ఈ భాగంలో అనుభవాలు:
1. తమని తలుచుకుంటే కానిది లేదని నిరూపించిన బాబా
2. ఊదీతో జ్వరం తగ్గుముఖం
3. దయచూపిన బాబా
తమని తలుచుకుంటే కానిది లేదని నిరూపించిన బాబా
నా పేరు తన్వి. నేను నా చిన్నతనం నుండి బాబా భక్తురాలిని. ఆయన నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఏవో తెలియని కారణాల వల్ల నా పెళ్లి చాలా ఆలస్యమైంది. చాలా సంబంధాలు చూసారు కానీ, ఏ సంబంధమూ కుదరలేదు. నేను స్నేహితుల సలహామేరకు 'నవగురువార వ్రతం' రెండు సార్లు చేసాను. బాబా దయవల్ల వ్రతం చేసిన సంవత్సరం తర్వాత నేను కోరుకున్న గుణగణాలున్న అబ్బాయితో నాకు వివాహం అయింది. బాబాని తలుచుకుంటే కానిది లేదని ఆయన నా విషయంలో నిరూపించారు.
ఒకరోజు రాత్రి నా కంట్లో నలక పడిపోయింది. నేను ఉదయానికి తగ్గుతుందిలే అని బాబాని తలుచుకుంటూ పడుకున్నాను. కానీ తగ్గలేదు. సరికదా కన్ను ఎర్రగా అయి ధారగా కంటి నుండి నీరు కారింది. మా నాన్న, "ఇక తగ్గేలాలేదు. హాస్పిటల్కి వెళదాం" అన్నారు. నేను కూడా హాస్పిటల్కి వెళ్లాలని తయారవుతూ, "ఏం బాధ సాయి? హాస్పిటల్ చాలా దూరం. ఇంత ఎండలో నేను వెళ్ళలేను. కానీ ఈ కన్నుతో అస్సలు చూడలేకపోతున్నాను. ఎలా అయిన నలక తొలగేలా చేయండి. అలా చేస్తే నా అనుభవాన్ని సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. అలా మ్రొక్కుకొని బైక్ ఎక్కుదామని బయటకి వెళ్లేసరికి అత్యంత ఆశ్చర్యకరంగా నా కంట్లో నలక తొలగిపోయేలా చేసారు నా సాయి. సాయి గురించి ఎంత చెప్పినా అది తక్కువే, మాటలు సరిపోవు. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. మీ ఋణం తీర్చుకోలేనిది. నా పెళ్లి ఆలస్యమైంది. కనీసం సంతానాన్ని అయినా త్వరగా ప్రసాదించు సాయి. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ వుండేలా చూడు సాయి".
ఊదీతో జ్వరం తగ్గుముఖం
సాయినాథ్ మహరాజ్ కి జై. నా పేరు రమాదేవి. నాకు అన్ని బాబానే. నేను ఏ విషయమైనా బాబాకే చెప్పుకుంటాను. ఆయన దయవల్ల నా జీవితంలో నేను కోరుకున్నవన్నీ జరిగాయి. ఇప్పుడు ఒక అనుభవం పంచుకుంటున్నాను. ఇది మీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ, నాకు పెద్ద విషయమే. మా 4ఏళ్ళ పాపకి నెలకి ఒకసారి జ్వరం వస్తుంటుంది. అలాగే ఈసారి జ్వరమొస్తే, నేను పాపకి బాబా ఊదీ పెట్టి, మరికొంత ఊదీ నీళ్లలో కలిపి తాగించాను. బాబా దయవల్ల జ్వరం తగ్గింది. బాబా అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాననుకున్నాను కానీ, చిన్న విషయం ఎందుకులే అనుకున్నాను. అయితే పాపకి మళ్ళీ జ్వరం వచ్చింది. అప్పుడు బాబాకి క్షమాపణలు చెప్పుకొని, మళ్ళీ ఊదీ పెడితే జ్వరం తగ్గింది. "ధన్యవాదాలు సాయినాథా! ఎప్పుడూ మమ్మల్ని రక్షిస్తూ ఉండు తండ్రీ".
దయచూపిన బాబా
నా పేరు తేజశ్రీ. మేము బెల్జియంలో ఉంటున్నాము. ఇక్కడ ఉద్యోగం రావాలంటే ఫ్రెంచ్ భాష రావాలి. అందుకని నేను ఫ్రెంచ్ భాష నేర్చుకున్నాను. ఆ భాష, పరీక్ష కొంచెం కష్టంగానే ఉంటాయి. అందువల్ల నేను, "ఈ పరీక్షలో పాసయ్యేలా చేయమ"ని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల నేను ఆ పరీక్షలో 70% మార్కులతో పాసయ్యాను. "చాలా ధన్యవాదాలు సాయి".
మాకు ఇద్దరు పిల్లలు. మా రెండో బాబుకి బెల్జియంలో ఐడీ కార్డు రావడానికి చాలా కష్టమైంది, చాలా ఇబ్బందులు వచ్చాయి. మేము బాబుకి కార్డు వస్తుందో, రాదో అనుకున్నాను. అప్పుడు నేను "బాబా! మీ దయవల్ల బాబుకి కార్డు రావాలి" అని బాబాకి చెప్పుకున్నాను. తరువాత కొంత సమయం పట్టి ఎన్నో సమస్యలు, చర్చల ఎదురైనా చివరికి బాబా దయ వల్ల 2025, మే 23న కార్డు వచ్చింది. "మమ్మల్ని అన్ని విధాలా రక్షిస్తున్నందుకు ధన్యవాదాలు సాయి. మేము ఎప్పుడూ మీకు ఋణపడి ఉంటాము".
Baba's please rakshana ichi kapadu Sai.please give peace and happiness to me.i. am feeling fear and depression.please Baba save me tandri. Om Sai Ram
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl house rent ki ippinchu thandri pl
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBab, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members 🙏🙏💐💐
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏