ఈ భాగంలో అనుభవాలు:
1. వృత్తి జీవితం గురించి బాబా భరోసా
2. అడ్డంకులు తొలగించిన బాబా
వృత్తి జీవితం గురించి బాబా భరోసా
నా పేరు మాధవి. మేము యూఎస్ఏలో ఉంటాము. ఒకసారి మా బాబుకి ఒక వారం పాటు సెలవులు వచ్చాయి. అప్పుడు మేము మరో రెండు కుటుంబాలతో కలిసి గుడికి వెళ్లాలని ముందుగా ప్రణాళిక వేసుకున్నాము. ఆ సమయంలో నేను నా వృత్తి జీవితంలో చాలా క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాను. నా వృత్తి జీవితంలో వచ్చిన విరామాల వల్ల ఉద్యోగం సంపాదించడం, దాన్ని నిలబెట్టుకోవడం నాకు సవాలుగా మారాయి. నేను కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి అన్ని విధాలా సాధ్యమైన అన్ని ప్రయత్నిస్తున్నప్పటికీ నేను చాలా నిరాశకు గురై ఉన్నాను. ఆ స్థితిలో నేను నా సర్వస్వాన్ని బాబా పాదపద్మాల వద్ద సమర్పించి, నా పరిస్థితిని సరిచేయమని ఆయన్నే ప్రార్థించాను. తర్వాత 'ఈ సెలవుల్లో గుడిని సందర్శించగలిగితే, అది నా వృత్తి విషయంలో ఆయన ఆశీర్వాదాలకు సంకేతంగా భావిస్తానని' నాకు నేను చెప్పుకున్నాను. అయితే దురదృష్టవశాత్తు సెలవుల్లో జ్వరమొచ్చి నేను అనారోగ్యం పాలయ్యాను. మా ప్రయాణ సమయానికి కోలుకుంటానని ఆశించాను కానీ, నాకు నయం కాలేదు. నేను మాత్రమే కాదు, నా భర్త, మాతోపాటు రావాలనుకున్న ఇతర కుటుంబసభ్యులు కూడా జబ్బునపడ్డారు. నాకు చాలా నిరాశ కలిగి, 'బహుశా నా వృత్తి విషయంలో బాబా నాకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదేమో' అని ఆలోచించడం మొదలుపెట్టాను.
మేము ప్రయాణం అనుకున్న రోజు నాకు కొంచెం నయంగా అనిపించింది. కానీ నా భర్తకు ఇంకా ఒంట్లో బాగోలేదు. కనీసం నాకైనా దగ్గరలోని గుడికి వెళ్ళే అవకాశం కల్పించమని బాబాను ప్రార్థించి నా భర్తను అడిగాను. అయన ఆరోజు డ్రైవ్ చేయలేనని చెప్పి, మరుసటిరోజు వెళ్దామని అన్నారు. అది విని నాకు, 'బహుశా నేను కోరుకున్నట్టు జరగాలని లేదేమో!, నా కర్మలో భాగంగా నేను ఈ దశను ఎదుర్కోవలసిందేనేమో!' అని బాధగా అనిపించింది. ఏదేమైనా విషయాన్ని బాబాకు అప్పగించి ఊరుకున్నాను. కానీ ఒక అనూహ్య సంఘటన జరిగింది. సాయంత్రం సుమారు 5:30 గంటలకు నా భర్త అకస్మాత్తుగా, "మనం గుడికి వెళదామా?" అని అడిగారు. నేను ఆయన ఆరోగ్యం బాగుందో, లేదోనని, "రేపు వెళ్లొచ్చు" అని అన్నాను. అందుకు ఆయన 'తాను బాగానే ఉన్నానని, కారు నడపగలనని' అన్నారు. బాబాపట్ల నాకు అపారమైన కృతజ్ఞతాభావం కలిగింది.
ఆ క్షణంలో నాకు ఎంత సంతోషం కలిగి ఉంటుందో మీరు ఊహించగలరనుకుంట!
తర్వాత మేము గుడికి బయలుదేరుతుండగా, బాబా పసుపు రంగు వస్త్రాలు ధరించి ఉండాలని నా మనసులో ఒక చిన్న కోరిక మెదిలింది. ఒక క్షణం పాటు ఆ కోరిక నా మదిలో బలంగా ఉన్నప్పటికీ, అంత బలంగా కోరుకోవడం అత్యాశ అవుతుందేమోనని కూడా అనుకున్నాను. ఆ ఆలోచనలతోనే నేను గుడికి ప్రయాణం సాగించాను. మేము గుడికి వెళ్లేసరికి బాబా పసుపు రంగు వస్త్రాల్లో దర్శనమిచ్చారు. ఆయనను ఆ విధంగా చూడగానే నా ఆనందానికి అవధులు లేవు. నేను బాబాను, "నేను నా వృత్తి జీవితంలో విజయం సాధించాలి. ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించండి" అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఇంటికి తిరిగి వచ్చాక అంతకంటే అందమైన సంఘటన జరిగింది. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా గుడిలో బ్రహ్మదేవునిగా ఏదో వ్రాస్తూ కనిపించారు. నేను నిద్రలేచినప్పుడు నాకు ప్రగాఢమైన శాంతి, ఆనందం అనుభవమయ్యాయి. బాబా నా విధి వ్రాతను మార్చి వ్రాస్తున్నారని, ఆ విధంగా నాకు ఆయన భరోసా ఇస్తున్నారని నేను నమ్మాను. ఆరోజు నుండి నా వృత్తి జీవితం గురించి నాకు ఆందోళన లేదు. నేను ఇంకా పూర్తిగా స్థిరపడకపోయినప్పటికీ నేను నా వంతు కృషి చేస్తూ ఉంటాను, మిగిలినది బాబా చూసుకుంటారని నాకు పూర్తి విశ్వాసముంది. "చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి ఈ జన్మలోనే కాకుండా ప్రతి జన్మలోనూ మాతో ఎల్లప్పుడూ ఉండండి".
అడ్డంకులు తొలగించిన బాబా
సాయిభక్తులకు నా నమస్కారం. నా పేరు ఈశ్వరి. మాది శ్రీకాకుళం. బాబాపట్ల నాకు పూర్తి విశ్వాసం.
నా బాధల్లో, కష్టాల్లో తోడుగా ఉంటానని ఆయన ఎన్నోసార్లు నాకు నమ్మకం కలిగించారు. ఒకసారి మేము తిరుపతి వెళ్లే ప్రయాణం పెట్టుకున్నాం, దర్శనం టికెట్లు, రానూపోనూ ట్రైన్ టికెట్లు అన్నీ బుక్ చేసుకున్నాము. అయితే అనుకోకుండా దర్శనంకి వెళ్లేరోజు నా నెలసరి సమయం అయింది. అందువల్ల, "నెలసరి ముందుగా రావాల"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల అద్భుతం జరిగినట్టు ఏడు రోజుల ముందే నెలసరి వచ్చేసింది. నేను మనసారా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇంకే సమస్య లేదు అనుకునేలాగా మావారికి ఆడిట్ అని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మేము ప్రయాణం పెట్టుకున్న రోజే ఆడిట్ అని చెప్పడంతో మావారు టెన్షన్ పడ్డారు. నేను మనసులో, 'ఆడిట్ మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత పెడితే బాగుంటుంది' అనుకొని బాబాను తలుచుకున్నాను. ఆరోజు రాత్రి మావారికి 'ఆడిట్ పోస్ట్ పోన్ అయింద'ని మెసేజ్ వచ్చింది. ఇదంతా బాబా వల్లే జరిగిందని నాకు తెలుసు గనక మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.

Om Sai Ram
ReplyDeleteOm Sai Ram please bless me with positive thoughts.My life and my husband life is in hell.please help
ReplyDeleteOm sai ram tandri, intlo ofce lo anta bagunde la chayandi tandri na kutumbanni andarni anni velala ayur arogyalatho kshamam ga kapadandi tandri pls.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsai sai
ReplyDeleteOmsai srisai jayajayasai
ReplyDeleteChala adbhutaimana andamaina and bhavalu panchukunna sodareemanulaku Dhanyavadalu.. baba krupa biddalapai ellappudu undali.. baba neeve dikku, kapadu 🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయి రామ్ 🙏 సాయిబాబా భక్తుల అనుభవాలు విశ్వాసం, భక్తి, ధైర్యాన్ని పెంచేలా ఉన్నాయి. బాబా కృప అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. 🙏
ReplyDeleteRolling screens for windows
Page Url : https://www.customscreens.in/rolling-screens-for-windows-hyderabad.html