సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1994వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎంతని చెప్పేది బాబా కరుణ!
2. బాబా కృప

ఎంతని చెప్పేది బాబా కరుణ!

సాయిదేవుడికి, సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు రమాదేవి. నేనిప్పుడు 2025, మార్చి, ఏప్రిల్, మే నెలలలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నిన్న పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. మా ఆఫీసులో 2025, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఆహ్వానానికి సంబంధించి అందరికీ ఈమెయిల్ వచ్చినా నాకు రాలేదు. మెయిల్ పంపడంలో పొరపాటు జరిగిందా, లేక ఇంకేమైనా జరిగిందో నాకు తెలియలేదు. ఇమెయిల్ రాకుండా వెళ్ళడానికి లేదు. అందరూ 'వస్తున్నావా?' అని అడుగుతుంటే, ఏం చెప్పాలో అర్థంకాక నాకు అవమానకరంగా అనిపించి, "ఏంటి బాబా ఇది?" అని బాధపడ్డాను. కానీ ఫంక్షన్ రోజు ఉదయం మా హెడ్ స్వయంగా నా దగ్గరకొచ్చి, "వెళ్దాం రా" అని నన్ను తీసుకొని వెళ్ళింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇది బాబా మిరాకిల్ తప్ప వేరొకటి కాదు. ఆయన మన విలువ ఎక్కడా తగ్గనివ్వరు. మనస్పూర్తిగా నమస్కారాలు బాబా.

నాకు ఒక సంవత్సరం నుండి టెలిగ్రామ్‌లో గేమ్స్ ఆడటం అలవాటు అయింది. ఎంతగా అంటే, ఒక వ్యసనంలా. ప్రతి 5 నిమిషాలకు ఓపెన్ చేసి గంటలు గంటలు టైమ్ టెలిగ్రామ్ యాప్ ఉపయోగిస్తూ చాలా సమయం వృధా చేసుకుంటుండేదాన్ని కళ్ళు కూడా నొప్పి పెట్టేవి. ఆ ఆ;అలవాటు మానుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా నన్ను నేను మార్చుకోలేకపోయాను. చివరికి ఒకసారి బాబాని, "ఈ అలవాటు మానుకోనేలా చేయండి" అని వేడుకున్నాను. తరువాత ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్నెట్‌లో ఈ బుక్స్ చదివే వ్యాపకం నాకు ఏర్పడింది. దాంతో టెలిగ్రామ్ మీద ధ్యాస పూర్తిగా పోయింది. ఇకపోతే, ఫోన్‌లో చదవడం వల్ల కళ్ళకు ఎఫెక్ట్ ఉంటుందని తొందరలోనే అది కూడా మానేశాను. ఇదంతా బాబా దయనే. మన వల్ల కాదన్నపుడు బాబాకి చెప్పుకుంటే ఆయన దారి చూపెడతారు. "థాంక్స్ బాబా".

ఒకరోజు కారులో చూస్తే, కారు పేపర్లు కనిపించలేదు. అప్పుడు నేను, '15 రోజుల క్రితం వాటిని దేనికోసమో తీసిన గుర్తుంది. కానీ తర్వాత కారులో కాకుండా వాటిని ఎక్కడ పెట్టానో!' అని అనుకున్నాను. ఆ సమయంలో నేను ఆఫీసులో ఉన్నందువల్ల, "బాబా! ఇంటికి వెళ్ళే దారిలో ట్రాఫిక్‌వాళ్ళు ఆ పేపర్లు అడగకుండా చూడండి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల ఎవరూ వాటిని అడగలేదు. ఇంటికి వెళ్ళాక మా బాబుని అడిగితే, కారులో నేను పెట్టే చోట కాకుండా వేరే చోట నుండి వాటిని తీసి ఇచ్చాడు. "థాంక్యూ సో మచ్ బాబా".

ఒకరోజు కారు రివర్స్ చేసేటప్పుడు ముందు బంపర్ వెళ్ళి పక్కింటివాళ్ళ ర్యాంపుకి తగిలి బంపర్ డ్యామేజ్ అయి, కారుకి కూడా కొద్దిగా గీతలు పడ్డాయి. దాంతో, 'ఇప్పుడు బంపర్ మార్చక తప్పదు. 2,500 లేదా 3,000 రూపాయలు అవుతాయి' అనుకున్నాను. మరుసటిరోజు బాబా దగ్గరకి వెళ్ళి, "బాబా! తక్కువ ఖర్చు అయ్యేటట్టు చూడండి" అని వేడుకున్నాను. తర్వాత మెకానిక్ దగ్గరకి వెళ్తే, "బంపర్ బాగానే ఉంది" అని టేప్, రెండు స్క్రూలు వేసి సెట్ చేసి కేవలం 200 రూపాయలు తీసుకున్నాడు. నాకు నిజంగా ఆశ్చర్యమనిపించింది. ఎందుకంటే, కారు తీసుకెళితే కనీసం 1000 రూపాయలు తీసుకుంటారు. ఇది బాబా కరుణ. "థాంక్స్ బాబా".

ఒకసారి కేవైసీ అప్డేట్ లేకపోవడం వలన నా క్రెడిట్ కార్డు బ్లాక్ అయింది. కస్టమర్ కేర్ వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నిస్తే, ఫోన్ కలవలేదు. అలా నేను రెండు వారాలు కార్డు ఉపయోగించలేక ఇబ్బందిపడి, "ఎలాగైనా ఈ సమస్య పరిష్కారమయ్యేలా చేయండి" అని బాబాని వేడుకున్నాను. అప్పుడు కస్టమర్ కేర్ ఫోన్ కలిసింది. ఒక వ్యక్తి నేనున్న చోటికే వచ్చి డాక్యూమెంట్ వెరిఫై చేసి వెళ్లడంతో కార్డ్ యాక్టివేట్ అయింది. "మీరు చూపే ప్రేమకు నేను ఏం.ఇవ్వగలను బాబా? అనంతకోటి నమస్కారాలు బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo