1. బాబా అనుగ్రహం వల్ల పొందిన ఆనందం
2. చెప్పుకుంటే సమస్య లేకుండా చూసుకునే తండ్రి బాబా ఉండగా భయమెందుకు?
బాబా అనుగ్రహం వల్ల పొందిన ఆనందం
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ప్రతి అనుభవం వల్లా నా జీవితంలో ఎంతో మంచి జరిగింది. బాబా అనుగ్రహం వల్ల 2024లో నాకు వివాహమైంది. నేను మా అత్తగారింటికి వెళ్లిన తర్వాత నుంచి మా అమ్మ ఆరోగ్యం దెబ్బతింది. మేము పెళ్లి పనులు వల్ల అలసట అనుకున్నాము. కానీ రోజురోజుకి అమ్మ అనారోగ్యం పెరిగి నడవలేని స్థితికి వచ్చింది, ఇంకా చాలా సమస్యలు వచ్చాయి. 2015లో ఇలాగే అమ్మ ఆరోగ్యంపాడై ఆర్థరైటిస్ సమస్య వచ్చి 6 నెలలు మంచం మీద ఉంది. ఇప్పుడు దాదాపు అదే పరిస్థితి రావడంతో అమ్మ మళ్ళీ మంచం పడుతుందేమోనని చాలా దిగులేసింది. నేను అత్తగారింటి నుండి వెళ్లేసరికి అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అందువల్ల నేను నేరుగా హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ అన్నీ రకాల టెస్టులు చేయించాలని అన్నారు. ఆ టెస్టులన్నీ క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలకు సంబంధించినవి. 2015లో కూడా ఆ టెస్టులు చేసారు. అప్పుడు అన్నీ నార్మల్ వచ్చాయి. మళ్ళీ అప్పటి పరిస్థితే వచ్చింది కాబట్టి ఆ టెస్టులన్నీ మళ్ళీ చేయించాలన్నారు డాక్టరు. ఒక్కొక్క టెస్టు చేస్తుంటే, 'రిపోర్టులో ఏమొస్తుందో?' అని నాకు భయంగా ఉండేది. అందుచేత ప్రతీ టెస్టు జరుగుతున్నప్పుడు నేను బాబా స్మరణ చేస్తూ ఉండేదాన్ని. 10 రోజులు టెస్టులు జరుగుతుంటే, నేను బాబాని, "ఇలా ఎన్ని టెస్టులు చేస్తారు బాబా? ఆ టెస్టులన్నీ అయిపోయి రిపోర్టులు నార్మల్ వచ్చి, అమ్మ కోలుకొని డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేలా చేయండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. బాబా అనుగ్రహం చూపారు. ప్రతీ టెస్టు రిపోర్టు నార్మల్ గా వచ్చింది. దాంతో డాక్టర్, "పెద్దగా ఏ సమస్యలు లేవ"ని చెప్పి అమ్మని డిశ్చార్జ్ చేశారు. నేను, "బాబా! దయచేసి అమ్మ పూర్తిగా కోలుకొని ఇదివరకటిలా తన రోజువారీ పనులు చేసుకుంటూ హాయిగా ఉండాలి. నేను మళ్ళీ మా అత్తగారింటికి వెళ్ళేలోపల అమ్మ మాములు అయ్యేలా అనుగ్రహించండి" అని బాబాని వేడుకోసాగాను. బాబా కృపవల్ల అమ్మ 3 నెలల్లో పూర్తిగా కోలుకొని అదివరకటిలా తన పనులు, ఇంటి పనులు చేసుకోసాగింది. బాబా అనుగ్రహం వల్ల మేము పొందిన ఆనందం అంతాఇంతా కాదు.
ఇకపోతే, హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను కొంచం తొందరపడి వేరేవాళ్ళ గురించి మా అత్తతో మాట్లాడాను. నేను మాట్లాడింది నిజమే అయినా మాట్లాడకపోయి ఉంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే, నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడానో ఆ వ్యక్తి పరిచయస్థులు ఒకరు అక్కడ ఉన్నారు. అందువల్ల 'ఎందుకు మాట్లాడానా?' అనిపించి, "బాబా! ఇలా మళ్ళీ ఎప్పుడూ మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడినందువల్ల ఏ సమస్యా లేకుండా చూడు తండ్రీ" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఏ సమస్యా రాలేదు.
ఒకరోజు మా అక్క చాలా కలతగా మెసేజ్ చేసింది. విషయం ఏమిటని అడిగితే, వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని, తనకి చాలా బాధగా ఉందని చెప్పింది. తన మాటలు విని నేను కూడా చాలా కంగారుపడి బాబాను, "ఎలాగైనా వాళ్ళింట్లో పరిస్థితులు చక్కపడేలా చేయమ"ని ప్రార్థించాను. బాబా పిలిస్తే పలుకుతారు కదా! ఆ రాత్రే గొడవ సర్దుమణిగింది. మా అక్క తిరిగి మనఃశాంతి పొందింది. "ధన్యవాదాలు బాబా. ప్రతి ఒక్క విషయంలో నాకన్నీ మీరై నడిపిస్తున్నారు. శ్రద్ధ-సహనం అనే రెండు రూపాయిలు సంపాదించి మీకు అర్పించడమే నా జీవితం ధ్యేయం బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!
చెప్పుకుంటే సమస్య లేకుండా చూసుకునే తండ్రి బాబా ఉండగా భయమెందుకు?
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. మాకు ఇద్దరు పిల్లలు. మేము ఉగాది పండుగకి మా ఊరు వెళ్ళాము. అది అసలే వేసవి. ఆంధ్రాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఎప్పుడు వూరు వెళ్లినా మా బాబు తిరిగి రానని సతాయిస్తాడు. అందువల్ల నేను, "బాబా! మేము ఊరు వెళ్లి తిరిగి వచ్చేవరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, అలాగే బాబు సతాయించకుండా చూడు తండ్రీ" అని బాబాని వేడుకొని ఆయన మీద భారమేసి వెళ్ళాను. బాబా దయవల్ల మా బాబు సతాయించకుండా తిరిగి వచ్చాడు.
ఇంకోసారి ఒక ఫంక్షన్‌కి వెళ్లాల్సి ఉండగా అదే సమయం నా నెలసరి సమయమైంది. అందుచేత నేను, "బాబా! నాకు నెలసరి సమస్య రాకుండా చూడు తండ్రీ" అని బాబాకి చెప్పుకొని ఆయన మీద భారమేసి ఫంక్షన్‌కి వెళ్ళాను. బాబా దయవల్ల ఎటువంటి సమస్యా లేకుండా సంతోషంగా ఫంక్షన్ చూసుకొని వచ్చాను. ఏదైనా చెప్పుకుంటే సమస్య లేకుండా చూసుకునే తండ్రి బాబా ఉండగా మనకెందుకు భయం? "సదా మమ్మల్ని కాపాడుతున్నందుకు చాలా ధన్యవాదాలు బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members 🙏🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl
ReplyDeleteOm Sai Ram
ReplyDelete💐💐సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!💐💐
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba manasantha bdha ga vundhi naku oka Dari chupinchi badha nunchi bayata veyyava thandri
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteSai Naa Kadupu kotaki samadam kavali
ReplyDeleteevvaru chuptaru tandri
Om Sai Ram
ReplyDeleteఓం సాయి బాబా నాకు మనోధైర్యం కలిగించి నాకు ప్రశాంత వాతావరణం కలిగించి కా పా డు తండ్రి.మా ra కా hana మీదే తండ్రి.Help me nanna..om Sai Ram
ReplyDeleteI love you tandri.please take care of my family 🙏🙏 Om Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏