ఈ భాగంలో అనుభవాలు:
1. అడుగడుగునా కాపాడుతున్న బాబా
2. సమస్యలేమీ లేకుండా అనుగ్రహించిన బాబా
అడుగడుగునా కాపాడుతున్న బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు సుగుణ. నేను గత 30 సంవత్సరాలుగా సాయిబాబా భక్తురాలిని. 1991-92లో నేను బాబా గురించి విన్నాను. కానీ నాకు ఆయన పట్ల అంతగా భక్తి కానీ, నమ్మకం కానీ నాకు కలగలేదు. అలాగని అపనమ్మకం కూడా లేదు. 1993వ సంవత్సరంలో మా అక్క అనారోగ్యం పాలైంది. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, చిన్న మ్రొక్కు మొక్కుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి ఆ సమస్య నుండి మా అక్క బయటపడింది. నేను బాబాకు నా మ్రొక్కు ముక్కు చెల్లించుకున్నాను కానీ, అప్పుడు కూడా ఆయన పట్ల పెద్దగా మనసులో భక్తి కలగలేదు. తర్వాత 1996లో నేను, నా భర్త వేరే రాష్ట్రంలో కొత్తగా కాపురం పెట్టడానికి సామాను అంతా తీసుకొని ట్రైన్లో వెళ్ళాము. ట్రైన్ దిగి ఆటో ఎక్కి ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఆటోడ్రైవరుతో బాగా పెద్ద గొడవ అయింది. నాకు గొడవలు అంటే చాలా చాలా భయం. విపరీతంగా భయపడిపోయాను. ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఆటోలో ఉన్న బాబా ఫోటో నా కంటపడింది. వెంటనే, "ఏ గొడవా లేకుండా ఇంటికి చేర్చమ"ని బాబాను ప్రార్థించాను. అంతే! అప్పటివరకు గొడవపడిన ఆటోడ్రైవర్ చాలా ప్రశాంతంగా మమ్మల్ని ఇంటి దగ్గర దింపేశాడు. ఇదంతా బాబా దయ అని నేను గ్రహించాను. అది మొదలు నా ప్రతి సమస్యలోనూ నేను బాబానే నమ్ముకున్నాను. ఆయన ఏ రోజూ నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అడుగడుగునా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతూనే ఉన్నారు. సాయితండ్రి దయవల్ల మేము కనీసం 15 సార్లు శిరిడీ వెళ్లొచ్చాం. "నా మీద ఇంతటి అనుగ్రహం చూపించినందుకు ధన్యవాదాలు బాబా".
2005వ సంవత్సరంలో మా కుటుంబం, అమ్మవాళ్ళ కుటుంబం, అక్కవాళ్ళ కుటుంబం, అన్నవాళ్ళ కుటుంబం కలిసి హరిద్వార్, ఋషికేష్, మరికొన్ని ప్రదేశాలు సందర్శించి వస్తుంటే, మేము ప్రయాణిస్తున్న బస్సుకి పెద్ద ప్రమాదం జరగబోయింది(అదే జరిగి ఉంటే మొత్తం కుటుంబంలో ఎవరమూ మిగిలేవాళ్ళం కాదు). అంతా తెలుస్తూనే ఉన్నా నాకు ఏ మాత్రం టెన్షన్ కానీ, భయం కానీ అనిపించలేదు. ఒకసారి 'ఓం సాయిరాం' అని మనస్ఫూర్తిగా బాబాని స్మరించుకున్నాను. ఆశ్చర్యం! ఎంతో వేగంగా వస్తున్న మా బస్సు పక్కనే ఉన్న సుమారు 67 అడుగుల లోయలో పడిపోకుండా చిన్న మైలురాయిని ఢీకొట్టి ఆగిపోయింది. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయమైనప్పటికీ బాబా దయతలిస్తే ఏదీ అసాధ్యం కాదు.
ప్రస్తుతం విదేశాలలో ఉన్న మా పాపకి చదువు అవ్వగానే ఉద్యోగం రాలేదు. మంచి మంచి ఉద్యోగాలు చాలా దగ్గరవరకు వచ్చి తప్పిపోతుండేవి. నేను ఎన్నో రకాలుగా బాబాను ప్రార్థించాను. అయినా ఉద్యోగం రావడానికి చాలా సమయం పట్టింది. అయినా బాబా మీద నాకున్న నమ్మకం రోజురోజుకి పెరిగిందే తప్ప తగ్గలేదు, నిరాశపడలేదు. సాయినాథుని దయవల్ల ఉద్యోగం లేకపోయినప్పటికీ నా బిడ్డ ఏ ఇబ్బందీ పడలేదు. అంతా బాబా దయ. ఆయన కొన్ని నెలల తర్వాత మా పాపకు ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదించారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబా లీలలు ఎన్నో ఎన్నెన్నో. "ధన్యవాదాలు బాబా. ప్రస్తుతం నా కోరిక ఏమిటో మీకు తెలుసు బాబా. అతి త్వరలోనే అది నెరవేరేటట్లు అనుభవించు తండ్రీ".
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః
సమస్యలేమీ లేకుండా అనుగ్రహించిన బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ బ్లాగుని చదువుతున్న భక్త కోటికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కళ్యాణి. నేను చిన్నప్పటి నుంచి ఆ సాయి(మాత) భక్తురాలిని. 2025, డిసెంబర్ నెలలో మా తాతయ్య భగవాన్ శ్రీసాయిబాబాలో ఐక్యమయ్యారు. వారి అస్థికలు గంగలో కలపడానికి కాశీ ప్రయాణం అనుకున్నాము. అది నా నెలసరి సమయం కావడం వల్ల నేను చాలా భయపడి, "బాబా! ఎటువంటి ఇబ్బంది లేకుండా తాతయ్య కార్యక్రమాలు, కాశీలో దర్శనాలు అన్ని మంచిగా జరగాల"ని బాబాని వేడుకున్నాను. సాయిమాత నా కోరిక నెరవేర్చారు. ఏటువంటి ఇబ్బంది లేకుండా అంతా మంచిగా జరిగి మేము మా ఊరు తిరిగి వచ్చాము. కానీ కాశీ నుంచి వచ్చిన రోజే మా నాన్నకి ఆరోగ్యపరంగా అసౌకర్యంగా అనిపించి హాస్పిటల్‌కి వెళితే, అక్కడ వాళ్ళు యాంజియోగ్రామ్ చేయించుకోమన్నారు . అయితే ఆరోజు అమావాస్య కావడంవల్ల మా నాన్న మర్నాడు చేయించుకుంటానని ఇంటికి వచ్చేసారు. నేను, "నాన్న హార్ట్‌లో ఎటువంటి సమస్య లేకుండా చూడమ"ని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల మర్నాడు యాంజియోగ్రామ్ చేయించుకుంటే, 'అంత నార్మల్‌గా ఉందని, సమస్య ఏమీ లేదని' వచ్చింది. "ధన్యవాదాలు స్వామి".

Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏
ReplyDeleteOm sai ram tandri, enno sarlu na samasyalani teercharu e saari kuda na samasyalani teerchi na anbuhavanni ikkada andaritho panchukune avakasanni ivvandi tandri. Andarni kshamam ga arogyam ga chusukondi baba pls.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram 🙏🙏
ReplyDelete