సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1883వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తోటి భక్తుల అనుభవాల ద్వారా జరిగిన మేలు
2. మనస్ఫూర్తిగా బాబా అనుకుంటే చాలు, ఏదైనా అయిపోతుంది

తోటి భక్తుల అనుభవాల ద్వారా జరిగిన మేలు
 
సాయి మహారాజ్‌కి, సాయి బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రమాదేవి. నేను నా అనుభవాలు పంచుకునే ముందు సాయిబంధువులకు ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను. నేను దాదాపు రెండున్నర సంవత్సరాల నుండి ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. బాబా దయతో నేను కూడా చాలాసార్లు నా అనుభవాలు పంచుకున్నాను. ఏ ఒక్క రోజూ బ్లాగులో అనుభవాలు ప్రచురితం కాకుండా ఉండలేదు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతిరోజూ బ్లాగులో అనుభవాలు ప్రచురితం కావడం లేదు. కాబట్టి బాబా అనుగ్రహం పొందగానే దయచేసి మీ అనుభవాలను వివరంగా బ్లాగుకి పంపండి. తద్వారా తోటి సాయి బంధువులకు మేలు చేసిన వాళ్లమవుతాం. అలా బ్లాగులోని సాయిబంధువుల అనుభవాలు చదివాక నేను పొందిన మేలును ఇప్పుడు చెప్తాను.

దాదాపు 2 సంవత్సరాల ‌నుండి మా బాబుకి స్కిన్ అలర్జీ ఉంది. స్కిన్ స్పెసలిస్ట్‌కి చూపించి, వాళ్ళు వ్రాసిన క్రీములు, సబ్బులు, టాబ్లెట్లు వాడినప్పటికీ 50% కూడా తగ్గలేదు. ఇక అప్పుడు దత్తస్వామికి, బాబాకి మ్రొక్కుకొని దత్త భస్మం, బాబా ఊదీ రాస్తుంటే 90% తగ్గింది. కానీ సమస్య రెండు సంవత్సరాల నుండి ఉండటం వలన కాళ్లపై నల్లటి మచ్చలు చాలా ఏర్పడ్డాయి. అవి అప్పుడప్పుడు దురదపెడుతుండేవి. నేను వాటిని తగ్గించమని బాబాని వేడుకుంటూ ఉండేదాన్ని. కొన్ని రోజులకి ఈ బ్లాగులో 'స్కిన్ అలర్జీ వస్తే, బాబాకి అభిషేకం చేసిన నీళ్ళు అలర్జీ ఉన్న చోట వ్రాయడం వల్ల అలర్జీ పూర్తిగా తగ్గింది' అని భక్తులు పంచుకున్నారు. అది చదివాక నన్ను కూడా అలా చేయమని బాబా ప్రేరణ ఇచ్చినట్లు అనిపించి, బాబుకి అభిషేక జలం రాద్దామని అనుకున్నాను. మా ఇంట్లో చిన్న బాబా విగ్రహం ఉంది. నేను ఆ బాబాకి అభిషేకం చేసి ఆ జలాన్ని ఒక సీసాలో భద్రపరిచాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేమిటంటే, ఒక సంవత్సరం కిందట బాబుకి చికెన్ పాక్స్ వచ్చి తగ్గింది. కానీ ఛాతీ దగ్గర ఒక కురుపు పెద్దగా, గట్టి కాయలా ఉండిపోయింది. నొప్పి కూడా ఉండేది. నేను బాబాని, "బాబా! బాబు అలర్జీ, అలర్జీ వల్ల ఏర్పడ్డ మచ్చలు, చికెన్ పాక్స్ వల్ల ఏర్పడ్డ కురుపు తగ్గిపోవాలి" అని వేడుకొని బాబా అభిషేక జలం బాబు శరీరంపై ఆయా ప్రాంతాల్లో రాశాను. అలా నాకు గుర్తు వచ్చినప్పుడు, అది కూడా చాలా కొద్దిసార్లే చేశాను. బాబా దయతో ఇప్పుడు బాబుకి పూర్తిగా తగ్గిపోయింది. అలాగే ఒకసారి మా బాబుకి ఆటలో ఇనుప తీగ గీసుకుపోయింది. నేను ఇంజక్షన్ చేయించలేమోననుకొని గాయమైన చోట ఊదీ, బాబా అభిషేక జలం రాశాను. బాబా దయవల్ల ఇంజక్షన్ లేకుండానే తగ్గింది. "బాబా! మీకు శతకోటి వందనాలు".
.
ఒకసారి మావారు తన ఆఫీసులో బాస్‌తో చాలా సమస్యలు ఎదుర్కొని 2, 3 నెలలు చాలా ఇబ్బందిపడ్డారు. అప్పుడు ఒకరోజు నేను ఈ బ్లాగులో అనుభవాలు చదువుతున్నప్పుడు 'సాయినాథ మూలబీజ మంత్రాక్షరి స్తోత్రం' పఠించడం వల్ల తమ సమస్య తీరిందని భక్తులు పంచుకున్న అనుభవం చదివాను. అప్పుడు నేను మా వారిచేత ఆ స్తోత్ర పఠనం చేయించాను. బాబా దయవల్ల రెండు నెలలలో మావారికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఈ విధంగా తోటి భక్తుల అనుభవాలు నాకు మేలు చేసాయి.

మరికొన్ని చిన్న చిన్న అనుభవాలు: ఒకరోజు మా ఇంట్లో గీజర్ పని చేయలేదు. నేను బాబాను వేడుకొని ఊదీ పెట్టాను. బాబా దయవల్ల సాయంత్రానికి మావారు ఆ సమస్యను సరిచేయగలిగారు. ఒకసారి మా అమ్మకి యూరిన్ ఇన్ఫెక్షన్ వలన ఇబ్బంది అయింది. నేను అమ్మకి తగ్గిపోవాలని ఊదీ పెట్టుకున్నాను. దాంతో అమ్మకి తగ్గిపోయింది. అలాగే అమ్మకి మోకాలు నొప్పి తగ్గాలని అనుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు అమ్మకి ఉపశమనంగా ఉంది. మా పిల్లలు చాలాసార్లు వాళ్ళ పరీక్షల విషయంలో బాబాను వేడుకొని, బాబా నామం 108 సార్లు వ్రాసారు. బాబా వాళ్ళను ఎప్పరూ నిరాశపరచలేదు. "మీకు శతకోటి కృతజ్ఞతలు బాబా. మీ ప్రేమకు అంతులేదు సాయినాన్నా!".

మనస్ఫూర్తిగా బాబా అనుకుంటే చాలు, ఏదైనా అయిపోతుంది

సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక బాబా భక్తురాలిని. నాకు తల్లి, తండ్రి, గురువు, సర్వస్వం ఆయనే. మా బ్రతుకు ఆయన కృపాబిక్ష. ఆయన లేని నిమిషం మాకు బ్రతుకు లేనట్లే! బాబాని నమ్ముకుంటే అడుగడుగునా అద్భుతాలు చూపిస్తారని మన అందరికీ తెలిసిందే! ఆయన నాకు ఎన్నో అద్భుతాలు చూపారు. అందులో నుంచి ఒకటి మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా బాబుకి చాలా జ్వరమొచ్చి ఆ రోజంతా అలానే ఉంది. టెంపరేచర్‌లో అస్సలు మార్పు లేదు. బాబు జ్వరంతో పాటు కడుపునొప్పి అని కూడా ఏడ్చాడు. దానికితోడు మరుసటిరోజు వాంతులు, విరోచనాలు కూడా అయ్యాయి. నాకు చాలా భయమేసి బాబాతో చెప్పుకున్నాను. తర్వాత హాస్పిటల్‌కి వెళ్తే, ఇన్ఫెక్షన్ అని చెప్పి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. బాబా దయ బాబు రెండురోజుల్లో కోలుకున్నాడు.  మనం బాబాకి సర్వస్య శరణాగతి వెడితే చాలు, అంతా ఆయన చూసుకుంటారు. మనస్ఫూర్తిగా బాబా అనుకుంటే చాలు, ఏదైనా అయిపోతుంది. నిజంగా బాబా అంటే బాబానే. ఆయన పాదాల చెంత మేము క్షేమంగా ఉన్నామని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా".

14 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  3. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  4. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐

    ReplyDelete
  5. Om sai ram, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri, naaku unna arogya samasya tagge la chudandi tandri pls, ofce lo anta bagunde la chesi na manasulo anukunnadi neraveri sai bhaktulatho panchukune avakasanni ivvandi tandri pls, amma nannalani kshamam ga chudandi tandri

    ReplyDelete
  6. baba madava bharam antha meede baba. madava birth certificate lo peru marchetattu chudandi baba

    ReplyDelete
  7. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  8. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi sarva Jana sukino bavanthu

    ReplyDelete
  9. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  10. Baba na arogyam bagundhela ashirvadhinchu sai

    ReplyDelete
  11. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo