సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2080వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబానే దిక్కు - ఆయన లేకపోతే ఏమైపోతామో!
2. ఊహించని విధంగా అనుగ్రహించిన బాబా

బాబానే దిక్కు - ఆయన లేకపోతే ఏమైపోతామో!  

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు లలిత. నాకు ఇద్దరు మగపిల్లలు. మొదటి బాబు పుట్టిన 3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ గర్భవతినయ్యాను. కానీ గర్భస్రావమై గర్భం నిలువలేదు. ఒక సంవత్సరం తర్వాత నేను మళ్ళీ గర్భవతినయ్యాను. కానీ అప్పుడు కూడా గర్భస్రావం అయ్యింది. ఇంకా నేను బాబాని, "బిడ్డ పుడితే మీ పేరు పెట్టుకుంటాను. అలాగే శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల కొన్నాళ్ళకి నేను మళ్ళీ గర్భవతినయ్యాను. కానీ ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంటుండేది. 2 నెలల తర్వాత కొంచెం బ్లీడింగ్ అయ్యింది. దాంతో మళ్ళీ గర్భస్రావం అయిపోతుందెమోనని నాకు ఇంకా భయమేసి బాబా దగ్గర ఏడుస్తూ, "నా గర్భం నిలపమ"ని చాలా వేడుకున్నాను. "అన్నదానం చేయిస్తాన"ని కూడా మొక్కుకున్నాను. నేను యూకేలో ఉంటాను. ఇక్కడ అడిగిన వెంటనే స్కానింగ్ చేయరు. ఒక వారం తర్వాత ఎప్పుడో అప్పోయింట్మెంట్ ఇచ్చారు. నేను 'లోపల బేబీకి ఎలా ఉందో? ఏంటో?' అని భయంతో ఆ వారం రోజులు చాలా నరకం చూసాను. కానీ బాబా దయవల్ల స్కానింగ్లో బిడ్డ గుండె కొట్టుకుంటుందని, బిడ్డ ఆరోగ్యంగా ఉందని వచ్చింది. అప్పుడు నేను ఎలా ఫీల్ అయుంటానో వేరే చెప్పాలా? బాబాకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు. తర్వాత ఇంకోసారి కూడా కొంచం బ్లీడింగ్ కనిపించింది. బాబానే దిక్కని ఊదీ నీళ్లలో కలుపుకొని రోజూ తాగుతూ 'సాయి సచ్చరిత్ర', సాయిమహారాజ్ సన్నిధి బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతుండేదాన్ని. దాంతో నాకు ఎంతో ఊరటగా, నమ్మకంగా ఉండేది. నా నమ్మకం వృధా కాలేదు. బాబా అడుగడుగునా నన్ను కాపాడుతూ నాకు ఆరోగ్యమైన బాబుని ప్రసాదించారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేముందు బాబుని చెకప్ చేసి, బాబు ఊపిరి ఎక్కువ సార్లు తీసుకుంటున్నాడని చెప్పి చాలా టెస్టులు చేసారు. ఆ సమయంలో నేను బాబా నామస్మరణ చేస్తూ, కాన్పుకోసం హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడే నాతోపాటు తీసుకెళ్లిన బాబా ఊదీ ప్యాకెట్ నా బిడ్డ తల కింద పెట్టేదాన్ని. బాబా నా మీద దయ చూపారు. రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. బాబా కృపవల్ల వారం తర్వాత నేను, నా బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చాము. ఇప్పుడు నా బిడ్డకి ఐదో నెల. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. బాబా లేకపోతే నాలాంటి వాళ్ళందరూ ఏమైపోతారో! ఆయనే అన్నిటికీ, అందరికీ దిక్కు. ఆయన ఊదీ ఎంతో అద్భుతమైనది. అత్యంత ఉత్తమ ఔషధం. ఆ ఊదీ నీళ్ళే ఇదివరకు నా అనారోగ్యాన్ని పోగొట్టి నాకు పునర్జన్మనిచ్చాయి. అందుకే నాకు బాబా ఊదీ అంటే చాలా నమ్మకం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. థాంక్స్ చెప్పుకోవడం తప్ప నేను ఏమి చేయలేను బాబా".


7 comments:

  1. Om sai ram tandri anta bagunde la chusukondi tandri pls, ofce lo unna samasyalu teerchi naaku manashanti ni ivvandi tandri meere naaku unna adaram tandri pls, nannu na kutumbannni andarni anni velala ayur arogyalatho kshamam ga kapadandi tandri pls.

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు బాబా.
    కష్టాలు తొలగించి, అందరినీ చల్లగా కాపాడు తండ్రి.
    ఈ శరీరం ఉన్నంత వరకు మీ పాదాల చెంతనే మమ్మల్ని ఉండనీయండి బాబా.

    అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
    శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై 🙏

    ఓం సాయిరాం 🙏
    మీరు ఎంతో అద్భుతంగా ఈ మాటలను రాశారు.
    మీరు మరియు మీ కుటుంబాన్ని ఆ బాబా ఎల్లవేళలా కాపాడుగాక.

    ఓం సాయిరాం 🙏

    ReplyDelete
  4. Om sri sairam 🙏🙏

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. Om Sri Sairam Guru Deva Datta 🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo