సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2077వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కష్టాన్ని బాబా ముందు చెప్పుకుంటే చాలు - ఆయన దాన్ని తప్పకుండా పరిష్కరిస్తారు
2. బాబా దయతో ఆరోగ్యం

కష్టాన్ని బాబా ముందు చెప్పుకుంటే చాలు - ఆయన దాన్ని తప్పకుండా పరిష్కరిస్తారు

నా పేరు సౌమ్య. మన తండ్రి సాయిబాబా ఎంత దయామయుడో నేను నా జీవితంలో ఎన్నోసార్లు అనుభూతి చెందాను. నేను నాకు ఎలాంటి కష్టమొచ్చినా గురువారం బాబా గుడికి వెళ్లి, బాబాతో చెప్పుకుంటాను. ఆశ్చర్యంగా, మళ్ళీ గురువారం వచ్చే లోపలే ఆ కష్టం తొలగిపోతుంది. బాబా ముందు కూర్చొని మన బాధను చెప్పుకోవడమే చాలు. కొన్ని సంవత్సరాల క్రితం నా నిశ్చితార్థం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి రద్దు అయింది. ఆ సమయంలో నేను చాలా బాధననుభవించాను. బాబా గుడికి వెళ్లి చాలా ఏడ్చాను. ఆశ్చర్యకరంగా ఒక గంటలోపే నా మనసులో ఉన్న బాధంతా బాబా తీసేసినట్టు నాకనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది — 'బాబా మన బాధను మనకన్నా బాగా అర్థం చేసుకుంటారు' అని.

ఒకసారి నేను రాపిడో సర్వీసుకోసం 999 రూపాయలు రీఛార్జ్ చేశాను. కానీ నేను ఆ డబ్బు ఉపయోగించుకోలేకపోయాను. కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే, వారు నా బ్యాంక్ అకౌంట్ నంబర్ అడిగారు. కానీ ఈ రోజుల్లో ఎవరికైనా బ్యాంక్ వివరాలు ఇవ్వడం సురక్షితం కాదని నాకనిపించి, "బాబా! నా డబ్బు తిరిగి వస్తే, మీకు కొబ్బరికాయ సమర్పిస్తాను” అని బాబాకి మొక్కుకున్నాను. ఆశ్చర్యంగా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వకుండానే రెండు రోజుల్లో నా డబ్బులు నాకు తిరిగి వచ్చాయి. అదే సమయంలో ఫేస్‌బుక్‌లో “నీ డబ్బులు ఎక్కడికీ పోవు” అనే బాబా సందేశం కనిపించింది.

మరోసారి నాకు, “నాకు పసుపురంగు పూలు తీసుకుని రా” అని బాబా సందేశం కనిపించింది. రెండు రోజుల తర్వాత ఇంట్లో మా అమ్మ సన్నజాజి పూలు మాల కట్టి పెట్టింది. దాన్ని బాబాకు సమర్పించాలనిపించింది నాకు.  కానీ నాకు గుడికి వెళ్లేంత ఒపికలేకపోయింది. అయినా ఎలాగోలా గుడికి వెళ్లి బాబాకు సమర్పించాను. అప్పుడు, 'నేను సన్నజాజి పూలు తీసుకురాకపోయినా బాబాకు పరవాలేదు. ఆయనకు మన భక్తి ముఖ్యమ'ని నాకు అనిపించింది.

ఒకసారి నేను ఆఫీసులో ఒక ప్రాజెక్ట్‌ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు పని విషయంలో చాలా టెన్షన్‌గా ఉండేది. అప్పుడు నేను ఒక గురువారం బాబా గుడికి వెళ్లి, ఆయన ముందు కూర్చొని, "బాబా! ఈ ప్రాజెక్ట్ నుంచి నన్ను బయటపడేసి మరో మంచి ప్రాజెక్ట్ ఇవ్వండి” అని ప్రార్థించాను. బాబా కృప చూడండి!! నేను బాబాని అడిగినట్టుగానే మరుసటి గురువారం లోపల నన్ను ఆ ప్రాజెక్ట్ నుండి విడుదల చేస్తామని ఆఫీసులో చెప్పారు. అంతేకాదు, మరో గురువారం వచ్చేసరికి నాకు కొత్త ప్రాజెక్ట్ కూడా వచ్చింది. నిజానికి నేను ప్రాజెక్టు విషయంలో ఇబ్బందిపడుతున్నప్పుడు “నీకు మంచి ప్రాజెక్ట్ వస్తుంది, నా గుడికి స్వీట్లు తీసుకువస్తావా?” అనే బాబా సందేశం కనిపించింది. బాబా చెప్పినట్టుగానే నాకు మంచి ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడు నాకు మరింతగా అనిపించింది — 'మన కష్టాన్ని బాబా ముందు చెప్పుకుంటే చాలు, ఆయన దాన్ని తప్పకుండా పరిష్కరిస్తారు' అని. ఇలా బాబా నా మనసును, నా కష్టాలను అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు నాకు దారి చూపిస్తూ, నా సమస్యలను తొలగిస్తూ ఉన్నారు. "సాయితండ్రీ! ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ మీ పాదాల చెంత మేము ఉండేలా ఆశీర్వదించండి".

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు. 



10 comments:

  1. Om sai sai jai jai sai ram

    ReplyDelete
  2. Om Sairam
    Sai allwlays be with me

    ReplyDelete
  3. Omsrisaiarogyakshemadhayinenamaha

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete
  5. Om sri sairam 🙏🙏

    ReplyDelete
  6. Om Sri Sai Raksha 🙏🙏🙏
    Om Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo