ఈ భాగంలో అనుభవాలు:
1. సమయానికి 'నేనున్నాను' అని తల్లిలా ఆదుకున్న సాయితల్లి
2. ముందే కలలో సూచించిన బాబా
సమయానికి 'నేనున్నాను' అని తల్లిలా ఆదుకున్న సాయితల్లి
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను చాలా రోజుల తర్వాత సాయికృపను మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2025, జనవరిలో మా అమ్మకు హార్ట్ సర్జరీ జరిగింది. ఆ సమయంలో బాబా మాకు తోడు ఉండి సహాయాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు(ఆ అనుభవాన్ని "'నేను మీతో ఉన్నాన'ని అభయమిచ్చిన బాబా" అన్న టైటిల్‌తో ఇదివరకు మీ అందరితో పంచుకున్నాను). తర్వాత ఆ సంవత్సరమంతా మా అమ్మ చాలా ఆరోగ్యంగా ఉంది. దానికి ఆ తండ్రికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక ఇప్పటి అనుభవానికి వస్తే.. 2025, డిసెంబర్ నెలాఖరులో ఒకరోజు ఉదయాన్నే మా అమ్మ నాకు ఫోన్ చేసి, "ఈరోజు ఉదయం నా ఎడమ చేయి ఐదు నిమిషాలపాటు పని చేయలేదు. తర్వాత మళ్లీ మామూలుగా వచ్చింది" అని చెప్పింది. నేను ఉన్న చోటు నుండి వాళ్ళ దగ్గరకి వెళ్లి అమ్మని డాక్టరుకి చూపిద్దామంటే 4 గంటలు పడుతుంది. అంత ఆలస్యం చేయడం మంచిది కాదనిపించింది నాకు. అందుకని మా నాన్నతో వెంటనే అమ్మని న్యూరాలజిస్ట్ దగ్గరకి తీసుకెళ్లి MRI స్కాన్ తీయించమని చెప్పాను. తర్వాత బాబాను, "అమ్మకు ఇబ్బంది లేకుండా చూడండి" అని చెప్పుకున్నాను. కానీ నాకు కొంత ఆందోళనగానే ఉండింది. కాసేపటికి ఈ బ్లాగు ఓపెన్ చేసి ఆరోజు అనుభవాన్ని చదివితే, అక్కడ ఒక భక్తులు తమ తండ్రికి బాగాలేదని, బయాప్సీ చేయించి, "అందులో ఏ ఇబ్బంది ఉండకూడద"ని బాబాని కోరుకుంటే, అంత బాగుందని, క్యాన్సర్ కాదని పంచుకున్నారు. ఆ అనుభవాన్ని చదివాక నాకు బాబా ఆ అనుభవం ద్వారా అమ్మకు బాగుంటుందని చెప్తున్నారనిపించి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆ తర్వాత వచ్చిన రిపోర్టులో చిన్న చిన్న రక్తం గడ్డలు గుండె నుండి బ్రెయిన్‌లోకి చేరినట్లు వుంది. కానీ దానివల్ల అమ్మకు ఇబ్బంది లేదు, డాక్టరు పక్షవాతం రాకుండా మందులు వాడాలని మందులు రాశారు. నిజానికి అమ్మ రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి మందులు వాడుతుంది. వాటిని కార్డియాలజిస్ట్ వ్రాసారు. మేము మూడు నెలల క్రితం ఆ మందులు ఆపుదామని కార్డియాలజిస్ట్ డాక్టర్ని అడిగాము. అందుకాయన వాటిని ఆపకుండా డోస్ తగ్గించారు. అదే ఆయన వాటిని ఆపేసి ఉంటే అమ్మకి పూర్తిగా పక్షవాతం వచ్చి ఉండేది. బాబానే ఆయన రూపంలో మాకు సహాయం చేసి పెద్ద ఇబ్బంది రాకుండా కాపాడారు. వెంటనే కార్డియాలజిస్ట్‌ని సంప్రదిస్తే, ఆయన అన్ని టెస్టులు చేసి, అన్ని బాగున్నాయని ఆ మందుల డోస్ మార్చి పంపారు. సమయానికి 'నేనున్నాను' అని తల్లిలా ఆదుకున్న సాయితల్లికి ఈ బ్లాగు ద్వారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
ముందే కలలో సూచించిన బాబా
నా పేరు లక్ష్మి. మేము వైజాగ్‌లో ఉంటాం. 2025, డిసెంబర్ నెలాఖరులో ఒకరోజు నిద్రపోతుంటే నా బంగారం పోయినట్టు కనిపించింది. నేను కంగారుగా, 'అయ్యో..' అని నిద్రలేచాను. తీరా చూస్తే, అది కల. కలే కదా అని ప్రశాంతంగా ఉన్నాను. కానీ నిజంగానే మావారి చేతి బ్రాస్లెట్ సోమవారం నాడు పోయింది. ఆ విషయం మాకు ఆరోజు తెలియలేదు. మేము ఆమధ్యనే కొత్త ఇంటిలోకి మారాం. అక్కడికి దగ్గరలో బాబా గుడి ఉందని మా పక్కింటావిడ చెపితే, గురువారం హారతికి వెళదామని అనుకున్నాం. మావారు తిరిగి వచ్చేటప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి కారు తీసుకొని వస్తానని చెప్పారు. మేము సరేనని నడిచి వెళ్ళాము. హారతి అయ్యాక అక్కడ అన్న ప్రసాదం తీసుకున్నాము. మావారు కూడా వచ్చారు. అప్పుడు మావారు తన చేతికి ఉండాల్సిన బ్రాస్లెట్ లేదని చూసుకున్నారు. ఇక అందరం టెన్షన్ పడ్డాం. ఇంటికి వచ్చి అంతా వెతికాం కానీ, అది కనపడలేదు. మావారు ఆ ముందు సోమవారం తన స్నేహితుడి పని మీద వెళ్ళారు. అందుకని వాళ్ళకి ఫోన్ చేసి, విషయం చెప్పి వాళ్ళ కారులో ఉందేమో చూడమని మావారు అడిగారు. అతను చూసి, "వెతికాను. బ్రాస్లెట్ లేదు" అని చెప్పారు. నాకు కోపమొచ్చి, "ఒంటి మీద వస్తువు ఉందా, లేదా అని తెలియనంతగా ఉన్నారా?" అని మావారిని తిట్టాను. తర్వాత నేను బాబాని "ఆ బ్రాస్లెట్ దొరికేలా చేయమ"ని వేడుకున్నాను. అదే విషయం మా వారికి చెప్పాను. ఎంత లేదన్న 5, 6 లక్షల ఖరీదు ఉంటుంది ఆ బ్రాస్లెట్. అందువల్ల మేము చాలా బాధపడ్డాం. మావారి స్నేహితుడు కూడా "అయ్యో.. నా పనికోసం వచ్చి పోయిందే!" అని బాధపడి కారులో మొత్తం అంతా మరోసారి వెతికించారు. అప్పుడు సీటు కింద ఒక మూలగా మా బ్రాస్లెట్ పడి ఉందట. అతను వెంటనే అది తీసుకుని వచ్చి మాకిచ్చారు. నేను నా బాధలో "బాబా! మేము ఎవరిది ఒక రూపాయి కూడా తీసుకోలేదు. కష్టపడి సంపాదించింది. అలాంటిది పోయింది. నువ్వు అన్నీ చూస్తావు కదా! మరి ఎలా పోయింది?" అని బాబాను ప్రశ్నించాను. కానీ బ్రాస్లెట్ దొరికాక నాకొచ్చిన కల గుర్తొచ్చి, 'బాబా చెప్పారు. నేనే సరిగా శ్రద్ధ తీసుకోలేదు' అనిపించింది. ఏదేమైనా బాబా దయవల్ల మా బ్రాస్లెట్ మాకు దొరికింది.
బాబా చూస్తున్నారు, వింటున్నారు అన్నది 100℅ నిజం. సర్వకాల, సర్వావస్థలందు మనం బాబాని గుర్తుంచుకుంటే చాలు. ఆయన మన విషయాలన్నీ చూస్తారు. "ధన్యవాదాలు బాబా".

Sai Sai 🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Ram 🙏🙏
ReplyDeleteOmsairam
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku 👍 vandanalu
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya namaha🙏🙏🙏
Baba tammudi kapuranni nilabettu 🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDelete