ఈ భాగంలో అనుభవాలు:
1. గురుదేవులు బాబా అనుగ్రహం
2. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా సహాయం చేస్తారు బాబా
గురుదేవులు బాబా అనుగ్రహం
నేను ఒక సాయి భక్తుడిని. నేను ఉండేది అమెరికాలో. 2025లో నేను పని చేస్తున్న కంపెనీ తరఫున ఒక కంప్యూటర్ వర్క్ షాపుకి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఒక వోచర్ ఇచ్చారు. ఆ వోచర్ కంప్యూటర్ సర్టిఫికేషన్ పరీక్ష వ్రాయడానికి పనికొస్తుంది. మామూలుగా అయితే ఆ పరీక్ష వ్రాయడానికి 400 డాలర్ల ఫీజు కట్టాలి. అయితే అనేక కారణాల వల్ల ఆ వోచర్ని వెంటనే వాడడం నాకు కుదరలేదు. ఆలా సంవత్సరం గడిచిపోయింది. 2026, మార్చి 14 దాటితే ఆ వోచర్ ఇంక పనికి రాదు. అందువల్ల 2025, డిసెంబర్ నెలలో ఒక గురువారంనాడు మార్చ్ 12న కంప్యూటర్ సెక్యూరిటీ(సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్) పరీక్ష వ్రాయడం కోసం టెస్టింగ్ సెంటర్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను. కానీ అనేక కారణాల వల్ల చదువు మాత్రం అంత సరిగా సాగలేదు. తూతూమంత్రంగా ఏదో చదివాను. దానికి తోడు మార్చి నెల మొదటివారంలో నా నడుము పట్టేసి నడవడం, పడుకోవడం అతి కష్టమైంది. డాక్టర్ దగ్గరకి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది రెండు, మూడు రోజుల్లో కుదిరేది కాదు. ఆ నడుము నొప్పి వల్ల నాలుగు రోజులు అసలు చదివిందే లేదు. దాంతో ఈ పరీక్ష ఇంక నేను పాసైనట్టే అనుకున్నాను. టెస్టింగ్ సెంటర్ వాళ్ళకి, ఆ వోచర్ ఇచ్చినవాళ్ళకి వరసగా ఫోన్లు చేసి, మెయిల్ పంపించి పరీక్ష వాయిదా వేయించే ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళు ఆ వోచర్ గడువు పొడిగించమని ఖరాఖండీగా చెప్పారు. కాళ్లు, చేతులు ఆడని స్థితిలో బాబాని, "మీరు సహాయం చేయకపోతే నేను పాసవ్వలేను. పాస్ మార్కుకి పైన అర మార్కు కూడా అక్కరలేదు. దయచేసి నాకు సహాయం చేయండి. పరీక్ష పోతే డబ్బుల మాట అటుంచి పరువుపోతుంది ముందు" అని అడిగాను. 2026, మార్చి 12న నడుముకు బెల్ట్ కట్టుకొని నొప్పితో కూర్చుని చేతనైనంతలో పరీక్ష వ్రాసాను. బాబా దయవల్ల పాసయ్యాను. స్కోర్ 84% అని వచ్చింది. వింత ఏమిటంటే, ప్రాక్టీస్ టెస్టుల్లో 60, 70 శాతమే వస్తే, నిజమైన పరీక్షలో 80 పైన వచ్చింది! కూర్చున్న చోటనే బాబాకి అనేకానేక ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఎలా పాస్ అయ్యాననేది నేను ఇప్పటికీ చెప్పలేను. ఇప్పటికీ నా ఒంటిని గిల్లి చూసుకుంటున్నాను. ఇది గురుదేవులు బాబా అనుగ్రహం అని చెప్పడం తప్ప మరో మాట లేదు.
మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా సహాయం చేస్తారు బాబా
సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గంగాధర. నేను శ్రీ శిరిడీ సాయిబాబా కృపకు పాత్రుడిని. నన్ను నేను 'భక్తుడి'ని అనడం కంటే 'బాబా కుమారుడి'ని అనడం నాకు ఎంతో సముచితం అనిపిస్తుంది. నా చిన్నతనంలోనే నా తండ్రి పరమపదించారు. ఆ సమయంలో నా జీవితం ఎంతో ఒంటరితనంతో నిండిపోయింది. 'నాకూ నాన్న ఉంటే బాగుండేది!' అన్న బాధ నా హృదయంలో ఎప్పుడూ ఉంటుండేది. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక స్నేహితుడి ద్వారా నాకు బాబా పరిచయమయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు మా కుటుంబంలో అందరికీ బాబానే తండ్రి, తల్లి, గురువు, దైవం అన్నీ అయ్యారు. నిజంగా నా తండ్రి ఉన్నా కూడా ఇంతగా చూసుకునేవారు కాదేమో! అనేంతగా నా బాబా నన్ను, నా కుటుంబాన్ని చూసుకుంటున్నారు. ఇక నా అనుభవానికి వస్తే..
ఒక మంచి కంపెనీలో పని చేస్తున్న నేను పని ఎంతైనా చేస్తాను కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ విషయంలో బలహీనుడిని. 2026, మార్చి 26న మా సీనియర్ సార్ సెలవు మీద వెళ్లాల్సి రావడంతో ఆయన పని నాకు అప్పగించారు. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే- పాన్ ఇండియా వీడియో కాన్ఫరెన్స్లో అన్ని రాష్ట్రాల ముందు నేను ప్రెజంటేషన్ ఇవ్వాలని. ఇది విన్న వెంటనే నాకు చాలా భయమేసింది. ఆ సమయంలో బాబా భక్తుల అనుభవాలు చదువుతున్న నేను మనసులో, “బాబా! ఈ సమస్య నుంచి నన్ను రక్షించండి. ఈరోజు ప్రెజంటేషన్ నుంచి బయటపడేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహం కొద్ది నిమిషాల్లోనే ఆ సార్ నుంచి ఫోన్ కాల్ రూపంలో వచ్చింది. “ఈరోజు నేనే ప్రెజంట్ చేస్తాను” అని సార్ చెప్పారు. అంతే! నా టెన్షన్ మొత్తం పోయింది. నా మనసులో ఒకే మాట - “ధన్యవాదాలు బాబా". ఈ అనుభవం ద్వారా బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా సహాయం చేస్తారు, సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబాకు సమానమని, మనం కృతజ్ఞత కలిగి ఉండటం చాలా ముఖ్యమైన నేను తెలుసుకున్నాను. "బాబా! మీ దయతో నాకు మంచి స్కిల్స్ రావాలి. మీరు తప్పకుండా నెరవేర్చుతారని నమ్ముతున్నాను".
సాయి స్మరణం సంకట హరణం
బాబా శరణం భవ భయ హరణం

Omsainadhayanamaha
ReplyDeleteom Sai Ram
ReplyDeleteOm sai ram tandri, na manasuki nachakunda yedi jaragakunda chudandi pls, naaku edi agipovali ani undi vaalle no cheppali ani korukuntunna, ofce lo intlo anni situations bagunde la chayandi baba pls, amma nannalani nannu andarni kshamam ga arogyam ga chusukondi baba pls.
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sai sri sai jai jai sai
ReplyDeleteOm sri sainadaya namaha 🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me