సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1881వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రణాళికతో పాపకి నయమయ్యేలా చేసిన బాబా
2. రెండు నెలల నరకయాతన నుంచి విముక్తి కలిగించిన బాబా

ప్రణాళికతో పాపకి నయమయ్యేలా చేసిన బాబా

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. నేను సాయినాథుడు నాపై చూపిన కృపను మీతో పంచుకుంటున్నాను. మా పాపకి మూడు సంవత్సరాలు. ఒకరోజు నేను తనకి స్నానం చేయిస్తుండగా తను, ఛాతి భాగం నొప్పిగా ఉందమ్మా అని చెప్పింది. చూస్తే, చనుమొన ప్రాంతంలో వాపు ఉంది, ఎర్రగా కూడా ఉంది. ఒక వైపే అలా ఉంది. అప్పుడు నేను చీమకుట్టినట్టు ఉందని జండూబామ్ రాసి, విషయాన్ని తేలికగా తీసుకున్నాను. ఎందుకంటే, అప్పుడప్పుడు తనని చీమలు కుడుతుంటాయి, అప్పుడు అక్కడ ఎర్రగా అవుతుంటుంది కూడా. అందుచేత ఇది అలానే అనుకున్నాను. రెండు రోజుల తర్వాత పాప మళ్లీ నొప్పి అంది. అప్పుడు రాత్రి 10 గంటలైంది. నాకు చాలా భయమేసింది, చాలా టెన్షన్ పడ్డాను. వెంటనే నాకు తెలిసిన డాక్టర్‌కి కాల్ చేశాను. పాపం ఆ డాక్టర్ ఆ సమయంలో పడుకొని ఉన్నారు. నిజానికి నేను సమయంలో అలా డిస్టర్బ్ చేయకూడదు. కానీ నాకు చాలా భయమేసి కాల్ చేసి విషయం చెప్పి, వీడియో కూడా తీసి పంపాను. ఆయన, "రేపు క్లినిక్‌కి తీసుకొని రండి" అని చెప్పారు. నాకు భయంతో ఆ రాత్రి నిద్ర రాలేదు. "బాబా! పాపకి ఏం కాకూడదు" అనుకుంటూ పాపకి వాపు, ఎర్రదనం ఉన్న చోట ఊదీ రాసి, మరికొంత ఊదీ పాప నోట్లో వేసి పడుకోబెట్టాను. మరుసటిరోజు పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్తే, పిల్లల డాక్టరు చూసి, "వాపు సమస్య కాదు. చనుమొన దగ్గర గట్టిగా ఉంది. దాని సంగతి చూడాలి" అని చెప్పి మూడు రోజులకి మందులిచ్చి మళ్లీ రమ్మని చెప్పారు. నాకు చాలా భయమేసి ఆందోళన చెందాను. "సాయినాథా! నువ్వే కాపాడాలి. పాపకి ఏం కాకూడదు, తగ్గిపోవాల"ని అని బాబాకి చెప్పుకున్నాను. రెండు రోజులు తర్వాత మా అక్క ఫోన్ చేసి, "శిరిడీ వెళదామ"ని అడిగింది. నేను సరేనని మనసులో 'శిరిడీ వెళ్తే, పాపకి తగ్గుతుంది. బాబా అక్కడ న్యాయం చేస్తారు' అని అనుకున్నాను. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాను. సెలవుకోసం మా డాక్టర్ దగ్గరకి వెళ్లాను. ఆయన సెలవు ఇచ్చారు. తర్వాత ఎందుకైనా మంచిదని ఆయనతో పాప గురించి చెప్పి వీడియో చూపించాను. అప్పుడు ఆయన, "అది అంత సమస్య కాదు. చనుమొన దగ్గర లింఫ్ నోడ్స్ డిలీట్ అయుంటాయి. కొంతమందికి అలా జరుగుతుంద"ని చెప్పి ఆంటిబయోటిక్స్ ఇచ్చి, "ఉదయం, సాయంత్రం వాడమ"ని చెప్పారు. అయితే నేను ఉదయం మాత్రమే పెట్టాను. దాంతో అది తగ్గిపోయింది. కానీ నా శిరిడి ప్రయాణం రద్దు అయింది. ట్రైన్ టికెట్లు కన్ఫర్మ్ కాలేదు. బాబా ఇదంతా మా డాక్టర్ని కలవడానికి ప్లాన్ చేసి ఉంటారు. నేను ఆయన ప్లాన్‌లో భాగంగా సెలవుకోసం మా డాక్టరు దగ్గరకి వెళ్లకపోయుంటే పాపకి ఇంత త్వరగా తగ్గేది కాదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. లవ్ యు బాబా".

రెండు నెలల నరకయాతన నుంచి విముక్తి కలిగించిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు శ్రీనివాసబాబు. నేను హైదరాబాదులో నివాసం ఉంటున్నాను. నాకు నిజంపేటలో ఒక డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ ఉంది. దాన్ని 2019లో అద్దెకిచ్చాను. ఈమధ్య అద్దె పెంచితే వాళ్ళు, రెండు నెలల్లో ఖాళీ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఖాళీ చేయడానికి ఇంకో 20 రోజులు ఉండగా నేను టూలేట్ బోర్డు పెట్టాను. దాంతో ఇల్లు చూడటానికి కొంతమంది వచ్చారు. అలా వచ్చిన వాళ్లు ఇంట్లో ఉన్న లాప్టాప్ తీసుకుని వెళ్లారని, లాప్టాప్ డబ్బులు ఇస్తేగాని ఇల్లు ఖాళీ చేయనని ఆ ఇంట్లో ఉన్నతను గొడవపెట్టాడు. అంతే కాకుండా మెంటైనెన్స్ డబ్బులు కూడా ఇవ్వలేదు. నాకు వేరే దారిలేక పోలీసు కేసు పెట్టాను. అయినా అతను, "నా లాప్టాప్ మీ ఇంట్లోనే పోయింది కనక అది దొరికే వరకు నేను ఇల్లు ఖాళీ చేయన"ని  సతాయించాడు. ఇక మావల్ల కాక బాబా మీద భారమేసి, "ఏ గొడవలూ జరగకుండా అతని మనసు మారి ఖాళీ చేసేలా చేయండి" అని బాబాని వేడుకున్నాను. మరుసటి ఆదివారం పెద్దమనుషులను తీసుకొని వెళ్లి పంచాయతీ పెట్టించాను. బాబా వాడి మనసు మార్చారు. ఖాళీ చేయడానికి ఒక నెల గడువు అడిగి, చెప్పినట్టు ఇల్లు ఖాళీ చేశాడు. ఇప్పుడు మేము ఇల్లు వేరేవాళ్ళకి అద్దెకు ఇచ్చాము. ఇదంతా కేవలం బాబా దయ. రెండు నెలల నరకయాతననుండి విముక్తి కలిగించారు బాబా. "ధన్యవాదాలు బాబా".

13 comments:

  1. Sri Sachidananda Samardha Sadguru Sainath Maharaj ki Jai. Baba ee problems nundi meere bayata padeyali thandri. Om Sairam!!

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me 🙏

    ReplyDelete
  8. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  9. baba, thank you baba. madava korika neraverchavu baba. naaku ekorika levu baba. madava ne naa lokam baba

    ReplyDelete
  10. Baba pls badal dorikela chudu tondaraga... Baba antaku mundu la kakunda peaceful house manchidi dorikela chudu baba. ..akkada naku elanti ibbandi undakudadu. Evari poru undakudadu. Pls baba.. Om sai ram 🙏

    ReplyDelete
    Replies
    1. Badal kadu baba badam dorikela chudu 🙏

      Delete
  11. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo