సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1998వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి భగవానుని లీలలు ఊహించగలం!
2. ప్రార్థన విన్న బాబా
3. సాయిని అడగాలేగాని, ఆయన ఇవ్వంది ఏముంటుంది?

సాయి భగవానుని లీలలు ఊహించగలం!

శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సమర్థ సద్గురు సాయి భగవాన్‌కి, శ్రీభరద్వాజ మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మా పాప పెండ్లి విషయంలో చాలా విముక్తి చూపేది. 'అప్పుడే పెళ్లి ఎందుకు? నేను ఇంకా చదువుకోవాలి' అని అంటుండేది. అందువల్ల నేను చాలా కలత చెంది ఆందోళనతో, "పాప మనసు మార్చి మంచి వ్యక్తితో పెండ్లి జరిపించమ"ని సాయిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నేను ప్రతినిత్యం మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతం చదువుతుంటాను. నేను రోజూ పూజ చేసి సాయిలీలామృతం తెరవగానే 'బొంబాయి' అని కనపడుతుండేది. ఎప్పుడు తీసినా అదే పేజీ వచ్చేది. నేను ప్రతిదినం అలవాటుగా తీయడం వల్ల ఆ పేజీ వస్తుందని భావించేదాన్ని. అలా ఉండగా ఒకరోజు మా బాబు నాతో, "అక్కకు ఫిబ్రవరిలో పెళ్లి నిశ్చయమవుతుందని నాకు కల వచ్చింది. ఖచ్చితంగా అవుతుంది, దిగులుపడకు" అని అన్నాడు. అది బాబా సంకల్పం. తరువాత హఠాత్తుగా పాపకి ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు బాబా భక్తులవడం ఒక విశేషం. వాళ్ళకి ఎన్నో దివ్య అనుభవాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ ముంబయి(బొంబాయి)లో ఉద్యోగం చేస్తున్నాడు. అందువల్ల ఆ సంబంధం బాబా నిర్ధారించిందని మేము భావించి 2025, ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసి ఏప్రిల్ నెలలో ఘనంగా వివాహం జరిపించాము. పెండ్లికి వచ్చిన అందరూ పెళ్లి బాగా జరిగిందని సంతోషంగా చెప్పారు. నా ఆరోగ్య సమస్య గాని, ఆఫీసులో సెలవులు గాని, పెళ్లి ఖర్చులు గాని ఆలోచన లేకుండా అన్నీ సవ్యంగా జరిగిపోయాయి. సాయి భగవానుని లీలలు మనం ఊహించగలం! వివాహం అయిన వెంటనే మా రెండు కుటుంబాలు తిరుపతి, శిరిడీ దర్శించాము. బాబాకు ఎల్లవేళలా మా కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన నామస్మరణ మా శ్వాసగా ఉండాలని ఆయన్ని ప్రార్ధిస్తూ ఆయన పాదపద్మములకు నమస్కారాలు.


సాయిని అడగాలేగాని, ఆయన ఇవ్వంది ఏముంటుంది?  

సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేష్. నా భార్యకు 6 నెలల నుంచి నెలసరి వచ్చిన తరువాత 6వ రోజు నుంచి 10వ రోజు వరకు వైట్ డిశ్చార్జ్‌లో కొద్దిగా రక్తం వస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్ళకి క్యాన్సర్ అని భయపెడుతున్నారు. ఆ కారణంగా నా భార్య భయపడింది. నేను, "నా భార్యకి ఏమీ కాకుండా చూడమ"ని బాబాకి చెప్పుకొని, నా భార్యను హాస్పిటల్‌కి తీసుకెళ్లి టెస్టులు చేయించాను. సాయిని అడగాలేగాని, ఆయన ఇవ్వంది ఏముంటుంది? బాబా దయవలన రిపోర్టులు నార్మల్ వచ్చాయి. "ధన్యవాదాలు సాయి".

7 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj KiJai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  3. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  4. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl house rent ki ippinchu thandri pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo