం మా ఆఫీసుకి పంపించండి. ఉద్యోగం ఇస్తారు" అని చెప్పారు. నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. నా చిన్న కోడలు చూసింది నేనెంత ఆనందపడ్డానో. నేను ఎంత గెంతులేసానో నాకే తెలుసు. బాబా పాదాలను ఆనందబాష్పలతో కడిగాను. మా అబ్బాయి ఆ ఆఫీసుకి వెళ్తే, "వెంటనే జాయిన్ అయిపోమ"ని అన్నారు. కానీ నేను రెండు రోజులు సమయం అడిగి మా అబ్బాయిని తీసుకుని శిరిడీ వెళ్ళాను. బాబా దర్శనానికి లైన్లో వెళ్తున్నంతసేపూ 'బాబా ఎప్పుడు కనిపిస్తారా?' అని ఆరాటంతో 'బాబా బాబా' అనుకుంటూ ఉంటే, మా అబ్బాయి చూసి 'అమ్మ నాకోసం ఎంత వేదన చెందిందో' అని చాలా ఫీల్ అయ్యాడు. అబ్బాయితో బాబా దర్శనం చేయించి, ఆయన సమాధిని తాకించి, "నా బిడ్డ భారం నీదేనయ్యా. నా బిడ్డ చేయి పట్టుకొని మీరే నడిపించాలి సాయినాథా" అని కన్నీటితో వేడాను. అప్పటినుంచి మా అబ్బాయి కూడా బాబానే తలుచుకుంటున్నాడు. బాబా అంటే ఏంటో తెలియనటువంటివాడు ప్రతి గురువారం బాబాకి ఉపవాసం ఉంటున్నాడు(బాబాకి ఉపవాసం ఉండటం ఇష్టముండదు, ఆయన తమ భక్తులని ఉపవాసముండనిచ్చేవారు కాదు. అందుకు సంబంధించిన వివరాలు చదవాలనుకుంటే దిగువన ఇవ్వబడిన లింక్ ద్వారా 'సాయియోగంలో ఉపవాస నియమం' అనే ఆర్టికల్ చదవండి). బాబా ఫోటో తన వాట్సాప్ ప్రొఫైల్లో పెట్టుకున్నాడు. అది చూసి నేను చాలా చాలా సంతోషపడ్డాను. ఇక నా బిడ్డ భారం బాబాయే చూసుకుంటారు. ఆ తండ్రి సుమన్ సార్ రూపంలో నా వేదన అర్థం చేసుకుని పొజిషన్ లేకపోయినా పోస్టు క్రియేట్ చేసి ఉద్యోగం ఇప్పించారు. అదే మన బాబా. సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై.
'సాయియోగంలో ఉపవాస నియమం' ఆర్టికల్ లింక్:-

ఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl
ReplyDeleteBaba Tanu chesina pani valla naku chala badha kaligindi, nakinka Kopam kuda vastondi, nenu inka tanu Pette torture ennallu bharinchali 🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲
ReplyDeleteOmsrisairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteBaba Nizam ni elappudu kaapadandi🙏🏻✨
ReplyDeleteBaba ra baba, Meenakshi ki pelli kudurinchu baba 🥲🙏
ReplyDelete