సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1880వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహాశీస్సులు
2. పోయిన మొబైల్ తిరిగి ఇప్పించిన బాబా

శ్రీసాయి అనుగ్రహాశీస్సులు


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు లలిత. ఒకసారి మా అమ్మకి ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి. అదీకాక జ్వరం వలన అమ్మ బాగా నీరసించిపోయింది. అప్పుడు అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళితే డాక్టర్, "5 రోజులు హాస్పిటల్లో ఉండాల"ని ఆ 5 రోజులు అమ్మకి సెలైన్‌లు ఎక్కించారు. దాంతో అమ్మకి ప్లేట్లెట్స్ పెరిగి జ్వరం, నీరసం తగ్గాయి. అప్పుడు డాక్టరు అమ్మని ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి రెండు రోజులు బాగానే ఉందికానీ, తర్వాత కాలు, కడుపు బాగా పొంగిపోయాయి. దాంతో అమ్మని మళ్లీ హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాము. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "అమ్మకి మందుల ద్వారా తగ్గిపోవాలి. హాస్పిటల్లో ఉంచవలసిన అవసరం రాకూడదు" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల డాక్టర్ అమ్మని చూసి నెల రోజులకి మందులు వ్రాసి, ఇంటి దగ్గరే మందులు వాడుకోమని చెప్పి పంపారు. "ధన్యవాదాలు బాబా".


2024, మార్చి 30న మా బాబాయి కొడుకు ఉపనయనం అయ్యింది. ఆ కార్యక్రమానికి అలాగే పందిరిరాటకి రమ్మని బాబాయివాళ్లు మరీ మరీ పిలిచారు. కానీ అది నాకు నెలసరి సమయం. నెలసరి రాకుండా మాత్రలు వేద్దామంటే ఆ కార్యక్రమాలు జరిగిన వెంటనే ఉగాది పండుగ ఉంది. అందువలన నేను మాత్రలు వేయకుండా బాబాకి దణ్ణం పెట్టుకొని, "పందిరిరాటకి వెళ్లలేకపోయినా ఉపనయనానికి వెళ్లేలా చూడమ"ని చెప్పుకున్నాను. సాయి దయవలన పందిరిరాటకి వెళ్లలేకపోయినా ఉపనయనంకి వెళ్లాను. "ధన్యవాదాలు బాబా".


మా పిన్నికి బోన్ క్యాన్సర్ వచ్చింది. తను చనిపోతారని ఆమెను హాస్పిటల్‌లోనే ఉంచారు. చెల్లెలిద్దరూ చాలా ఏడుస్తుంటే నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! ఆవిడ మంచం మీద అయినా కొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది. ఆ పిల్లలిద్దరూ చాలా బాధపడుతున్నారు" అని చెప్పుకున్నాను. బాబా దయవలన ఆవిడ ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. కాకపోతే, మంచం మీద. చివరి దశ, ఇంకా ఆవిడ లేచి తిరగలేరు. ఇకపోతే, మా పెద్దపాపలో ఇంటర్‌‌లో 900 పైన మార్కులు రావాలని, అలాగే చిన్నపాపకి పదవ తరగతిలో 500 మార్కులు రావాలని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల పెద్దపాపకి 901, చిన్నపాపకి 521 మార్కులు వచ్చాయి. "ధన్యవాదాలు బాబా. వయసుకు తగ్గట్టు పెద్దపాప ఎదగడం లేదు బాబా. దయచేసి తను ఎత్తు, బరువు పెరిగేటట్లు చేయండి. అలాగే చిన్నపాపకి సెల్ చూసే అలవాటు తగ్గేటట్లు చేయండి. జన్మజన్మలకి మేము మేలు మరిచిపోను తండ్రీ. నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి. నాకు మీ పాదాలందు స్థిరమైన నమ్మకం, భక్తి ఉండేలా అనుగ్రహించండి బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై.


పోయిన మొబైల్ తిరిగి ఇప్పించిన బాబా

సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబాబానే నాకు అన్నీ. నేను ఉద్యోగస్థురాలిని. ఒక సాయంత్రం నేను కాలేజీ బస్సు దిగి ఇంటికొచ్చాక చూసుకుంటే నా మొబైల్ లేదు. బస్సు స్టాప్ దగ్గర పడిపోయిందేమోనని వెనక్కి వెళ్లి అక్కడ చూసాము కానీ, మొబైల్ కనిపించలేదు. అప్పుడు బస్సులో మర్చిపోయానేమోనని డ్రైవరుకి కాల్ చేస్తే, అతను బస్సులో చూసి లేదన్నాడు. నేను ఇంకా అది దొరుకుతుందన్న ఆశను కోల్పోయాను. మొబైల్‌లో బ్యాటరీ తక్కువగా ఉంది. మా మామయ్య తన మొబైల్ నుండి కాల్ చేస్తే, రింగ్ అయిందికానీ, ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అందుకని పోలీసుస్టేషన్‌లో చెప్తే ట్రాక్ చేస్తారని బయలుదేరి నా భర్తకి కాల్ చేసి, విషయం చెప్పాను. ఆయన నేను ట్రాక్ చేస్తానని, "పోలీస్ స్టేషన్ దగ్గర చూపిస్తుంది" అని చెప్పారు. దాంతో మేము ఎవరైనా నా మొబైల్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చి ఉంటారని తొందరగా వెళ్ళాము. అయితే అక్కడు పోలీసులు ఎవరూ మొబైల్ తెచ్చివ్వలేదన్నారు. దాంతో నేను నిరాశ చెంది, "బాబా! ఇప్పటికే మొబైల్ దొరకడం అసాధ్యం. కానీ మీరు దాన్ని సాధ్యం చేయగలర"ని బాబాకి చెప్పుకున్నాను. అంతలో నా భర్త ఫోన్ చేసి, "నీ మొబైల్ ఎవరి దగ్గర ఉందో, వాళ్ళు అక్కడే ఉన్నారు. మొబైల్ తీసుకోండి" అని అన్నారు. సరేనని, మేము నా మొబైల్‌కి కాల్ చేస్తే, వాళ్ళు లిఫ్ట్ చేసి, "పోలీస్ స్టేషన్ బయట వున్నాము. రండి, మీ ఫోన్ మీకు ఇస్తాము' అన్నారు. మేము వెళ్లి నా ఫోన్ తీసుకున్నాము. బాబా 20 నిమిషాల్లో నా మొబైల్ నాకు ఇప్పించేసారు. నిజంగా 'బాబా' అనుకుంటే చాలు తీరుస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సర్వం సాయినాథ పాదర్పణమస్తు.

13 comments:

  1. Baba, bless my children and fulfill their wishes in education. Baba, please give first rank in PG NEET exam for my daughter. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. Om sai ram 🙏

    ReplyDelete
  8. Om Sairam
    Sai always be with me 🙏

    ReplyDelete
  9. baba sai madava bharam antha meede baba. kalki cinema tickets dorikelaga chudu baba

    ReplyDelete
  10. Om Sai Ram sri sai ram Jai sai ram sai baba is great god sri Annathna koti Akhinadhal nayaka bramanadha nayaka raj thi raj yogi raj prabram sri sacthhinadtha samatha srada suggudrui subari sai baba Maharaj ki jai TQ u your blessings sai baba Maharaj ki Jai true your blessings sai baba Maharaj ki Jai my favourite sai baba Maharaj ki Jai 🙏💐🥥

    ReplyDelete
  11. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo