సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2060వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమయానికి 'నేనున్నాను' అని తల్లిలా ఆదుకున్న సాయితల్లి  
2. ముందే కలలో సూచించిన బాబా

సమయానికి 'నేనున్నాను' అని తల్లిలా ఆదుకున్న సాయితల్లి  

సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను చాలా రోజుల తర్వాత సాయికృపను మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2025, జనవరిలో  మా అమ్మకు హార్ట్ సర్జరీ జరిగింది. ఆ సమయంలో బాబా మాకు తోడు ఉండి సహాయాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు(ఆ అనుభవాన్ని  "'నేను మీతో ఉన్నాన'ని అభయమిచ్చిన బాబా" అన్న టైటిల్‌తో ఇదివరకు మీ అందరితో పంచుకున్నాను). తర్వాత ఆ సంవత్సరమంతా మా అమ్మ చాలా ఆరోగ్యంగా ఉంది. దానికి ఆ తండ్రికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక ఇప్పటి అనుభవానికి వస్తే.. 2025, డిసెంబర్ నెలాఖరులో ఒకరోజు ఉదయాన్నే మా అమ్మ నాకు ఫోన్ చేసి, "ఈరోజు ఉదయం నా ఎడమ చేయి ఐదు నిమిషాలపాటు పని చేయలేదు. తర్వాత మళ్లీ మామూలుగా వచ్చింది" అని చెప్పింది. నేను ఉన్న చోటు నుండి వాళ్ళ దగ్గరకి వెళ్లి అమ్మని డాక్టరుకి చూపిద్దామంటే 4 గంటలు పడుతుంది. అంత ఆలస్యం చేయడం మంచిది కాదనిపించింది నాకు. అందుకని మా నాన్నతో వెంటనే అమ్మని న్యూరాలజిస్ట్ దగ్గరకి తీసుకెళ్లి MRI స్కాన్ తీయించమని చెప్పాను. తర్వాత బాబాను, "అమ్మకు ఇబ్బంది లేకుండా చూడండి" అని చెప్పుకున్నాను. కానీ నాకు కొంత ఆందోళనగానే ఉండింది. కాసేపటికి ఈ బ్లాగు ఓపెన్ చేసి ఆరోజు అనుభవాన్ని చదివితే, అక్కడ ఒక భక్తులు తమ తండ్రికి బాగాలేదని, బయాప్సీ చేయించి, "అందులో ఏ ఇబ్బంది ఉండకూడద"ని బాబాని కోరుకుంటే, అంత బాగుందని, క్యాన్సర్ కాదని పంచుకున్నారు. ఆ అనుభవాన్ని చదివాక నాకు బాబా ఆ అనుభవం ద్వారా అమ్మకు బాగుంటుందని చెప్తున్నారనిపించి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆ తర్వాత వచ్చిన రిపోర్టులో చిన్న చిన్న రక్తం గడ్డలు గుండె నుండి బ్రెయిన్లోకి చేరినట్లు వుంది. కానీ దానివల్ల అమ్మకు ఇబ్బంది లేదు, డాక్టరు పక్షవాతం రాకుండా మందులు వాడాలని మందులు రాశారు. నిజానికి అమ్మ రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి మందులు వాడుతుంది. వాటిని కార్డియాలజిస్ట్ వ్రాసారు. మేము మూడు నెలల క్రితం ఆ మందులు ఆపుదామని కార్డియాలజిస్ట్ డాక్టర్ని అడిగాము. అందుకాయన వాటిని ఆపకుండా డోస్ తగ్గించారు. అదే ఆయన వాటిని ఆపేసి ఉంటే అమ్మకి పూర్తిగా పక్షవాతం వచ్చి ఉండేది. బాబానే ఆయన రూపంలో మాకు సహాయం చేసి పెద్ద ఇబ్బంది రాకుండా కాపాడారు. వెంటనే కార్డియాలజిస్ట్‌ని సంప్రదిస్తే, ఆయన అన్ని టెస్టులు చేసి, అన్ని బాగున్నాయని ఆ మందుల డోస్ మార్చి పంపారు. సమయానికి 'నేనున్నాను' అని తల్లిలా ఆదుకున్న సాయితల్లికి ఈ బ్లాగు ద్వారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.


5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo