ఈ భాగంలో అనుభవాలు:
1. చెప్పుకొని నిష్ఠ-సబూరీలతో ఉంటే సమస్యల నుండి తప్పక బయటపడేస్తారు బాబా
2. ప్రార్థించిన కొద్దిసేపటికే కృపను చూపిన బాబా
చెప్పుకొని నిష్ఠ-సబూరీలతో ఉంటే సమస్యల నుండి తప్పక బయటపడేస్తారు బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. ముందుగా సాయి బంధువులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు గోపి. నేను 2025, జూలై మాసంలో ఒక పెద్ద అనారోగ్యంతో కొన్నిరోజులపాటు ఆసుపత్రిలో ఉన్నాను. ఆ సమయంలో రాత్రీపగలూ నిద్రపట్టక రకరకాల ఆలోచనలతో 'నేను తిరిగి ఇంటికి వెళతానో, లేదో' అని భయపడుతూ ఉండేవాడిని. బాబాను తలుచుకొని 'ఓం శ్రీ సాయినాథాయ నమః' అని మనసులో జపిస్తూ బాబా మీద పూర్తి నమ్మకంతో ఊదీ నుదుటన పెట్టుకుని, చిటికెడు ఊదీ నీళ్ళలో వేసుకుని తాగుతూ, ఊదీ ప్యాకెట్ తలగడ క్రింద ఉంచుకొని పడుకుంటూ, "బాబా! నేను త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి చేరుకోవాలి" అని వేడుకొనేవాడిని. దాంతో నాకు ధైర్యంగా ఉండి చక్కగా నిద్ర కూడా పట్టేది. బాబా దయవల్ల త్వరలోనే కోలుకొని పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను. "ధన్యవాదాలు బాబా".
ఒక గురువారం నేను బాబా గుడికి వెళ్లి, తిరిగి వస్తుంటే నా కారులో ఒక రెడ్ కలర్ ఎర్రర్ ఇండికేషన్ రావడం గమనించాను. మర్నాడు కారు తీసుకొని షోరూంకి వెళ్తే, వాళ్ళు చూసి "నాలుగు లక్షల దాకా ఖర్చు అవుతుంద"ని చెప్పారు. తర్వాత నేను వేరే మెకానిక్ దగ్గరకి కారు తీసుకొని వెళ్తే, "సమస్య ఒక్కసారిగా పరిష్కారం కావాలంటే, మొత్తం సెట్ మార్చాలి. దానికి రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు అవుతుంది. అలా కాకుండా అంచెలంచెలుగా రిపేర్ చేస్తే, ఖర్చు ముప్పైవేల నుంచి రెండున్నర లక్షల వరకు అవుతుంది. కాకపోతే అందుకోసం మీరు చాలాసార్లు రావలసి ఉంటుంది. కానీ ఏ స్థాయిలో సమస్య పరిష్కారమైతే అక్కడవరకు మాత్రమే డబ్బులు తీసుకుంటాను" అన్నారు. నేను సరేనని చెప్తే, అతను మొదటి స్థాయి మరమ్మత్తు చేసి ముప్పై వేల రూపాయలు తీసుకుని "సమస్య మళ్ళీ రాకపోతే సరే, లేదంటే మళ్ళీ తీసుకురండి" అని చెప్పారు. కొన్నిరోజులకి అదే సమస్య మళ్ళీ మొదలవడంతో నేను వీలు చూసుకుని మళ్ళీ మెకానిక్ దగ్గరకి వెళదామనుకున్నాను. ఇంతలో గురువారం వచ్చింది. ఆరోజు సాయంత్రం బాబా గుడికి కారులో వెళ్తూ, "బాబా! తిరిగి ఇంటికి వచ్చేసరికి ఈ సమస్య ఉండకుండా చూడండి" అని మనసారా బాబాను వేడుకున్నాను. తర్వాత గుడికి చేరుకొని బాబా దర్శనం చేసుకుని ఆయనపై పూర్తి నమ్మకంతో తిరుగు ప్రయాణమయ్యాను. మొదట గమనించలేదు కానీ, కొంత దూరం వచ్చాక చూస్తే ఆ రెడ్ కలర్ ఎర్రర్ సింబల్ లేదు. ఇది జరిగి ఇప్పటికి దాదాపు సంవత్సరమవుతుంది. ఆ సమస్య మళ్ళీ రాలేదు. కొన్నిసార్లు మనకి తెలియకుండానే బాబా మీద మన నమ్మకం, భక్తి సన్నగిల్లుతాయి. అలాంటి సమయంలో బాబా మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి పెట్టిన పరీక్ష ఇది అని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా! నేను తెలుసో, తెలియకో ఏవైనా తప్పులు చేసుంటే క్షమించి నా చేయి పట్టుకొని సరైన మార్గంలో నడిపించండి బాబా".
ఒకరోజు నా పర్సులో ఉండాల్సిన క్రెడిట్ కార్డ్ కనపడలేదు. పర్స్ మొత్తం, ఇంకా కారులో, ఇంట్లో ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. ఎంత ఆలోచించినా ఎక్కడైనా పెట్టినట్లు గుర్తు రాలేదు. నా భార్య కూడా ఇంట్లో అంతా వెతికినప్పటికీ దొరకలేదు. అప్పుడు నేను మనసులో, "బాబా! కార్డు దొరికేలా అనుగ్రహించండి" అని అనుకున్నాను. నేను అలా అనుకోగానే నా భార్య, "ఒకసారి మీ పర్సు ఇలా ఇవ్వండి. నేను చూస్తాను" అని తీసుకొని నా ముందే చూస్తుంటే, అప్పటివరకూ ఎంత వెతికినా దొరకని అదే పర్సులో కార్డు దొరికింది. నేను ఆశ్చర్యపోయాను. బాబాను తలుచుకొని, ఆయన మీద నమ్మకముంచి మళ్ళీ వెతికితే దొరకడం బాబా మనతోనే ఉన్నారనేదానికి నిదర్శనం. బాబా మీద ఎంత ధృడ విశ్వాసంతో ఉంటే ఆయన మనకు అంత దగ్గరగా వుండి మన కోరికలు తీరుస్తారని, మన సమస్యలకు పరిష్కారం చూపుతారని నా గట్టి నమ్మకం. "ధన్యవాదాలు బాబా. నా అనుభవాలను ఈ బ్లాగులో ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి. మీ బిడ్డలందరి చేయి పట్టుకొని సరైన మార్గంలో ముందుకు నడిపించండి బాబా".
ప్రార్థించిన కొద్దిసేపటికే కృపను చూపిన బాబా
నా పేరు ప్రీతి. అత్యంత కృతజ్ఞత, భక్తితో మన ప్రియమైన సాయిబాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని పంచుకుంటున్నాను. 2026, జనవరిలో నా కొడుకు వైరల్ జ్వరంతో బాధపడ్డాడు. మందులు తీసుకుంటున్నప్పటికీ జ్వరం కొన్నిరోజులు కొనసాగింది. ఒక తల్లిగా నేను తన ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందాను. ఆ క్లిష్ట సమయంలో నేను, "నా కొడుకు త్వరగా కోలుకోవాల"ని హృదయపూర్వకంగా సాయిబాబాను ప్రార్థించాను. నేను అలా ప్రార్థించిన కొద్దిసేపటికే బాబా కృప, దివ్య ఆశీస్సుల వలన నా కొడుకు జ్వరం తగ్గి తన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడి మళ్ళీ చురుకుగా అయ్యాడు. బాబా దయ, రక్షణ వల్లనే నా బిడ్డ త్వరగా కోలుకున్నాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. "ఎల్లప్పుడూ నా కుటుంబాన్ని కాపాడుతూ, ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు బాబా. దయచేసి ఎప్పుడూ ఇలాగే మాపై మీ కృపను కురిపిస్తూ ఉండండి".


Omsairam
ReplyDeleteOm Sri Sai Ram
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram 🙏🙏
ReplyDeleteOm sri sairam 🙏🙏
ReplyDeleteబాబా నీ దయ వలన నా జీవితంలో ఎన్నో మంచి మార్పులు వచ్చాయి. మా పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అంత బాధ్యత నీ మీద పెట్టా. నా తండ్రివి నువ్వు, నా నమ్మకాన్ని నిలబెట్టావు. అమ్మాయి ఉద్యోగం, పెళ్ళి అన్నీ సవ్యంగా చేసి మమ్మల్ని ఆనందంగా ఉంచావు. నీ ఋణం తీర్చుకోలేం. చాలా చాలా ధన్యవాదాలు. నీ నామస్మరణే దివ్య ఔషధం 🙏
ReplyDelete