ఈ భాగంలో అనుభవాలు:
1. ఎప్పుడూ తోడుగా ఉండే బాబా
2. రెండురోజుల్లో ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించిన బాబా
ఎప్పుడూ తోడుగా ఉండే బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు కోమలవల్లి. మా అమ్మాయి వివాహానంతరం ఆర్థికంగా నిలబడటానికి నేను 2024, జనవరి నెలలో నిండు గర్భంతో ఉన్న ఒక ఆవును 60 వేల రూపాయలకి కొన్నాను. అది మా దగ్గరకు వచ్చిన నాలుగు రోజులకు డెలివరీ సమయం ఆసన్నమై ఈనలేక అవస్థపడుతుంటే డాక్టర్ పట్టి దూడను బయటకి లాగారు. ఆ దూడ ఒక పది రోజులు ఉండి చనిపోయింది. డెలివరీ అయినప్పటినుండి ఆవుకు రోజూ జ్వరం వస్తుండేది. ఎన్నో ఇంజక్షన్లు, మందులు వాడాము. అదే సమయంలో నా ఆరోగ్యం బాగాలేక ఒక 20 రోజులు బాగా ఇబ్బందిపడ్డాను. ఆవు కూడా చాలా ఇబ్బందిపెట్టింది. సరిగ్గా తినదు, నీళ్లు తాగదు. తెల్లారి లేచిన వెంటనే ఆవు ఎలా ఉందోనని ముందు దాన్నే చూసేదాన్ని. స్కూలులో టీచరుగా పనిచేస్తున్న నేను డ్యూటీలో ఉండగా నా ఫోన్ రింగ్ అయితే చాలు, 'ఏం వినాల్సి వ స్తుందో!' అని భయపడేదాన్ని. అంతలా నేను మానసిక వ్యధకు గురయ్యాను. ఇలా ఉండగా ఒకరోజు ఆవు ఉన్నట్టుండి పడిపోయింది. 10 సెలైన్ బాటిళ్లు ఎక్కించాము. అందరూ, "అది ఇంకా బతకదు. మీరు దానికోసం చాలా ఖర్చు పెట్టారు. దాన్ని కసాయివాళ్ళకి ఇచ్చేయండి. ఎంతో కొంత వస్తుంది" అని అన్నారు. నేను ఏడుస్తూ మావారితో, "చనిపోతే పూడ్చేద్దాం. కానీ కసాయివాళ్ళకి ఇవ్వొద్దు" అని అక్కడ ఉండలేక డ్యూటీకి వెళ్ళిపోయాను. మావారికి కూడా దానిని కసాయివాళ్లకు ఇవ్వడం ఇష్టంలేక మన ప్రయత్నం మనం చేద్దామని ఏవో ప్రయత్నాలు చేశారు. బాబా ఆశీర్వాదంతో ఆయన ప్రయత్నాలు ఫలించి ఆవు లేచి నిలబడింది. మావారు నాకు ఫోన్ చేసి, "ఆవు లేచి నిలబడింద"ని చెప్పారు. నేను వెంటనే ఇంటికి వచ్చి మళ్ళీ డాక్టర్ను పిలిపించి ట్రీట్మెంట్ చేయించాం. బాబా ఊదీ నీళ్లలో కలిపి ఆవు చేత తాగించాను. బాబా దయవల్ల ఆవు కోలుకుంది. కానీ దాన్ని నా దగ్గరకు ఉంచుకోవడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఆ విషయం మా తమ్ముడితో చెప్తే, తను వేరే వాళ్ళతో మాట్లాడి ఆవును చూసుకునే ఏర్పాటు చేశాడు. ఆవును వాళ్లతో తోలేసాక 'దాన్ని కొనడానికి 60,000 పెట్టాను, దాని వైద్యానికి మరో 30,000 రూపాయలదాకా పెట్టాన'ని మొదట బాధేసింది. కానీ, "ఏ వస్తువైనా, వ్యక్తి అయినా, ప్రాణి అయినా ఋణం తీరేవరకే నీ దగ్గర ఉంటుంది" అన్న బాబా మాటలు గుర్తొచ్చి ఏ జన్మలోనో ఆ అవుకు నేను ఋణపడి ఉంటానని, ఈ జన్మలో ఇలా తీరిందని నన్ను నేను సమాధానపరుచుకున్నాను. దాంతో నాకు చాలా మనశాంతిగా అనిపించింది. రెండు నెలల తర్వాత ఆవు ఎలా ఉందో చూద్దామని వెళితే, వాళ్ళు దానికి సరిగా తిండి పెట్టకుండా బాగా పాడుచేశారు. ఆవును చూసి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ మనసులో భయం మొదలైంది. ఫోన్ రింగ్ అయితే గుండెలో దడగా ఉండేది. అప్పుడు మా తమ్ముడితో, "ఎంతకైనా ఆవును అమ్మేయమ"ని చెప్పాను. కానీ ఆవు పరిస్థితి చూసి ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. అప్పుడు నేను, "ఎటువంటి ఆటంకాలు లేకుండా అవు అమ్మేసేటట్లు చూడమ"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మా అమ్మాయి మామగారు ఎవరితోనో మాట్లాడి ఆవును 15,000 రూపాయలకు అమ్మేసారు. ఇలా బాబా ఆ సమయంలో నాకు తోడుగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ నాతో ఉన్నారని, ప్రతి పని ఆయనే చూస్తున్నారని నేను నమ్ముతాను. అదే నిజం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సర్వం సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు.
రెండురోజుల్లో ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించిన బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నా పేరు విజయశ్రీ. ముందుగా సాయితండ్రికి, సాయిబంధువులకు నా నమస్కారములు. 2023, సెప్టెంబర్ నెలలో మావారికి ఉద్యోగంలో ఒక సమస్య వచ్చింది. నేను చాలా చాలా వేదన అనుభవించి, "తండ్రీ! దయ చూపు" అని బాబాను వేడుకున్నాను. తర్వాత ఫేస్బుక్‌లో "నీ భర్తకు వేరే ఉద్యోగం వస్తుంది. కంగారుపడకు" అని ఒక సందేశం వచ్చింది. తరువాత మావారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. నేను, "ఆ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో ఆ ఉద్యోగంలో చేరమని మావారికి ఉత్తర్వులు వచ్చాయి. "ధన్యవాదాలు బాబా. ఎల్లవేళలా మీ పాదాల దగ్గర నాకు చోటు ఇవ్వు తండ్రీ. మీకు శతకోటి వందనాలు సాయి".
Baba antha meere chusukovali meede bharam thandri. Om Sairam!!!
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education. Baba, please give first rank in PG NEET exam for my daughter. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sri Sairam 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri Sai karma dwamsine namaha 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram 🙏
ReplyDeleteOm sairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
baba madava bharam antha meede baba
ReplyDeleteOm sairam
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai Ram kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteBabasailu ki shanti prasadinchu
ReplyDelete