ఈ భాగంలో అనుభవం:
- పట్టుబట్టి మొక్కు తీర్పించి మరీ సొంతింటిని అనుగ్రహించిన బాబా
సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు సునీత. మావారి పేరు జయరాజ్. మాది వైజాగ్. నా జీవితంలో బాబా చేసిన అనుభవాలు గురించి ఏమని చెప్పను? ఎన్నని చెప్పను? ప్రతిరోజూ సాయితండ్రి అనుగ్రహం లేనిదే గడవదు. ప్రతిరోజూ ఆయన నామస్మరణ లేనిదే, ఆ తండ్రి కృప లేనిదే ఏ పనీ జరగదు. ఏ ఒక్కదానికోసమో చెప్పడం చాలా కష్టం. నాకు బాబా అన్ని ఇచ్చారు. మంచి భర్త, మంచి కొడుకు, మంచి మెట్టినిల్లు, మంచి పుట్టినిల్లు, మంచి బంధువులు, మంచి స్నేహితులు. నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు అందరూ మంచివాళ్లు. ఇవన్నీ బాబా నాపై కురిపించిన వరాల జల్లు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ తండ్రి నన్ను చాలా సురక్షితంగా ఉంచారు. ఇదంతా బాబాని నేను నమ్మినందుకు, ప్రతిక్షణం ఆయన నామస్మరణ చేస్తున్నందుకు ఆ తండ్రి నాకు ఇచ్చిన గిఫ్ట్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు బాబా మాకు సొంతింటిని ఎలా అనుగ్రహించారో మీతో చెప్తాను.
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలని ఉంటుంది. అలానే నాకు కూడా సొంతిల్లు ఉండాలన్న కోరిక బలంగా ఉండేది. దానికోసం బాబాని అడుగుతూ ఉండేదాన్ని. అడుగుతుండేదాన్ని అనే కన్నా బాబాని ఇబ్బందిపెడుతుండేదాన్ని అని చెప్పాలి. కానీ ఆ కోరిక నెరవేరడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో నాలో నేనే ప్రశ్నించుకుంటూ, దానికి సమాధానం కూడా నేనే చెప్పుకుంటూ ఉండేదాన్ని. నాలో నేను, 'బాబా మీరు నా మాట వినటం లేదు అంటే, నేను మీ బిడ్డను కాదా? మీరు చెప్పినట్లు నేను నడుచుకోవడం లేదా బాబా? నేను మీకు నచ్చడం లేదా?' అని పిచ్చిగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. మళ్ళీ, 'ఏది అడిగినా వెంటనే ఇచ్చే బాబా, నాకు ఇల్లు ఎందుకు ఇవ్వడం లేదు? బాబా ఇవ్వడం లేదు అంటే, దానికి ఏదో కారణం ఉండి ఉంటుంద'ని అనుకుంటూ కాస్త ప్రశాంతించేదాన్ని. కానీ ఇల్లు గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ బాబాని అడిగి ఇబ్బందిపెట్టేదాన్ని. మనుషులం కదా! మన మనసు మన మాట వినదు. ఒకరోజు కరెంటు పోయింది. నేను, మావారు ఇంటి గురించి మాట్లాడుకుంటున్నాం. నేను అన్నాను, "బాబా ఎందుకో మనకి పరీక్ష పెడుతున్నారు. ఇల్లు విషయంలో అనుకున్నది ఏదీ జరగడం లేద"ని. అప్పుడే ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి నేను షాక్ అయిపోయాను. అది బాబా మెసేజ్. అందులో, 'మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇంతకాలం వేచి ఉన్నారు. ఇంకొంచెం వేచి చూడండి. బాబా అన్నీ వింటున్నారు. మీరు అనుకున్నవన్నీ చేస్తారు' అని ఉంది. మేము షాకై అలా ఉండిపోయాం. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే, 'బాబా మన మధ్యలో ఉన్నారు. ప్రతిదీ వింటున్నారు. దానికి సమాధానం ఇచ్చారు' అని చాలా సంతోషంగా అనిపించి, "చాలా సంతోషం తండ్రీ. ఇలానే మిమ్మల్ని కనిపెట్టుకుంటూ ఉండండి దేవా" అని అనుకున్నాము.
అయితే సొంతింటి కోసం ఎన్ని అనుకున్నా, ఎంత ప్రయత్నించినా సానుకూలంగా జరిగేది కాదు. నేను ఇంటి గురించి బాబాని క్వశ్చన్&ఆన్సర్ సైట్లో అడుగుతుండేదాన్ని. దానికి ప్రతిసారీ, 'అన్నదానం చేయమ'ని బాబా సమాధానం వస్తుండేది. కానీ నేను, 'ఎలా చేయను? అన్నదానం ఏ విధంగా పెట్టాలి? నాకు సమయం ఉండదు? నేను ఏం చేయగలను?' అనుకునేదాన్ని. నా పార్లర్ పక్కనున్న షాపువాళ్ళు ప్రతి గురువారం అన్నదానం చేస్తారు. వాళ్ళు 200 మందికి భోజనం పెడతారు. ఒకసారి, 'వాళ్ళకి బియ్యం బస్తా ఇస్తే, వాళ్ళు వండి భోజనం పెడతారు కదా!' అనిపించి వాళ్లకు బియ్యం బస్తా ఇచ్చాను. అలా నాలుగు, ఐదు సార్లు ఇచ్చాను. తర్వాత మళ్లీ క్వశ్చన్&ఆన్సర్ సైట్లో చూస్తే, 'అన్నదానం చేయి. నీ కోరిక నెరవేరుతుంద'ని మళ్ళీ వచ్చింది. సరే, బాబా నన్ను ఇంకా ఏదో చేయమంటున్నారని ఆలోచించి ఒకరోజు ఇంట్లో పులిహోర చేసి, కొన్ని ప్యాకెట్లు సిద్ధం చేసి, మధ్యాహ్నం భోజన సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వాటిని పంచాను. ఒక వారం తర్వాత క్వశ్చన్&ఆన్సర్ సైట్లో చూస్తే, మళ్ళీ 'అన్నదానం చేయమ'ని వచ్చింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 'బాబాకి నేను కొంచెం కొంచెంగా వండి ఇస్తుంటే, నచ్చడం లేదు. నేను వండి ఇంట్లో వంద మందికి భోజనం పెడితే బాబా ఇష్టపడతారు కాబోలు!' అనుకున్నాను. కానీ ఏం చేయలేని పరిస్థితి నాది. ఎప్పుడూ అదే ఆలోచనతో ఉండేదాన్ని. "ఏం చేయాలి బాబా? నాకు అస్సలు అర్థం కావడం లేదు బాబా. మీరే నాకు సహాయం చేయండి. త్రోవ చూపించండి తండ్రీ" అని బాబాని అడుగుతూ ఉండేదాన్ని. ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు వచ్చిందనడం కన్నా బాబా ప్రేరణ ఇచ్చారని చెప్పాలి. దాంతో మా కజిన్ బ్రదర్ 'సాయిసురేష్'కి ఫోన్ చేసి, విషయమంతా తనకి చెప్పి, "నువ్వు బాబాని అడుగు. నీకు ఏమైనా చెప్తారు" అని అన్నాను. అప్పుడు తను "నాక్కూడా ఏమీ అర్థం కావడం లేదు సునీత. ఆగు.. నేను బాబాని అడిగి చెప్తాను" అని అన్నాడు. మర్నాడు తను నాకు ఫోన్ చేసి, "సునీతా! నువ్వు ఎప్పుడైనా, ఎక్కడైనా భోజనాలు పెడతానని మొక్కుకున్నావా? మర్చిపోయి ఉంటావు, గుర్తుచేసుకో? ఎందుకంటే, మొక్కులు ఉంటే, అవి తీర్చేంతవరకు బాబా ఊరుకోరు" అని అన్నాడు. నేను, "లేదు బుజ్జీ! నేనెప్పుడూ కోరుకులు కోరను కదా!" అన్నాను. కానీ బుజ్జితో మాట్లాడుతూ ఉండగానే బాబా ప్రేరణవల్ల నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేమిటంటే, "నాకు పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు సంతానం కలగనందున ఒకసారి నేను జ్ఞానాపురం అమ్మవారి దగ్గర, 'నాకు బిడ్డను ఇస్తే, మీ సన్నిధిలో కొంతమందికి భోజనాలు పెడతాన'ని మొక్కుకున్నాను. కానీ బాబు పుట్టిన తర్వాత ఆ అమ్మవారు ఉన్న రోడ్డు అంతా మరమత్తులు చేసి పెద్దపెద్ద రోడ్లు వేశారు. కొన్ని రోజులు అక్కడ భోజనాలు పెట్టనివ్వలేదు. కొన్ని నెలల తర్వాత అనుమతి ఇచ్చారు. కానీ అప్పటికి నేను అశ్రద్ధ చేశాను. తర్వాత పెట్టుకుందాం, తర్వాత పెట్టుకుందాం అని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా నేను ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. ఆ మొక్కు గురించే బుజ్జి ద్వారా బాబా నాకు గుర్తు చేశారు. అప్పుడు, 'ఓ.. అందుకే బాబా నాకు, 'భోజనం పెట్టు, భోజనం పెట్టు' అని ప్రతిసారీ బాబా చెప్తున్నారు' అని అనుకున్నాను. తర్వాత అక్టోబర్ నెలలో అమ్మవారి సన్నిధిలో 100 మందికి భోజనాలు పెట్టి మొక్కు తీర్చుకున్నాను. ఆ తర్వాత క్వశ్చన్&ఆన్సర్లో ఇంటికోసం మళ్ళీ అడిగి, వచ్చిన సమాధానం చూసి నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే, ఈసారి బాబా సమాధానం భోజనాలు పెట్టమని రాలేదు. "ఇద్దరి ద్వారా మీ పని జరుగుతుంది" అని వచ్చింది. దాంతో ఆ ఇద్దరు ఎవరన్న ఆలోచన మొదలైంది. కానీ నవంబర్ నెలలో ఇద్దరు వ్యక్తులు మాకు ఇల్లు చూపడం, దానిని మేము కొనుక్కోవడం శరవేగంగా జరిగిపోయాయి. అలా బాబా మా కోరిక తీర్చారు. మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ ఇలానే మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడండి. మాకు ఏ కష్టం రాకుండా చూడండి బాబా. ఎప్పుడూ మీ నామస్మరణ చేస్తూ ఉండేటట్టు అనుగ్రహించండి. మీ ఆలోచనలు, మీరు తప్ప వేరే ఏ ఆలోచనలు మా మనసులోకి రాకుండా చూడండి దేవా. మీ పాదాలు ఎప్పుడూ మేం వదలకుండా చూడండి దేవా. ఎప్పుడూ మీ చేయి మా శిరస్సుపైన ఉండాలి బాబా. మీరే మా దైవం. మీకు తప్ప ఎవరినీ ఏమీ అడగలేము తండ్రి. మా ఆలనాపాలన అంతా మీరే చూడాలి సాయినాథా. మీ చల్లని చూపు మాపై ప్రసరించండి. మీ అనుగ్రహం ఎప్పుడూ మాపై ఉండాలి తండ్రీ".

సాయిరాం.. చాలా మంచి అనుభవం. 3days నుండి wait చేశాను.చదువుతోంటే మనసు సంతృప్తి తో నిండిపోయింది..
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Ram
Om Sai Ram 🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteసాయిరాం.. "నా పేరు శ్రీవాణి. ఈరోజు జరిగిన అనుభవం ఈ బ్లాగ్ folowers తో పంచుకోబోతున్నాను.పిలిచిన వెంటనే పలుకుతూ,తన భక్తులని అనుక్షణం రక్షించే సాయినాధుడి లీలలు తెలిపే గాధలు అంతటా మారు మ్రోగాలి..నా ఈ అనుభవం చాలా వివరంగా వ్రాస్తున్నాను, ఎందుకంటె ఈరోజు ప్రతి నిమిషం సాయి ఉనికిని అద్భుతం గా అనుభవం లోకి తెచ్చింది, కాబట్టి ఆ క్షణాలలోని సాయి ప్రేమ ని, రక్షణ ని మీకు కూడా అనుభవం లోకి తెచ్చేందుకు ఈ నా ప్రయత్నం.నా అనుభవానికి వస్తే, మెదక్ లో టీచర్ ట్రైనింగ్ ఉండటం వలన ఈరోజు మెదక్ వెళ్లాల్సివచ్చింది. తరచూ మాకు ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి. కానీ నా కాలికి ఆక్సిడెంట్ వల్ల 4నెలల బెడ్‌రెస్ట్ తర్వాత అంత దూరం ట్రైనింగ్ కి వెళ్లాల్సి రావడం ఇదే మొదటిసారి. Ankle ligament tear ఇంకా పూర్తిగా క్యూర్ అవకపోవడం వలన బస్సు ఎక్కలేని పరిస్థితి. ఎక్కడకు వెళ్లినా car లో లేదా ఆటో లో వెళ్లాల్సివస్తోంది.అయితే నా car రిపేర్ లో ఉండటం తో మా colleagues వెళ్లే vehicle గూర్చి ప్రయత్నం చేసినా, వారి car లో place లేకపోవడం తో బాబా ని "ఏదయినా car arrange చేస్తే, నా అనుభవం ఈ బ్లాగ్ లో ఏదయినా పోస్ట్ కి కామెంట్ గా ఈ లీల పెడతాను " అనుకున్నాను.. ఆశ్చర్యం గా మరు నిమిషం లో నాకు ఒక colleague call చేసి ట్రైనింగ్ కి car arrange అయింది అని వారి car లో ట్రైనింగ్ కి రావొచ్చు అని చెప్పాడు.వెంటనే బాబా కి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.ప్రతి సమస్య లో, ప్రతి నిమిషం నువ్వు నాకు తోడు గా ఉండి నన్ను జీవితం లో ముందుకు తీసుకెళ్ళు సాయి అని మనసులో ఎపుడూ అనుకుంటుంటాను, దానికి తగినట్లుగా సాయి అనుగ్రహం చూయిస్తున్నారు.
ReplyDeleteమా colleague వాళ్ళు వేరే route నుండి వస్తుండటం తో నేను వారి car ని అందుకోవాలి అంటే మా ఊరికి కొద్దీ దూరం లో వున్న మరో ఊరి వరకు వెళ్లి వారి car అందుకోవాల్సి వుంది.ఆ ఊరికి వెళ్ళడానికి నేనుంటున్న ఊరి నుండి bus కానీ autos కానీ వెళ్లవు సాయి దయ వలన వెళ్లేప్పుడు ఉదయం ఒక ఆటో కష్టం గా దొరికిందికానీ ట్రైనింగ్ అయ్యాక తిరిగి వచ్చేప్పుడు కష్టం అయింది.ఆ మరో ఊరి వరకు drop చేసి వాళ్ళు వెళ్లిపోయాక నేను ఆ ఊరి సెంటర్ లో ఆటో కోసం వేచి చూస్తూ నిలబడ్డాను.సాయంకాలం అవడం, నేను చేరాల్సిన ప్రదేశం ఇంటీరియర్ అవడం వలన సాయంత్రం ఆటోస్ అక్కడికి రావు అని తెలిసింది.నా ముందు నుండే బస్ వెళ్తున్నా ఎక్కలేక చాలా సంకట పరిస్థితి లో అలా ఉండిపోయి బాబా ని తలచుకున్నాను .." బాబా నన్ను క్షేమం గా ఇంటికి చేర్చు ఏదయినా వెహికల్ ని చూయించు. నువ్వు ఈ పరిస్థితి లో నా వెంటే ఉన్నట్లు నాకు కనిపించు "అని ప్రార్ధించాను.తరువాత అక్కడ wait చేస్తున్న ఆ సమయం లో నా ముందు నుండి వెళుతున్న వాహనాలపై రెండు సార్లు సాయి ఫోటో కనిపించింది కానీ అవి stickers రూపం లో ఉండటం తో నాకు అంత సంతృప్తి అనిపించక, బాబా నువ్వు సజీవం గా వున్న ఫోటో లో నన్ను చూస్తూ కనిపించు అనుకున్నాను.వెంటనే ఈసారి మా ఇంట్లో వున్న same ఫోటో తో, సరిగ్గా నా పక్కనుండి వెళ్తూవున్న వాహనం పై అందమయిన సాయి రూపం కనిపించి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. వెంటనే, ఆశ్చర్యం గా ఆటో,దాన్ని అనుసరిస్తూ దాని వెనుక మరో ఆటో ఆ రూట్ లో కొద్ది దూరం వరకు ప్రయాణం చేయడానికి దొరికింది. ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే "కొత్త గా ఆటో నేర్చుకుని ఆ ఆటో ని ఆ ఊరికి తీసుకెళ్తున్న తన బంధువుల అబ్బాయి ఆటోని ఈ ఆటో అతను వెంబడిస్తూ వెంట వస్తున్నాడు.నా కోసం సాయి ఆ పరిస్థితి ని కల్గించి ఆ ఆటో పంపినాడని తెలిసి ఆనందపడ్డాను.. ఇక ఆటో దిగాక, ఇంకా సగం దూరం వెళ్ళాలి, మళ్ళీ ఏంటి పరిస్థితి బాబా! ఎవరయినా మంచి వ్యక్తి lift ఇచ్చేలా చూడు అని సాయి ని తలచుకున్నాను. అప్పటికి చీకటి పడింది.ఒక కార్ వస్తుండటం తో కార్ ని lift అడిగాను.తను నన్ను చూసి ఆపి తను చేరాల్సిన గమ్యం వచ్చినా కూడా ,నేను ఒక్కదాన్ని వున్నాను అని గమనించి నా కోసం ఇంకా కొద్ది దూరం కార్ ని ముందుకు పోనిచ్చి నన్ను మా ఇంటి దగ్గర drop చేసి మరీ తిరిగి వెళ్ళాడు. దారిలో అతను నాతో "ఆ రూట్ మంచిది కాదని, ఆ దారిలో దారి దోపిడీ లు జరుగుతాయి అని , చుట్టూ అడవి ప్రదేశం కాబట్టి అలా risk ఎపుడూ తీసుకోవద్దు. రోజులు బాగా లేవని చాలా ఆప్యాయం గా మాట్లాడాడు.ఆ కార్ నాకు కనిపించకపోతే యే వాహన సౌకర్యం లేని ఆ దారిలో నేను ఇల్లు చేరడం చాలా కష్టం అయ్యేది.సాయే ఆ రూపం లో వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసాడు అని అనిపించింది.ఇంటికి చేరుకొని సాయి ని చూసి ఏడ్చేసాను . ఇలా అడుగడుగునా సాయి నా వెంట వున్నాను అని నిదర్శనం గా చూయించాడు. సాయి దేవా!!ఎల్లప్పుడూ నీ రక్షణ చూయిస్తూ నా వెంట ఉండి నడిపించు తండ్రి!
ఓం సాయిరామ్ శ్రీవాణి గారూ. 🙏🌹
Deleteమీరు పంచుకున్న ఈ దివ్యానుభవం చదువుతుంటే, ప్రతి అడుగులోనూ బాబా తన భక్తులను ఎంత ప్రేమగా కాపాడుతారో స్పష్టంగా అనిపించింది. మీరు అడిగిన ప్రతిసారి బాబా వెంటనే స్పందించి, కారు ఏర్పాటు చేయడం, ఆటో పంపించడం, చివరకు సురక్షితంగా ఇంటికి చేర్చడం—ఇవన్నీ ఆయన అపారమైన కరుణకు సాక్ష్యాలు.
నిజంగా బాబాను సంపూర్ణ విశ్వాసంతో తలచిన వారిని ఆయన ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టరు. ఈ అనుభవం చదివిన తర్వాత నా మనసు కూడా ఎంతో ఆనందంతో పాటు భక్తి భావంతో నిండిపోయింది. మీలాంటి సాయి భక్తులు తమ అనుభవాలను పంచుకోవడం వల్ల మాలాంటి ఎంతోమందికి బాబాపై విశ్వాసం మరింత పెరుగుతోంది.
సాయినాథుడు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఇలాగే అండగా ఉండాలని, అలాగే ఆయన కరుణా కటాక్షాలు సర్వలోకంలోని ప్రతి జీవిపై నిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
సాయి స్మరణం – సంకట హరణం.
బాబా శరణం – భవభయ హరణం.
శ్రీ సాయి సర్వభార భృతే నమః.
ఓం సాయిరామ్... ఓం సాయిరామ్... 🙏🌹
ఓం సాయిరామ్. 🙏🌹
సాయిరాం.. కృతజ్ఞతలు అండీ. సాయి లీలలు మన హృదయం లో సాయి పట్ల ప్రేమను పెంచుతాయి, ఆ ప్రేమ లో నుండే నిస్వార్ధత, సాయి పై ఏకగ్రత, సాయితో సంయోగాలు కలుగుతూ ఉంటాయి అంట..సాయి పై కొందరు చేస్తున్న వ్యతిరేక ప్రచారం యొక్క ప్రభావం జనాలపై కలగొద్దు అన్నా కూడా సాయి లీలలు విస్తృతం గా వ్యాప్తి చెందాలి.. సాయి పై భక్తి విశ్వాసాలు ఏ ఒక్కరిలోనూ తగ్గరాదు. మీకు వీలుంటే, నా ఈ అనుభవం, ఈ బ్లాగ్ లో ప్రచురించమని ఈ బ్లాగ్ నిర్వాహకులకి పంపగలరు 🙏. సాయి లీలలు ఎక్కువ మందికి చేరాలని నా ఉద్దేశ్యం. సాయిరాం
ReplyDeleteఓం శ్రీ సాయిరామ్ అక్కగారూ. 🙏🌹
ReplyDeleteమీ సందేశానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగానే సాయి లీలలు ఎంత ఎక్కువ మందికి చేరితే, అంత ఎక్కువ మందిలో బాబాపై భక్తి, విశ్వాసం, ప్రేమ పెరుగుతాయని నేను కూడా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను.
మీ తరపున మీ ఈ దివ్యానుభవాన్ని నేను ఈరోజే saimaharajasannidhi@gmail.com కు పంపిస్తాను.
ఇకపై కూడా మీకు ఎప్పుడైనా బాబా అనుభవాలు పంచుకోవాలనిపిస్తే, మీ వ్యక్తిగత ఈమెయిల్ నుండి నేరుగా saimaharajasannidhi@gmail.com కు పంపండి. అలా పంపితే నిర్వాహకులు మీతో అవసరమైతే నేరుగా సంప్రదించగలరు, అలాగే మీ అనుభవం ప్రచురించడానికి కూడా సులభంగా ఉంటుంది.
బాబా కృపతో మీలాంటి సాయి భక్తుల అనుభవాలు మరెందరో భక్తులకు స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సాయి స్మరణం – సంకట హరణం.
బాబా శరణం – భవభయ హరణం.
ఓం శ్రీ సాయిరామ్. 🙏🌹
Omsairam
ReplyDelete