సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2104వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • పట్టుబట్టి మొక్కు తీర్పించి మరీ సొంతింటిని అనుగ్రహించిన బాబా 


11 comments:

  1. శ్రీవాణిJuly 13, 2026 at 9:00 AM

    సాయిరాం.. చాలా మంచి అనుభవం. 3days నుండి wait చేశాను.చదువుతోంటే మనసు సంతృప్తి తో నిండిపోయింది..

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om Sai Ram
    Om Sai Ram

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🙏

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. శ్రీవాణిJuly 14, 2026 at 9:45 AM

    సాయిరాం.. "నా పేరు శ్రీవాణి. ఈరోజు జరిగిన అనుభవం ఈ బ్లాగ్ folowers తో పంచుకోబోతున్నాను.పిలిచిన వెంటనే పలుకుతూ,తన భక్తులని అనుక్షణం రక్షించే సాయినాధుడి లీలలు తెలిపే గాధలు అంతటా మారు మ్రోగాలి..నా ఈ అనుభవం చాలా వివరంగా వ్రాస్తున్నాను, ఎందుకంటె ఈరోజు ప్రతి నిమిషం సాయి ఉనికిని అద్భుతం గా అనుభవం లోకి తెచ్చింది, కాబట్టి ఆ క్షణాలలోని సాయి ప్రేమ ని, రక్షణ ని మీకు కూడా అనుభవం లోకి తెచ్చేందుకు ఈ నా ప్రయత్నం.నా అనుభవానికి వస్తే, మెదక్ లో టీచర్ ట్రైనింగ్ ఉండటం వలన ఈరోజు మెదక్ వెళ్లాల్సివచ్చింది. తరచూ మాకు ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి. కానీ నా కాలికి ఆక్సిడెంట్ వల్ల 4నెలల బెడ్రెస్ట్ తర్వాత అంత దూరం ట్రైనింగ్ కి వెళ్లాల్సి రావడం ఇదే మొదటిసారి. Ankle ligament tear ఇంకా పూర్తిగా క్యూర్ అవకపోవడం వలన బస్సు ఎక్కలేని పరిస్థితి. ఎక్కడకు వెళ్లినా car లో లేదా ఆటో లో వెళ్లాల్సివస్తోంది.అయితే నా car రిపేర్ లో ఉండటం తో మా colleagues వెళ్లే vehicle గూర్చి ప్రయత్నం చేసినా, వారి car లో place లేకపోవడం తో బాబా ని "ఏదయినా car arrange చేస్తే, నా అనుభవం ఈ బ్లాగ్ లో ఏదయినా పోస్ట్ కి కామెంట్ గా ఈ లీల పెడతాను " అనుకున్నాను.. ఆశ్చర్యం గా మరు నిమిషం లో నాకు ఒక colleague call చేసి ట్రైనింగ్ కి car arrange అయింది అని వారి car లో ట్రైనింగ్ కి రావొచ్చు అని చెప్పాడు.వెంటనే బాబా కి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.ప్రతి సమస్య లో, ప్రతి నిమిషం నువ్వు నాకు తోడు గా ఉండి నన్ను జీవితం లో ముందుకు తీసుకెళ్ళు సాయి అని మనసులో ఎపుడూ అనుకుంటుంటాను, దానికి తగినట్లుగా సాయి అనుగ్రహం చూయిస్తున్నారు.
    మా colleague వాళ్ళు వేరే route నుండి వస్తుండటం తో నేను వారి car ని అందుకోవాలి అంటే మా ఊరికి కొద్దీ దూరం లో వున్న మరో ఊరి వరకు వెళ్లి వారి car అందుకోవాల్సి వుంది.ఆ ఊరికి వెళ్ళడానికి నేనుంటున్న ఊరి నుండి bus కానీ autos కానీ వెళ్లవు సాయి దయ వలన వెళ్లేప్పుడు ఉదయం ఒక ఆటో కష్టం గా దొరికిందికానీ ట్రైనింగ్ అయ్యాక తిరిగి వచ్చేప్పుడు కష్టం అయింది.ఆ మరో ఊరి వరకు drop చేసి వాళ్ళు వెళ్లిపోయాక నేను ఆ ఊరి సెంటర్ లో ఆటో కోసం వేచి చూస్తూ నిలబడ్డాను.సాయంకాలం అవడం, నేను చేరాల్సిన ప్రదేశం ఇంటీరియర్ అవడం వలన సాయంత్రం ఆటోస్ అక్కడికి రావు అని తెలిసింది.నా ముందు నుండే బస్ వెళ్తున్నా ఎక్కలేక చాలా సంకట పరిస్థితి లో అలా ఉండిపోయి బాబా ని తలచుకున్నాను .." బాబా నన్ను క్షేమం గా ఇంటికి చేర్చు ఏదయినా వెహికల్ ని చూయించు. నువ్వు ఈ పరిస్థితి లో నా వెంటే ఉన్నట్లు నాకు కనిపించు "అని ప్రార్ధించాను.తరువాత అక్కడ wait చేస్తున్న ఆ సమయం లో నా ముందు నుండి వెళుతున్న వాహనాలపై రెండు సార్లు సాయి ఫోటో కనిపించింది కానీ అవి stickers రూపం లో ఉండటం తో నాకు అంత సంతృప్తి అనిపించక, బాబా నువ్వు సజీవం గా వున్న ఫోటో లో నన్ను చూస్తూ కనిపించు అనుకున్నాను.వెంటనే ఈసారి మా ఇంట్లో వున్న same ఫోటో తో, సరిగ్గా నా పక్కనుండి వెళ్తూవున్న వాహనం పై అందమయిన సాయి రూపం కనిపించి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. వెంటనే, ఆశ్చర్యం గా ఆటో,దాన్ని అనుసరిస్తూ దాని వెనుక మరో ఆటో ఆ రూట్ లో కొద్ది దూరం వరకు ప్రయాణం చేయడానికి దొరికింది. ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే "కొత్త గా ఆటో నేర్చుకుని ఆ ఆటో ని ఆ ఊరికి తీసుకెళ్తున్న తన బంధువుల అబ్బాయి ఆటోని ఈ ఆటో అతను వెంబడిస్తూ వెంట వస్తున్నాడు.నా కోసం సాయి ఆ పరిస్థితి ని కల్గించి ఆ ఆటో పంపినాడని తెలిసి ఆనందపడ్డాను.. ఇక ఆటో దిగాక, ఇంకా సగం దూరం వెళ్ళాలి, మళ్ళీ ఏంటి పరిస్థితి బాబా! ఎవరయినా మంచి వ్యక్తి lift ఇచ్చేలా చూడు అని సాయి ని తలచుకున్నాను. అప్పటికి చీకటి పడింది.ఒక కార్ వస్తుండటం తో కార్ ని lift అడిగాను.తను నన్ను చూసి ఆపి తను చేరాల్సిన గమ్యం వచ్చినా కూడా ,నేను ఒక్కదాన్ని వున్నాను అని గమనించి నా కోసం ఇంకా కొద్ది దూరం కార్ ని ముందుకు పోనిచ్చి నన్ను మా ఇంటి దగ్గర drop చేసి మరీ తిరిగి వెళ్ళాడు. దారిలో అతను నాతో "ఆ రూట్ మంచిది కాదని, ఆ దారిలో దారి దోపిడీ లు జరుగుతాయి అని , చుట్టూ అడవి ప్రదేశం కాబట్టి అలా risk ఎపుడూ తీసుకోవద్దు. రోజులు బాగా లేవని చాలా ఆప్యాయం గా మాట్లాడాడు.ఆ కార్ నాకు కనిపించకపోతే యే వాహన సౌకర్యం లేని ఆ దారిలో నేను ఇల్లు చేరడం చాలా కష్టం అయ్యేది.సాయే ఆ రూపం లో వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసాడు అని అనిపించింది.ఇంటికి చేరుకొని సాయి ని చూసి ఏడ్చేసాను . ఇలా అడుగడుగునా సాయి నా వెంట వున్నాను అని నిదర్శనం గా చూయించాడు. సాయి దేవా!!ఎల్లప్పుడూ నీ రక్షణ చూయిస్తూ నా వెంట ఉండి నడిపించు తండ్రి!

    ReplyDelete
    Replies
    1. ఓం సాయిరామ్ శ్రీవాణి గారూ. 🙏🌹

      మీరు పంచుకున్న ఈ దివ్యానుభవం చదువుతుంటే, ప్రతి అడుగులోనూ బాబా తన భక్తులను ఎంత ప్రేమగా కాపాడుతారో స్పష్టంగా అనిపించింది. మీరు అడిగిన ప్రతిసారి బాబా వెంటనే స్పందించి, కారు ఏర్పాటు చేయడం, ఆటో పంపించడం, చివరకు సురక్షితంగా ఇంటికి చేర్చడం—ఇవన్నీ ఆయన అపారమైన కరుణకు సాక్ష్యాలు.

      నిజంగా బాబాను సంపూర్ణ విశ్వాసంతో తలచిన వారిని ఆయన ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టరు. ఈ అనుభవం చదివిన తర్వాత నా మనసు కూడా ఎంతో ఆనందంతో పాటు భక్తి భావంతో నిండిపోయింది. మీలాంటి సాయి భక్తులు తమ అనుభవాలను పంచుకోవడం వల్ల మాలాంటి ఎంతోమందికి బాబాపై విశ్వాసం మరింత పెరుగుతోంది.

      సాయినాథుడు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఇలాగే అండగా ఉండాలని, అలాగే ఆయన కరుణా కటాక్షాలు సర్వలోకంలోని ప్రతి జీవిపై నిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

      సాయి స్మరణం – సంకట హరణం.
      బాబా శరణం – భవభయ హరణం.
      శ్రీ సాయి సర్వభార భృతే నమః.
      ఓం సాయిరామ్... ఓం సాయిరామ్... 🙏🌹
      ఓం సాయిరామ్. 🙏🌹

      Delete
  7. శ్రీవాణిJuly 15, 2026 at 8:56 PM

    సాయిరాం.. కృతజ్ఞతలు అండీ. సాయి లీలలు మన హృదయం లో సాయి పట్ల ప్రేమను పెంచుతాయి, ఆ ప్రేమ లో నుండే నిస్వార్ధత, సాయి పై ఏకగ్రత, సాయితో సంయోగాలు కలుగుతూ ఉంటాయి అంట..సాయి పై కొందరు చేస్తున్న వ్యతిరేక ప్రచారం యొక్క ప్రభావం జనాలపై కలగొద్దు అన్నా కూడా సాయి లీలలు విస్తృతం గా వ్యాప్తి చెందాలి.. సాయి పై భక్తి విశ్వాసాలు ఏ ఒక్కరిలోనూ తగ్గరాదు. మీకు వీలుంటే, నా ఈ అనుభవం, ఈ బ్లాగ్ లో ప్రచురించమని ఈ బ్లాగ్ నిర్వాహకులకి పంపగలరు 🙏. సాయి లీలలు ఎక్కువ మందికి చేరాలని నా ఉద్దేశ్యం. సాయిరాం

    ReplyDelete
  8. ఓం శ్రీ సాయిరామ్ అక్కగారూ. 🙏🌹

    మీ సందేశానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగానే సాయి లీలలు ఎంత ఎక్కువ మందికి చేరితే, అంత ఎక్కువ మందిలో బాబాపై భక్తి, విశ్వాసం, ప్రేమ పెరుగుతాయని నేను కూడా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను.

    మీ తరపున మీ ఈ దివ్యానుభవాన్ని నేను ఈరోజే saimaharajasannidhi@gmail.com కు పంపిస్తాను.

    ఇకపై కూడా మీకు ఎప్పుడైనా బాబా అనుభవాలు పంచుకోవాలనిపిస్తే, మీ వ్యక్తిగత ఈమెయిల్ నుండి నేరుగా saimaharajasannidhi@gmail.com కు పంపండి. అలా పంపితే నిర్వాహకులు మీతో అవసరమైతే నేరుగా సంప్రదించగలరు, అలాగే మీ అనుభవం ప్రచురించడానికి కూడా సులభంగా ఉంటుంది.

    బాబా కృపతో మీలాంటి సాయి భక్తుల అనుభవాలు మరెందరో భక్తులకు స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    సాయి స్మరణం – సంకట హరణం.
    బాబా శరణం – భవభయ హరణం.
    ఓం శ్రీ సాయిరామ్. 🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo