సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2068వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. స్వప్నానుభవం ద్వారా కర్మను కరిగించిన బాబా
2. బాబా అనుగ్రహం


బాబా అనుగ్రహం

నా పేరు హాసిని. ఒకరోజు నేను జలుబు, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాను. సాయి భక్తులకు ఏదైనా కష్టం వస్తే, ఏం చేస్తారు? బాబా ఊదీ నీళ్లలో కలిపి తాగుతారు. నేనూ అలానే చేసాను. బాబా దయవల్ల నాకు ఆ రెండు సమస్యల నుండి ఉపశమనం లభించింది.

నా పరీక్షల సమయంలో ఒకరోజు హఠాత్తుగా జివిఎంసి వాళ్ళు మా తాతయ్య షాప్ తొలగిస్తామని అన్నారు. అది తెలిసి నాకు భయం మొదలై, "తాతయ్య షాప్ సురక్షితంగా ఉంటే గారెలు నైవేద్యంగా పెడతాన"ని బాబాతో చెప్పుకున్నాను. అద్భుతం ఏంటంటే, జేసీబీ డ్రైవర్ మాకు తెలియనప్పటికీ అతను మమ్మల్ని మా ప్రాంతంలో చూశానని మా షాపుకి ఏమీ కాకుండా చూసారు. మిగతా షాపులన్నీ తొలగించారు. అలా బాబా అతని రూపంలో మాకు నష్టం జరగకుండా కాపాడారు. ఇది నిజంగా సాయి లీల. "ధన్యవాదాలు బాబా".

నాకు ఇష్టమైన అబ్బాయికి పెళ్లి చేస్తామని వాళ్ళింట్లో బలవంతం చేసారు. అప్పుడు నేను, "బాబా! తను పండక్కి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఎలాంటి పెళ్లి ప్రస్తావన రాకూడదు" అని బాబాని అర్థించాను. బాబా దయవల్ల పెళ్లి గురించి వాళ్ళు ప్రస్తావించలేదు. "ధన్యవాదాలు బాబా. మా ఇద్దరి పెళ్ళికి మీరు అనుమతి ఇచ్చారు. దయచేసి ఎలాంటి గొడవలూ లేకుండా మా ఇద్దరికీ పెళ్లి అయ్యేలా ఆశీర్వదించండి బాబా".  

2025, ఆగష్టులో నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి జరిగింది. తను తన పెళ్ళిక రాకపోతే నాతో మాట్లాడానని అంది. పెళ్లికి ముందు నాకు జ్వరం వచ్చినప్పటికీ సరిగ్గా పెళ్లి సమయానికి తగ్గింది. కానీ నెలసరి రాలేదు.పెళ్ళిలో ఎక్కడ వస్తుందో అని భయపడి బాబా ఊదీ తీసుకొని ఆయన సహాయాన్ని అర్థించాను. బాబా దయవల్ల నాకు ఎలాంటి ఆటంకం రాలేదు. నా ఫ్రండ్ పెళ్లిలో ఆనందంగా గడిపాను. అలానే రాఖీ పౌర్ణమికి కూడా నెలసరి ఆటంకం రాకూడదని బాబా సహాయం అడిగాను. బాబా దయవల్ల అప్పుడు కూడా నెలసరి రాలేదు. ఇంకో విషయం ఫ్రెండ్ పెళ్ళికి తయారవుతున్నప్పుడు నా వెండి చైన్ కనిపించకపోతే, కొబ్బరికాయ కొడతానని బాబాకి మొక్కుకున్నంతనే కనిపించింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

5 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete
  3. Om sai ram tandri, baba ofce lo intlo unna samasyalu annitini tholaginchandi tandri pls, ofce lo nenu anukunna position lo unde la chudandi tandri pls, amma nannalani Ammamma tatayalani anni velala ayur arogyalatho kshamam ga kapadandi tandri naaku manchi arogyanni prasadinchandi tandri pls, anta meede tandri daya badyata.

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo