సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2073వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తలచినంతనే ఆరోగ్యం ప్రసాదించే బాబా
2. బాబా చేసిన సహాయం

తలచినంతనే ఆరోగ్యం ప్రసాదించే బాబా

శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై. ఓం శ్రీసాయినాథాయ నమః. ముందుగా శ్రీసాయి దివ్య పాదపద్మాలకు నా శతకోటి సాష్టాంగ ప్రణామములు. సాయి భక్తులకు నమస్కారాలు. నా పేరు డా. కృష్ణ. మాది హైదరాబాద్. శ్రీసాయే మా జీవితం. నిజంగా ఈ బ్లాగు శ్రీసాయి భక్తులపాలిట ఒక వరం. అసంఖ్యాకమైన సాయిలీలలను సంతోషంగా తోటి సాయి భక్తులతో పంచుకోవడానికి, వాటిని చదివి బాబా ప్రేమను అనుభూతి చెందడానికి, ఇంకా ఆ సాయీశ్వరుని యందు భక్తివిశ్వాసాలు మరింతగా బలపడటానికి ఈ బ్లాగు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక నా అనుభవాల విషయానికి వస్తే..  2025, సెప్టెంబరు 28న నేను దగ్గు, జలుబు, కఫంతో నా జీవితంలో ఎన్నడూ అనుభవించని నరకయాతన అనుభవించాను. ఒక 7-8 రోజులు రాత్రంతా విపరీతమైన దగ్గు, జలుబు, స్వల్ప జ్వరంతో చాలా బాధపడ్డాను. అదే వారంలో(అక్టోబర్ నెల మొదటి వారంలో) దసరా పండగ వచ్చింది. ఆరోజు నేను బాబాను తలచుకొని దీనంగా, "బాబా! ఈ జబ్బు తగ్గేటట్లు చేయండి" అని ప్రార్థించాను. శ్రీసాయి దయతో వారం రోజుల తరువాత నా జీవితంలో ఎన్నడూ అనుభవించని బాధనుండి నన్ను బయటపడేశారు. తరువాత సాయి సచ్చరిత్రలోని శ్రీసాయిబాబా కూడా సెప్టెంబరు నెల 28న జ్వరంతో బాధపడి 1918, అక్టోబర్ 15, దసరా పండుగ రోజు మహాసమాధి చెందిన విషయం గుర్తుకు వచ్చి, 'అదే రోజులలో శ్రీసాయి నా కర్మ ఫలితం అనుభవించేలా చేసారని' నాకనిపించింది. "ధన్యవాదాలు బాబా".

2026, జనవరి 8, గురువారం నా తండ్రి లోబీపీ, షుగర్ వ్యాధి వల్ల డీహైడ్రేషన్‌కి గురై చాలా క్లిష్ట పరిస్థితి ఎదుర్కోన్నారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలైనందున నేను చాలా భయపడిపోయి శ్రీసాయినాథుని పాదాల చెంత నా మొర ఆలకించమని వేడుకొని ప్రతిక్షణం బాబాను ప్రార్ధించాను. బాబా దయవల్ల ఐసీయూలో.ఉన్న నా తండ్రి తక్కువ బిల్లుతో ఆ కష్టం నుండి బయటపడి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు.  

ఒకసారి హాస్టల్లో ఉండి 8వ తరగతి చదువుతున్న నా కొడుకుకి చర్మ వ్యాధి సోకింది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. అప్పుడు బాబాను వేడుకొని రోజూ బాబా పవిత్ర ఊదీ వాడితే, ఆ సాయినాథుడు కరుణించి ఆ చర్మ వ్యాధిని నయం చేసారు. " మా సాష్టాంగ ప్రణామాలు బాబా. మీ కృపాకటాక్షాలు మా మీద కురిపించినందుకు మీకు ధన్యవాదాలు తండ్రీ. ఇలాగే మీ ఆశీస్సులు ఎప్పుటికీ మాపై ఉండేలా చూడు తండ్రీ. మీ భక్తులందరినీ ఇలాగే కాపాడు బాబా. మీరే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ బాబా. ప్రతి శ్వాసలో నీ పేరు జపించడం తప్ప ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం తండ్రీ?".

సర్వం సాయినాథార్పణమస్తు.

బాబా చేసిన సహాయం

ఓం సాయినాథాయ నమః. నా పేరు కృష్ణసౌమ్య. నేను సాయిబాబా బిడ్డను. నేను ఇప్పుడు బాబా నాకు ఇటీవల చేసిన సహాయం గురించి పంచుకుంటున్నాను. నేను ఒక MNC కంపెనీలో పని చేస్తున్నాను. నేను మీటింగ్స్‌లో ఉంటే మా చిన్నబాబు చాలా అల్లరి చేస్తుంటాడు. నా పని చేసుకుంటూ తనని చూసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. అయితే నేను నా తల్లిదండ్రులతో ఉండటంవల్ల వాళ్ళు బాబుని చూసుకుంటుంటే, నేను నా పని చేసుకుంటుంటాను. కొత్తగా నన్ను ఒక ప్రాజెక్ట్‌లో వేశారు. కానీ పని ప్రారంభించడానికి కావలసిన అనుమతులు నాకు రానందున నేను పని మొదలు పెట్టలేకపోయాను. కొన్నిరోజులు ఆ అనుమతులు రాకపోవడంతో నాకు పెద్దగా పని ఉండేది కాదు. కాబట్టి నా తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్లినా నేను బాబుని చూసుకోగలిగాను. కానీ అనుమతులు వచ్చే సమయానికి నా తల్లిదండ్రులు ఊరు వెళ్లారు. అనుమతులు వచ్చాయి కాబట్టి మేనేజర్ ఖచ్చితంగా పని గురించి అడుగుతారు. నేనేమో బాబుని చూసుకొంటూ పని చేసుకోలేను. అందువల్ల నేను బాబాను, "అమ్మానాన్న లేని సమయంలో అనుమతులు వచ్చాయి. ఇప్పుడు పని మొదలుపెట్టాలి. కానీ బాబుని చూసుకుంటూ పని చేయడం చాలా కష్టం. కాబట్టి అమ్మానాన్న లేని ఈ మూడు రోజులు పని లేకుండా చూడండి బాబా” అని ప్రార్థించాను. నిజంగా బాబా నా  జీవితంలో ఒక అద్భుతం  చేసారు. అనుమతులు వచ్చినా మేనేజర్ నాకు పని కేటాయించలేదు, పని గురించి నన్ను అసలు ఏమీ అడగలేదు. ఇకపోతే అదే సమయంలో ఆఫీసుకి రావాలని మేనేజర్ చెప్పారు. బాబును ఇంకొకరి ఇంట్లో వదిలి వెళ్లడం చాలా కష్టమైనందున నేను నా మనసులో బాధపడుతూ బాబాను, "నా కొడుకుని అన్నయ్య వాళ్ళింట్లో వదిలి వెళ్తాను. అక్కడ తనకి ఏ ఇబ్బందీ రాకుండా చూడండి బాబా” అని ప్రార్థించాను. బాబా మళ్లీ అద్భుతం చేశారు. ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశారు. నేను ఆఫీస్‌కి రాలేనని మేనేజర్‌కి ఓపెన్‌గా చెప్తే, మేనేజర్ ఏమీ అనలేదు. ఆ రోజు గురువారం. నేను నా కొడుకుని తీసుకొని బాబా గుడికి వెళ్లాను. నిజంగా బాబా చేసిన సహాయం ఎంత చెప్పినా తక్కువే. ఆ తండ్రి మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు. "ధన్యవాదాలు బాబా".

10 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om sai ram 🙏🙏🙏🙏...Baba na health bagundela chudu thandri 🙏🙏

    ReplyDelete
  4. Om Sai Ram
    Om Sai Ram

    ReplyDelete
  5. Om Sri Sai Raksha 🙏🙏🙏
    Om Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo