1. కుక్కల బారినుండి కాపాడిన బాబా
2. బాబా దయవల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పరిష్కారం
3. అతి తక్కువ ఖర్చుతో ఫోన్ బాగయ్యేలా దయచూపిన బాబా
కుక్కల బారినుండి కాపాడిన బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు పావని. మాది హైదరాబాద్. 2025, ఫిబ్రవరి లేదా మార్చిలో మా అక్క కొడుకుకి ఆరోగ్యం బాగాలేకపోతే నేను 3 వారాలు 'సాయి దివ్యపూజ' చేస్తానని మ్రొక్కుకొని పూజ మొదలుపెట్టాను. చివరి గురువారంనాడు ఉదయం 6:30కి పని మీద నేను బయటకి వెళ్ళాల్సి వచ్చింది. మా ఇంటినుండి బస్ స్టాప్‌కి 200 మీటర్ల దూరం ఉంటుంది. నేను అడ్డదారి తీస్కోని ఒక చిన్న సందులో నడుచుకుంటూ వెళుతున్నాను. ఆ సందులో మనుషులెవరూ లేరు, 4 కుక్కలున్నాయి. అవి నావైపు కోపంగా చూస్తున్నట్లు కొంచం దూరంలో ఉండగా నాకు అర్థమైంది. కానీ వెనక్కి తిరిగి పరిగెత్తి వెళ్ళలేని పరిస్థితి. నేను అలా వెళితే ఆ కుక్కలు నా వెనక వేగంగా పరుగెత్తుకొచ్చి నన్ను కరిచేస్తాయి. అందుకని బాబాని తలుచుకుంటూ మెల్లగా అడుగులు ముందుకి వేస్తుంటే, ఒక కుక్క నా దగ్గరకి వచ్చి నా కాలు తన రెండు దవడలతో పట్టుకుంది. ఆ క్షణంలో నేను చాలా భయంతో వణికిపోతూ 'అమ్మా' అని గట్టిగా అరిచాను. అంత కోపంతో ఉన్న కుక్క నన్ను పట్టుకొని కూడా కరవకుండా వదిలేసింది. అప్పటికి మిగిలిన కుక్కలు నా పక్కనున్న కూడా మొదటి కుక్కతోపాటు అవి నన్ను కరవడానికి రాకుండా చూస్తూ ఉండిపోయాయి. నేను అలానే నిల్చోని ఉండిపోయాను. ఆ కుక్కలన్నీ నన్ను చూసి వెళ్లిపోయాయి. తర్వాత నేను నడవడం మొదలుపెట్టాను. కానీ నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. 'ఈరోజు బాబా చివరి గురువార పూజ చేయబోతున్నాను. నాకు ఎందుకిలా జరిగింది? నేను 'అమ్మా' అని గట్టిగా అరవడం వల్ల ఆ క్లిష్ట పరిస్థితి నుండి బయట పడ్డానా? లేక అప్పటివరకు బాబా కాపాడు అనుకుంటూ ఉన్నాను కదా! నన్ను బాబా కాపాడారా?' అని ఆలోచిస్తూ, "బాబా! మీరు నన్ను నిజంగా కాపాడినట్లైతే నేను ఈ పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చేలోపు మీరు నాకు కనిపించండి" అని అనుకున్నాను. తర్వాత నేను నా పని మూగించుకొని ఇంటికి తిరిగి వస్తుంటే ఒక గోడ మీద ఉన్న బ్యానర్‌పై బాబా దర్శనమిచ్చారు. అప్పుడు, "ఏదో పెద్ద ప్రమాదమే జరగబోయి ఉంటుంది. బాబా దాన్ని ఇలా తీశారు" అని అనుకున్నాను. "మీరు నా మాట విన్నందుకు, నాతో ఉన్నానని నిరూపించినందుకు, కష్టకాలంలో నేను ఉన్నానంటూ ధైర్యం చెప్తున్నందుకు ధన్యవాదాలు బాబా. అమ్మ ఆరోగ్యం సరిగా లేదు. దయచేసి ఇంతకు ముందులా అమ్మ ఆరోగ్యం మంచిగా అయ్యేలా చూడండి".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
బాబా దయవల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పరిష్కారం
నా పేరు M.చైతన్య. మా అమ్మ వయసు 50 సంవత్సరాల పైన ఉంటుంది. ఆమెకి బిపి ఉంది. ఆమె కొంతకాలం కడుపునొప్పితో బాధపడింది. మేము మొదట గ్యాస్ సమస్య అనుకున్నాం. అందువల్ల అమ్మ దానికి సంబంధించిన పదార్థాలు తినడం మానేసింది. అయినా అమ్మకి కడుపునొప్పి వస్తుండేది. అలా వచ్చినప్పుడు అమ్మ చాలా అంటే చాలా బాధపడుతుండేది. మాకు ఏమీ అర్థంకాక ఆడవాళ్ళ సమస్య వల్ల కడుపునొప్పి వస్తుందేమోనని భావించాము. కొన్నిరోజుల తర్వాత డాక్టరుని సంప్రదించాము. కానీ అమ్మకి నయం కాలేదు. అప్పుడు నేను మనసులో, "తండ్రీ! మా అమ్మ పరిస్థితి ఏంటో, ఏ వ్యాధితో బాధపడుతుందో మాకు అర్థం కావటం లేదు. దయవుంచి మా తప్పులను మన్నించి మాకు ఒక దారి చూపండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత 2023, వినాయకచవితి సమయంలో అమ్మకి కడుపునొప్పి తీవ్రంగా వచ్చింది. అప్పుడు వేరే లేడీ డాక్టర్ని సంప్రదిస్తే, పరీక్షలు చేసి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని నిర్ధారించి, అందుకు సంబంధించిన మందులు ఇచ్చారు. ఆ మందులు వాడుతూ, దాంతోపాటు రోజూ నీళ్లలో ఊదీ వేసుకొని ఎక్కువగా తాగుతుంటే సమస్య చాలావరకు నయమైంది. బాబా దయవల్లే అమ్మ సమస్య పరిష్కారమైంది. "బాబా! మీకు మా సాష్టాంగ నమస్కారాలు".
సర్వేజనా సుఖినోభవంతు.
అతి తక్కువ ఖర్చుతో ఫోన్ బాగయ్యేలా దయచూపిన బాబా
సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుడిని. బాబా ఎన్నోసార్లు నన్ను రక్షించారు, స్వప్నదర్శన భాగ్యం అనుగ్రహించారు. అందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో 2025, సంక్రాంతి సెలవుల తరువాత ఒకరోజు రాత్రి బండిపై వస్తుంటే నా జేబులో ఉన్న ఫోన్ కింద పడిపోయి పగిలింది. ఇంటికి వచ్చి 'ఫోన్ లేకుండా ఉద్యోగానికి వెళ్ళలేను, ఫోన్ చూస్తే పగిలిపోయింది, కొత్త ఫోన్ కొనగలిగే స్తోమత లేదు' అని ఆ రాత్రంతా చాలా బాధపడ్డాను. బాబాను తలుచుకుని, "బాబా! నాకు ఎందుకు ఇలా జరిగింది? అసలే ఆర్థికంగా చాలా ఇబ్బందిపడుతున్నాను. ఇప్పుడు ఈ మొబైల్ పనిచేయకపోతే ఎలా?" అంటూ బాబా ఫోటో ముందు కూర్చుని దుఃఖించాను. "తక్కువ ఖర్చుతో ఫోన్ బాగయ్యేలా చూడు తండ్రీ" అని వేడుకొని భారం బాబా మీద వేసాను. మరుసటిరోజు బాబాకి చెప్పుకొని హైదరాబాద్‌లోని జగదీష్ మార్కెట్‌కి వెళ్లి నా మొబైల్ చూపిస్తే, "ఏం కాలేదు. కెమెరా గ్లాసు ఒక్కటే పోయింది" అని చెప్పి, కేవలం 350 రూపాయలకే ఫోన్ బాగు చేసి ఇచ్చారు. నా బాబా, నా తండ్రి అంత తక్కువ ఖర్చుతో మొబైల్ రిపేర్ చేయించిచ్చారని చాలా సంతోషించాను. "ధన్యవాదాలు బాబా".
Om Sai Ram
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl house rent ki ippinchu thandri pl
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members 🙏🙏💐💐
ReplyDeleteOm Sai Ram please 🙏🙏 give peace of mind and courage to me and husband.Be with my family and bless my husband and children
ReplyDelete💐💐ఓంసాయి శ్రీసాయి జయజయసాయి💐💐
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
SAI BABA MEE PRASADAM INA SAI MADAVA BHARAM ANTHA MEEDE BABA
ReplyDeletesai tandri naku back pain nundi vimukthini prasadichu baba
ReplyDeletekapadu tandri, naa yokka tapulanau manichumu baba
om sai ram, jai sairam, jai jai krishna jai sairam