సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2085వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అంతా బాబా దయ
2. బాబా ఊదీ అనుగ్రహం

అంతా బాబా దయ

సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు కోమలవల్లి. 2026, ఫిబ్రవరిలో నేను విపరీతమైన దగ్గు, గొంతునొప్పితో బాధపడ్డాను. గొంతు నుంచి మాటలు కూడా రాలేదు. మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు డాక్టరుకి చూపించుకుంటే, మూడు రోజులకు మందులిచ్చారు. కానీ ఆ మందులు అయిపోయినా నాకు తగ్గలేదు. మా అమ్మవాళ్ళు, "వచ్చి చూపించుకొని వెళ్ళు" అన్నారు. కానీ మావారు హాస్పిటల్‌కి వెళ్తానంటే అరుస్తారు. నా పరిస్థితి చూస్తే,  గొంతునొప్పి, దగ్గు వలన ఏమీ తినలేకపోయేదాన్ని. కేవలం వేడి నీరు మాత్రమే తాగగలిగేదాన్ని. రాత్రిపూట విపరీతమైన దగ్గు, ముక్కు నుండి శ్వాస ఆడక చాలా ఇబ్బందిపడేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి నేను ఇంక భరించలేకపోయాను. నాకు ఎప్పుడు ఆరోగ్యం బాగలేకపోయినా ఎంతవరకు భరించగలనో అంతవరకు భరిస్తాను, ఇక నావల్ల కాదన్నప్పుడు బాబా ఊదీయే నాకు ఔషధం. రాత్రి 1:30 ప్రాంతంలో బాబాను, "దగ్గు, గొంతునొప్పి తగ్గించి ప్రశాంతమైన నిద్రని ప్రసాదించు బాబా" అని వేడుకొని కొంచెం ఊదీ గొంతుకి రాసుకొని, మరికొంత ఊదీ నోట్లో వేసుకున్నాను. అయితే ఆ తర్వాత కూడా విపరీతంగా ఇబ్బందిపడి ఏడ్చేసాను. తెల్లవారుజామున 4:30 గంటలకు నిద్రపట్టింది. రాత్రి అంతలా ఇబ్బందిపడినా ఉదయం 6 గంటలకు నిద్ర లేచేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. వరసగా మూడురోజులు ఊదీ గొంతుకు రాసుకొని, కొద్దిగా నోట్లో వేసుకుంటుంటే, గొంతునొప్పి, దగ్గు పూర్తిగా తగ్గిపోయాయి. అంతా బాబా దయ.

2026, మార్చి 31న మా మామయ్యగారు చనిపోయారు. మేము 7వ రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తాం. అందుకోసం నేను స్కూల్లో ఏప్రిల్ 1వ తేదీన నాకు ఏప్రిల్ 6వ తేదీన సెలవు కావాలని అడిగాను. అయితే ఏప్రిల్ 2వ తేదీన హఠాత్తుగా మా తోడికోడలు ఫోన్ చేసి, "7వ రోజు కార్యక్రమం 5వ రోజు అంటే ఏప్రిల్ 4న పెట్టుకుందామ"ని అంది. ఆరోజు నా సహోద్యోగి సెలవు తీసుకుంటున్నందున నాకు సెలవు ఇవ్వరు. ఆ విషయం చెప్పినా మా తోడికోడలు ఒప్పుకోలేదు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా కార్యక్రమం 7వ రోజు జరిగేలా చూడండి. నేను ఏం చెప్పినా మా తోడికోడలు ఒప్పుకోదు. నీదే భారం" అని బాబాను వేడుకున్నాను. ఆరోజు సాయంత్రం నేను ఇంటికి వెళ్ళాక మా తోడికోడలు, "కార్యక్రమం 5వ రోజు చేయకూడదు. కాబట్టి 7వ రోజు చేద్దామ"ని అంది. ఇదంతా బాబా దయ మాత్రమే. "శతకోటి ధన్యవాదాలు బాబా".


9 comments:

  1. Baba na manasulo unna badhalni ofce lo unna samasyalni annitini teerchandi tandri, meeru tappa naaku evaru leru pls tandri chala tension ga pressure ga undi tandri, nenu korukunnadi naaku anugrahinchandi tandri pls.

    ReplyDelete
  2. Om Sai Rakshak Saranam Devaa 🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. Om Sai Ram 🙏🙏

    ReplyDelete
  7. May 7th 2026, ఈ రోజు బాబా ఒక ట్రబుల్ నుంచి కాపాడారు, అది ఇక్కడ శేర్ చెసుకుంటున్నా, నేను ఒక నెల నుంచి ఒక ప్రోజెక్ట్ లో లీడ్ వర్క్ చేస్తున్నా, పొయిన వారం ప్రొడక్శన్ మైగ్రెట్ చేసాం, ఒక మజర్ రిపొర్ట్ క్లైంట్ అనుకున్నట్టు రాలేదు, డెవలప్మెంట్ లో బాగానె వుంది, మూడు రోజుల నుండి ఎంత ప్రయత్నించినా అదె పరిస్తిస్తి, దాదాపుగా ఎడుపు వచెసింది, ఇంక చివరలో ఇవ్వళ బాబా తొ చెప్పుకున్న,ఫైనల్ గా మళ్ళి కొడ్ డిప్లొయ్ చెస్తాను ఈ సారి ఎలగయిన వర్క్ అయ్యెలగా చెయ్యండీ ప్లీజ్ బాబా అని, రిపొర్ట్ ప్రబ్లం సెట్ అయితె నేను సాయి మహరాజ్ ఆన్నిధి బ్లగ్ కమెంట్స్ లో నా ఎక్ష్పిరియన్స్ పొస్ట్ చెస్తాను అని అనుకున్నాను, అంతే అద్భుతం జరిగింది, మళ్ళీ మైగ్రట్ చేసి, రిపొర్ట్ రన్ చేసను, 3 రోజులుగా అవ్వనిది, సడెన్ గా అంత బాగా వుంది, నేను సరిగ్గా చెప్పలేక పోతున్న, కాని సాయి బంధువులు నా భావాలని అర్దం చేసుకుంటరు, థ్యంక్యు సాయి తండ్రి, అందరిని మీ చల్లగ చూడంది తండ్రి. ఓం సాయినాథయ నమహ!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo