ఈ భాగంలో అనుభవాలు:
1. సాయినాథుని కృపాకటాక్షాలు
2. ఆపద నుండి బయటపడేసిన బాబా
సాయినాథుని కృపాకటాక్షాలు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు విజయ. మాది కాకినాడ. నా చెల్లెలి కూతురు సాయిసృజన తన భర్త, కొడుకుతో జర్మనీలో ఉంటుంది. తన కొడుకుకి 10 నెలల వయస్సు. అంత చిన్నబాబు మెడ మీద ఎడమ పక్కన వాచి గట్టిగా గడ్డలా అయింది. మొదట అది మామూలు గడ్డే తగ్గిపోతుంది అనుకున్నారు. కానీ రెండు, మూడు రోజులైన తగ్గకపోయేసరికి బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్లి చూపిస్తే, ఒక వారానికి టానిక్ వ్రాశారు. అది వాడినా ఆ గడ్డ కొంచం కూడా తగ్గలేదు. పైగా బాబు ఒళ్ళు జ్వరమొచ్చినట్లు ఉండడం, తిక్కపట్టినట్లు ఏడవడం జరిగింది. దాంతో వాళ్ళు మళ్లీ బాబుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లారు. ఈసారి బ్లడ్ టెస్ట్ చేయాలని చేసారు. అయితే బ్లడ్ టెస్ట్‌లో కూడా ఏమీ తేడా కనిపించలేదు. అప్పుడు ఆ హాస్పటల్వాళ్ళే ఇంకో పెద్ద హాస్పిటల్‌కి పంపారు. ఆ హాస్పిటల్‌వాళ్ళు కాన్సర్ గడ్డ ఏమోనన్న అనుమానం తీర్చుకోవడానికి బాబుకి మళ్ళీ అన్ని టెస్టులు చేసారు. మత్తుమందు ఇచ్చి MRI స్కాన్ కూడా చేసారు. అయినా ఏమీ లేదు, అంతా బాగానే ఉందని వచ్చింది. కానీ ఆ గడ్డ తగ్గలేదు. అప్పుడు డాక్టర్ ఆ గడ్డను కోసి తీయాలని, 2025, ఏప్రిల్ 26న గడ్డను తొలగించి, లోపల ఉన్న చీమును టెస్ట్‌కు పంపించారు. సాయినాథుని దయవల్ల ఆ టెస్ట్ రిపోర్ట్ మామూలుగానే ఉంది. వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఆ గడ్డ వచ్చినప్పటి నుంచి బాబు తల్లిదండ్రులు, మా చెల్లెలు, మేము, "అది ఎలాంటి ప్రమాదకరమైన గడ్డ కాకూడదు. బాబు క్షేమంగా ఉండాలి" అని సాయిని ఎంతగానో ప్రార్థించాము. ఆ సాయినాథుని కృపాకటాక్షాల వల్ల ఆ గడ్డ పూర్తిగా సమసిపోయి మామూలుగా అయిపోయింది. బాబు ఎప్పటిలా మామూలుగా ఆడుకుంటున్నాడు. దేశంకాని దేశంలో భార్యభర్తలిద్దరూ తమ ఉద్యోగాలు చూసుకుంటూ, చంటిబిడ్డను హాస్పిటళ్ళ చుట్టూ తిప్పడం చాలా కష్టమైన విషయం, మానసిక బాధ వర్ణనాతీతం. అలాంటి కష్ట పరిస్థితుల నుంచి కాపాడిన సాయినాధునికి అనేకానేక ధన్యవాదాలు. "మీరు ఎప్పుడూ మాతో ఉన్నారన్న ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. సదా మా వెంట ఉండి అన్ని పరిస్థితుల నుంచి.మమ్మల్ని కాపాడండి సాయి".
ఆపద నుండి బయటపడేసిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. 2024, నవంబర్ 11న మా అమ్మ, నాన్న మా అక్కతో తిరుపతి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక అనుకోకుండా నాన్న ఆరోగ్యం బాగా లేకపోవడంతో దర్శనం చేసుకోకుండానే తిరిగి వచ్చారు. హైదరాబాద్ వచ్చేసరికి నాన్న ముఖం, పాదాలు పొంగిపోయి ఉన్నాయి. వాళ్ళు మా నాన్న చెల్లెలు ఇంటికి వెళ్లి, అక్కడినుండి హాస్పిటల్‌కి వెళ్ళారు. డాక్టర్ చెక్ చేసి "కిడ్నీ సమస్య, 24 గంటలైతే కానీ ఏం చెప్పలేము" అని 4, 5 సార్లు డయాలసిస్ చేసారు. నాన్న 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాక డిశ్చార్జ్ అయి మా అక్క దగ్గరకి వెళ్ళారు. అప్పటికి ఆయనకి పూర్తిగా నయం కానందున మళ్ళీ 5 రోజులకి హాస్పిటల్లో అడ్మిట్ అయితే, క్రియాటిన్ ఎక్కువగా ఉందని రోజు విడిచి రోజు ఒక నెలపాటు
డయాలసిస్ చేయించాలన్నారు. మాకు చాలా భయమేసింది. నేను మంగళవారంనాడు, "బాబా! నాన్నకి నయం కావాలి. 9 గురువారాల వ్రతం చేస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. అదేరోజు మా పక్కింటి అతను తనకు తెలిసిన హాస్పిటల్లో డయాలసిస్ చేయిద్దామని అన్నారు. మేము సరే అనుకున్నాము. నేను, "నాన్నకు క్రియేటిన్ కనీసం 4 ఉండేలా చేసి డయాలసిస్ అవసరం లేకుండా చేయండి బాబా" అని బాబాని వేడుకొని మా అమ్మకు శిరిడీ నుండి తెచ్చిన ఊదీ ఇచ్చి రోజూ నాన్నకి పెట్టమని చెప్పాను. అమ్మ అలాగే చేయసాగింది. తర్వాత నాన్నని ఒక హాస్పిటల్ నుండి ఇంకో హాస్పిటల్‌కి తీసుకెళ్లిన రోజు నాన్న క్రియేటిన్ 4 ఉంది. ఆ రోజు గురువారం. నాన్నని ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మళ్ళీ అన్నీ పరీక్షలు చేసి "కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. రెండు కిడ్నీలకి స్టంట్స్ వేసి ఇన్ఫెక్షన్ తగ్గించాలి" అన్నారు. నాన్న కంటికి అదివరకు స్ట్రోక్ వచ్చి తగ్గింది. ఒకవేళ ఆ సమస్య ఉంటే అనస్థీషియా ఇవ్వడం కష్టమని చెప్పారు. మాకు భయమేసింది. కానీ ఎమ్ఆర్ఐ చేస్తే, నార్మల్ వచ్చింది. దాంతో రెండు స్టంట్స్ వేసి, "రాయి తర్వాత తీస్తాం" అన్నారు. ఆ తర్వాత మూత్రంలో రక్తం వస్తే, "బ్లాడర్ లోపల రక్తం గడ్డలు ఉన్నాయి. ఆపరేషన్ చేయాలి. కానీ ఫుల్ బాడీకి అనస్థీషియా ఇస్తే బాడీ ఎలా స్పందిస్తుందో చెప్పలేము" అన్నారు. మాకు భయమేసింది కానీ, బాబా దయవల్ల ఏ ఇబ్బంది లేకుండా ఆపరేషన్ బాగా జరిగి నాన్న ఆరోగ్యంగా 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి మా అక్క దగ్గరకి వెళ్ళారు. తర్వాత కాలునొప్పి అని హాస్పిటల్‌కి వెళితే టాబ్లెట్లు ఇచ్చారు. అప్పటికి టాయిలెట్ కోసం పైపు వేసి ఉంది. మరుసటిరోజు టాయిలెట్ లీక్ అవ్వడంతో మళ్ళీ హాస్పిటల్‌కి వెళితే పైపు అవసరం లేదని తీసేసారు. నాన్న వాళ్ళు 3 రోజులు అక్క దగ్గర ఉండి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. నేను సంక్రాంతికి వాళ్ళ దగ్గరకి వెళితే నాన్నకు రక్తం తగ్గి నడవలేని స్థితిలో ఉన్నారు నాన్న. దాంతో గురువారం రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే టెస్ట్ చేసి, "అల్సర్ వల్ల రక్తం తగ్గింద"ని రక్తం ఎక్కించి అల్సర్స్‌కి చికిత్స చేసారు. మా అక్క కూడా బాబా భక్తురాలు. తను అప్పుడప్పుడు 9 గురువారాల వ్రతం చేస్తుంది. ఇప్పుడు మా నాన్నకోసం మొదలుపెట్టింది. నేను కూడా చేసాను. బాబా దయవల్ల నాన్న ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. కాని ఆయనకి మోకాలు నొప్పి ఉంది. దానికి ఆపరేషన్ చేయాలన్నారు. అది నయం అయ్యేలా బాబా ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను.
ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః
Om Sai Ram
ReplyDeleteSai please 🙏🙏 bless my family.Be with us.Om Sai Ram
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members 🙏🙏💐💐
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteom sai ram sai naku back pain taginchi manchi arogyani evvu thandri manasuki prashantatha evvu tandri
ReplyDeletesai maa bhartha ki mariyu maa athaa mamaki manchi manasuni prasadinchu tandri
ReplyDelete