సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2078వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. గురుదేవులు బాబా అనుగ్రహం
2. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా సహాయం చేస్తారు బాబా


మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా సహాయం చేస్తారు బాబా

సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గంగాధర. నేను శ్రీ శిరిడీ సాయిబాబా కృపకు పాత్రుడిని. నన్ను నేను 'భక్తుడి'ని అనడం కంటే 'బాబా కుమారుడి'ని అనడం నాకు ఎంతో సముచితం అనిపిస్తుంది. నా చిన్నతనంలోనే నా తండ్రి పరమపదించారు. ఆ సమయంలో నా జీవితం ఎంతో ఒంటరితనంతో నిండిపోయింది. 'నాకూ నాన్న ఉంటే బాగుండేది!' అన్న బాధ నా హృదయంలో ఎప్పుడూ ఉంటుండేది. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక స్నేహితుడి ద్వారా నాకు బాబా పరిచయమయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు మా కుటుంబంలో అందరికీ బాబానే తండ్రి, తల్లి, గురువు, దైవం అన్నీ అయ్యారు. నిజంగా నా తండ్రి ఉన్నా కూడా ఇంతగా చూసుకునేవారు కాదేమో! అనేంతగా నా బాబా నన్ను, నా కుటుంబాన్ని చూసుకుంటున్నారు. ఇక నా అనుభవానికి వస్తే..

ఒక మంచి కంపెనీలో పని చేస్తున్న నేను పని ఎంతైనా చేస్తాను కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ విషయంలో బలహీనుడిని. 2026, మార్చి 26న మా సీనియర్ సార్ సెలవు మీద వెళ్లాల్సి రావడంతో ఆయన పని నాకు అప్పగించారు. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే- పాన్ ఇండియా వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని రాష్ట్రాల ముందు నేను ప్రెజంటేషన్ ఇవ్వాలని. ఇది విన్న వెంటనే నాకు చాలా భయమేసింది. ఆ సమయంలో బాబా భక్తుల అనుభవాలు చదువుతున్న నేను మనసులో, “బాబా! ఈ సమస్య నుంచి నన్ను రక్షించండి. ఈరోజు ప్రెజంటేషన్ నుంచి బయటపడేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహం కొద్ది నిమిషాల్లోనే ఆ సార్ నుంచి ఫోన్ కాల్ రూపంలో వచ్చింది. “ఈరోజు నేనే ప్రెజంట్ చేస్తాను” అని సార్ చెప్పారు. అంతే! నా టెన్షన్ మొత్తం పోయింది. నా మనసులో ఒకే మాట - “ధన్యవాదాలు బాబా". ఈ అనుభవం ద్వారా బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా సహాయం చేస్తారు, సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబాకు సమానమని, మనం కృతజ్ఞత కలిగి ఉండటం చాలా ముఖ్యమైన నేను తెలుసుకున్నాను. "బాబా! మీ దయతో నాకు మంచి స్కిల్స్ రావాలి. మీరు తప్పకుండా నెరవేర్చుతారని నమ్ముతున్నాను".

సాయి స్మరణం సంకట హరణం
బాబా శరణం భవ భయ హరణం

9 comments:

  1. Omsainadhayanamaha

    ReplyDelete
  2. Om sai ram tandri, na manasuki nachakunda yedi jaragakunda chudandi pls, naaku edi agipovali ani undi vaalle no cheppali ani korukuntunna, ofce lo intlo anni situations bagunde la chayandi baba pls, amma nannalani nannu andarni kshamam ga arogyam ga chusukondi baba pls.

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete
  5. Om sai sri sai jai jai sai

    ReplyDelete
  6. Om sri sainadaya namaha 🙏🙏🙏

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo