ఈ భాగంలో అనుభవాలు:
1. తలచినంతనే చేత్తో తీసేసినట్టు బాధలన్నీ తీసేసే సాయి
2. వారం రోజుల్లో డబ్బు సమకూర్చిన బాబా
తలచినంతనే చేత్తో తీసేసినట్టు బాధలన్నీ తీసేసే సాయి
చల్లని తండ్రి శ్రీసాయినాథుని దివ్య పాదపద్మములకు నా నమస్కారం. నా పేరు జ్యోతి. ఎందరో సాయిభక్తులు అసంఖ్యాకమైన సాయిలీలలు తెలుసుకోవడానికి, అలాగే తమ అనుభవాలను సంతోషంగా అందరితో పంచుకోవడానికి, ఇంకా ఆ తండ్రి యందు భక్తి, విశ్వాసాలు మరింతగా బలపడటానికి ఈ బ్లాగు ఎంతో ఉపయోగపడుతుంది. నిజముగా ఈ బ్లాగు సాయి భక్తులకు ఒక వరం. సాయి అందరినీ కాపాడే దైవం. ఆయన అసంఖ్యాక లీలలలో నుండి కొన్ని మీతో ఇప్పుడు పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కొంచెం సున్నితమైన మనస్కురాలిని. అందువల్లనేమో తెలియదుకానీ, నాకు ఏవైనా సమస్యలు వస్తే వాటి గురించే ఆలోచిస్తూ బాగా ఆందోళన చెందుతూ ఉంటాను. ఆ కారణంగా నాకు నిద్ర సరిగా పట్టదు. మనిషి జీవితంలో సమస్యలు సహజమేనని నాకు తెలుసు. కానీ ఎంత ప్రయత్నించినా నేను ఆ ఆందోళన నుండి బయటపడలేకపోతున్నాను. నాకు వచ్చిన ఎన్నో చిన్న, పెద్ద సమస్యల నుండి ఆ సాయినాథుడు నన్ను కాపాడారు. అయినా నేను చాలా భయపడుతూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉండటం వల్ల ఒకసారి రాత్రి అకస్మాత్తుగా ఆందోళన నా అధీనం తప్పిపోయి ఒళ్లంతా చల్లబడిపోయేది, గుండెల్లో నొప్పి వచ్చింది. ఇంకా ఏమైనా అయిపోతుందేమోననిపించి నాకు చాలా భయమేసింది. ఎంత శాంతపరుచుకుందామనుకున్నా నా వల్ల కాలేదు. నిజంగా అది అత్యంత ప్రమాదకర పరిస్థితి. ఆ సమయంలో నేను సాయితండ్రిని తలుచుకొని, "సాయీ! నన్ను క్షమించు. నువ్వు ఉన్నావని, ఆదుకుంటావని, అన్నీ చూసుకుంటావని తెలిసి కూడా ఆలోచిస్తూ భయంతో ఇంతదాకా తెచ్చుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి చాలా భయానకంగా ఉంది. నా కుటుంబం నా మీదే ఆధారపడి ఉంది. నన్ను కాపాడు సాయీ" అని వేడుకున్నాను. అంతే, దాదాపు గంట నుండి అనుభవిస్తున్న నరకయాతన, గుండెబరువు అన్నీ ఒక్కసారిగా చేత్తో తీసేసినట్లు పోయాయి.
ఇంకోసారి నేను తీవ్ర జ్వరం, ఒళ్లునొప్పులు, కడుపునొప్పితో చాలా బాధపడ్డాను. లేచే ఓపిక కూడా లేక సాయితండ్రిని వేడుకున్నాను. అప్పటినుండి జ్వరం తగ్గి చమటలు పట్టాయి. తలచినంతనే చేత్తో తీసేసినట్లు నా బాధలన్నీ తీసేసారు సాయి. ఇలా ఎన్నోసార్లు పిలవగానే తండ్రి నన్ను ఆదుకున్నారు. ఆయన ఎప్పుడూ తమని నమ్ముకున్న బిడ్డల పక్కనే ఉంటారు. అందుకే పిలవగానే పలుకుతున్నారు. మహాసముద్రం వంటి సాయి లీలలలో నుండి నేను ఒక చిన్న నీటి బిందువును పంచుకున్నాను. ఇంకా చాలా చెప్పాలనుంది. త్వరలో మరిన్ని అనుభవాలతో మిమ్మల్ని కలుసుకుంటాను. సాయితండ్రికి, సాయి భక్తులకు నా ధన్యవాదాలు.
వారం రోజుల్లో డబ్బు సమకూర్చిన బాబా
సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు స్వాతి. నేను హైదరాబాద్ వాసిని. బాబా నా జీవితంలోకి వచ్చి 2 సంవత్సరాలవుతుంది. 'బాబా ఇంత ఆలస్యంగా నా జీవితంలోకి వచ్చారు. ముందే ఎందుకు రాలేదు' అని నాకు అనిపిస్తుంది. కానీ ఆయన చాలా అద్భుతాలు చూపించారు.అందులోనుండి ఒక చిన్న అనుభవం పంచుకుంటున్నాను. నా జీవితంలోకి ఒక అబ్బాయి వచ్చి, నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. నేను చాలా గందరగోళంలో ఉండి ఆ విషయం గురించి బాబా దగ్గర చీటీలు వేసాను. అప్పుడు, 'మోసం ఏం జరగదు. అతను నన్ను పెళ్లి చేసుకుంటాడ'ని వచ్చింది. నేను బాబా మీద నమ్మకంతో ఆ అబ్బాయిని మా ఇంటికొచ్చి మాట్లాడమని చెప్పాను. ఆ అబ్బాయి వచ్చి మా ఇంట్లో మాట్లాడాడు. మా అమ్మ ఒప్పుకుంది గానీ, నా పెళ్లి బాధ్యత మా మావయ్య తీసుకున్నందున ఆయనతో కూడా మాట్లాడించాల్సి ఉంది. ఈ విషయం అలా ఉంచితే, ఆ అబ్బాయికి విదేశాలకు వెళ్లే ప్రణాళికలున్నాయి. నవంబర్‌లో నన్ను పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లాలన్నది అతని ఆలోచన. అయితే వీసా విషయంగా బ్యాంకు బాలన్స్ చూపించడానికి 3 లక్షల రూపాయలు తక్కువ అయ్యాయి. సమయం చూస్తే, ఒక వారమే ఉంది. అందువల్ల మేమిద్దరం ఒక్క వారంలో 3 లక్షలు ఎలా ఏర్పాటు చేయాలని చాలా ఆందోళన చెందాము. అప్పుడు నేను బాబాని, "మీరే ఆ డబ్బు ఏర్పాటు చేయాలి బాబా" అని గట్టిగా ప్రార్థించాను. అలా రోజూ రాత్రి బాబాని ప్రార్థిస్తూ, ఆయన మీద నమ్మకంతో ఆయనకే వదిలేసాను. అసలు ఎలా జరిగిందో తెలియదుకానీ, సమయానికి 3 లక్షలు సర్దుబాటు అవ్వడంతో బ్యాంక్ స్టేట్మెంట్ చూపించగలిగాము. అంతా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే, అంత మొత్తం ఏర్పాటవ్వడం అసాధ్యం. కానీ బాబా దయవల్ల జరిగింది. "థాంక్యూ సో మచ్ బాబా. నాకు ఇంత మద్దతు ఇస్తున్నందుకు, నాతో ఉంటున్నందుకు లవ్ యు సో మచ్ బాబా. మీ దయతో అంతా మంచిగా జరగాలని ఏ అడ్డంకులు లేకుండా మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను తండ్రీ".
Tandri Sai please 🙏🙏 cure my depression I am suffering very much.please take care of me.Be with us and bless us.i am feeling so sad and to much worry. Om Sai Ram.please cure baba
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, anta bagunde la chayandi tandri, amma nannalani kshamam ga chudandi valla badyata meede, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri, naaku manchi arogyanni prasadinchi ofce lo anta bagunde la chayandi tandri pls
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeletebaba madava ki chaduvu meeda interest kaligelaga chudu tandri. Maa attagariki naameeda vunna kopam poyelaga cheyandi tandri.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sairam
ReplyDeleteOmsairam
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteSri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai,🙏🙏🙏🙏🙏
ReplyDelete