సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2091వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి ఇచ్చిన దర్శనాలు - నిదర్శనాలు
2. ఏ కష్టం వచ్చినా సాయితండ్రే రక్ష


ఏ కష్టం వచ్చినా సాయితండ్రే రక్ష

సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు సాహితి. 2025, జూలైలో నాకు విపరీతమైన ఒళ్ళునొప్పులతో జ్వరం వచ్చి లేచి, నడవడం చాలా కష్టమైంది. డాక్టర్ దగ్గరకి వెళితే చాలా రోజులకి జ్వరం తగ్గింది కానీ, కాళ్ల వాపులు, నొప్పులు తగ్గలేదు. బాబాను ప్రార్థిస్తూ ఇద్దరు డాక్టర్లని సంప్రదించినా తగ్గలేదు. నాకు నడవడం చాలా కష్టంగా ఉండేది. సమయానికి బాబా దయవల్ల వేరే ఊరిలో ఉద్యోగాలు చేసుకుంటున్న మా పిల్లలిద్దరికీ ఇంటి నుండి పని చేసే అవకాశం ఇవ్వడంతో వాళ్ళు ఇంటికి వచ్చారు. ఆవిధంగా బాబా నాకు ధైర్యాన్నిచ్చారు. కానీ రోజులు గడుస్తున్నా కాళ్లనొప్పులు తగ్గకపోవడంతో నేను చాలా భయపడి బాబాను ప్రార్ధించి హోమియో వైద్యుడి దగ్గరకి వెళ్తే, టెస్టులు చేయించుకోమని చెప్పారు. అసలే షుగర్ వ్యాధిగ్రస్థురాలినైన నేను ఏ కిడ్నీ సమస్యో అని చాలా భయపడి, "సాయీ! టెస్టులు చేయించుకుంటాను. ఏ సమస్య లేకుండా రిపోర్టులన్నీ నార్మల్‌‌‌గా వచ్చేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. బాబా కరుణించారు. టెస్టులు చేయించుకున్నాక ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ లేకుండా అన్నీ నార్మల్‌‌‌గా వచ్చాయి. హోమియో వైద్యుడు టాబ్లెట్లు ఇచ్చారు. వాటితో కాళ్లు నొప్పులు, వాపులు తగ్గాయి.

ఈమధ్య నా భర్త ఆరోగ్యం బాగాలేదు. ఆయన, "కాళ్ళు, చేతులు పట్టుతప్పుతున్నాయి. డ్యూటీ చేయడం కష్టంగా ఉంటుంద"ని అన్నారు. నేను బాబాని, "సాయీ! ఆయన ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది తండ్రీ. ఆయన కూడా టెస్టులు చేయించుకుంటారు. అన్ని నార్మల్‌‌‌గా ఉండేటట్లు చేయండి" అని వేడుకున్నాను. ఆ సాయితండ్రి మా వెంటే ఉన్నందున ఒక్క షుగర్ రిపోర్టు ఎక్కువగా ఉందని రావడం తప్ప మిగతా టెస్టు రిపోర్టులు అన్నీ బాగానే వచ్చాయి. నాకు ఏ కష్టం వచ్చినా నా సాయితండ్రే నాకు రక్ష. "ప్రతి విషయంలో మాకు తోడుగా ఉంటున్న మీకు ధన్యవాదాలు సాయితండ్రి. నా భర్త షుగర్ అదుపులో ఉండేలా దయచూపండి".

11 comments:

  1. Om Sri Sai Nathaya Namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Omsainadhayanamaha

    ReplyDelete
  4. Om Sai Rakshak Saranam Devaa 🙏🙏🙏

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete
  7. Om Sai Ram 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  8. ఓంసాయినాథయా నమః 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo