సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2107వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రద్ధ-సబూరిలతో బాబాని ప్రార్థిస్తే, ఆయన తప్పకుండా సహాయం చేస్తారు
2. బదిలీ కాకుండా దయచూపిన బాబా


బదిలీ కాకుండా దయచూపిన బాబా

నేను ఒక సాయి భక్తుడిని. మేము సోలాపూర్‌లో ఉంటాము. ఇక్కడ నేను రైల్వేలో, నా భార్య LICHFLలో పని చేస్తున్నాం. గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నందున ఒక ఇల్లు తీసుకుంటే బాగుంటుందని నిర్మాణంలో ఉన్న ఒక ఇల్లు తీసుకున్నాం. ఇంకా ఇంటికి ఫర్నిచర్, గృహప్రవేశం చేయాల్సి ఉండగా అనుకోకుండా నా భార్యకి ప్రమోషన్‌తో పాటు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఆఫీసులో చెప్పారు. కొత్తగా తీసుకున్న ఇంట్లో అడుగుపెట్టకుండానే ఊరి వదిలి వెళ్ళిపోవడం ఏంటని అనిపించి బాబాని, "వేరే చోటుకి బదిలీ వస్తే, నచ్చిన ఉద్యోగం మానేయాల్సి ఉంటుంది. ఒక్కరి జీతంతో ఇల్లు గడవడం కష్టం. ఇద్దరు పిల్లలతో చాలా కష్టం అవుతుంది. ఎలా అయినా బదిలీ కాకుండా ఉండి అందరం కలిసి కొత్త ఇంట్లో అడుగుపెట్టేలా చూడండి. ఐదుగురుకి అన్నదానం చేసి, మీ మందిరంలో కొబ్బరికాయ సమర్పించుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల ఈ సంవత్సరం బదిలీ రాలేదు. వస్తాదనుకున్న ప్రమోషన్ కూడా రాకపోయినా బాబా ఏం చేసినా మన క్షేమం కోసమే చేస్తారని అనుకున్నాం. "చాలా ధన్యవాదాలు బాబా. ఇంటి పని తొందరగా పూర్తై గృహప్రవేశం చక్కగా జరిగేలా చూడండి".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo