సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1907వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కరుణ - ఊదీ మహిమ
2. కోరుకున్నవి అనుగ్రహించిన బాబా


కోరుకున్నవి అనుగ్రహించిన బాబా

నా పేరు ఉమ. మేము USలో ఉంటున్నాము. మా బాబు 12వ తరగతి పూర్తవ్వడంతో కాలేజీలో అడ్మిషన్ కోసం కొన్ని కాలేజీలకి అప్లై చేసాము. బాబు హైస్కూలు USలోనే చదివాడు కానీ, మాకు గ్రీన్ కార్డు ఇంకా రానందున ఇంటర్నేషనల్ స్టూడెంట్ కేటగిరీలో అప్లై చేయాల్సి వచ్చింది. ఆ కేటగిరీలో ఫీజు రెండింతలు ఎక్కువగా ఉంటుంది. నేను బాబాని, "మా బాబుకి మేమున్న స్టేట్‌లోనే సీటు రావాలి. మేము అంత ఫీజు భరించలేము, స్కాలర్షిప్ వచ్చేలా అనుగ్రహించండి బాబా" అని మరీమరీ వెడుకున్నాను. బాబా దయతో బాబుకి మేము ఉన్న స్టేట్లోనే సీటు వచ్చింది. అంతేకాదు, మెరిట్ స్టూడెంట్ అని 60% ఫీజు కూడా తగ్గించారు. నాకు చాలా సంతోషమేసింది. బాబు 2024 , ఆగష్టు మూడో వారంలో కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇదంతా బాబా ఆశీర్వాదం వల్లే జరిగిందని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1906వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ముందుగా నెలసరి వచ్చేలా దయచూపిన బాబా
2. గొంతునొప్పి తగ్గించిన బాబా
3. విపత్కర పరిస్థితిలో లభించిన బాబా సహాయం

ముందుగా నెలసరి వచ్చేలా దయచూపిన బాబా

సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మన సాయితండ్రిని నమ్ముకుంటే అడుగడుగునా అద్భుతం చూపిస్తారని మన అందరికీ తెలిసిందే! అలాంటివి నాకు ఎన్నో జరిగాయి. మేము 2024, ఆగష్టు 14 & 15 తేదీల్లో కాశీ, అయోధ్య వెళదామని ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. అయితే 17వ తేదికి నా నెలసరి సమయం. ఒకవేళ అది రాకుండా ఉండాలంటే నేను 5 రోజులు టాబ్లెట్లు వాడాలి. ఇటువంటి పరిస్థితిలో నేను అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసే బాబాని తలుచుకొని, "నాకు నెలసరి ముందే వచ్చేలా చేసి టాబ్లెట్ వేసుకోకుండా చూడండి" అని చెప్పుకొని ఆయనకే వదిలేసాను. బాబా నా మాటలు విన్నారు. 11వ తేదీనే నాకు నెలసరి వచ్చింది. దాంతో  15వ తేదికి 5 రోజులు అయిపోతాయి కాబట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చని సంతోషించాను. అంతా బాబా దయ. ఆయనకి మనం సర్వస్యశరణాగతి చెందితే చాలు అన్నీ ఆయనే చూసుకుంటారు. 

గొంతునొప్పి తగ్గించిన బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితంలో బాబా తప్ప ఎవరూ లేరు. నేను ఆయన చెప్పిన కొన్ని విషయాలు పాటిస్తూ వారి స్మరణలో నా జీవితాన్ని సాగిస్తున్నాను. ఒకరోజు బయట నుంచి చికెన్ బిర్యానీ తెచ్చుకుని నేను, మా అమ్మ తిన్నాం. తినేటప్పుడు ఏమీ అనిపించలేదు కానీ, మింగుతున్నప్పుడు ఏదో చిన్న దుమ్ము లోపలికి వెళ్తున్నట్లు అనిపించింది. సరే, చిన్నదే కదా! ఏమి కాదు అనుకున్నాను. తర్వాత నీళ్లు తాగుతుంటే నా గొంతులో ఏదో అడ్డంగా ఉన్నట్లు అనిపించింది. మరుసటిరోజు గొంతు నొప్పిగా కూడా అనిపించింది. మూడు రోజులయ్యేసరికి గొంతు నొప్పి బాగా ఎక్కువైంది. అప్పుడు నేను, "నాకు గొంతు నొప్పి లేకుండా, అలాగే ఏమీ జరగకుండా చూడండి బాబా" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి మామూలుగా అనిపించింది. నాకు చాలా సంతోషమేసింది. గొంతునొప్పిని తగ్గించిన నా తల్లి, తండ్రి అయిన బాబాకి శతకోటి ధన్యవాదాలు. ఎప్పుడూ నాతో, అందరితో బాధల్లో వెన్నంటుండి సహాయాన్ని అందించమని బాబాను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 1905వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చేసిన సహాయం
2. బాబా ఆశీస్సులు

బాబా చేసిన సహాయం

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు అనూష. బాబా కృపాకటాక్షాలు అందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడో భక్తులకు జరిగిన అనుభవాలను ఎందరో భక్తులకు చేరుస్తూ కష్టాల్లో ఎవరు తోడున్నా, లేకపోయినా బాబా ఉన్నారని నమ్మకాన్ని కలిగిస్తున్న ఈ బ్లాగుకు చాలా కృతఙ్ఞతలు. ఇక నా అనుభవానికి వస్తే..  ఒకసారి నేను వైద్య పరీక్షలు చేయించుకుంటే హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువ ఉందని వచ్చింది. డాక్టర్ అది చూసి, అసలెందుకు రక్తం తగ్గుతుందో తెలుసుకోవడానికి చాలా పరీక్షలు వ్రాసారు. దానిలో థైరాయిడ్ పరీక్ష కూడా ఉంది. అది చూసి, 'నేను ఈమధ్య ఏ డైట్ నియమాలు పాటించకుండానే చాలా బరువు తగ్గాను. నాకు థైరాయిడ్ ఉందేమో! అందువల్లే బరువు తగ్గనేమో!' అని నాకు చాలా భయమేసింది. అదీకాక నేను బాగా బలహీనమైపోయానని, రక్తం తక్కువగా ఉందని చాలా ఫీల్ అయిన నా నాన్న ఇప్పుడు నాకు థైరాయిడ్ కూడా ఉందంటే చాలా బాధపడతారనిపించింది. అందువల్ల నేను వెంటనే, "ఎలా అయినా థైరాయిడ్ లేకుండా చూడండి బాబా" అని బాబాను ప్రార్థించాను. తర్వాత నేను హాస్పిటల్‌కి వెళ్లి రిపోర్టులు తీసుకున్నాను. అప్పుడు బాబా మెసేజ్ కోసం చూస్తే, 'నీకు అనుకూలంగా రిజల్ట్ వస్తుంద'ని ఇచ్చారు. తర్వాత రిపోర్టులు తీసుకొని డాక్టర్ దగ్గరకి వెళ్తూ టెన్షన్ వల్ల రిపోర్టు చూశాను. అందులో నా థైరాయిడ్ లెవెల్ 0.7 అని, 0.4 నుండి 5 అయితే నార్మల్ అని ఉంది. అయితే నేను కంగారులో 0.7ని 7 అనుకొని నాకు థైరాయిడ్ ఉందని బాధపడ్డాను. తర్వాత సరిగా ఆలోచిస్తే, అది 0.7 అని గుర్తించి బాబా నాకు సహాయం చేసారనిపించింది. అయినా ఇంకా ఏదో భయంతో డాక్టర్ దగ్గరకి వెళితే, రిపోర్టులన్నీ చూసి, "బాగానే ఉన్నాయి. ఒక్క బ్లడ్ తక్కువగా ఉంది" అని అన్నారు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇది బాబా చేసిన అద్భుతం అని నేను నమ్ముతున్నాను. "పిలిచిన వెంటనే తోడుండే మీకు శతకోటి వందనాలు బాబా. నాకున్న ఆరోగ్య సమస్యలన్నీ నయమయ్యేలా నాకు మీ ఆశీస్సులిచ్చి మంచి ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించండి".

బాబా ఆశీస్సులు

నా పేరు మహేశ్వర. నేను ఐటీ రంగంలో పని చేస్తున్నాను. 2024, ఆగస్ట్ నెల ప్రారంభంలో మూడు రోజులపాటు నా ప్రాజెక్ట్‌లో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని బ్యాచ్ జాబ్స్ ఫెయిల్ అవ్వసాగాయి. దానికి కారణమేంటో మేము కనుక్కోలేకపోయాము. ఆ సమయంలో నా మేనేజర్ సెలవులో ఉన్నప్పటికీ ఈ సమస్యల స్థితిగతులను అడుగుతూనే ఉన్నారు. ఆగస్టు, 5న మళ్ళీ జాబ్స్ ఫెయిల్ అయ్యాయి. మేము ఇంకొక టీమ్‌తో చర్చించాము. వాళ్ళు మా బ్యాచ్ జాబ్స్‌ మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలో చెపుతామని అన్నారు. వాళ్ళ నుంచి నిర్ధారణ వచ్చాక జాబ్స్ రన్ చేసాము. అప్పుడు నేను, "జాబ్స్ విజయవంతంగా రన్ అవ్వాల"ని బాబాని ప్రార్థించాను. బాబా ఆశీస్సులతో జాబ్స్ సరిగా రన్ అయ్యాయి. "థాంక్యూ బాబా".

2024, ఆగస్టు నెలాఖరులో కస్టమర్ సైట్‌లో పని చేస్తున్న నా సహోద్యోగికోసం నేను ఎన్నోసార్లు చేసిన ఒక టాస్క్(పని)కి సంబంధించి నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్(కె.టి.) చేశాను. అయితే, ఆ టాస్క్ అనుకున్న విధంగా పని చేయలేదు. నేను బాబా సహాయాన్ని అర్థిస్తూ, "సమస్యను పరిష్కరించమ"ని ప్రార్థించాను. బాబా ఆశీస్సులతో ఆ సమస్య పరిష్కరమైంది. విజయవంతంగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ పూర్తైంది. బాబా అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

ఒకరోజు నేను కూరగాయలు కొనడానికి, బట్టలు షాపింగ్ చేద్దామని బయలుదేరాను. నాకెందుకో నేను వెళ్ళిన బట్టల షాపులో బాబా(విగ్రహం) ఉండొచ్చని అనిపించింది. ఆశ్చర్యకరంగా నేను వెళ్ళిన షాపులో క్యాష్ కౌంటర్ దగ్గర బాబా విగ్రహం దర్శనమిచ్చింది. నేను బట్టలు ఎంచుకున్న తర్వాత, "బిల్లు 9,000 రూపాయల కంటే ఎక్కువ కాకుండా చూడమ"ని బాబాని ప్రార్థించాను. నేను తీసుకున్న బట్టలు 11,200 రూపాయలు కాగా డిస్కౌంట్ పోను మొత్తం 8,600 రూపాయలు అయ్యింది. బాబా నాపై చూపుతున్న అనుగ్రహానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "బాబా! నా జీవితాంతం మీ కృప నాకు ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రీ". 

ఓం సాయినాథాయ నమః.

సాయిభక్తుల అనుభవమాలిక 1904వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోరుకున్న వారి కోరికలు నెరవేర్చే కల్పతరువు నా సాయిబాబా
2. బాబా ముద్ర
3. డబ్బులు అందేలా చేసిన బాబా

కోరుకున్న వారి కోరికలు నెరవేర్చే కల్పతరువు నా సాయిబాబా 

నా పేరు ఫణీంద్ర, మనకి యే కష్టం వచ్చినా సాయిబాబాని తలచుకోగానే, మనసుకు ప్రశంతతను అందజేస్తారు. ఇది నా విషయంలో చాలాసార్లు చేసి చూపించారు నా సాయిబాబా. అలాంటి ఒక అనుభవం నేను ఇప్పుడు సాయిభక్తులందరితో పంచుకుంటున్నాను. 2024, మేలో నేను, నా తమ్ముడు అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్ళాము. అప్పుడు మధ్య దారిలో ఎక్కడో నా పర్స్ పడిపోయింది. ఆ విషయం నేను గుడికి చేరాక గమనించాను. నాకు ఎవరిని అడగాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. నా బ్యాంక్ కార్డులు, బైక్ సి బుక్, లైసెన్స్, పాన్ కార్డ్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. 'ఇప్పుడున్న సమస్యలకి తోడు ఇదేమిటి బాబా?' అని మనసులో బాధపడ్డాను. గుడికి వస్తున్న మధ్య దారిలో ఓ చోట నీళ్లు తాగడానికి అగాము. అక్కడేమైనా పడిపోయి ఉంటుందేమోనని దర్శనంకి వెళ్లకుండా, ఆ అరుణాచలేశ్వరుని మనసులో వేడుకొని తిరిగి 40 కిలోమీటర్లు వెనక్కి మేము అదివరకు అగిన చోటుకి వెళ్లి చూసాము. కానీ అక్కడ నా పర్స్ లేదు. చాలా బాధ, నిరాశలతో ఏం చేయాలో అర్థంకాక మనసులో ఆ సాయినాథుని, "బాబా! నా పర్సు దొరికేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. తర్వాత చేసేదేమీలేక బ్యాంక్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అన్ని డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులు బ్లాక్ చేయించి మళ్ళీ వెనక్కి వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శించి ఇంటికి ప్రయాణమయ్యాము. సరిగ్గా మధ్యదారిలో తెలియని నంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ ఎత్తి మాట్లాడితే, "మీ పర్స్ ఏమైనా పోగొట్టుకున్నారా?" అని అడిగారు అవతలి వ్యక్తి. ఇంకా మాకు ఫలానా చోట ఒక పర్స్ దొరికిందని చెప్పారు. చిత్రమేమిటంటే, నా పర్స్లో నా ఫోన్ నెంబర్ ఎక్కడుందో నాకైతే తెలీదు. అలాంటిది అతను ఎలా ఫోన్ చేశాడో అని ఆశ్చర్యమేసింది. అప్పుడు నాకు ఇది బాబా లీల అనిపించింది. నేను అతనితో నా పర్స్ పోయిందని చెప్పి, వెళ్లి నా పర్స్ నేను తెచ్చుకున్నాను. నేను ఈ మధ్య ఆఫీసులో కూడా నా టేబుల్ దగ్గర పర్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందుకే బాబా ఈవిధంగా అజాగ్రత్త తగదని హెచ్చరించారు. "ధన్యవాదాలు బాబా. నాయందు ఇలాగే ఎప్పుడూ మీ అమృతదృష్టి ఉండనీ సాయితండ్రీ".

బాబా ముద్ర

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2024, ఆగస్టు 7వ తేదీన మేము ఏలూరు నుంచి వైజాగ్‌లో కనకమహాలక్ష్మి గుడికి కారులో వెళ్లాలనుకున్నాము. అయితే మాకు సంవత్సరం బాబు ఉన్నందున 5 గంటల ప్రయాణంలో బాబు కుదురుగా ఉంటాడో, లేదోనని ఆందోళన పడ్డాను. అందుచేత ముందురోజు, "బాబా! రేపు ప్రయాణంలో వెళ్లేటప్పుడు కానీ, తిరిగి వచ్చేటప్పుడు కానీ బాబు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా హాయిగా వెళ్లి, రావాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయ చూపారు. మొత్తం ప్రయాణంలో ఒక్క అరగంట తప్ప అస్సలు ఇబ్బంది పెట్టలేదు. నిజానికి సంవత్సరం పిల్లలు అంతసేపు ప్రయాణం అంటే చాలా విసిగిస్తారు. బాబా దయవల్ల దర్శనం చాలా త్వరగా, చక్కగా జరిగింది. త్వరగా ఇంటికి కూడా చేరుకున్నాం. అసలు అంత దూరం వెళ్ళొచ్చినట్లే అనిపించలేదు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే, ఆ కారు డ్రైవర్ బాబా భక్తుడు. కారు ముందు భాగంలో బాబా హ్యాంగింగ్ ఒకటి కట్టారు, కారు వెనకాల 'ద్వారకామాయి' అని వ్రాసుంది. కారు ఎక్కగానే బాబా పాటలు పెట్టారు. బాబా ముద్ర అలా ఉంటుంది. మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే అంతా తామే స్పష్టంగా మనకి తెలియజేస్తారు.


సాయిభక్తుల అనుభవమాలిక 1903వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి కృపతో తీరిన సమస్యలు
2. బాబాకి చెప్పుకుంటే లభించిన అనుగ్రహం


బాబాకి చెప్పుకుంటే లభించిన అనుగ్రహం

సాయిబంధువులందరికీ నమస్కారం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనకు ఏ ఆపద రాకుండా చూసుకుంటున్న మన బాబాకి శతకోటి వందనాలు. నా పేరు సౌజన్య. 2024, మార్చ్ 30న మా అమ్మకి మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీ చేయించాము. తర్వాత మరో కాలు రీప్లేస్మెంట్ సర్జరీకోసం అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే, రెండు రోజులైనా సర్జరీ చేయలేదు. స్టాఫ్‌ని అడిగితే రేపు చేస్తామని చెప్తుండేవారు తప్ప చేసేవారు కాదు. అప్పుడు నేను బాబాని, "రేపైనా సర్జరీ చేసేలా చూడు బాబా" అని వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటి రోజు వేకువజామున సర్జరీ చేసారు. ఇంకా నొప్పి కూడా ముందుసారి కంటే ఈసారి తక్కువగా ఉండింది. ఇకపోతే, మేము ఇన్సూరెన్స్ కింద సర్జరీ చేయించాము. అయితే అప్పటికే మావారు కంపెనీలో రాజీనామా ఇచ్చారు. నా భర్త ఫ్రెండ్ ఒకరు నోటీస్ పీరియడ్‌లో ఉంటే ఇన్సూరెన్స్ వర్తించదని చెప్పారు. దాంతో నాకు చాలా టెన్షన్ వచ్చింది. ఎందుకంటే, ఒకవేళ ఇన్సూరెన్స్ రాకపోతే మొత్తం డబ్బులు మేము కట్టాల్సి వస్తుంది. హఠాత్తుగా అంత డబ్బు కట్టాలంటే కష్టం. అందువల్ల నేను బాబాని, "ఇన్సూరెన్స్ వచ్చేలా చూడమ"ని వేడుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి సమస్యలు లేకుండా బిల్ పేమెంట్ అయింది. "శతకోటి వందనాలు బాబా. మా చేయి ఎప్పుడూ వదలక సదా మమ్మల్ని కాపాడు తండ్రీ. అమ్మ తొందరగా కోలుకునేలా చూడు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1902వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • కావాలని అడిగితే చాలు - అది మనకి మంచిదైతే బాబా తప్పకుండా సహాయం చేస్తారు

నా పేరు హాసిని. నా ఫ్రెండ్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే చివరి నిముషంలో చేజారిపోసాగాయి. అలా ఒక 3 కంపెనీలలో తను సెలెక్ట్ అవ్వలేదు. అప్పుడు నేను తనతో "నువ్వు ఈసారి వెళ్లే కంపెనీలో నీకు ఉద్యోగం రావాలి. అదే జరిగితే విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాన"ని మ్రొక్కుకోమని చెప్పాను. తర్వాత తను వెళ్లిన కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అయితే జాయినింగ్ ముందు కొన్ని టెస్టులు ఉన్నాయి. అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అడిగారు. తనకి ఆ సర్టిఫికెట్ లేదు. అందువల్ల తను "ఏమవుతుందోనని భయమేస్తుంది" అని అన్నాడు. ఇక అప్పుడు నేను, "బాబా! నా ఫ్రెండ్ ఆ కంపెనీలో సెలెక్ట్ అవ్వాలి. తనకి ఉద్యోగం రావాలి. తనకి ఆఫర్ లెటర్ వచ్చేస్తే మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయవల్ల తనకి ఆఫర్ లెటర్ వచ్చింది. మనమందరం ప్రధానంగా తెలుసుకోవలసింది ఏంటంటే, ఏదైనా పని చేసేటప్పుడు గురు అనుగ్రహం వుండాలి. అప్పుడే ఎలాంటి పనైనా విజయవంతమవుతుంది. అది నాకు ఈ అనుభవం ద్వారా అర్థమైంది.

నేను డిగ్రీ పరీక్షలు వ్రాసాను. ఆ పరీక్షలు సులువే కానీ, ఎంత బాగా వ్రాసినా ఫెయిల్ చేస్తున్నారని ఒక ఫ్రెండ్ చెప్పింది. తనని అలాగే ఫెయిల్ చేశారు కూడా. అయితే నేను పరీక్షలు వ్రాసే ముందు "బాబా! మీరు దగ్గరుండి నాచేత పరీక్షలు వ్రాయించాలి. ఇచ్చిన సమయంలో పూర్తి పేపర్ మీరు నాచేత వ్రాయించాలి బాబా" అని బాబాకి చెప్పుకున్నాను. నా పక్కనున్న వాళ్ళు ఎవరూ నూటికి నూరు మార్కులకి ఆన్సర్ చేయలేదు. బాబా దయవల్ల నేను మాత్రం ఆయన్ని తలుచుకుంటూ అన్నీ ఆన్సర్ చేశాను. ఒక పరీక్ష వ్రాసేటప్పుడు నా పక్కనున్న అతను నేను వ్రాసేది చూసి తను రాసుకుంటుంటే, నేను పోనిలే వ్రాసుకోని అని ఊరుకున్నాను. మరో 30 నిముషాలు ఉందనగా ఇన్విజిలేటర్ గమనించి, చూసి వ్రాస్తున్న అతనిని ఏమీ అనకుండా నా పేపర్ తీసేసుకున్నారు. నేను అప్పటికే వ్రాసేసినందున తిరిగి అడగలేదు. నేను ఎగ్జామ్ హాల్ నుండి బయటకి వచ్చేసాక ఆ మేడం నా పేపర్ మీద పెన్‌తో కొట్టేశారని నా స్నేహితులు చెప్పారు. అది విని నాకు చాలా భయమేసింది. ఆ సబ్జెక్టు ఉండిపోతే ఒక సంవత్సరం వేచి ఉండాలనిపించింది. కానీ ఎక్కడో బాబా ఉన్నారు కదా అని ధైర్యంగా అనిపించింది. మొత్తం పరీక్షలన్నీ అయిపోయాక నేను, "బాబా! మొత్తం సబీజెక్టులన్నీ పాసవ్వాలి. మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను. అలానే పులిహోర, కొబ్బరి కేసరి ప్రసాదం గుడిలో పంచుతాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల నేను ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. మేడం కొట్టేసిందని చెప్పిన పేపర్ కూడా బాబా దయవల్ల పాస్ అయ్యాను. నేను చేసిన గ్రాడ్యుయేషన్‌కి 60% మార్కులొస్తేనే విలువ ఉంటుంది, అందువల్ల నేను బాబాని నాకు 60% రావాలని అడిగాను. బాబా దయవల్ల నాకు 67% వచ్చింది. చాలా సంతోషించాను. ఇది అంత మన సాయి లీల. నేను స్టూడెంట్స్‌కి ఒక్కటే చెప్తాను. బాబా! పాసవ్వాలని అడిగినంత మాత్రాన మనం పాస్ అవ్వము. మనం కష్టపడితేనే బాబా 'అయ్యో.. నా బిడ్డ కష్టపడుతుంద'ని మనకి సహాయం చేస్తారు. విద్యార్థులకు గురు కృప చాలా ఆవశ్యకం.

ఒకసారి నేను kyc అప్డేట్ చేయడం కోసం పోస్టాఫీసుకి వెళ్ళాను. వాళ్ళు ఏవో పేపర్స్ ఇచ్చి సంతకాలు చేయాలని అన్నారు. నేను సంతకాలన్నీ చేసి ఆ పేపర్స్ తీసుకొని మరుసటిరోజు మళ్ళీ పోస్టాఫీసుకి వెళ్తే, ఇంకా కొన్ని సంతకాలు చేయాలని అన్నారు. నేను ఇంకా నెగ్లెక్ట్ చేసి నాలుగు నెలల తర్వాత 'ఈసారి పని అయిపోవాలని, మళ్ళీ వెనక్కి పంపకూడదని; బాబా సహాయం అడిగి అవే పేపర్స్‌తో పోస్టాఫీసుకి వెళ్ళాను. వాళ్ళు ఏమీ అనకుండా అప్డేట్ చేశామని అన్నారు. అదివరకు అవే పేపర్స్ తీసుకెళ్తే ఇంకా సంతకాలు చేయాలని వెనక్కి పంపారు. అంతా బాబా దయ. మనం ఇది కావాలని అడిగితే చాలు. అది మనకి మంచిదైతే బాబా తప్పకుండా సహాయం చేస్తారు.

ఒకసారి నాకు జలుబు చేసింది. టాబ్లెట్లు వేసుకున్నా అస్సలు తగ్గలేదు. ఎందుకో ఆరోజు రాత్రి టెలిగ్రామ్ ఓపెన్ చేసి 'సాయి మహరాజ్ సన్నిధి' ఛానెల్ ఓపెన్ చేస్తే, అందులో ఎవరో భక్తులకి జలుబు చేస్తే, ఊదీ నీళ్లు తాగితే తగ్గిందని పంచుకున్నారు. బహుశా బాబానే ఆ రూపంలో అలా చెప్పారనిపించింది నాకు. ఎందుకంటే, నేను టెలిగ్రామ్ అసలు ఎప్పుడూ ఓపెన్ చేయను, బ్లాగు తాలూకు ఛానల్ అయితే అసలే ఓపెన్ చేయను. అలాంటిది ఆరోజు ఓపెన్ చేయడం, జలుబుకి సంబంధించిన అనుభవమే చదవడం అంతా బాబా కృప మనపై ఉండటం వల్లే. సరే, మరుసటిరోజు నేను నీళ్లలో శిరిడీ నుండి తెచ్చిన ఊదీ కలిపి తాగాను. అంతే, నేనింకా ఏ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. బాబా ఊదీ అంత శక్తివంతమైనది. "ధన్యవాదాలు బాబా",

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.

సాయిభక్తుల అనుభవమాలిక 1901వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ
2. సాయినాథుని రక్షణ

బాబా దయ

నాపేరు తేజశ్రీ. సంవత్సరం ఆరు నెలలు ఉన్నప్పుడు మా చిన్నబాబుకి జలుబు చేసి చాలా రోజుల వరకు తగ్గలేదు. తన ముక్కు అంతా వాచిపోయి రక్తం కూడా వచ్చింది. చిన్న పిల్లాడు చాలా బాధపడ్డాడు. నేను ఆయింట్మెంట్ వాడుతున్న కానీ తగ్గలేదు. చివరికి నేను, "బాబా! మీ దయవల్ల బాబుకి జలుబు తగ్గిపోవాలి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొన్నిరోజులకి బాబుకి జలుబు తగ్గింది. ఇంకోసారి సంవత్సరం ఏడు నెలల వయసున్నప్పుడు బాబు ఆడుకుంటూ మంచం మీద పడిపోయాడు. మంచం తాలూకు చెక్క తన దవడకి తగిలి రక్తం వచ్చింది. బుగ్గ వాచింది కూడా. తను బాగా ఏడ్చాడు. నేను బాబాతో, "మీ దయవల్ల ఏ సమస్య లేకుండా త్వరగా బాబుకి తగ్గిపోవాలి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల త్వరగానే బాబుకి తగ్గిపోయింది.

2024, మేలో మా చిన్నబాబు నా లాప్టాప్‌లో వీడియోలు చూస్తూ ఏం చేసాడో తెలియదుగానీ లాప్టాప్ సపోర్ట్ దగ్గర మొత్తం విరిగిపోయింది. అది కొని సంవత్సరం కూడా కాలేదు. నాకు చాలా బాధేసి, "బాబా! మీ దయతో ఏ సమస్యా లేకుండా ఉండాలి" అని బాబాతో చెప్పుకొని వారంటీ ఉన్నందున లాప్టాప్ షాపుకి తీసుకెళ్ళాను. ఆ షాపతను ముందు ఇది వారంటీ కింద రాదని చెప్పినప్పటికీ తరువాత ప్రయత్నిస్తానని అన్నారు. నేను సంతోషించి లాప్టాప్ ఇచ్చి వచ్చేసాను. అతను నేను చెప్పిన సమస్యను పరిష్కరించకుండా వేరే సమస్యలున్నాయని ఇమెయిల్ పెట్టి చాలా పెద్ద మొత్తం డబ్బులు కట్టాలని అన్నారు. మేము ఆ లాప్టాప్ కొన్నదానికంటే ఎక్కువ అడిగారు. నా భర్త లాప్టాప్ వారంటీ కింద వస్తుందని తీసుకున్నారు కదా అని రిప్లై ఇమెయిల్ పెట్టారు. దానికి ఏ సమాధానమూ రాలేదు. తరువాత ఒక గురువారం మీ లాప్టాప్ తీసుకెళ్లండి అని నాకు షాపు నుండి మెయిల్ వచ్చింది. నేను కొంచం సంతోషించాను. అయితే ఆరోజు కుదరక మరుసటిరోజు షాపుకి వెళ్తే, లాప్టాప్ ఇవ్వలేదు. అసలు దాన్ని బాగు చేయలేదు కూడా. పైగా చెక్ చేసినందుకు డబ్బులు కట్టమన్నారు. దాంతో నాకు ఏం చేయాలో అర్థంకాక తిరిగి వచ్చేసాను. నాకు వాళ్ళు లాప్టాప్ తిరిగి ఇస్తారో, ఇవ్వరో అని కొంచం బాధేసింది. తర్వాత కొన్నిరోజులకి మరల వచ్చి లాప్టాప్ తీసుకెళ్లండి అని మెయిల్ వచ్చింది. మేము వెంటనే వెళ్ళలేదు. కొన్ని రోజులకి 2024, జూలై 23న నా భర్త వెళ్తే, లాప్టాప్ తిరిగి ఇచ్చారు. బాబా దయవల్ల బాగు చేయకపోయినా మా లాప్టాప్ మాకు తిరిగి ఇచ్చారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్ సాయి. మీకు ఎప్పుడూ ఋణపడి ఉంటాము". 


సాయిభక్తుల అనుభవమాలిక 1900వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి కృప
2. శిరిడీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించిన బాబా
3. అవే టిక్కెట్ల మీద ప్రయాణానికి అనుమతించేలా దయచూపిన బాబా


శిరిడీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించిన బాబా

ఓం సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. నా పేరు శ్రీలక్ష్మీ. మాది విజయవాడ. నేను నాకు ఊహ తెలిసినప్పటినుంచి బాబా గుడికి, భజనలకు వెళ్తుండేదాన్ని. అప్పట్లో టీ, రొట్టెల మీద బాబా దివ్య రూప దర్శనమయ్యేది. నేను కూడా ఒక భక్తురాలి ఇంట్లో రొట్టె మీద బాబాను దర్శించాను. మా ఇంటి దగ్గర్లో ఉన్న ఒక చిన్నపాప ఒంటిపైకి బాబా ప్రతి గురువారం వచ్చేవారు. ఒకసారి మేము అక్కడికి వెళ్ళి, "బాబా! శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఎప్పుడు రమ్మంటారు?" అని అడిగితే, "శిరిడీనా! ఎందుకు? వద్దు" అన్నారు. మేము, "మీ దర్శనం చేసుకోవాలి, వస్తాం" అని అంటే, "సరే, వస్తావా? రా. ఎలా వస్తావో, నేను చూస్తాను" అని అన్నారు బాబా. ఇది జరిగిన 15, 20 రోజుల తర్వాత మేం అనుకోకుండా మహారాష్ట్రలో ఉన్న మా పెద్దమ్మ వాళ్ళింటికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాము. అప్పుడు మా పెద్దమ్మ, "ఇక్కడిదాకా వచ్చారు కదా! శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోండి" అని చెప్పింది. అప్పటివరకు శిరిడీ వెళ్లాలన్న విషయమే మాకు గుర్తు లేదు. బాబానే మా పెద్దమ్మ ద్వారా గుర్తు చేసి మరీ తమ దగ్గరకు రప్పించుకొని తమ దర్శన భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. ఆ తండ్రికి వేల కోటి ప్రణామాలు. ఇది జరిగి 30 సంవత్సరాలవుతుంది. అయినా రద్దీ లేని ప్రశాంతమైన ఆ దివ్య దర్శనం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి అది.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

అవే టిక్కెట్ల మీద ప్రయాణానికి అనుమతించేలా దయచూపిన బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబాబా నాకు అనేకసార్లు అభయమిచ్చి ఆదుకున్నారు.  పెద్ద-చిన్న అని తేడా లేకుండా ప్రతి సమస్యకు నేను వారినే ఆశ్రయిస్తాను. ఆయన చాలాసార్లు అనుగ్రహిస్తారు. అంతెందుకు ఏ భగవత్ స్వరూపాన్ని చూసినా నా నోట పలికేది, మనసున మెదిలేది 'బాబా' అన్న పదమే. 2024, జూలై 24 తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి నేను, మా కోడలు, మనుమరాలు కలసి చికాగోకు లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్లో ప్రయాణమయ్యాం. ఫ్రాంక్ఫర్ట్లో దిగి చికాగోకి వేరే ఫ్లైట్ తీసుకోవాల్సి ఉండగా హైదరాబాద్ నుండి ఫ్రాంక్ఫర్ట్ వెళ్లి ఫ్లైట్ ఆలస్యమైంది. అదీకాక సెక్యూరిటీ చెక్లో కూడా ఆలస్యమైంది. కాళ్ళనొప్పుల వల్ల నేను ఎక్కువ దూరం నడవలేను. వీల్ చైర్ బుక్ చేసుకున్నాను. కానీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్ పోర్ట్లో వీల్ చైర్ సకాలంలో అందకపోవడంతో చికాగో ఫ్లైట్ మిస్ అయ్యాం. అటువంటి క్లిష్ట పరిస్థితిలో బాబాని బాగా ప్రార్ధించుకున్నాను. మొదట, "మేము ఏమి చేయలేము. ఆలస్యానికి, ఫ్లైట్ మిస్ అవడానికి మేము బాధ్యులం కాము" అన్న ఎయిర్లైన్స్వాళ్ళు మర్నాటి ఫ్లైట్కి అవే టికెట్ల మీద అనుమతించారు. నేను ఇది బాబా దయగా భావిస్తూ వారికి ప్రణమిల్లుతున్నాను. "బాబా! నీ మహిమ అద్భుతం, అనంతం".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo