ఈ భాగంలో అనుభవాలు:
1. పరిష్కరించలేని సమస్యలను సాయి పరిష్కరించగలరు
2. ప్రార్థనకు బదులిచ్చిన బాబా
పరిష్కరించలేని సమస్యలను సాయి పరిష్కరించగలరు
గురుబంధువులందరికీ నమస్కారం. నా పేరు మోహన్. మేము కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు ద్వారబంధాల(గడపల) తయారీకోసం ఒక వడ్రంగికి 57 వేల రూపాయలు ఇచ్చాను. కొంతకాలానికి పని ఎంతవరకు వచ్చిందని అడగడానికి అతనికి ఫోన్ చేస్తే, అతను ఫోన్ తీయలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీసేవాడు కాదు. పక్క టౌన్లో ఉండే అతని షాపు వద్దకు వెళితే అక్కడ కూడా ఉండేవాడు కాదు. అతని ఇంటికి వెళ్ళినా కనిపించేవాడు కాదు. అతని గురించి నాకు ఏమీ తెలియదు. మా మేస్త్రి తీసుకొస్తే పని అప్పగించాను. కాగితాలు కూడా రాసుకోలేదు. కేవలం నోటి మాట మీద డబ్బు ఇచ్చేశాను. అందుకని మాకు చాలా భయమేసింది. ఇప్పుడెలా అని చాలా బాధపడ్డాము. మేస్త్రిని పిలిచి తిట్టాము. అతనికోసం తిరుగుతూ నాలుగు, అయిదు నెలలు గడిచాయి. రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు. ఇంకా అప్పుడు సాయిని, "తండ్రీ! నోటి మాట మీద డబ్బు ఇచ్చాను. అది పెద్ద మొత్తం. అందుకు సంబంధించి నా దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. ఈ పరిస్థితుల్లో నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. దయచేసి నాకు సహాయం చేయండి. మీ పేరు మీద అన్నదానం చేస్తాను" అని ప్రార్థించాను. తరువాత కొన్నిరోజులకు ఎప్పటిలానే గమనించడానికి అతని షాపుకి వెళ్లాను. ఆశ్చర్యం! బాబా దయవల్ల ద్వారబంధాలు తయారై సిద్ధంగా ఉన్నాయి. అతను కిటికీలు చేయడానికి మళ్ళీ డబ్బు అడిగాడు. నేను, "మీ మీద నాకు నమ్మకం లేదు. పని చేసిన తర్వాత డబ్బులు తీసుకోండి" అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా వెహికల్ మాట్లాడుకొని ద్వారబంధాలు తీసుకొని వచ్చేశాను. తర్వాత కిటికీలు తయారికోసం వేరే వండ్రంగితో మాట్లాడుకున్నాను. నేను చెబుతున్నాను, 'పరిష్కరించలేని సమస్యలను సాయి పరిష్కరించగలరు'. "ధన్యవాదాలు బాబా".
ప్రార్థనకు బదులిచ్చిన బాబా
అందరికీ నమస్కారాలు. నా పేరు మాధవి. మేము యుఎస్ఏలో నివాసముంటున్నాము. ఒకసారి సెలవులు గడపడానికి మేము బీచ్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకొని ముందుగా అక్కడ హోటల్ బుక్ చేసుకున్నాం. మా ప్రయాణానికి ఇంకా 2 రోజులు ఉందనగా మా 6 ఏళ్ల బాబుకి జ్వరం చాలా ఎక్కువగా వచ్చింది. ఆ జ్వర తీవ్రత వల్ల బాబు నిద్రలో వింతగా కలవరించాడు. నేను చాలా భయపడి బాబాని తలుచుకొని ఆ రాత్రంతా ఆయన నామస్మరణ చేసుకుంటూ బాబు శరీరం తడి గుడ్డతో తుడుస్తూ, "బాబుకి ఎలా ఉంటుందో ఏమో! ప్రయాణం రద్దు చేద్దామంటే, మాతోపాటు మరో నాలుగు కుటుంబాలు వస్తున్నాయి. అదీకాక రూమ్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పుడెలా బాబా?" అని అనుకున్నాను. మరుసటిరోజు బాబు నిరుత్సాహంగా ఉన్నాడు, నిద్రలేనందున నాకు కూడా చాలా కష్టం అనిపించింది. దానికితోడు మా అమ్మకి ఫోన్ చేస్తే, తనకి విరోచనలై బాగోలేదని తెలిసింది. ఇంకా నా వల్ల కాలేదు. సమస్య చిన్నదే అయినా ఇటు బాబు, అటు అమ్మ. ఇద్దరూ త్వరగా బాగైపోతే బాగుండు అని బాబా నామస్మరణ చేస్తూ, "బాబా! బాబుకి జ్వరం తగ్గి ఉత్సాహంగా అవ్వాలి. అమ్మ కూడా కాస్త కొలుకునేలా చూడండి" అని బాబాతో చెప్పుకున్నాను, ఇక బాబా అద్భుతం చూడండి. మా ప్రయాణానికి కొన్ని గంటల ముందు బాబు కాస్త చురుగ్గా అయ్యాడు. అక్కడికి వెళ్ళాక కూడా మరీ అంత నిరుత్సాహంగా లేకుండా కాస్త చురుకుగానే ఉన్నాడు. అక్కడినుండి తిరిగి వచ్చాక పూర్తిగా చురుకు అయ్యాడు.
నా ప్రార్ధనలు విని బాబుకి ఆరోగ్యం కుదుటపడేలా చేసారు బాబా. లేకపోతే, ప్రయాణం రద్దు అయినందుకు అందరూ నిరుత్సాహపడేవాళ్ళము, డబ్బు కూడా వృద్ధ అయ్యేది.
ఇంకో విషయం, జ్వరం వల్ల బాబు ఏదైనా తింటుంటే తలనొప్పి వస్తుందని ఫిర్యాదు చేసాడు. నాకు అది కూడా టెన్షన్‌గా అనిపించి, "బాబా! నేను ఏ డాక్టర్ దగ్గరకి బాబుని తీసుకెళ్ళాను. మీరే మా డాక్టర్, ఊదీయే మాకు ఔషధం. బాబుకి అదే ఇస్తాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయ చూపారు. వేరే ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు, తన కొడుకు కూడా జ్వరం వచ్చిన తర్వాత ఇలానే బాధపడ్డాడనీ, పులుపు పదార్థాలు పెడుతుంటే తలలో నొప్పి వస్తుండేదనీ తెలిసింది. అందుచేత తను "పులుపు పదార్థాలు పెట్టకు" అని చెప్పింది. దాంతో ఒక వారం రోజులు నేను బాబుకి పులుపు పదార్థాలు పెట్టలేదు. బాబా దయవల్ల బాబు ఆరోగ్యం కుదుటపడింది. మా అమ్మ ఆరోగ్యం కూడా 3 రోజులలో కుదురుపడింది. "ధన్యవాదాలు బాబా. కోటికోటి ప్రణామాలు బాబా. అమ్మానాన్నల ఆరోగ్యం బాగుండేలా చూడండి బాబా. మేము వాళ్ళకి దూరంగా ఉన్నాము. మీరే వాళ్ళకి తోడుగా ఉండండి బాబా".
సాయి స్మరణం శంకట హరణం|
బాబా శరణం భవభయ హరణం||
Om sairam 🙏
ReplyDeleteOm Sai Ram please bless my son family 🙏🙏 please 🙏 be with them.Bless their return journey safe.Take care of them.Give me courage
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sri Sainathaya Nama, Saibaba save me and our family. We are in big trouble, Baba remove all pains and give peace full life. We all are surrendered to your lotus feet. Saibaba please save my job and save our family.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi pl
ReplyDeleteSai kapadu saranu saranu.. Amma nanna ki sampoorna ayurarogyalatho anugrahinchu.. Amma nannaki ye apada rakunda kapadu tandri 🙏
ReplyDeletePriyathi priyamaina na baba tandri,
ReplyDeleteNeevu prasadinchuna anugrahaniki Chala Chala thanks.. naku ichina matalu prakaram eppatilane mammalni kapadu tandri.. Amma nannani, nannu ma ayanani, na biddalani na puttintivarini, mettininti varini kapadutu undu deva.. ma adabiddalaki pelli sambandhalu kudurinchi tondaraga vivaham jaripinchu jagannatha 🙏🥲🥲🥲🙏🙏🙏🙏🙏
Itlu,ninne nammukunna nee bidda🙏
Baba.. swetcha ni kolpoyanu tanavalla 🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲
ReplyDeleteOm Sai Ram
ReplyDelete