1. బాబా దయ
2. సాయినాథుని కృపతో ఏదైనా జరుగుతుంది
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై. సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు రవి. నేను నా కుటుంబంతో యుఎస్‌లో ఉంటున్నాను. 2026, ఫిబ్రవరిలో మా బాబాయ్ గారి అబ్బాయి వివాహం వైజాగ్‌లో జరిగింది. నేను ఒక నెల రోజులు సెలవు పెట్టి ఇండియా వెళ్లాలనుకున్నాను. అయితే మా పిల్లలు ఇక్కడ యుఎస్ స్కూల్లో చదువుతున్నారు. ఇక్కడి స్కూలు నిబంధనల ప్రకారం ఊరికే పది రోజులకు మించి సెలవు పెడితే, పిల్లల్ని స్కూలు నుంచి తొలగిస్తారు. అలాంటప్పుడు మళ్లీ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ వేస్తే, స్కూల్లో ఖాళీ ఉంటే వెంటనే సీటు వస్తుంది లేదంటే వచ్చేవరకు వేచి ఉండాలి. ఒక్కోసారి ఆ సంవత్సరం సీటు రాకపోవచ్చు కూడా. అందువల్ల నేను ఏం చేయాలని సందిగ్ధంలో పడ్డాను. అదే ఆలోచిస్తూ బాబాని అడిగితే, ఏది సరైనదో చెప్తారని(నాకు ఏ సంశయం వచ్చినా బాబాని అడిగి విసిగిస్తూ ఉంటాను), “బాబా! ఇండియాకి వెళ్ళమంటారా?, వద్దంటారా?” అని 'ఎస్', 'నో' చీటీలు వేసి అడిగాను. ఆయన 'ఎస్' అని ఇచ్చారు. దాంతో నేను నా భార్యతో “ఇంక బెంగలేదు, బాబా వెళ్ళమన్నారు. అంతా ఆయన చూసుకుంటారు” అని ధైర్యం చెప్పి అనుకున్నట్టుగా నెల రోజులు సెలవు పెట్టి కుటుంబంతో ఇండియా వెళ్ళాను. అక్కడంతా బాగా జరిగింది. ముఖ్యంగా శిరిడీలో బాబా దర్శనం నన్ను చాలా సంతోషపరిచింది. అంత సంతృప్తికరంగా ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు వెళ్ళినా కాలేదు. నేను నాతోపాటు మా బాబాయ్ కొడుకు పెళ్లి శుభలేఖ తీసుకొని వెళ్లి బాబా సమాధి దగ్గర పెట్టి, “బాబా! మీరు వచ్చి వధూవరులను ఆశీర్వదించి కార్యక్రమాలన్నీ బాగా జరిగేలా చూడండి” అని ప్రార్థించాను. మా బాబాయ్ మేము హైదరాబాద్ నుంచి వైజాగ్‌లో ఆడపెళ్ళివారింట జరిగే పెళ్లికి వెళ్లేందుకు ఒక బస్సు మాట్లాడారు. ప్రయాణం రోజు సాయంత్రం బస్సు రాగానే పెళ్లి సామాన్లు తీసుకొని బస్సు ఆగిన చోటకి వెళితే, బస్సు ముందు భాగంలో 'నేను ఉన్నాను” అంటూ బాబా విగ్రహ రూపంలో పలకరించారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పటినుంచి వైజాగ్‌లో పెళ్ళై తిరిగి వచ్చేవరకు అడుగడుగునా సాయి ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తూనే ఉన్నారు(ఆ ఫోటోలు కింద జతపరుస్తున్నాను. చూసి ఆనందించండి). ఉదాహరణకి ఒక చోట కాఫీ కోసం బస్సు ఆపితే, అక్కుడున్న హోటల్ పేరు “సాయికృష్ణ”, వైజాగ్ చేరుకున్నాక బస్సు నిలిపిన స్థలానికి ఎదురుగా 'సాయిబాబా స్పిరిట్యువల్ సెంటర్(Saibaba spiritual center)' అని, ఇలా ఎన్బెన్నో. బాబా చూపిన ప్రేమ, దయ, కరుణలకి ఉబ్బితబ్బిబ్బయిపోయాను.
మేము ఇండియా నుంచి తిరిగి యుఎస్ వెళ్ళాక చూస్తే, నేను భయపడినట్లే మా పిల్లల్ని స్కూలు నుంచి తొలగించారు. దాంతో నేను ఫ్రెష్ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ వేసాను. బాబా దయవల్ల మా అమ్మాయికి వెంటనే సీటు వచ్చింది. కానీ అబ్బాయికి వెయిటింగ్ లిస్ట్ అన్నారు. మూడు వారాలు గడిచినా అందులో ఏ మార్పు లేదు. బాబా ఎందుకు ఇలా చేస్తున్నారని అనుకున్నప్పటికీ ఇంకా వేచి చూద్దామని నేను అంటుండేవాడిని. కానీ స్కూల్ ప్రిన్సిపాల్ "ఈ సంవత్సరం సీటు రావడం కష్టమేమో!" అనడంతో నా భార్య బాబు ఇంట్లో ఖాళీగా ఏమీ చేయకుండా ఉంటే సమయం వృధాగా పోతుందని దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూలులో అప్లికేషన్ సబ్మిట్ చేసి, జాయిన్ చేద్దాం అంది. నేను సరేనన్నాను. బాబు ఒక వారం ఆ ప్రైవేట్ స్కూలుకి వెళ్ళాక మరుసటి సోమవారం ఉదయాన్నే పాత స్కూల్ ఆఫీస్ నుంచి ఎవరో అప్లికేషన్ విత్ డ్రా చేసుకోవడం వల్ల ఒక వేకెన్సీ ఏర్పడిందని ఫోన్ వచ్చింది. అది విని మా ఆనందానికి అవధులు లేవు. అప్పటివరకు ఏ మార్పులేని వెయిటింగ్ లిస్ట్ నెంబర్ అడ్మిషన్‌కి వచ్చిందంటే అది ఆ సాయినాథుని కృపవల్లనే. ఆయన తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. నేను బాబా మా శ్రద్ధ-సబూరిలు పరీక్షించటానికి
ఓం శ్రీసాయినాథాయ నమః

ఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSai always be with me
Om sai ram tandri ofce lo intlo anni bagunde la chayandi, anni problems solve ayye la chayandi anni meeku telusu amma nannalani na kutumbanni andarni anni velala ayur arogyalatho kshamam ga kapadandi anta meede badyata om sai ram.
ReplyDeleteOm Sai Rakshak Saranam Devaa 🙏🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai 🙏🙏
ReplyDeleteBaba … Adi jaragadani telusu.. aina maro maru adugutunna..tana Pelli jaripinchu deva..
ReplyDeleteOm Sai Ram
ReplyDelete