ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు
2. ప్రార్థన విని సమస్యను పరిష్కరించిన బాబా
3. సాయి కరుణ
బాబా ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు
గురుభ్యోనమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. నా పేరు వెంకటరమణ. మాది ఏలూరు జిల్లా. నా చిన్నతనం నుంచి బాబా చేసిన లీలలలు ఎన్నో ఎన్నెన్నో. వాటిలో నుండి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2025, జూన్ 22న మేము కొల్లేరు పెద్దింట్లమ్మ అమ్మవారికి పొంగలి నైవేద్యం నివేదించాలనుకొని అన్నీ సిద్ధం చేసుకున్నాము. అంతా సిద్ధమయ్యాక 21వ తారీఖు సాయంత్రం విపరీతమైన గాలివాన మొదలైంది. అది చూసి మాకు భయమేసింది. ఎందుకంటే, ఆ గుడి దగ్గరకు వెళ్లే మార్గం సరిగా ఉండదు. బాబాని తలుచుకుంటూ "ఏంటి బాబా? అన్ని సిద్ధం చేసుకున్నాక ఇలా అయింది" అని బాబాని వేడుకున్నాము. అంతే! 22వ తారీకు ఉదయం నుంచి మేము పొంగలి అమ్మకి నివేదించి ఇంటికి వచ్చేవరకు వర్షం అస్సలు లేదు. ఆ బాబా ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు అంటారు. అది నిజం. నేను, నా కుటుంబం జీవితాంతం సాయిబాబాకి ఋణపడి ఉంటాము.
ప్రార్థన విని సమస్యను పరిష్కరించిన బాబా
సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా లీలల గురించి నేను ఏమని చెప్పగలను? సమస్య ఏదైనా మనస్ఫూర్తిగా బాబాకి చెప్పుకుంటే, ఆయన ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఈ బ్లాగులో చాలామంది బాబా భక్తులు ఎలక్ట్రానిక్ వస్తువుల సమస్యలు ఏవైనా ఉంటే బాబాకి చెప్పుకున్నంతనే సమస్య పరిష్కారమైందని తమ అనుభవాలను మనతో పంచుకున్నారు. అటువంటిదే నా అనుభవం. 2025, జూన్లో మా వాషింగ్ మిషన్ చెడిపోతే 7,000 రూపాయలతో బాగు చేయించాను. కానీ మళ్లీ వెంటనే వేరే సమస్య వచ్చింది. ఈసారి బాగు చేయించడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకని బాబా ముందు కూర్చొని, "బాబా! నా పరిస్థితి మీకు తెలిసిందే కదా! ఇప్పుడు నేను దాన్ని బాగు చేయించే పరిస్థితిలో లేను. దయచేసి నా ఈ సమస్యని పరిష్కరించండి బాబా" అని వేడుకొని ఆయన పాదాల చెంత ఉన్న ఊదీ తీసుకొని, "అనారోగ్య సమస్యలనే కాకుండా ఇలాంటి సమస్యలను కూడా పరిష్కరించండి బాబా" అని కొద్దిగా ఊదీ మిషన్లో వేసాను. తర్వాత మిషన్లో బట్టలు వేసి, మిషన్ స్విచ్ ఆన్ చేసి, "బాబా! ఇంకా మీ దయ. మీరు నా ప్రార్థన విన్నట్లైతే ఏ సమస్యా లేకుండా మిషన్ ఆన్ అవ్వాలి. మళ్లీ కంప్లైంట్ వచ్చిందంటే మీరు నా ప్రార్థన వినలేదని అర్థం చేసుకుంటాను" అని బాబాని గట్టిగా ప్రార్థించాను. నిజంగా బాబా నా ప్రార్థన విన్నారు. ఏ సమస్యా లేకుండా బట్టలు చక్కగా వాష్ అయ్యాయి. 'బాబా నా ప్రార్థన విన్నారు, నా సమస్య పరిష్కరించారని' నాకు ఎంత సంతోషం అనిపించిందో చెప్పలేను. సాయి లీలలు అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఆ అనుభూతి. "బాబా! మీకు ధన్యవాదాలు. మీ బంగారు పాదాలకు శతకోటి సాష్టాంగ నమస్కారాలు తండ్రీ. మమ్మల్ని ఎప్పుడూ ఇలానే కాపాడు సాయి".
సాయి కరుణ
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు విజయశ్రీ. 2024లో మా చిన్నబ్బాయి డిగ్రీ 2వ సంవత్సరం కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. ఆ విషయం తెలిసి నేను తనపై కేకలేసాను. తను ఏమీ మాట్లాడకుండా బయటికి వెళిపోయాడు. అలా వెళ్లినవాడు ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోయేసరికి నాకు భయమేసింది. వెంటనే బాబాను తలచుకొని, "తండ్రీ! నా బిడ్డను ఇంటికి పంపించు" అని సాయితండ్రిని వేడుకున్నాను. తర్వాత కాసేపటికి అబ్బాయి ఇంటికి వచ్చాడు. అప్పటిదాకా నేను పడిన టెన్షన్ అంతా పోయింది. సంతోషంగా సాష్టాంగ నమస్కారాలతో బాబాకి ధన్యవాదాలు తెలుపుకున్నాను. బాబా కృపతో 2025లో అబ్బాయి అన్ని సబ్జెక్టులు పాసయ్యాడు. ఒకసారి నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే, "తండ్రీ! బ్లీడింగ్ ఆగేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. వెంటనే బ్లీడింగ్ ఆగిపోయింది. "ధన్యవాదాలు సాయితండ్రీ! మీ కృప ఎప్పుడూ మా మీద, మీ భక్తులందరి మీద ఉండాలి తండ్రి".
Sai na bartha manasulo naku barya sthanam eppinchu thandri om sairam🙏
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOmsaisrisaijayajayasai
ReplyDelete