సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1995వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాని నమ్మినవాళ్ళు ఎప్పుడూ చెడిపోరు
2. ఆర్తిగా వేడుకుంటే సమస్యను పరిష్కరిస్తారు బాబా


ఆర్తిగా వేడుకుంటే సమస్యను పరిష్కరిస్తారు బాబా  

ఓం శ్రీసాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. బాబాను ఆర్తిగా వేడుకుంటే ఆయన మన సమస్యను పరిష్కరిస్తారన్న దానికి నా ఈ అనుభవం ఋజువు. నా భర్త టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుని సంబంధిత కంపెనీవాళ్ళను సంప్రదిస్తే, మెడికల్ టెస్టులు చేయాలన్నారు. మావారికి షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ అది ఎప్పుడూ అదుపులోనే ఉంటుంది కాబట్టి నేను టెస్టులంటే భయపడలేదు. కానీ వాళ్ళు చేయించిన టెస్టుల్లో షుగర్ చాలా ఎక్కువ ఉన్నట్లు వచ్చింది. అప్పుడు నేను, "ఇదేంటి బాబా, ఇలా వచ్చింది?" అని చాలా బాధపడ్డాను. నా భర్త, "సరే, ఇంకో కంపెనీకి అప్లై చేసి చూద్దాం. దాంట్లో కూడా ఇలానే వస్తే ఆలోచిద్దాం" అని అన్నారు. ఆ కంపెనీవాళ్ళు టెస్టులు చేసాక నేను రిపోర్టులు వచ్చేవరకు కూడా భయంతో బాబాని, "రిపోర్టులు నార్మల్‌గా రావాలి బాబా" అని ప్రార్థిస్తూ గడిపాను. బాబా అద్భుతం చూపించారు. ముందు కంపెనీ రిపోర్టులకి తర్వాత వాటికి అసలు ఎక్కడా పొంతన లేదు. రిపోర్టులు నార్మల్ వచ్చాయి. ప్రీమియం తగ్గకపోయినప్పటికీ రిపోర్టులు నార్మల్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. "ధన్యవాదాలు బాబా. నా భర్తకు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలున్నాయి. వాటిని నయం చేసి తను ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా. నాకున్న కష్టాన్ని త్వరగా తీర్చండి సాయి".

సర్వం శ్రీసాయినాథార్ఫణమస్తు.

10 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  3. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  4. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🙏🙏

    ReplyDelete
  6. Om sai ram 🙏🏻

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  8. ఓం సాయిరామ్

    ReplyDelete
  9. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl house rent ki ippinchu thandri pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo