ఈ భాగంలో అనుభవాలు:
1. బాబాని నమ్మినవాళ్ళు ఎప్పుడూ చెడిపోరు
2. ఆర్తిగా వేడుకుంటే సమస్యను పరిష్కరిస్తారు బాబా
బాబాని నమ్మినవాళ్ళు ఎప్పుడూ చెడిపోరు
సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు జ్యోతిర్మయి. మాది నెల్లూరు. నా ఈ అనుభవం ఎలా చెప్పాలో అర్ధం కావటం లేదు. కానీ ప్రతి చిన్న విషయానికీ బాబా స్పందిస్తారని చెప్పడానికి నేను నా అనుభవం చెప్తున్నాను. దయచేసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు. మేము ప్రతి సంవత్సరం మే, 21కి శిరిడీ వెళ్తాము. అలాగే ఈ సంవత్సరం వెళ్ళడానికి 2 నెలల ముందు టికెట్లు బుక్ చేసుకున్నాము. నాకు ప్రతినెలా 12వ తేదీకి నెలసరి సమయం. ప్రతినెలా 12న రాకపోయినా 13 లేదా 14న ఖచ్చితంగా వస్తుంది. అలాంటిది ఈసారి మే 14 దాటి 15 వచ్చినా రాలేదు. నాకు టెన్షన్ పెరిగిపోయింది. ఎందుకంటే, మేము 19న ట్రైన్ ఎక్కాలి. 15న నెలసరి వస్తేనే 19కి 5వ రోజు స్నానం అవుతుంది. బాబాని ప్రార్థిస్తున్నా ఎలాంటి సమాధానం రాలేదు. మెడికల్ షాపుకి వెళ్లి నెలసరి రావడానికి టాబ్లెట్లు ఇవ్వమంటే, "అలా ఇవ్వము. డాక్టర్ దగ్గర చూపించుకొని రండి" అన్నారు. వేరే మెడికల్ షాపులో అడిగితే, "నెలసరి రావడానికి టాబ్లెట్లు ఉండవమ్మా. రాకుండా ఉండటానికి ఉన్నాయి" అన్నారు. ఇంకో షాపులో అడిగితే, వాళ్ళు కూడా అదే చెప్పారు. పైగా ఆ టాబ్లెట్లు 7 రోజులు వేసుకోవాలట, మేము శిరిడీ వెళ్ళేరోజు నుంచి వేసుకోకూడదట. నేను ఇంటికి వచ్చి, "బాబా! మీరే ఏదో ఒకటి చేయండి. నాకు 15వ తేదీనే నెలసరి రావాలి" అని బాబాకి చెప్పుకొని, పూజ చేసి ఊదీ పెట్టుకొని పడుకున్నాను. అయినా నెలసరి రాలేదు. టెన్షన్ పెరిగిపోయి బాబా మీద కోపం రాసాగింది. మనసులో, 'బాబా! గత సంవత్సరం నెలసరి రాదనే నమ్మకంతో శిరిడీ వెళ్తే క్యూలైన్లో ఉండగా వచ్చేసింది. ఈసారి కూడా నన్ను శిరిడీ రానివ్వకుండా అందరి ముందు నన్ను నవ్వులు పాలు చేస్తున్నావు బాబా. శిరిడీ రాకుండా చేయాలని అనుకున్నట్లైతే టికెట్లు బుక్ కాకుండా చేయొచ్చు కదా! అప్పుడు ఎవరూ ఏమీ అనుకోరు. కానీ ఇప్పుడు అందరూ నీవల్లే ఇలా అయిందని నన్నే అంటారు' అని బాబాని అడిగాను. కానీ ఆరోజు నెలసరి రాలేదు. 16న వస్తుందనుకుంటే ఆరోజు సాయంత్రం వరకు రాలేదు. ఇంకా నేను నా భర్తతో, సోదరునితో 'ఇదే నా చివరి శిరిడీ ప్రయాణం. నేను ఇంకా శిరిడీ వెళ్ళను. బాబాకి నేను వచ్చేది ఇష్టం లేదు" అని అన్నాను. నాకు బాబాపైన కోపం బాగా వచ్చింది. ఎందుకంటే, 15 నుండి 20 వేల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్లి, బాబాని చూడకుండా వస్తే ఎలా ఉంటుంది? నేను ఇంకా నెలసరి వస్తుందన్న ఆశ వదిలేసాను. 16వ తేదీ రాత్రి 8:30 అప్పుడు నెలసరి వచ్చినట్టు ఉంటే, చెక్ చేసుకున్నాను. కానీ రాలేదు. కడుపునొప్పిగా ఉండింది. స్ప్రైట్ తాగాను. నా భర్త వస్తుందిలే అన్నారు. రాత్రి 10 అయ్యాక మరోసారి చెక్ చేసుకున్నాను కానీ, నెలసరి రాలేదు. అప్పుడు, "బాబా! అందరికీ అన్ని ఇస్తాను అంటావు. మరి నేను ఇంతలా అడుగుతుంటే మౌనంగా ఉంటావేం బాబా. నేను నా సహనాన్ని కోల్పోతున్నాను. చూసి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు కదా అని అందరూ నన్నే అంటున్నారు" అని ఇంకా చాలా చాలా అన్నాను బాబాని. తర్వాత 11 గంటలకి నెలసరి వచ్చింది. నేను శిరిడీ చేరేలోపు 5 రోజులు పూర్తవుతాయి కాబట్టి మనసులోనే బాబాకి థాంక్స్ చెప్పుకొని, అన్ని మాటలన్నందుకు క్షమాపణలు కూడా చెప్పుకున్నాను. ఒకటి మాత్రం చెప్పగలను, 'బాబా మన సహనాన్ని పరీక్షిస్తారు. చివరికి మనం అనుకున్నదే చేస్తారు. బాబాని నమ్మినవాళ్ళు ఎప్పుడూ చెడిపోరు.
ఆర్తిగా వేడుకుంటే సమస్యను పరిష్కరిస్తారు బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. బాబాను ఆర్తిగా వేడుకుంటే ఆయన మన సమస్యను పరిష్కరిస్తారన్న దానికి నా ఈ అనుభవం ఋజువు. నా భర్త టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుని సంబంధిత కంపెనీవాళ్ళను సంప్రదిస్తే, మెడికల్ టెస్టులు చేయాలన్నారు. మావారికి షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ అది ఎప్పుడూ అదుపులోనే ఉంటుంది కాబట్టి నేను టెస్టులంటే భయపడలేదు. కానీ వాళ్ళు చేయించిన టెస్టుల్లో షుగర్ చాలా ఎక్కువ ఉన్నట్లు వచ్చింది. అప్పుడు నేను, "ఇదేంటి బాబా, ఇలా వచ్చింది?" అని చాలా బాధపడ్డాను. నా భర్త, "సరే, ఇంకో కంపెనీకి అప్లై చేసి చూద్దాం. దాంట్లో కూడా ఇలానే వస్తే ఆలోచిద్దాం" అని అన్నారు. ఆ కంపెనీవాళ్ళు టెస్టులు చేసాక నేను రిపోర్టులు వచ్చేవరకు కూడా భయంతో బాబాని, "రిపోర్టులు నార్మల్గా రావాలి బాబా" అని ప్రార్థిస్తూ గడిపాను. బాబా అద్భుతం చూపించారు. ముందు కంపెనీ రిపోర్టులకి తర్వాత వాటికి అసలు ఎక్కడా పొంతన లేదు. రిపోర్టులు నార్మల్ వచ్చాయి. ప్రీమియం తగ్గకపోయినప్పటికీ రిపోర్టులు నార్మల్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. "ధన్యవాదాలు బాబా. నా భర్తకు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలున్నాయి. వాటిని నయం చేసి తను ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా. నాకున్న కష్టాన్ని త్వరగా తీర్చండి సాయి".
సర్వం శ్రీసాయినాథార్ఫణమస్తు.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏
ReplyDeleteOm sai ram 🙏🏻
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl house rent ki ippinchu thandri pl
ReplyDeleteOm Sri Sai Ram
ReplyDelete