ఈ భాగంలో అనుభవం:
ఏది అడిగితే అది, ఎలా కావాలనుకుంటే అలా అనుగ్రహించే సాయితండ్రి
సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు సునీత. మావారి పేరు జయరాజ్. మాది వైజాగ్. నేను సమయం దొరికినప్పుడు బాబా భక్తుల అనుభవాలు చదువుతుంటాను. ఏరోజు చదవకపోయినా నా మనసు కుదుటపడదు. అవి చదివిన తర్వాతే నేను సంతోషంగా ఉంటాను. నాకు జరిగిన అనుభవాలను మా కజిన్ బ్రదర్ సాయిసురేష్ తో సంతోషంగా పంచుకోవడం నాకలవాటు. తను చాలాసార్లు అనుభవాలు వ్రాసి, బ్లాగులో పెడితే అందరూ చదువుతారు, బాబా ప్రేమను ఆస్వాదించి ఆనందిస్తారని చెప్తుండేవాడు. కానీ నాకు వ్రాయడమంటే చాలా బద్ధకం. నేను ఎప్పుడూ ఏదీ వ్రాయను. అందుకే తను అంతలా చెప్పిన వ్రాసేదాన్ని కాదు. కానీ ఒకసారి నాకే అనిపించింది, 'బాబా భక్తుల అనుభవాలు చదివితే, నాకు ఎంత సంతోషంగా ఉంటుందో కదా! అలానే నా అనుభవాలు కూడా సాయి స్నేహితులకి ఆనందాన్నిస్తాయి' అని. అందరిలో సాయి ఉన్నారు. మీ అందరూ హ్యాపీగా ఉంటే నా సాయి హ్యాపీగా ఉన్నట్టే కదా! అంతేకాదు, మన సాయితండ్రి ఎప్పుడూ మన దగ్గరగా ఉండడం మనకి కావాలి. బాబా భక్తుల అనుభవాలు చదువుతుంటే, బాబా మనతో ఉన్నట్లు మనకనిపిస్తుంది. అందుకే నా అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. ఎప్పుడూ వ్రాయను కదా! ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.
నేను ప్రతి చిన్న విషయానికి, పెద్ద సమస్యకి బాబాను తలుస్తూ ఉంటాను. ఒకసారి మా బైక్ తాళాలు ఎంత వెతికినా కనిపించలేదు. బాబా నామస్మరణ చేస్తూ
రెండు రోజులు ఎంతగానో వెతికాము. ఎప్పుడూ పెట్టే చోట వందసార్లు వెతికాము కానీ, కనిపించలేదు. చివరికి, "బాబా! తాళాలు దొరకాలి, అవి దొరికేటట్లు చేయండి" అని అనుకున్నాను. వెంటనే ఆ తాళాలు నాకు కనిపించాయి.
ఒకసారి నాకు చాలా జ్వరం వచ్చి అస్సలు ఓపిక లేకుండా పోయింది. అయినా తప్పనిసరి పరిస్థితిలో నా బ్యూటీపార్లర్‌కి వెళ్లాల్సి వచ్చి వెళ్ళాను. ఆరోజు షాపులో పనిచేసే అమ్మాయి రాలేదు. నాకు ఓపిక లేదు. 'బాబా! ఇప్పుడు ఎవరైనా క్లయింట్ వస్తే, ఏం చేస్తాం? నేను అస్సలు నిల్చోలేకపోతున్నాను. ఎవరు వచ్చినా పంపించేస్తాను. నేను వాళ్ళని హ్యాండిల్ చేయను, చేయలేను' అనుకుంటూ కూర్చున్నాను. కొంత సమయం తర్వాత ఒక క్లయింట్ వస్తే, "నాకు బాగోలేదు. నేను ఏ పని చేయలేన"ని చెప్పాను. కానీ తనకి ఫంక్షన్ ఉందని, అర్జెంటుగా ఫేషియల్ చేయించుకోవాలని అన్నారు. "మేడం! నేను అస్సలు హ్యాండిల్ చేయలేను" అన్నాను. కానీ తను "మేడం! చేసేయండి ప్లీజ్. నాకు మీరు తప్ప ఇక్కడ ఎవరూ తెలియదు? నేను ఎక్కడికీ వెళ్ళను. మీకు తెలుసు కదా!" అన్నారు. సరేనని నేను కొంచెం ఓపిక తెచ్చుకుని, "ఫేషియల్ చేద్దాం బాబా. మీరు నాకు తోడుగా ఉండండి. ఫేషియల్ బాగా చేసి పంపించేంత వరకు నాకు కొంచెం శక్తిని ఇవ్వండి బాబా" అని అనుకొని ఫేషియల్ మొదలుపెట్టాను. కానీ ఒక్క నిమిషం కూడా నిల్చోలేకపోతున్నాను. బాబాని తలుచుకొని మనసులో, "అయ్యో.. బాబా! ఫేషియల్ మొదలుపెట్టేసాను. నాకస్సలు బాగాలేదు. నేనేం చేయను బాబా. ఫేషియల్ చేయడానికి ఒక అమ్మాయిని పంపించండి బాబా. అమ్మాయి ఉంటే బాగుంటుంది బాబా" అని అనుకుంటున్నాను. అంతే! 'మేడం' అంటూ ఓ గొంతు వినిపించింది. ఎవరని బయటికి వెళ్లి చూస్తే, నా దగ్గర అదివరకు పనిచేసే మానేసిన అమ్మాయి. నేను తనని చూసి షాక్ అయిపోయాను. ఆ రోజు తన బాబు పుట్టినరోజని నాకు చాక్లెట్లు ఇవ్వడానికని తన బాబు, భర్తని తీసుకుని వచ్చింది. తను నా పరిస్థితి చూసి షాక్ అయి, "మేడం! ఎందుకలా నీరసంగా ఉన్నారు? బాగోలేదా మీకు?" అని అడిగింది. "అవును పూజా! నాకు అస్సలు బాగోలేదు. ఫేషియల్ కోసం క్లయింట్ ఉన్నారు. కానీ నాకు అస్సలు ఓపిక లేదు" అన్నాను. అంతే, "నేను చేసేస్తాను మేడం. మీరు కూర్చోండి" అని తను నన్ను కూర్చోబెట్టి, చక్కగా ఫేషియల్ పూర్తి చేసింది. తన పిల్లలు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ మమ్మీ వచ్చేంతవరకు చక్కగా ఆడుకున్నారు. తన భర్త కూడా ఓపికగా షాపులో గంటసేపు వేచి ఉన్నారు. అంతా బాబా అనుగ్రహమనే చెప్పాలి. నేను ఎలా అడిగానో, అలానే అనుగ్రహించారు బాబా. హృ దయపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవడం తప్ప ఇంకేం చేయగలం?
ఒకసారి నాకు చాలా జ్వరం వచ్చి అస్సలు ఓపిక లేకుండా పోయింది. అయినా తప్పనిసరి పరిస్థితిలో నా బ్యూటీపార్లర్‌కి వెళ్లాల్సి వచ్చి వెళ్ళాను. ఆరోజు షాపులో పనిచేసే అమ్మాయి రాలేదు. నాకు ఓపిక లేదు. 'బాబా! ఇప్పుడు ఎవరైనా క్లయింట్ వస్తే, ఏం చేస్తాం? నేను అస్సలు నిల్చోలేకపోతున్నాను. ఎవరు వచ్చినా పంపించేస్తాను. నేను వాళ్ళని హ్యాండిల్ చేయను, చేయలేను' అనుకుంటూ కూర్చున్నాను. కొంత సమయం తర్వాత ఒక క్లయింట్ వస్తే, "నాకు బాగోలేదు. నేను ఏ పని చేయలేన"ని చెప్పాను. కానీ తనకి ఫంక్షన్ ఉందని, అర్జెంటుగా ఫేషియల్ చేయించుకోవాలని అన్నారు. "మేడం! నేను అస్సలు హ్యాండిల్ చేయలేను" అన్నాను. కానీ తను "మేడం! చేసేయండి ప్లీజ్. నాకు మీరు తప్ప ఇక్కడ ఎవరూ తెలియదు? నేను ఎక్కడికీ వెళ్ళను. మీకు తెలుసు కదా!" అన్నారు. సరేనని నేను కొంచెం ఓపిక తెచ్చుకుని, "ఫేషియల్ చేద్దాం బాబా. మీరు నాకు తోడుగా ఉండండి. ఫేషియల్ బాగా చేసి పంపించేంత వరకు నాకు కొంచెం శక్తిని ఇవ్వండి బాబా" అని అనుకొని ఫేషియల్ మొదలుపెట్టాను. కానీ ఒక్క నిమిషం కూడా నిల్చోలేకపోతున్నాను. బాబాని తలుచుకొని మనసులో, "అయ్యో.. బాబా! ఫేషియల్ మొదలుపెట్టేసాను. నాకస్సలు బాగాలేదు. నేనేం చేయను బాబా. ఫేషియల్ చేయడానికి ఒక అమ్మాయిని పంపించండి బాబా. అమ్మాయి ఉంటే బాగుంటుంది బాబా" అని అనుకుంటున్నాను. అంతే! 'మేడం' అంటూ ఓ గొంతు వినిపించింది. ఎవరని బయటికి వెళ్లి చూస్తే, నా దగ్గర అదివరకు పనిచేసే మానేసిన అమ్మాయి. నేను తనని చూసి షాక్ అయిపోయాను. ఆ రోజు తన బాబు పుట్టినరోజని నాకు చాక్లెట్లు ఇవ్వడానికని తన బాబు, భర్తని తీసుకుని వచ్చింది. తను నా పరిస్థితి చూసి షాక్ అయి, "మేడం! ఎందుకలా నీరసంగా ఉన్నారు? బాగోలేదా మీకు?" అని అడిగింది. "అవును పూజా! నాకు అస్సలు బాగోలేదు. ఫేషియల్ కోసం క్లయింట్ ఉన్నారు. కానీ నాకు అస్సలు ఓపిక లేదు" అన్నాను. అంతే, "నేను చేసేస్తాను మేడం. మీరు కూర్చోండి" అని తను నన్ను కూర్చోబెట్టి, చక్కగా ఫేషియల్ పూర్తి చేసింది. తన పిల్లలు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ మమ్మీ వచ్చేంతవరకు చక్కగా ఆడుకున్నారు. తన భర్త కూడా ఓపికగా షాపులో గంటసేపు వేచి ఉన్నారు. అంతా బాబా అనుగ్రహమనే చెప్పాలి. నేను ఎలా అడిగానో, అలానే అనుగ్రహించారు బాబా. హృ
2026, వేసవిలో ఒకసారి నాకు వడియాలు పెట్టాలనిపించింది. కానీ నాకు అస్సలు సమయం ఉండదు. ఉదయం నిద్రలేస్తూనే ఇంటి పనులు చేసుకుని, షాపుకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసారికి రాత్రి ఏ సమయమైపోతుందో కూడా తెలియదు. ఒక్క ఆదివారమే షాపు నుండి తొందరగా సాయంత్రం 6 గంటలకి ఇంటికి వస్తాను. అందుకని ఆరోజు ఉదయం మేడపై వడియాలు ఆరపెట్టి వెళ్ళిపోతే, సాయంత్రం వాటిని తెచ్చుకోవచ్చని ఆదివారం కోసం ఎదురుచూస్తూ కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను. అయితే ముందురోజు శనివారం గాలి, వాన వచ్చింది. దాంతో కొంచం సందిగ్ధంలో పడినప్పటికీ మర్నాడు ఆదివారం ఉదయం బాగా ఆలోచించి బాబా మీద భారమేసి వడియాలు పెట్టడానికి సిద్ధం చేసేసాను. తీరా మేడపైకి వెళ్లి చూస్తే చల్లగాలి, పైగా పూర్తిగా మేఘాలు ఉన్నాయి. అంతేకాదు, ఆరోజు సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది. ప్రతిసంవత్సరం ఆరోజు కొంచమైనా వర్షం పడుతుంది. అయినా అప్పటికే అంతా సిద్ధం చేసుకున్నందున చేసేదేమీలేక వడియాలు పెట్టడం మొదలుపెట్టాను. మా బిల్డింగ్‌లో ఆడవాళ్లు చూసి, "అదేంటి ఇన్ని రోజులు మంచి ఎండను వదిలేసి, వర్షం పడుతున్నప్పుడు వడియాలు పెడుతున్నారు?" అని అన్నారు. అది విని, 'వాళ్ళు అన్నది వాస్తవమే కదా!' అని భయపడిపోయాను. కానీ మనసులో బాబా నామస్మరణ చేస్తూ వడియాలన్నీ పెట్టి, "ప్లీజ్ బాబా! వర్షం పడకూడదు. ఎండ ఎక్కువగా వచ్చి వడియాలు బాగా ఆరిపోవాలి తండ్రీ" అని అనుకున్నాను. బాబా లీల చూడండి. ఆరోజు ఎంతో వర్షం పడుతుందన్నట్టు ఉన్న మేఘాలు అంతా పోయి నేను షాపుకి వెళ్లే సమయానికి పూర్తిగా ఎండ వచ్చేసింది. నేను సంతోషంగా షాపుకు వెళ్లి, నా పని అంతా చూసుకుని సాయంత్రం ఇంటికొచ్చి మేడపైకి వెళ్ళినప్పుడు బిల్డింగ్‌లోని ఆడవాళ్ళందరూ నన్ను చూసి "సునీతగారూ! మీ దగ్గర బాబా ఉన్నారండి. మేము అందరం 'వర్షం వస్తుంది. సునీతగారు వడియాలు పెట్టారు' అనుకుంటున్నాము. కానీ మీరు ఎప్పుడూ బాబా ఉన్నారు, భయం ఎందుకు అన్నందుకు అలానే అయిందండి. బాబా కాపాడారండి, వడియాలు చక్కగా ఆరిపోయాయి" అన్నారు. నాకు వాళ్ళందరి మాటలకు చాలా సంతోషంగా అనిపించింది. మనం ఏది అడిగితే అది, ఎలా కావాలనుకుంటే అలా మన ప్రతి చిన్న, పెద్ద కోరికలు తీర్చే మన సాయితండ్రికి హృదయపూర్వక పాదాభివందనాలు, శతకోటి వందనాలు.
బాబా నా సొంతింటి కలను ఎలా నెరవేర్చారో తరువాయి భాగంలో చెప్తాను.

Om Sai ram
ReplyDeleteOm Sai ram. Publish every day sai leelas in my blog
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me