ఈ భాగంలో అనుభవాలు:
1. స్వప్నానుభవం ద్వారా కర్మను కరిగించిన బాబా
2. బాబా అనుగ్రహం
స్వప్నానుభవం ద్వారా కర్మను కరిగించిన బాబా
నా పేరు సాహితి. 2023 నుండి నాకు 'IBS' కంప్లైంట్(కడుపునొప్పి, ఉబ్బరం, మలబద్ధకం లేదా అతిసారంతో కూడిన దీర్ఘకాలిక జీర్ణశయాంతర సమస్య) ఉంది. మొదట్లో గ్యాస్ట్రిక్ సమస్య అనుకుని మూడేళ్లు డాక్టర్ల చుట్టూ తిరిగాను, మందులు వాడాను. కానీ ప్రతిసారీ తాత్కాలిక ఉపశమనం తప్ప ఏ మందులకి నా సమస్య తీరలేదు. నాకున్న ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకుంటూ నన్ను నేను చూసుకోలేక ఆ ఆరోగ్య సమస్యతో చాలా నరకం చూసాను. ఈ బ్లాగులోని అనుభవాలు చదువుతూ నా వాళ్ళ అనారోగ్య సమస్యలు తీర్చిన అనుభవాలు పంచుకునేదాన్ని కానీ, నాకున్న సమస్యలు తీర్చమని బాబాని అడిగేదాన్ని కాదు. ఇంత చిన్న సమస్యలకి కూడా బాబాని అడగకూడదు, ప్రారబ్ధ కర్మ అనుభవించాలి కదా అనిపించేది. కానీ ఒకసారి బాబాని ప్రశ్నలు-సమాధానాలలో అడిగితే, 'దత్తచరిత్ర' పారాయణ చేయమని వచ్చింది. 2025లో పారాయణ మొదలుపెట్టాను కానీ, నా ఆరోగ్యం సహకరించక సగం చదివి మిగతాది చదవలేకపోయాను. తర్వాత 2025, జూలైలో ఒక హోమియో వైద్యుడిని కలిసాను. ఆ డాక్టరు పేరు సాయి కుమార్. అతని ద్వారా నాకున్న సమస్య గ్యాస్ట్రిక్ కాదు, IBS అని తెలిసింది. అతనిచ్చిన మందులతో బాగానే కోలుకున్నాను. దసరా రోజుల్లో 'దేవి భాగవతం' చదివి ఆరోగ్యం బాగు పడిందని నేను ఉన్నత చదువు(పీజీ) చదవడం మొదలుపెట్టాను. కానీ ఎందుకో తెలియదు డిసెంబర్ నుండి ఛాతీ నొప్పితో మళ్ళీ అనారోగ్యం నన్ను చుట్టుముట్టింది. "బాబా! నన్ను కాపాడు" అని బాబాను ప్రార్థిస్తూనే భయపడుతూ కార్డియాలజిస్ట్ దగ్గరకు వెళ్ళాను. "బాబా! ఈసీజీ రిపోర్టు నార్మల్ వచ్చేలా చూడు" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఈసీజీ నార్మల్ వచ్చింది. డాక్టర్ గ్యాస్ట్రిక్ అన్నారు. 'హమ్మయ్య..' అనుకొని మరుసటిరోజు నుండి దత్త పారాయణం ప్రారంభించి ఒక వారంలో పూర్తి చేశాను. తర్వాత నా అనుభవం బ్లాగులో పంచుకుందామనుకునే అంతలో నాకు రక్త విరోచనం అయింది. నేను భయపడి, "బాబా! మళ్ళీ నాకు ఈ పరీక్ష ఏమిటి?" అని బాధపడ్డాను. డాక్టర్ వద్దకెళ్తే, "మూలవ్యాధి వల్ల అయుంటుంది. ఒక్కసారే కదా కంగారుపడొద్దు" అన్నారు. కానీ నేను చాలా నిరాశచెంది, "బాబా! మిమ్మల్నే నమ్ముకున్నాను. ప్రతిసారీ ఏదో ఒక అనారోగ్యంతో నాకెందుకు ఈ పరీక్షలు?" అని ఏడుస్తూ బ్లాగు తెరిస్తే, "నీ చావు చీటీ చింపేసాను. భయపడకు" అని వచ్చింది. కానీ ఆ రాత్రి మళ్ళీ గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చింది. పడుకునే ముందు మళ్ళీ బ్లాగులో చూస్తే, "ఈ మసీదుమాయి దయాళువు. నిన్ను రక్షిస్తుంది" అని వచ్చింది. నేను మనసులో 'రెండు సంవత్సరాల నుండి శిరిడీ వెళ్లాలనుకొని వెళ్ళలే కపోతున్నాను. నేను ఎలా ద్వారకామాయికి వెళ్ళగలను? నన్ను ఇంకా ఉపేక్షించకండి బాబా. మీరే ఈ జబ్బు నుండి నాకు విముక్తి ప్రసాదించాలి' అనుకుంటూ సచ్చరిత్రలో 13వ అధ్యాయం చదివి ఊదీ పెట్టుకుని పడుకున్నాను. బాబా మాట అక్షరసత్యం. ఆరోజు రాత్రి స్వప్నంలో నేను ద్వారకామాయిలో ఉన్నాను. స్పష్టంగా ద్వారకామాయి గోడలు చూసాను. తర్వాత ఏదో మాయ నాలో ప్రవేశించి ఒక్కసారిగా నా శరీరం మాయమైపోయిన అనుభూతి కలిగి గట్టిగా అరిచాను. దాంతో నాకు మెలకువ వచ్చింది. నేను పూర్తిగా కోలుకున్న భావన కలిగింది. ఆరోజు నుండి నేను మామూలుగా అయ్యాను. ఈ అనుభవం వ్రాసేనాటికి ఒక వారం గడిచింది. మందులు వాడుతున్నాను కానీ, సమస్య ఉన్నట్లు అస్సలు లేదు. బాబా అనుకుంటే మనం ఎక్కడ, ఏ స్థితిలో ఉన్నా మనల్ని కాపాడతారు. స్వప్నంలో, నిజ జీవితంలో కొన్ని అనుభవాల ద్వారా మన కర్మలని కరిగిస్తారు. శ్రద్ధ-సబూరితో, స్వచ్ఛమైన మనసుతో అందరి మంచి కోరుకుంటూ బాబాని కొలిసినట్లైతే తప్పక కరుణిస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబా అనుగ్రహం
నా పేరు హాసిని. ఒకరోజు నేను జలుబు, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాను. సాయి భక్తులకు ఏదైనా కష్టం వస్తే, ఏం చేస్తారు? బాబా ఊదీ నీళ్లలో కలిపి తాగుతారు. నేనూ అలానే చేసాను. బాబా దయవల్ల నాకు ఆ రెండు సమస్యల నుండి ఉపశమనం లభించింది.
నా పరీక్షల సమయంలో ఒకరోజు హఠాత్తుగా జివిఎంసి వాళ్ళు మా తాతయ్య షాప్ తొలగిస్తామని అన్నారు. అది తెలిసి నాకు భయం మొదలై, "తాతయ్య షాప్ సురక్షితంగా ఉంటే గారెలు నైవేద్యంగా పెడతాన"ని బాబాతో చెప్పుకున్నాను. అద్భుతం ఏంటంటే, జేసీబీ డ్రైవర్ మాకు తెలియనప్పటికీ అతను మమ్మల్ని మా ప్రాంతంలో చూశానని మా షాపుకి ఏమీ కాకుండా చూసారు. మిగతా షాపులన్నీ తొలగించారు. అలా బాబా అతని రూపంలో మాకు నష్టం జరగకుండా కాపాడారు. ఇది నిజంగా సాయి లీల. "ధన్యవాదాలు బాబా".
నాకు ఇష్టమైన అబ్బాయికి పెళ్లి చేస్తామని వాళ్ళింట్లో బలవంతం చేసారు. అప్పుడు నేను, "బాబా! తను పండక్కి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఎలాంటి పెళ్లి ప్రస్తావన రాకూడదు" అని బాబాని అర్థించాను. బాబా దయవల్ల పెళ్లి గురించి వాళ్ళు ప్రస్తావించలేదు. "ధన్యవాదాలు బాబా. మా ఇద్దరి పెళ్ళికి మీరు అనుమతి ఇచ్చారు. దయచేసి ఎలాంటి గొడవలూ లేకుండా మా ఇద్దరికీ పెళ్లి అయ్యేలా ఆశీర్వదించండి బాబా".
2025, ఆగష్టులో నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి జరిగింది. తను తన పెళ్ళిక రాకపోతే నాతో మాట్లాడానని అంది. పెళ్లికి ముందు నాకు జ్వరం వచ్చినప్పటికీ సరిగ్గా పెళ్లి సమయానికి తగ్గింది. కానీ నెలసరి రాలేదు.పెళ్ళిలో ఎక్కడ వస్తుందో అని భయపడి బాబా ఊదీ తీసుకొని ఆయన సహాయాన్ని అర్థించాను. బాబా దయవల్ల నాకు ఎలాంటి ఆటంకం రాలేదు. నా ఫ్రండ్ పెళ్లిలో ఆనందంగా గడిపాను. అలానే రాఖీ పౌర్ణమికి కూడా నెలసరి ఆటంకం రాకూడదని బాబా సహాయం అడిగాను. బాబా దయవల్ల అప్పుడు కూడా నెలసరి రాలేదు. ఇంకో విషయం ఫ్రెండ్ పెళ్ళికి తయారవుతున్నప్పుడు నా వెండి చైన్ కనిపించకపోతే, కొబ్బరికాయ కొడతానని బాబాకి మొక్కుకున్నంతనే కనిపించింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఓం సాయిరామ్
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteOm sai ram tandri, baba ofce lo intlo unna samasyalu annitini tholaginchandi tandri pls, ofce lo nenu anukunna position lo unde la chudandi tandri pls, amma nannalani Ammamma tatayalani anni velala ayur arogyalatho kshamam ga kapadandi tandri naaku manchi arogyanni prasadinchandi tandri pls, anta meede tandri daya badyata.
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Ram 🙏🙏
ReplyDelete