సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

స్వయంగా బాబా వచ్చి 'శ్రీసాయిలీల' బుక్స్ ఇచ్చి నా వ్యధ తీర్చారు


మదన్ గోపాల్ గోయల్ అనే సాయిభక్తుడు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఒక ఇంగ్లీష్ రచయిత అన్నారు, 'మనం దేనికోసం ఎదురుతెన్నులు చూస్తూ వుంటామో, అది దొరికినాక అంత ఆనందం వుండదు. ఎదురుతెన్నులు కాయడంలోనే ఆనందం వుంది' అని. కానీ ఆ ఆంగ్లకవికి ఏం తెలుసు నా వ్యధ? నేను వయస్సు మీదపడినవాడిని, వృద్ధుడిని. నా శరీరం నడిచినన్ని రోజులు చాలాసార్లు శిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు కాలు కదపలేని పరిస్థితి. ఇంట్లోనుంచి బయటికి కూడా పోలేని స్థితి. నేను పడే బాధ ఒక వృద్ధుడికే అర్థమవుతుంది. అందుకేనేమో శ్రీసాయినాథుడు ఒక వృద్ధుని రూపంలో నా వద్దకు వచ్చి నన్ను కృతార్థుడిని చేశారు. ఆ సాయిలీలనే నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను.

నేను 'శ్రీసాయిలీల' పత్రికకి లైఫ్ టైం మెంబెర్‌ని. ఆ పత్రిక వస్తే మన సాయిభక్తులకు ఎంత ఆనందంగా వుంటుందంటే, నాకైతే చాతకపక్షికి స్వాతి నక్షత్రం నాటి వర్షపు నీటిబిందువు దొరికినట్లే. అలాంటి నేను 2010 ప్రాంతంలో 'శ్రీసాయిలీల' పత్రికకోసం ఎంత ఎదురుచూసినా సుమారు ఒకటిన్నర సంవత్సరం రాలేదు. 'బుక్స్ ఎందుకు రావట్లేదు?' అని చాలా బాధపడుతూ ప్రతిరోజూ బాబాను, "ఓ సాయినాథా! నేను నీ 'శ్రీసాయిలీల', నీ చరిత్ర చదివి తరించడానికి ఎంతో ఉత్కంఠతో, ఎన్నోరోజులుగా ఆశగా ఎదురుచూస్తున్నాను. నా బాధ మీకు తెలుసుగానీ, ప్రజలకు ఏమి తెలుసు? నేను పడే వ్యధ, కష్టం వాళ్ళకు అనుభవం కూడా ఉండదు, ఊహించి కూడా వుండరు. ఎన్నోరోజులుగా ఎదురుతెన్నులు కాస్తున్నాను నీ 'శ్రీసాయిలీల' కోసం. ఓ సద్గురు సాయినాథా! నీ కథలను వినే అదృష్టం నుంచి నన్ను వంచితుడిని చేస్తావా? నీ 'శ్రీసాయిలీల' పుస్తకంలో అత్యంత సుందరమైన నీ ఫోటోలు చూసి నేను ఆనందపడేవాడిని. ఇప్పుడెందుకో అవి రావడం లేదు. 'ఏరోజు ఆయువు అయిపోతుందో, నిన్ను చివరిసారి చూడకుండానే అంతిమశ్వాస తీసుకుంటానేమో' అని నా మనస్సు వ్యాకులపడుతూ వుంది. ఓ సాయినాథా! నీవు ధరిత్రిపై నడయాడేటప్పుడు, నీ అనన్య భక్తుల పిలుపు విని నీవు వాళ్ళందరికీ దర్శనం ఇచ్చావు. నీవే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. వాళ్ళ కష్టాలను కడతేర్చావు. నీవు నీ శరీరాన్ని వదిలేశాక కూడా నీ చైతన్యంతో, నీ సూక్ష్మరూపంతో భక్తులకు కలలో కూడా దర్శనం ఇస్తున్నావు. నీవు ఇంకా ఈ ధరిత్రిపై నీ లీలలను నడుపుతున్నావు, భక్తజన సంరక్షకుడవని తెలుపుతున్నావు. వయస్సు మీదపడిన కారణంగా నేను శిరిడీ రాలేకుండా వున్నాను. ఇప్పుడు నువ్వే నా దగ్గరికి రావాలి తండ్రీ!" అని ప్రార్థించేవాడిని.

నా బాధ ఆ సాయినాథుడికి చేరింది కాబోలు, ఒకరోజు నాలాగే 95 సంవత్సరాలు మీదపడిన ఒక వృద్ధుడు వచ్చి మా ఇంటి తలుపు తట్టాడు. నేను తలుపు తీస్తే, ఆ వృద్ధుడు 'శ్రీసాయిలీల' బుక్స్ నాకు ఇచ్చాడు. నేను ఆ వృద్ధుని ముఖాన్ని పరిశీలనగా చూశాను. అతిసుందరమైన కళ్ళు. 'ఆ కళ్ళలోకి చూస్తే చాలు, మన అనంత జన్మల పాపాలు హరిస్తాయి' అన్నంత తేజోవంతంగా ఉన్నాయి. గడ్డం, మీసం, బాబాను పోలిన పోలికలు. నేను ఆనందం పట్టలేకపోయాను. ఆ వృద్ధుడు నాతో, "నన్ను నిందిస్తావేం? నీవు నీ ఇంటి అడ్రస్ మార్చుకొన్నప్పుడు కొత్త ఇంటి అడ్రస్ నాకు ఇవ్వాలి కదా? అలా చెయ్యకుండా నన్ను నిందిస్తే ఎలా?" అని అన్నాడు. అప్పుడు నా తెలివి పనిచేసింది. అవును కదా! నేను ఇల్లు మారాను. ఆ శ్రీసాయిలీల బుక్స్ పాత అడ్రస్‌కు వెళ్తున్నాయి. అందుకనే నాకు రాలేదు. ఇదీ అసలు విషయం. ఈ విషయం నా మనస్సుకు తట్టేసరికి ఆ వృద్ధుడు అంతర్థానమయ్యాడు. అప్పుడు అనుకున్నా, 'స్వయంగా బాబా వచ్చి 'శ్రీసాయిలీల' బుక్స్ ఇచ్చి వెళ్ళారు' అని. నా జన్మజన్మల పుణ్యం పండింది. ఆ ప్రభువు స్వయంగా వచ్చాడు, నా కోరిక తీర్చాడు.

సోర్స్: సాయి లీల మ్యాగజైన్.

శేజ ఆ ర తి (తెలుగులో భావంతో)


🌹శేజ్ ఆరతి🌹

(రాత్రి పదిగంటలకు ధూపదీప నైవేద్యాలర్పించి ఐదు వత్తులతో ఆరతి యివ్వాలి)


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

 (1)
                 
(1) ఓవాళూ ఆరతీ మాఝ్యా సద్గురునాథా, మాఝ్యా సాయినాథా!!
     పాంచాహీ తత్త్వాంచా దీప--లావిలా ఆతా!!

భావం:-  ఓ నా సద్గురునాథా! నా సాయినాథా! మీకు ఆరతి.
             పంచతత్త్వాలనే దీపాలుగా (మీకు ఆరతి) తిప్పుతున్నాను.

(2) నిరాకరాచీ స్థితి కైసీ ఆకారా ఆలీ, బాబా ఆకారా ఆలీ!!
      సర్వాఘటీ భరూని ఉరలీ--సాయి మావులీ !!ఓవాళూ!!

భావం:- నిరాకారమైన స్థితి ఆకారమెలా పొందినది?
            సర్వమూ వ్యాపించియింకనూ సాయి తల్లిగా శేషించి యున్నారు.

సంధ్య (ధూప్) ఆరతి (తెలుగులో భావంతో)


సంధ్య (ధూప్) ఆరతి

*(సూర్యాస్తమయ సమయంలో ఒక వత్తితో హారతి యివ్వాలి)*

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై


*(1)*

*1. 
ఆరతీ సాయిబాబాసౌఖ్యదాతార జీవాl*
*
చరణ రజరాలిద్యావా దాసావిసావభక్తావిసావాl 
భక్తావిసావా* ఆరతీ సాయిబాబాl
భావం:- *సాయిబాబామీకు ఆరతి. మీరు జీవులకు సౌఖ్యదాతలు.*
*
మీ దాసులుభక్తులూ అయిన మాకు మీ పాదధూళిలో స్థానం ప్రసాదించండి.*

భక్తులపాలిట ఆపద్బాంధవుడు



సాయిబంధువులందరికీ నమస్కారములునా పేరు సుబ్రహ్మణ్యంమాది నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం. నా జీవితంలో ఇటీవల బాబా చేసిన ఒక అద్భుతం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నానుతాను తన భక్తులపాలిట ఆపద్బాంధవుడనని  సంఘటన ద్వారా బాబా నిరూపించారు.

కొంతకాలం క్రిందట ఒకరోజు సాయంత్రం నేను, నా భార్య పనిమీద బజారుకి బయలుదేరాము. నేను ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ పర్సన్‌ని. నాకు ఒక tricycle(మూడు చక్రాలు ఉన్న స్కూటర్) వుంది. మేము దానిమీద బయలుదేరాము. మా వీధి  నుండి ప్రధానవీధికి మలుపు తిరగ్గానే వెనుకనుండి తెలిసినవాళ్ళు మమ్మల్ని  పిలిచారు. మేము స్కూటర్ ఆపి వెనక్కి తిరిగాము. కానీ వాళ్ళు పిలిచింది, మాకు ముందునుండి రాబోతున్న  పెద్ద ప్రమాదం గురించి హెచ్చరించడానికి. అది మేము గుర్తించేలోపు మాకు ఎదురుగా 15 బర్రెలు బెదిరిపోయి పరిగెడుతూ మా పైకి వస్తున్నాయి. వాటి వెనుక ఒక ఒంటెద్దుబండి (ఆ ఎద్దు కూడా బెదిరిపోయివుంది) వీటిని తరుముతున్నది. ఇక మాకు తప్పించుకునే అవకాశం లేదు. నేను ఫిజికల్లీ హ్యాండీకేప్డ్ వ్యక్తిని అయినందున పక్కకి పరిగెత్తలేను. మా ఆవిడ కూడా నన్ను వదిలి వెళ్ళలేదు. ఇక ఇద్దరం మా అంతర్యామి అయిన బాబానే శరణం అనుకొని ఆయననే స్మరిస్తూ ఉండిపోయాము. మా పక్కవారందరూ ఏమి చేయాలో తోచక చూస్తూ ఉండిపోయారు. మాకు సహాయం చేసేవాళ్ళే లేరు. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. ఎవరో ఆదేశించినట్లుగా ఆ బర్రెల గుంపు రెండు పాయలుగా విడిపోయి మా పక్కనుంచి వెళ్లిపోయాయి. కానీ ఒంటెద్దుబండి మాత్రం నా పైకి వస్తున్నది. నేను, "బాబా! నువ్వే నాకు రక్ష" అని అనుకున్నాను. బండి నా పైకి వచ్చి సరిగ్గా బండి కాడిమాను, అంటే ఎద్దు మెడపై వుండే పెద్ద కొయ్య నా మెడకి కేవలం ఒక అంగుళం దూరంలో పక్కనుంచి వెళ్ళిపోయింది. నాకు, మా ఆవిడకు ఏమీ జరగలేదు. పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బాబా నా ముందు నిలుచుని నాకు కనిపించారు. ఇంతటి  కరుణని  చూపిన ఆ దయాళువుకి శతకోటి వందనాలు చెప్పుకున్నాను.

సాయి శరణం.

ఎంత అదృష్టం చేసుకొని ఉన్నామో కానీ బాబా ఇంతటి లీలలను చూపారు


ఒక సాయిభక్తుడు తన భార్యకు బాబా చూపిన అద్భుత లీలలను ఇలా తెలియజేస్తున్నారు:

2005వ సంవత్సరంలో మే నెల 2వ తేదీన నాగపూర్‌లో నా భార్య సుచిత్ర ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైంది. తన కుడిభుజంకాలివేళ్లు అన్నీ బాగా విరిగిపోయి, తన చర్మంపై అంతా మచ్చలు పడ్డాయి. నాగపూర్‌లోని డాక్టర్ తన విరిగిన భుజానికి, మెడకి కలిపి కట్టు కట్టడం వల్ల తన చెయ్యి వంకరగా మారింది. ఈ గాయాలు తగ్గే క్రమంలో నా భార్య బాబాపై దృఢమైన భక్తివిశ్వాసాలు పెంచుకుంది. బాబాని ప్రతిక్షణం తలచుకుంటూ, 'తన గాయాల బాధ తగ్గించమ'ని బాబాను ఆర్తిగా వేడుకునేది.

మే 25వ తేదీన సమయం రాత్రి 1.55 అయినప్పటికీ నా భార్యకు నిద్రపట్టక ఇబ్బందిపడుతూ మంచం మీద పడుకుని ఉండగా... ఒక్కసారిగా సాక్షాత్తూ శ్రీసాయినాథుడు ప్రత్యక్షమై నా భార్య ముందు నిల్చొని ఉన్నారు. అలా బాబాను కళ్ళెదురుగా చూసి తను చాలా సంతోషపడింది. సాయిబాబా నా భార్యని "పైకి లేవమ"ని చెప్పారు. కానీ తను, "నా కాలుచెయ్యి సహకరించట్లేదు. నేను ఎలా లేవగలను బాబా?" అన్నది. తనకి ఎక్కడ దెబ్బలు తగిలాయో చూపమన్నారు బాబా. కానీ తను చీర కాస్త పైకి జరిపి తన కాలిపై ఉన్న గాయాలను చూపడానికి ఇబ్బందిపడుతూ ఉంటే అందుకు బాబా, "నేను నీ తల్లినితండ్రినిసోదరిని. నా ముందు నువ్వు ఇబ్బందిపడనవసరం లేదు. ఏదీ, చూపించు" అని అన్నారు.

తరువాత బాబా తన చేతులతో నా భార్య చేతులను స్పృశించి అటు ఇటు తిప్పారు. తరువాత తన చేతివేళ్ళతో ఆమె గాయాలపై ఉన్న అన్ని బ్యాండేజీలను తాకారు. వెంటనే బ్యాండేజీలన్నీ కింద పడిపోయాయి. తరువాత బాబా నా భార్య పక్కన కూర్చుని, ఆమె చేతిని తిన్నగా ముందుకి చాపమన్నారు. బాబానే స్వయంగా ఆమె చేయి పట్టుకొని తిన్నగా పెట్టారు. తరువాత చేతిని వెనక్కి మడిచి పెట్టమన్నారు. తను అలాగే మడిచి పెట్టింది. అప్పుడు బాబా "నీ చెయ్యి మునపటివలే మాములుగా అయిపోయింది" అని నా భార్యకు అభయం ఇచ్చారు. తరువాత బాబా నిల్చొని నా భార్యను ఆశీర్వదించారు. ఆమె బాబాను టీ తాగమని అడిగితే, బాబా ఒక చిరునవ్వు  నవ్వారు.

తను వెంటనే లేచి నన్ను లేపింది బాబాని చూపించడానికికానీ నేను లేచేసరికి బాబా అక్కడ లేరు. కానీ నా భార్య చేతులు బాగుకావడం గమనించాను. మందులు, కట్లు కిందపడివున్నాయి. నా భార్య తన చేతిని మడిచి పెట్టి ఉన్నది. నేను ఆమె చేతిని తిన్నగా చాపమన్నాను. ఆమె తన చేతిని తిన్నగా పెట్టేసరికి ఆమె చేతిలో బాబా ఊదీ ప్యాకెట్ ఉంది. బాబా స్వయంగా తన చేతులతో ఆ ఊదీ ప్యాకెట్‌ని నా భార్య చేతిలో పెట్టారు. మేము ఎంత అదృష్టం చేసుకొని ఉన్నామో బాబా ఇంతటి లీలను మాపై చూపారు. నిజానికి నా భార్య ముందెన్నడూ శిరిడీ దర్శించలేదు. తను ఎప్పుడూ ఇంటి దగ్గర ఉండే గుడికి మాత్రమే వెళ్లేది. అయినా బాబా మాపై ఇంత కరుణ చూపారు.

ఆ తరువాత మేమంతా శిరిడీకి వెళ్లి బాబా దివ్యదర్శనం చేసుకొని మనసారా  ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఆ తర్వాత భోజనం చేయడానికి ప్రసాదాలయానికి వెళ్ళాము. ఇక్కడ మళ్ళీ బాబా మరో లీల చూపారు. నా భార్య భోజనం చేస్తూవుండగా భోజనం మధ్యలో తన చేతికి బాబా లాకెట్ తగిలింది. అది చూసి మేమంతా ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాము. అక్కడ భోజనశాలలో అందరినీ ప్రశ్నిస్తే, వారు కూడా ఏమీ చెప్పలేక ఆశ్చర్యచకితులయ్యారు. మా సంతోషానికి ఇంక అవధులు లేవు. ఇంత అద్భుతమైన రెండు లీలలను బాబా మాపై చూపించారు.

           సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


మ ధ్యా హ్న ఆ ర తి (తెలుగులో భావంతో)


మ ధ్యా హ్న ఆ ర తి


*(మధ్యాహ్నం. 12--00 లకు వత్తులతో హారతి యివ్వాలి)*

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై



*(1)*

*1.
ఘేవునియా పంచారతీ కరూ--బాబాంసీ ఆరతీ.*
*
సాయిసీ ఆరతీ--కరూ బాబాంసీ ఆరతీ.*


భావం:- *బాబా సాయీ, మీకు పంచారతి చేయుదుము.*

బాబానే స్వయంగా వచ్చి పిల్లాడిని, నన్నూ కాపాడారు



శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై



వృత్తిరీత్యా చిన్నపిల్లల డాక్టర్ అయిన విన్నీ చిట్లూరి గారు ప్రముఖ సాయిభక్తులు. శ్రీసాయిబాబాపై ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రచించి ప్రచురించారు. ఆమె రచించిన గ్రంథాలలో “Ambrosia in Shirdi” ప్రముఖమైనదిప్రస్తుతము శిరిడీలో నివసిస్తున్న ఆమె శ్రీసాయిబాబాతో గల తమ స్వంత అనుభవాన్నిఇలా తెలియచేస్తున్నారు.

కాకడ ఆరతి (తెలుగులో భావంతో)



*🌹🌹కా క డ హా ర తి🌹🌹*


*(
ఉదయం గం. 5--15 లకు దీపము, అగరువత్తి పెట్టి వెన్న నివేదించి, 5 వత్తులతో హారతి యివ్వాలి)*

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

*(1)*

*1.
జోడూనియా కర చరణి--టేవిలా మాథా*
*
పరిసావీ వినంతీ మాఝీ--పండరీనాథా*

భావం:- *కరములు జోడించి నీ చరణములపై నా శిరస్సుంచాను ఓ పండరీనాథా నా వినతి విను.*

*2.
అసోనసో భావ ఆలో--తుఝియా ఠాయా*
*
కృపాదృష్టి పాహేమజకడే--సద్గురురాయా*


భావం:- *నాకు భక్తి యున్నదో లేదో! నీదరి చేరాను సద్గురు రాజా. నన్ను కృపాదృష్టితో చూడుము.*

*3.
అఖండీత సావే ఐసే--వాటతే సాయీ*
*
సాండూనీ సంకోచ్ ఠావ్--థోడాసా దేయీ*
 

భావం:- *నీ అఖండ పాదసేవ కోరాను, సంకోచించక నీ హృదయములో నాకు స్థానమిమ్ము.*

*4.
తుకా హ్మణే దేవా మాఝీ--వేడీవాకుడీ*
*
నామేభవ పాశ్ హాతి--అపుల్యా తోడి*


భావం:- *తుకారాము వేడినట్లు, నా నామస్మరణ లోని లోపాలు మన్నించి నా భవపాశము (కర్మబంధము) ను తొలగించు.*



*(2)*

*1.
ఉఠా పాండురంగా ప్రభాత--సమయో పాతలా !*
*
వైష్ణవాంచా మేళా గరుడ--పారీ దాటలా !!*

భావం:- *నిదురలే, ఓ పాండురంగా! ప్రభాత సమయమైనది. వైష్ణవబృందము గరుడ స్థంభము వద్ద నిలచినది.*

*2.
గరుడపారా పానుని మహా--ద్వారా పర్యంత !*
*
సురవరాంచీ మాందీ ఉభీ--జోడూనియా హాత్ !!*



భావం:- *గరుడ స్థంభము నుండి మహాద్వారము వరకు సురశ్రేష్టులు చేతులు జోడించి నీదర్శనార్ధము నిలచారు.*

*3.
శుకసనకాదిక నారద తుంబర--భక్తాంచ్యాకోటీ !*
*
త్రిశూలడమరూ ఘేఉనిఉభా--గిరిజేచా పతీ !!*

భావం:- *శుక, సనక, నారద, తుంబురాది భక్తికోటి త్రిశూల డమరుధారి గిరిజావతి (వేచియున్నారు).*

*4.
కలియుగీచా భక్తనామా--ఉభాకీర్తనీ !*
*
పాఠీమాగే ఉభీడోలా--లావునియా జనీ !!*


భావం:- *కలియుగ భక్త వరుడు నామదేవు నిన్ను కీర్తిస్తున్నాడు. నీ పాదదాసి జనాబాయిగూడ నీ దర్శనం కోసం వేచియున్నది.*

*3*

*1.
ఉఠా ఉఠా శ్రీసాయినాథ గురు చరణ కమల దావా!*
*
ఆధివ్యాధి భవతాప వారునీ తారా జడజీవా!!*

భావం:- *లేలెమ్ము, ఓ సాయినాథ సద్గురూ! నీ చరణ కమల దర్శనమిమ్ము, జడబుద్ధిగల జీవులమైన మమ్ము దారిద్ర్య, రోగాది తాపాల నుండి తరింపచేయి.*


*2. గేలీ తుహ్మా సోడునియా భవతమరజనీ విలయా!*
*
పరి హీ ఆజ్ఞనాసీ తుమచీ భులవి యోగమాయా!!*


భావం:- *జన్మలనిచ్చే అజ్ఞానాంధకారము నిన్నంటలేదు. కాని అజ్ఞానులమైన మమ్ము నీ యోగమాయ సమ్మోహ పరచనది.*


*3. శక్తి న ఆహ్మా యత్కించిత్ హి తిజలా సారాయా!*
*
తుహ్మీచ్ తీతే సారుని దావా ముఖ జన తారాయా!!*


భావం:- *దానిననుభవించే శక్తి మాకు కించిత్తు గూడ లేదు. నీ ముఖ దర్శనమిచ్చి మమ్ము తరింపజేయి.*


*4. భో సాయినాథ మహారాజ్ భవతిమిర నాశక రవీ!*
*
ఆజ్ఞానీ ఆహ్మీ కితీ తవ వర్ణావీ ధోరవీ!!*


భావం:- *సూర్యసమానమైన నీ జ్ఞానతేజముతో అజ్ఞానాంధకారమును పారద్రోలి, నీపై భక్తిని ప్రసాదించు.*


*5. తీ వర్ణితా భాగలే బహువదని శేష విధి కవీ!*
*
సకృప హోఉని మహిమా తుమచా తుహ్మీచ వదవావా llఆధిll llఉఠా
ll*

భావం:- *బహుముఖములు గల ఆది శేషుడే వర్ణించలేని నీ మహిమను అజ్ఞానులమైన మేమేమి వర్ణించగలము? కృపతో నీ మహిమను నీవే ప్రకటించు.*


*6. భక్త మనీ సద్భావ ధరుని జే తుహ్మా అనుసరలే!*
*
ధ్యాయాస్తవ తే దర్శన తుమచే ద్వారి ఉభే ఠేలే!!*


భావం:- *నీ సద్భక్తులు నిన్ను దర్శించుటకు ద్వారము వద్ద వేచియున్నారు.*

*7. ధ్యానస్థా తుహ్మాస్ పాహునీ మన అముచే ధాలే!*
*
పరి త్పద్వచనామృత ప్రాశాయాతే ఆతుర ఝాలే!!*


భావం:- *ధ్యానస్థులైన మిమ్ము చూచి మా మనసు భ్రమించినది. మీ వచనామృతానికై ఆరాట పడుతున్నాము.*


*8. ఉఘడూనీ నేత్రకమలా దీనబంధు రమాకాంతా!*
*
పాహి బా కృపాదృష్టీ బాలకా జశీ మాతా!!*


భావం:- *దీనబంధూ, లక్ష్మీపతీ, నీ నేత్ర కమలములు తెరచి మాతృ వాత్సల్యముతో మమ్ము చూడు.*


*9. రంజవీ మధురవాణీ హరి తాప్ సాయినాథా!*
*
ఆహ్మీచ ఆపులే కార్యాస్తవ తుజ కష్టవితో దేవా!!*


భావం:- *మధురవచనములతో నీ బిడ్డల తాపము తీర్చు. మా కొరకు నిన్ను కష్టపెడు తున్నాము.*


*10. సహన కరశిల ఐకుని ద్యావీ భేట్ కృష్ణధావా!! llఉఠాllఆధిll*

భావం:- *సహనముతో కృష్ణుడనైన నా మోరాలకించి నీ దర్శనము ప్రసాదించు.*

*(4)*

*1.
ఉఠా పాండురంగా ఆతా--దర్శన ద్యాసకళా*
*
ఝాలా ఆరుణోదయసరళీ--నిద్రేవీ వేళా*!!

భావం:- *ఓ పాండురంగా! నిదుర లేచి నీ దివ్య కళలతో దర్శనమిమ్ము. అరుణోదయమైనది, నిదురలేచే సమయమైనది.*

*2.
సంతసాధూ మునీ అవఘే--ఝాలేతీ గోళా*
*
సోడాశేజే సుఖేఆతా--బహుత్యా ముఖకమలా*!!


భావం:- *సాధుసంతుల బృందము వేచియున్నది. నిద్ర సుఖము వీడి నీ దివ్యదర్శనమిమ్ము.*

*3.
రంగమండపీ మహాద్వారీ--ఝాలీసే దాటీ*
*
మన ఉతా వీళ రూప--పహావయా దృష్టీ*!!


భావం:- *ద్వారమండపమున వున్న మా మనస్సులు మీ దర్శనానికై ఉవ్విళ్ళూరు చున్నవి.*

*4.
రాయీ రఖుమాబాయి తుహ్మా--యే ఊ దాదయా*
*
శేజే హాలవునీ జాగే--కరా దేవరాయ*!!


భావం:- *ఓ రాణీ రుక్మిణీదేవీ! నీవైనా దయతో రంగని మేల్కొల్పు (రంగా!) నిద్రను పోగొట్టుకొని మేలుకో, దేవరాజా! గరుడ హనుమంతులు నీ దర్శనానికై వేచి యున్నారు.*

*5.
గరుడ హనుమంత ఉభే--పాహతీ వాట్*
*
స్వర్గీచే సురవర ఘేఉని--ఆలే బోభాట్*!!


భావం:- *స్వర్గంలోని సురవరులు ఆరతిగొని వచ్చారు.*

*6.
ఝాలే ముక్త ద్వార్ లాభ్--ఝాలా రోకడా*
*
విష్ణుదాస్ నామా ఉభా--ఘేఉని కాకడా*!!


భావం:- *విష్ణుదాసు, నామదేవు కాకడ హారతి చేపట్టి నిలిచారు.*
*(5)*

*1.
ఘేఉనియా పంచారతీకరూ--బాబాసీ ఆరతీ*
*
సాయిసీ ఆరతీ--కరూ బాబా సీ ఆరతీ
l*

భావం:- *బాబా మీకు పంచారతి చేస్తాము.*

*2.
ఉఠాఉఠాహో బాంధవ--ఓవాళూ హరమాదవ*
*
సాయిరామాధవ ఓవాళూ హరమాధవ
l*

భావం:- *సాయిబంధువులారా, లేచిరండి! సాయి రమాధవునికి ఆరతి చేద్దాము.*

*3.
కరూనీయా స్థీరమన--పాహు గంభీర హేధ్యాన*
*
సాయిచే హేధ్యాన--పాహు గంభీరా హే ధ్యాన
l*

భావం:- *స్థిర మనస్సుతో ధ్యానము చేద్దాము.*

*4.
కృష్ణనాథా దత్తసాయీ--జడోచిత్త తుఝేపాయీ*
*
చిత్త బాబాసాయి--జడోచిత్త తుఝే పాయి*

భావం:- *కృష్ణనాథా, దత్తా, సాయీ! మా జడ చిత్తములు ఎల్లప్పుడూ నీ పాదాలపై నిలుచుగాక!*.


*(6)*

*1.
కాకడ ఆరతీ కరీతో--సాయినాథ దేవా*
*
చిన్మయరూపదాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ !!కా!!*

భావం:- *సాయినాథా, కాకడ ఆరతి చేసెదను.*
*
ఈ బాలకుని చిన్న సేవను గైకొని, నీ చిన్మయరూప దర్శన మిమ్ము.*

*2.
కామక్రోద మీద మత్సరాటుని--కాకడా కేలా*
*
వైరాగ్యాచే తూప్ కాడునీ మీతో బిజవీలా*
*
సాయినాథ గురుభక్తిజ్వలనే--తోమీ పేటవిలా*
*
తద్వృత్తీజాళునీగురూనే--ప్రకాశ పాడియలా*
* ద్వైతరమా నాసూనీ మిళవీ--తత్స్వరూపజీవా*
*
చిన్మయరూప దాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ!*
కాకడ ఆరతీ కరీతో--సాయినాథ దేవా*
*
చిన్మయరూపదాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ!!*


భావం:- * సహజముగా కామక్రోదాది ప్రవృత్తి గల మనస్సును మీ ఆరతికి వత్తిగా వైరాగ్యమనే నేతిలో తడిపి, సాయినాథునిపట్లనున్న గురుభక్తి యనే జ్యోతిని వెలిగించాను; తదాకారవృత్తి యనే వెలుగులో గురువు ప్రకాశించాడు.* *ద్వైతమనే తమస్సు నశించి, జీవుడు తత్స్వరూపియైనాడు.*


*2. భూ--ఖేచర వ్యాపునీ అవఘే--హృత్కమలీ రాహసీ*
*
తోచిదత్తదేవతు శిరిడీ--రాహుని పావసీ*
*
రాహునియేథే అన్యత్రహి తూ--భక్తాస్తవధావసీ*
*
నిరసునియా సంకట దాసా--అనుభవ దావిసీ*
*నకలేత్వల్లీలాహీ కోణ్యా--దేవావామానవా !!చి!!కా!!*
*చిన్మయరూప దాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ*
కాకడ ఆరతీ కరీతో--సాయినాథ దేవా*
*
చిన్మయరూపదాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ!*

భావం:- *భూమి--ఆకాశములలోను, (జీవుల) హృదయ కమలంలోనూ నీవే వున్నావు. నీవు దత్తాత్రేయుడవు; శిరిడీలో వుంటూ (అందరినీ) ఆదరిస్తున్నావు. నీవిక్కడ వుండడం వలన యితర ప్రాంతాల నుండి భక్తులు నీ కోసం పరుగున వస్తున్నారు. నీవు నీ దాసుల కష్టాలు తొలగించి (దివ్యమైన) అనుభవాలిస్తున్నావు. ఈ కలిలో నీవంటి మానవుడుగాని, దేవతగాని మరొకరు లేరు.*

*3. త్వద్యశదుందుభీనే సారే--అంబర్ హేకోందలే*
*
సగుణమూర్తి పాహణ్యా ఆతుర--జన శిరిడీఆలే*
*
ప్రాశుని తద్వచనామృత అముచే--దేహభాన్ హరఫలే*
*
సోడునియాదురభిమానస--త్వచ్చరణీవాహిలే*
*
కృపాకరునియా సాయిమావులే--దాసపదరిఘ్యావా!!*

*చిన్మయరూప దాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ*
కాకడ ఆరతీ కరీతో--సాయినాథ దేవా*
*
చిన్మయరూపదాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ !!కా!!*

భావం:- *నీ యశోతేజములు అనే దుందుభులు ఆకాశమంతటా మారుమోగుతున్నాయి.* *నీ సగుణమూర్తి దర్శనానికై దూరం నుండి భక్తులు శిరిడీ వచ్చారు.* *నీ వచనామృతములో దేహభావాన్ని మరచారు.* *దురభిమానము విడచి మనస్సులను నీ చరణాలపై నిలిపారు.* *దాసులైన మమ్మనుగ్రహించి, ఆశ్రయమిమ్ము.*


*(7)*

*1.
భక్తీచియా పోటీ బోధ్--కాకడ జ్యోతి*
*
పంచప్రాణ జీవే భావే--ఓవాళూ ఆరతీ*


భావం:- *భక్తితో నిండిన హృదయంతో నీ ప్రభాత ఆరతి చూస్తున్నాను.*
*పంచప్రాణములతో వెలిగే జీవభావమే ఆరతిగా నీకు తిప్పుతున్నాను.*

*2.
ఓవాళూ ఆరతీమాఝ్యా--పండరీనాథా! మాఝా సాయినాథా*
*
దోన్ హీ కరజోడూనీచరణీ--ఠేవిలా మాధా*


భావం:- *నా పండరినాథా నీకు ఆరతి! ఓ సాయినాథా నీకు ఆరతి.*
*రెండు చేతులు జోడించి నా శిరస్సును నీ పాదములపై వంచుతున్నాను.*

*3.
కాయమహిమా వర్ణూ ఆతా సాంగణే కితీ*
*
కోటి బ్రహ్మహత్య ముఖ--పహతా జాతీ*


భావం:- *నీ మహిమను చక్కగా నేనేమి వర్ణించ గలను?*
*నీ ముఖదర్శనము వలన కోటి బ్రహ్మ హత్యల పాపం గూడ నశిస్తుంది.*

*4.
రాయీ రఖుమాబాయీ ఉభ్యా--దోఘి దోబాహీ.
మయూరపింఛ చామరేఢాళితి--ఠాయీచాఠాయీ.*

భావం:- *రాయీ, రుక్మాబాయి యిద్దరూ నెమలి పింఛము, చామరములతో నీకు యిరువైపులా నిలచి అన్నివైపులా వీస్తున్నారు.*

*5. తుకాహ్మణే దీపఘేఉని--ఉన్మనీత శోభా.
విఠేవరీ ఉభాదిసే--లావణ్యగాభా*

భావం:- *తుకారాముడు దీపమును గ్రహించి స్తుతీంచుచుండగా ఆ పరమాత్ముడు ఇటుకపైన కనులకింపుగా శోభించుచున్నాడు*

*(8)*

*1.
ఉఠా సాధుసంత సాదా--ఆపులాలే హిత*
*జాఈల్ జాఈల్ హా నరదేహా--మగకైచా భగవంత*

భావం:- *లే లేవండి సాధుసజ్జనులారా! మీ హితమును చేకూర్చుకొనండి.* *ఈ దేహం త్వరలో నశించిపోతుంది. ఓ భగవంతుడా, ఆ తర్వాత (తరించడం) ఎలా?*


*2. ఉఠోనియా పహాటే బాబా--ఉభా ఆసే విటే*
*
చరణతయాచే గోమటే అమృత--దృష్టీ అవలోకా*


భావం:- *నాయనాలారా ఉదయమే లేచి, యిటుకపై నిలచిన బాబా వారి (విఠలుని) పాదాలు దర్శించండి. అతని అమృత దృష్టిని చూడండి.*


*3. ఉఠా ఉఠా హో వేగేసీ చలా--జాఊ రాఉళాసీ*
*జలతిలపాతకాంచ్యా రాశీ--కాకడ ఆరతి దేఖిలియా*

భావం:- *లే లెండి, త్వరగా ఆలయానికి పోదాము.* *ఆ కాకడ ఆరతి గైకొంటే పాపాలు నశిస్తాయి.*

*4. జాగేకరా రుక్మిణీవర--దేవ ఆహే నిజసురాన్ త*
*వేగేలింబలోణ్ కరా--దృష్టీ హో ఈల్ తయాసీ*

భావం:- *ఓ రుక్మిణీవరా, నిదురలే! నీవే దేవత లందరికీ దేవుడవు.* *త్వరగా దిష్టితీయించుకో! లేకుంటే నీకు దృష్టి దోషం తగులుతుంది.*


*5. ద్వారీభాజంత్రీ వాజతీ--ఢోలు ఢమామే గర్జతీ*
*
హోతసే కాకడ ఆరతీ మాఝ్యా--సద్గురు రాయాచీ*

భావం:- *మహాద్వారంలో ఢోలు, భజంత్రీలు మోగుతున్నాయి.* *మా సద్గురురాయునికి కాకడ ఆరతి జరుగుతున్నది.* 


*6. సింహనాద శంఖభేరి--ఆనంద హోతో మహాద్వారీ*
*కేశవరాజా విఠేవరీ--నామా చరణ వందితో*

భావం:- *శంఖాలు మహాద్వారం వద్ద సింహనాదం చేస్తూ ఆనందం కలిగిస్తున్నాయి.* *కేశవుడైన విఠలుని పాదాలకు నామదేవుడు వందనము చేస్తున్నాడు.*



*(9)*

*
సాయినాథ గురుమాఝే ఆయీ*
*
మజలాఠావ ద్యావా పాయీ*

*
దత్తరాజ గురు మాఝే ఆయీ*
*
మజలాఠావ ద్యావా పాయీ*
*సాయినాథ గురుమాఝే ఆయీ*
*
మజలాఠావ ద్యావా పాయీ*

*
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై*


భావం:- *నా తల్లివైన సాయినాథ గూరూ! నాకు నీ పాదముల వద్ద ఆశ్రయమివ్వు, నా తల్లివైన దత్తరాజ గురూ! నీ పాదాలవద్ద ఆశ్రయమివ్వు.*


*(10)*

*1.
ప్రభాత సమయీ నభా శుభరవి ప్రభా ఫాకలీ*
*
స్మరే గురు సదా అశా సమయిత్యా ఛళే నాకలీ*
*
హ్మణోని కరజోడునీ కరు అతా గురుప్రార్థనా*
*
సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*

భావం:- *ప్రభాత సమయంలో ఆకాశంలో శుభమైన రవితేజము వెలుగుతున్నది; యీ సమయంలో గురువును స్మరించేవారిని కలి ఎన్నడూ బాధించదు. కనుక చేతులు జోడించి గురువును ప్రార్థిస్తాను; సమర్థ గురువు సాయినాథా! నా మనోవాంఛలీ డేర్చు.*

*2.
తమా నిరసి భాను హాగురుహి నా సి అజ్ఞానతా*
*
పరంతు గురుచీ కరీ నరవిహీ కధీ సామ్యతా*
*
పున్ హా తిమిరజన్మ ఘే గురుకృపేని అజ్ఞాన నా*
*
సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*


భావం:- *సూర్యుడు చీకట్లను పారద్రోలినట్లు, గురువు అజ్ఞానాన్ని పారద్రోలుతాడు; కాని గురువుతో రవిని పోల్చడం సరిగాదు. చీకటి మరలా వస్తుంది గాని, గురు కృపవలన పారద్రోలబడిన అజ్ఞానం మరిరాదు కనుక*


*3. రవి ప్రగట హో ఉని త్వరిత ఘా లవీ ఆలసా*
*
తసా గురుహి సోడవీ సకల దుష్కృతీ లాలసా*
*
హరోని అభిమానహీ జడవి తత్పదీ భావనా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*
భావం:- *ఉదయించిన రవి, అలసటను వెంటనే పోగొడతాడు. అలానే దుష్కార్యాలపై వ్యామోహాన్ని గురువు పొగొడతాడు. అభిమానాన్ని నశింపజేసి మన హృదయాన్ని ఆయన పాదాలయందు స్థిరపరుస్తాడు. కనుక...*

*4.
గురూసి ఉపమా దిసే విధిహరీ హరాచీ వుణీ*
*
కుఠోని మగ్ హేఇతీ కవనియా ఉగీ పాహుణి*
*
తుఝీచ ఉపమా తులా బరవి శోభతే సజ్జనా*

*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*

భావం:- *గురువుతో బ్రహ్మ, హరి, హరులను పోల్చడం తగదు; ఇంక పోల్చదగిన వారింకెవరున్నారు?(సాయీ!) నీకు నీవే సాటియని మహనీయులు కీర్తిస్తున్నారు. కనుక...*

*5.
సమాధి ఉతరో నియా గురు చలా మశీదీ కడే*
*
త్వదీయ వచనోక్తితీ మధుర వారితీ సాకడే*
*
అజాతరిపు సద్గురో అఖిలపాతకా భంజనా*
*
సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*


భావం:- *ఓ గురూ! నీవు సమాధి నుండి దిగి మశీదుకు వచ్చి మధురములైన నీ మాటలతో (మా) కష్టాలు నివారించు. శతృవులే లేని ఓ సద్గురూ, (మా) పాతకాలన్నింటినీ పారద్రోలు.*


*6. అహా సుసమయా సియా గురు ఉఠోనియా బైసలే*
*
విలోకుని పదాశ్రితా తదియ ఆపదే నాసిలే*
*
అసా సుహాత కారియా జగతి కోణిహీ అన్యనా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*
భావం:- *గురువులేచి కూర్చున్నారు. ఆహా, యిదెంత మంచి సమయం! ఆయన తన పాదాలను ఆశ్రయించిన వారిని చూచి వారి ఆపదలను నాశనం చేస్తారు. ఇలా మేలు చేసేవారు యీ జగత్తులో యింకెవ రున్నారు? కనుక..*


*7.
అసే బహూత శాహణా పరి నజ్యా గురూచీ కృపా*
*
నతత్స్వహిత త్యాకళే కరితసే రికామ్యా గపా*
*
జరీ గురుపదా ధరీ సుదృఢ భక్తినేతో మనా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*
భావం:- *ఎంత తెలివిగలవాడైనా, అతడు గురు కృపను పొందనంతవరకూ అతడి జీవితమే వ్యర్థం; (కారణం) అతడు గురు పాదములను దృఢ భక్తితో మనసులో ధరించకుంటే తనకు తాను ఎలాంటి శ్రేయస్సునూ సాధించుకోలేడు.*


*8. గురో వినతిమా కరీ హృదయమందిరీ యాబసా*
*
సమస్త జగ్ హే గురుస్వరూపచీ ఠసో మానసా*
*
కరో సతత సత్కృతీ మతిహిదే జగత్పావనా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*

భావం:- *ఓ గురూ! నా విన్నపం చేసుకుంటున్నాను; నా హృదయ మందిరంలోకి వచ్చి కూర్చోండి! ఈ సమస్త జగత్తూ గురుని స్వరూపమన్న భావం నా మనస్సుకు హత్తుకునేలా చేయండి. ఎల్లప్పుడూ జగత్పావనములైన సత్కార్యాలే చేసే మనస్సును నాకు అనుగ్రహించండి.*


*(11)*

*
ప్రేమేయే అష్టకాశీ పఢుని గురువరా---ప్రార్థితీ జే ప్రభాతి.*
*
త్యాచే చిత్తాసి దేతో అఖిల హరునియా---భ్రాంతి మీ నిత్యశాంతి.*
*
ఐసేహే సాయినాథే కధుని సుచవిలే---జేవి యా బాలకాశీ.*
*
తేవీత్యా కృష్ణపాయీ నముని సవినయే---అర్పితో అష్టకాశీ.*

భావం:- *ఈ బాలకుడైన కృష్ణుడు యీ అష్టకం వ్రాసి సవినయంగా ఆయన పాదాలకు సమర్పించి నపుడు సాయి. 'ఈ అష్టకం ప్రేమతో చదివి గురువునెవరు ప్రభాత సమయంలో ప్రార్థిస్తారో అట్టివారి చిత్తం నుండి భ్రాంతులన్నింటినీ హరించివేసి నిత్యమైన శాంతిని ప్రసాదిస్తాను' అని తెల్పారు.*


*(12)*

*
సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*

*
జానా తుమనే జగత్పసారా, నబహీ ఝూట్ జమానా*
*జానా తుమనే జగత్పసారా, నబహీ ఝూట్ జమానా*

*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*

*మై అంధాహూ బందా అపకా, ముఝుసే ప్రభుదిఖలానా*
*మై అంధాహూ బందా అపకా, ముఝుసే ప్రభుదిఖలానా*


*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*

*
దాసగణు కహే అబ్ క్యా బోలూ, ధక్ గయి మేరీ రసనా*
*దాసగణు కహే అబ్ క్యా బోలూ, ధక్ గయి మేరీ రసనా*

*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
భావం:- *'ఓ సాయీ! మీరు (మాపై) కృపాదృష్టి నుంచాలి; యీ మీ బిడ్డలను పాలించాలి. ఓ జగద్వ్యాపకా, యీ ప్రపంచమంతా అసత్యమని మీకు తెలుసు. నేను అజ్ఞానా నంధుడను; మీ బానిసను; మీరే నాకు ప్రభు దర్శనం చేయించాలి. ఇంకేమి చెప్పగలను? నా నాల్క మూగవోయింది' అంటున్నాడు యీ దాసగణు.*


*(13)*

*
రహం నజర్ కరో, అబ్ మోరే సాయీ*
*
తుమబీన నహీ ముఝే మా బాప్ భాయీ*
*రహం నజర్ కరో*

*
మై అంధాహూ, బందా తుహ్మారా, మై అంధాహూ, బందా తుహ్మారా *
*
మైనాజానూ, మైనాజానూ, మైనాజానూ అల్లా ఇలాహీ*
* రహం నజర్ కరో, రహం నజర్ కరో, అబ్ మోరే సాయీ*
*
తుమబీన నహీ ముఝే మా బాప్ భాయీ*
*రహం నజర్ కరో*


*
ఖాలీజమానా, మైనే గమాయా, ఖాలీజమానా, మైనే గమాయా *
*
సాథీ ఆఖరికా, సాథీ ఆఖరికా, సాథీ ఆఖరికా కియాన కోయీl*
* రహం నజర్ కరో, రహం నజర్ కరో, అబ్ మోరే సాయీ*
*
తుమబీన నహీ ముఝే మా బాప్ భాయీ*
*రహం నజర్ కరో*

*
అప్నే మస్ జిద్ కా ఝాడూ గనూ హై, అప్నే మస్ జిద్ కా ఝాడూ గనూ హై*
*
మాలిక్ హమారే, మాలిక్ హమారే, మాలిక్ హమారే తుమ్ బాబాసాయి*
* రహం నజర్ కరో, రహం నజర్ కరో, అబ్ మోరే సాయీ*
*
తుమబీన నహీ ముఝే మా బాప్ భాయీ*
*రహం నజర్ కరో*
భావం:- *ఓనా సాయీ! ఇప్పుడే నాకు నీ కృపా దృష్టి ప్రసాదించు. నీవు గాక నాకు తండ్రి గాని, సోదరుడు గాని వేరెవ్వరూ లేరు. నేను అజ్ఞానాంధుడను, నీ బానిసను. 'అల్లాహ్' (దైవము)--'ఇలాహి' (సత్యము) ఏమీ నాకు తెలియవు. నా జీవిత సమయ మంతా వ్యర్థ పరచుకొన్నాను. నేను నిన్ను తప్ప వేరెవరినీ చివరి తోడుగా చేసుకోలేదు. ఈ (దాస) గణు మీ మసీదు చిమ్మే చీపురు మాత్రమే. ఓ సాయీ, నీవే నా యజమానివి.*


*(14)*

*
తుజకాయదే ఊ సావళ్యా మీ భాయా తరీయా
తుజకాయదే ఊ సావళ్యా మీ భాయా తరీయా*
*
మీదుబళి బటిక నా మ్యాచీ జాణ శ్రీహరీ*
*మీదుబళి బటిక నా మ్యాచీ జాణ శ్రీహరీ*

*
ఉచ్చిష్ట తులా దేణేహి గోష్ట నాబరియో*
*ఉచ్చిష్ట తులా దేణేహి గోష్ట నాబరియో*
*
తూ జగన్నాథ్ తుజదేఊ కశీరే భాకరి*
*తూ జగన్నాథ్ తుజదేఊ కశీరే భాకరి*

*
నకో అంత మదీయపాహు సఖ్యా భగవంతా, శ్రీకాంతా*
*
మధ్యాహ్న రాత్రి ఉలటోని గేలీహీ అత--అణచిత్తా*
*
జ హో ఈల్ తుఝారే కాకడ కీ రా ఉళాతరియో*
*జ హో ఈల్ తుఝారే కాకడ కీ రా ఉళాతరియో*
*
అణతీల్ భక్త నై వేద్యహి నానాపరీ*
*అణతీల్ భక్త నై వేద్యహి నానాపరీ*

*తుజకాయదే ఊ సావళ్యా మీ భాయా తరీయా
తుజకాయదే ఊ సావళ్యా మీ భాయా తరీయా*
*
మీదుబళి బటిక నా మ్యాచీ జాణ శ్రీహరీ*
*మీదుబళి బటిక నా మ్యాచీ జాణ శ్రీహరీ*
భావం:- *ఓ నల్లనయ్యా! తినడానికి నీకు నేనేమివ్వగలను? ఓ శ్రీహరీ, నేను శక్తిలేని బానిసనని నీకు తెలుసు. ఎంగిలిదైన యీ సంగటి నీకు యివ్వడం తగదు. నీవో (సాక్షాత్తు) జగన్నాథుడవు. నీకు కేవలం యీ రొట్టె ముక్క ఏమని సమర్పించేది? ఓ భగవంతుడా, శ్రీకాంతుడా, అర్థరాత్రి గడచిపోయి కాకడ ఆరతి జరిగే సమయం గూడ అవుతున్నది. (ఇక) భక్తులందరూ నీకు అనేకమైన నైవేద్యాలు సమర్పిస్తారు.


*(15)*

శ్రీసద్గురు బాబాసాయీ హో - శ్రీసద్గురు బాబాసాయీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ - తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
మీ పాపిపతితధీమంతా - మీ పాపిపతితధీమంతా
తారణేమలా గురునాధా ఝుడకరీ - తారణేమలా సాయినాధా ఝుడకరీ
తూశాంతిక్షమేచామేరూ - తూశాంతిక్షమేచామేరూ
తుమి భవార్ణ విచేతారూ గురువరా
తుమి భవార్ణ విచేతారూ గురువరా
గురువరా! మజసి పామరా అతా ఉద్దరా
త్వరితలవలాహీ త్వరిత లలాహీ
మీబుడతో భవ భయ డోహీ ఉద్దరా
శ్రీ సద్గురు బాబాసాయీ హో - శ్రీ సద్గురు బాబాసాయీ హో
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
 
భావం:- *శ్రీ సద్గురు సాయిబాబా, నాకీ భూమి మీద నీవు గాక వేరెవ్వరూ ఆశ్రయం లేరు; నేను పాపిని, మంద బుద్ధినీ; నన్ను తరింప జేయడానికి జాగు చేయవద్దు. శాంతి క్షమలలో మీరు మేరువు వంటి వారు. నన్ను భవసాగరం నుండి తరింప జేయి, ఓ గురువరా! ఓ గురువరా, పామరుడనైన నన్ను యిప్పుడే తృటిలో ఉద్దరించు; భవ భయమనే బావిలో మునుగుతున్న నన్నిపుడే రక్షించు!*



కాకడ ఆరతి సమాప్తం...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo