ఈ భాగంలో అనుభవాలు:
1. ఆపద్బాంధవుడు మన సాయి
2. కష్టాలు తీర్చే బాబా
ఆపద్బాంధవుడు మన సాయి
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
నేను ఒక సాయిభక్తురాలిని. ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు ఒక్కోసారి అవి మన నిజ జీవితంలోని విషయాలకు దగ్గరగా ఉంటున్నాయి. ఇది నా విషయంలోనే కాదు, చాలామందికి అనుభవమయ్యే ఉంటుంది. ఇక నా అనుభవాల విషయానికి వస్తే.. ఒకప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం. మావారు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవారు. అక్కడ ప్రాజెక్టులు అయిపోవడంతో మా ఊరు వచ్చేద్దామని నిర్ణయించుకున్నాము. అందుకని నేను కొన్ని విలువైన వస్తువులు మా అమ్మ వాళ్ళింటిలో ఉంచాను. నేను నా ఆరోగ్యం కోసం చేస్తున్న నవగురువార వ్రత ఉద్యా పన నిమిత్తం వెండి కుందులు కూడా మా అమ్మ వాళ్ళింటికి తెచ్చుకున్నాను. పూజ అంతా బాగా జరిగాక సాయంత్రం మందిరానికి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని వచ్చాను. తర్వాత కొన్నిరోజులకు మేము సామాన్లన్నీ తీసుకుని మా ఊరు వెళ్ళాం. సామాను సర్దుకునేసరికే బాగా అలసిపోయాను. నేను ఆ సమయంలో వెండి కుందులు కనిపించలేదని గుర్తించాను. వాటిని అమ్మ వాళ్ళింట్లో ఎక్కడ పెట్టానో కూడా నాకు జ్ఞాపకం లేదు. నా భర్తకి విషయం చెప్తే, 'తిడతారేమో! విలు వైన వస్తువుల విషయంలో అశ్రద్ధగా ఉంటానని అనుకుంటారెమో!' అని భయపడి, "వస్తువులు దొరికేలా చూడామ"ని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత అమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు 'సాయి నామం' జపిస్తూ కుందులు వెతికితే, అమ్మ వాళ్ళ బీరువాలో బాగా లోపల ఒక కవరులో ఆ వస్తువులు దొరికాయి. బాబాకి చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ఒకసారి కార్తీకమాసంలో మా పిన్ని, బాబాయ్ మా ఇంటికి వచ్చారు. అప్పుడు అందరం కలిసి కోటప్పకొండ వెళ్లి, అక్కడ స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే నా నెలసరి సమయం దగ్గర్లో ఉండడం వల్ల బాబాని, "నెలసరి రాకుండా చూడమ"ని వేడుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రికోటేశ్వరస్వామిని, అమరావతిలోని అమరేశ్వరుని కూడా దర్శించుకున్నాము.
నేను ఈరోజు జీవించు ఉన్నానంటే అది బాబా దయవల్లే. 2020, కరోనా కాలంలో నాకు షుగర్ వ్యాధి వచ్చింది. అప్పుడు మా బాబు నాలుగో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత లోపించడం, వాటికి తోడు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించకపోవడం వల్ల నేను చాలా సన్నగా అయిపోయాను. 'ఏంటి బాబా? నాకు మళ్లీ ఏమైనా అనారోగ్య సమస్య ఏమిటి?' అని అనుకున్నాను. ఆ సమయంలో నా తల్లిదండ్రులు, ముఖ్యంగా నా తల్లి నాకు చాలా సేవ చేశారు. నేను తట్టుకోలేక ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని ప్రాణత్యాగం చేయాలనుకున్నాను. నాకు ఎప్పుడూ అవే ఆలోచనలు వస్తుండేవి. నాకు రోజూ ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ చదవడం అలవాటు. ఒకరోజు బ్లాగులో ఒక భక్తుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. అది అచ్చం నాకొచ్చిన సమస్యే. అతను తన భార్యకి షుగర్ వ్యాధి ఉందని, బంధువులు, స్నేహితులు, చూసిన వాళ్ళందరూ 'నువ్వే ఎందుకు సన్నగా అయిపోతున్నావు?' అని అడుగుతుండేవారని, ఆమె ఆరోగ్య విషయమై చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారని, అతను ఆమెకు ధైర్యం చెప్పి టెస్టులన్నీ చేయిస్తే, నార్మల్ వచ్చాయని, 'కేవలం షుగర్ వల్లే సన్నగా అయ్యారు. మీరు ధైర్యంగా ఉండండి' అని డాక్టర్ చెప్పారని పంచుకున్నారు. అది చదివిన నాకు కొంత ధైర్యం వచ్చింది. కానీ నాకు అలాంటి ఆలోచనలే వస్తుండేవి. అయితే బాబా నన్ను వదల్లేదు. ఎప్పుడు ఫోన్ చూసినా యూట్యూబ్, ఫేస్బుక్ లో 'ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకు. వేచి ఉండు. నేను కాపాడుతాను. నీకు నేనున్నాను' అంటూ మెసేజ్లు వచ్చేవి. దాంతో, 'ఎప్పుడూ ఎలాంటి పొరపాటు చేయకూడదు. ఎలాంటి చెడు నిర్ణయం తీసుకోకూడదు. అదృశ్య రూపంలో బాబా మనతో మన వెంట ఉంటారు. మన మాటలు వింటారు. దేనికి భయపడకూడదు' అని నిర్ణయించుకున్నాను. ఆపద్బాంధవుడు మన సాయి. "ధన్యవాదాలు బాబా".
కష్టాలు తీర్చే బాబా
Om Sai Ram tandri you reduse my depression.Thank you tandri . with your blessings my son, grand sons came safely 🙏🙏
ReplyDeleteOmsairam
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi pl
ReplyDeleteOm sai ram, amma nannalani anni velala kshamam ga arogyam ga chudandi tandri pls, ofce lo na samasyalani teerchandi tandri pls meeru tappa naaku vere dikku ledu tandri, alage naaku manchi arogyanni prasadinchandi tandri pls.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Sairam swami thank you so much💐💐💐❤️❤️❤️❤️
ReplyDeleteOm Sai ram … Om Sai ram..om Sai ram..om Sai ram.. om Sai ram ..om Sai ram..om Sai ram ..om Sai ram ..om Sai ram ..om Sai ram ..om Sai ram ..om Sai ram ..om Sai ram ..om Sai ram.. Sai sorry .. enduko cheppalanipinchindi.. kani ee roju jarigina dantlo na tappu ledane na manasuki anipistondi.. na aparadham undi ani niku anipiste nannu kshaminchu…. Sorry baba
ReplyDeleteSainadhahouse advance problem solve cheyandi pl
ReplyDelete